-
ప్రియాంక ఉపేంద్ర ప్రయోగాత్మక చిత్రం 'క్యాప్చర్' విడుదలకు సిద్దం
కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర భార్య ప్రియాంక ప్రయోగాత్మక చిత్రం క్యాప్చర్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇప్పటి వరకు తెరపైకి రానటువంటి ప్రయోగాత్మక చిత్రమిదని యూనిట్ తెలిపింది. సినిమా మొత్తం కూడా సీసీటీవీ ఫుటేజ్ నుంచి షూట్ చేసినట్టుగా అనిపిస్తుంది. సింగిల్ లెన్స్‌తో తీసిన మొట్ట మొదటి సినిమా కూడా ఇదే. దర్శకుడు లోహిత్.హెచ్ ఎప్పుడూ కూడా కొత్త పాయింట్‌తోనే సినిమాలు తీస్తుంటారు. ప్రియాంక ఉపేంద్ర, లోహిత్ కాంబోలో ఇది వరకు మమ్మీ, దేవకి వంటి చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు మూడోసారి మరో ప్రయోగాత్మక చిత్రమైన ‘క్యాప్చర్’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రాన్ని షమికా ఎంటర్ప్రైజెస్, శ్రీ దుర్గా పరమేశ్వరి ప్రొడక్షన్స్ బ్యానర్స్ మీద రవి రాజ్ నిర్మిస్తున్నారు. రాధికా కుమారస్వామి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ అంతా కూడా గోవాలోనే జరిగింది. 30 రోజుల పాటు నిరవధికంగా చిత్రీకరించారు. ప్రస్తుతం షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే సినిమాను విడుదల చేయాలని మేకర్లు ప్లాన్ చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి ప్రియాంక ఉపేంద్ర పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌ను గమనిస్తే ప్రియాంక మొహం మీద తీవ్ర గాయాలు కనిపిస్తున్నాయి. ఇక ఆమె చుట్టూ సీసీటీవీ కెమెరాలు కనిపిస్తున్నాయి. వాటి మధ్యలో ఓ కాకి కనిపిస్తోంది. వ్యక్తుల చేతులు కూడా కనిపిస్తున్నాయి. ఇవన్నీ చూస్తుంటే ఏదో ఇంట్రెస్టింగ్ పాయింట్‌తో సినిమాను మలిచినట్టుగా ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగిపోయింది. శివ రాజ్ కుమార్ తగరు సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న మన్విత కామత్ ఈ చిత్రంలో ఓ కీ రోల్ పోషిస్తున్నారు. మాస్టర్ కనిష్‌రాజ్ ఈ చిత్రంతో బాలనటుడిగా పరిచయం కాబోతున్నారు. పాండికుమార్ ఈ చిత్రానికి కెమెరామెన్‌గా, రవిచంద్రన్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. -
అందాల శిల్పం.. నటి శిల్పా మంజూనాథ్ (ఫోటోలు)
-
వైరల్: కరోనా పేషెంట్లతో సెలబ్రిటీల డ్యాన్స్
