-
హనుమాన్ హీరో కొత్త మూవీ.. గ్లింప్స్ చూస్తే గూస్‌బంప్సే!
హనుమాన్ మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన యంగ్ హీరో తేజ సజ్జా. ఈ సినిమాతో ఒక్కసారిగా క్రేజ్ దక్కించుకున్నారు. తేజ మరో హిస్టారికల్ మూవీ చేసేందుకు రెడీ అయిపోయారు. తేజ సజ్జాకు జంటగా రితికా నాయక్ నటిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో ఆయన రవితేజతో ఈగల్ మూవీని తెరకెక్కించారు. తాజాగా ఈ మూవీ టైటిల్‌తో పాటు గ్లింప్స్, ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. హైదరాబాగ్లోని రామానాయుడు స్టూడియోలో జరిగిన కార్యక్రమంలో టైటిల్ రివీల్ చేశారు. తేజ సజ్జా తాజా చిత్రానికి మిరాయి అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్రంలో తేజ సూపర్‌యోధ పాత్రలో కనిపించనున్నారు. తాజాగా రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్లో తేజ సజ్జ సూపర్ యోధా లుక్‌లో కనిపించారు. బద్దలయ్యే అగ్నిపర్వతం పైన నిలబడి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను అశోకుని కాలంలో జరిగిన కళింగ యుద్ధం ఆధారంగా తెరకెక్కిస్తున్నట్లు గ్లింప్ల్ చూస్తే అర్థమవుతోంది. మిరాయి సినిమాను తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, మరాఠీతో పాటు చైనీస్ భాషల్లోనూ వచ్చే ఏడాది ఏప్రిల్ 18న విడుదల చేయనున్నారు. From the hush of ancient narratives📜 Comes a thrilling adventurous saga of a #SuperYodha 🥷⚔️#PMF36 x #TejaSajja6 Titled as #𝐌𝐈𝐑𝐀𝐈 ⚔️#MIRAITitleGlimpse out now💥 -- https://t.co/k4tycunRkA In Cinemas on 18th APRIL 2025 ~ 2D & 3D🔥 SuperHero @tejasajja123… pic.twitter.com/WN2MB2EPlE — People Media Factory (@peoplemediafcy) April 18, 2024 -
Teja Sajja: ‘సూపర్ యోధ’గా ‘హను-మాన్’ హీరో
‘హను–మాన్’ చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు హీరో తేజ సజ్జా. తాజాగా ఆయన కొత్త సినిమా ప్రకటన వచ్చింది. ‘ఈగల్’ ఫేమ్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమా నిర్మించనున్నారు. ఈ చిత్రాన్ని ప్రకటించి, పోస్టర్ రిలీజ్ చేసింది యూనిట్. ‘హను–మాన్’ చిత్రంలో సాంప్రదాయ దుస్తుల్లో కనిపించిన తేజ.. కొత్త పోస్టర్లో స్టైలిష్ మేకోవర్‌లో కనిపించారు. ‘‘సూపర్ యోధ సాహసోపేతమైన కథతో పాన్ ఇండియా మూవీగా ఇది తెరకెక్కనుంది. ‘ఈగల్’ తర్వాత కార్తీక్ ఘట్టమనేనితో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న రెండో చిత్రం ఇది. ఈ సినిమా పూర్తి వివరాలను