బెంగళూరు: కోవిడ్ సోకితే చాలు అయినవాళ్లనే పరాయివాళ్లుగా చూస్తున్నా రోజులివి. మానసిక స్థైర్యం కల్పించాల్సిన వాళ్లే మనకెందుకులే అని చేతులు దులుపుకుంటున్న దుర్దినాలివి. కానీ ఇలాంటి సమయంలో బాధతో కుమిలిపోతున్న కోవిడ్ పేషెంట్లను నవ్వించేందుకు, వారి ముఖాల మీద చిరునవ్వు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేశారిద్దరు నటీనటులు. కన్నడ స్టార్ హర్షిక పూనాచా, తన కజిన్, నటుడు భువన్ పొన్నన్నతో కలిసి కర్ణాటకలోని మడికెరి కోవిడ్ ఆస్పత్రిని సందర్శించింది. పీపీఈ కిట్లలో ఆస్పత్రిలో అడుగుపెట్టిన ఈ సెలబ్రిటీలు అక్కడి వార్డుల్లో ఉన్న ఆయా పేషెంట్లను పలకరిస్తూ డ్యాన్సులు చేశారు. ఈ సందర్భంగా అక్కడున్న కొందరు కరోనా పేషెంట్లు వారితో కలిసి ఉత్సాహంగా స్టెప్పులేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. కొడగు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అనుమతితో కోవిడ్ పేషెంట్లను కలిసిన ఈ సెలబ్రిటీలు వారిపై వివక్ష చూపకూడదని తెలియజేసేందుకు ఈ ప్రయత్నం చేశామన్నారు. అయితే అక్కడ చాలా మంది రోగులు మానసికంగా బలహీనంగా ఉన్నారని తెలిపారు. అలాంటివారికి ధైర్యాన్ని నూరిపోసేందుకు ప్రయత్నించామన్నారు. ఈ మాయదారి రోగాన్ని సమూలంగా నాశనం చేసేవరకు మనమందరం కలిసి కట్టుగా ఉండాలని పిలుపునిచ్చారు. కాగా భువన్, హర్షిక.. భువనమ్ ఫౌండేషన్ ద్వారా నిరుపేదలకు నిత్యావసర సరుకులు అందించడంతోపాటు రోగులకు ఔషధాలను కూడా పంపిణీ చేస్తున్నారు. చదవండి: OTT: నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజయ్యే సినిమాలు, వెబ్‌సిరీస్ లిస్ట్ ఇదిగో! -
డ్రగ్ కేసు: స్టార్ జంటకు సమన్లు
సాక్షి, బెంగళూరు: ప్రస్తుతం డ్రగ్స్ కేసు అటూ బాలీవుడ్‌ను ఇటూ శాండల్ వుడ్‌ను కుదిపేస్తోంది. కన్నడ డ్రగ్ వ్యవహరంలో ఇప్పటికే కన్నడ హీరోయిన్లు సంజన గల్రానీ, రాగిణి ద్వివేదీలతో పాటు పలువురిని బెంగళూర్ సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా కన్నడ స్టార్ జంట దిగంత్ మంచలే, ఐంద్రిత రేలకు సీసీబీ పోలీసులు సమన్లు జారీ చేశారు. దర్యాప్తు నిమిత్తం రేపు ఉదయం 11 గంటలకు సీసీబీ కార్యాలయానికి హాజరు కావాలని వారిని పోలీసులు పేర్కొన్నారు. (చదవండి: డ్రగ్స్ కేసు: మాజీ మంత్రి కుమారుడి ఇంట్లో సోదాలు) అదే విధంగా ఈ కేసులో కీలక నిందితుడైన షేక్ ఫాజిల్ శ్రీలంకలోని ఐ బార్టనే అనే క్యాసినోకు ఈ జంటను ఆహ్వానించిన వీడియో వైరల్ అవుతోంది. దీంతో డ్రగ్స్ సప్లయర్స్‌తో వీరికి కూడా ఎమైన సంబంధం ఉందని భావించిన సీసీబీ వారికి సమన్లు జారీ చేసింది. మరోవైపు కర్ణాటక మాజీ మంత్రి జీవరాజ్ అల్వా కుమారుడు ఆదిత్యపై కూడా కేసు నమోదైంది. ఆయనకు చెందిన రిసార్ట్ పై ఇవాళ(మంగళవారం) ఉదయం సీసీబీ పోలీసులు తనిఖీ చేశారు. ప్రస్తుతం ఆదిత్య పరారీలో ఉన్నాడని అతడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. (చదవండి: డేటా మొత్తం డిలీట్ చేసిన సంజనా, రాగిణి) -
పెళ్లి చేసుకున్న బిగ్‌బాస్ జంట!
ప్రముఖ రియాలిటీ షో కన్నడ ‘బిగ్‌బాస్ సీజన్ 5’ విన్నర్ చందన్ శెట్టి, కంటెస్టెంట్ నివేదిత గౌడల వివాహం బంధువులు, స్నేహితుల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. బిగ్‌బాస్ హౌజ్‌లో ప్రేమలో పడ్డ ఈ జంట గతేడాది అక్టోబర్‌లో నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. కాగా బుధవారం ఉదయం వీరిద్దరూ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. బిగ్‌బాస్ హౌజ్‌లో స్నేహితులుగా మెలిగిన వీరిద్దరూ ప్రేమికులుగా మారారు. ఇక బిగ్‌బాస్ హౌజ్ నుంచి బయటకు వచ్చాక కూడా పార్టీలకు కలిసి వెళ్లడం, రెస్టారెంట్లు, కాఫీ డేలకు చేట్టాపట్టాలేసుకుని తిరుగుతూ ప్రేమాయణం సాగించారు. ఇక చివరకు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇక ఆలస్యం చేయకుండా ఈ విషయాన్ని వారి కుటుంబ సభ్యులకు చెప్పడంతో.. వారు కూడా వీరి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో గతేడాది నిశ్చితార్థం చేసుకున్న ఈ ప్రేమ జంట ఈ రోజు పెళ్లి చేసుకున్నారు. View this post on Instagram happy married life 💛💙@niveditha__gowda @chandanshettyofficial @puneethrajkumar.official #appuboss #chandanshetty A post shared by puneeth Rajkumar_fc (@power_star_boys_mysore) on Feb 25, 2020 at 8:11pm PST ఈ క్రమంలో కన్నడ పరిశ్రమ ప్రముఖులు, సన్నిహితులు, బంధువుల మధ్య పెళ్లికి ముందు రోజు రాత్రి జరిగిన రిసెప్షన్ వేడుకను ఘనంగా జరుపుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను చందన్ శెట్టి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా ఈ ఫొటోలో వీరిద్దరూ ఒకే రంగు దుస్తులను ధరించి పార్టీలో అందరిని ఆకట్టుకున్నారు. చందన్ శెట్టి బ్లాక్ అండ్ మెరూన్ త్రీ పీస్ బ్రోకెడ్ కోటు ధరించగా.. నివేదిత బాల్రూం గౌనుకు తలపై నెట్ వేల్ ధరించి అందంగా ఉంది. View this post on Instagram Such a Wonderful Video🤩🤩 Give mE a Credit🤩 🙈 Do Follow More Update Follow @chandanshettyofficial @boss.chandanshetty #chandanshetty #csfire Admin:-) @vishu.nyk_ Credit :-) @ ________________________________________ #zeesaregamapa15 #sarigamapa #Sandalwood #rajeshkrishnan #vijayaprakash #naveensajju #chandanshetty #kgf #kannadasongs #kannada #kannadadubsmash #kannadaworld #banglore #anchoranushree #kannadamovies #kannadakogile #majatalkies #kuriprathap #support #follow #sanjithhegde #bbk6 #biggbosskannada #colorssuper #zeekannada #kannadamemesanthe #kannadamemes #sandalwoodactress #csshokilala _____________________________________________ Page:-@chandanshetty_fans_club Admin:- @dhanesh_patil1122 @poornima207 —————————————————- Page:- @chandanshettykannadarapper Admin:- @naveen_gowda25 —————————————————- Page:- @chandanshettyfansbgk1 Admin:- @pajjudodamani —————————————————- Page:-@rap_king_chandan_shetty_fans Admin:- @deepak_m_narendra ————————————————— Page:- @Chandanshetty_fans_krazee Admin:- @shivkanthofficial —————————————————- Page:- @Chandanbro_fans_club Admin:-@_appu_official ————————————————— Page & admin:- @shree.swamy_cs —————————————————- Page:- @chandanshettyfc Admin:- @shreyank_manjunath —————————————————- Page:- @boss.chandanshetty Admin:- @vishu.nyk_ —————————————————- Page:- @durgan_cs_fans Admin :- @____mr____nayaka____ @appu_shabhash ————————————————- Page:- @pra.deep_offical_740 by ———————————————— Page :- @teamchandanshettyofficial Admin :- @surajwakodedar A post shared by CHANDAN SHETTY 👑👑 (@boss.chandanshetty) on Feb 25, 2020 at 9:53pm PST
Pagination
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
IPL 2024: ఇవెక్కడి క్యాచ్‌లు రా బాబు.. చూస్తే ఫ్యూజ్‌లు ఎగిరిపోవాల్సిందే..!
'ఛీ, నీ బతుకు'.. చురకలంటించిన కలర్స్ స్వాతి
12 పరుగులకే ఆలౌట్.. టీ20ల్లో రెండో అత్యల్ప స్కోర్
జగనన్న పాలనతో పెత్తందార్ల కడుపు మండుతోంది: నాగార్జున యాదవ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
ఆది సాయికుమార్ కొత్త మూవీ.. గోవాలో మ్యూజిక్ సిట్టింగ్స్
కాంగ్రెస్‌కు శామ్ పిట్రోడా రాజీనామా
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
తప్పక చదవండి
- ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
- ఒక్క క్లిక్‌తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్‌కి టెండర్ వేసిన 'దేవర'?
- టీ20 వరల్డ్‌కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్‌గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement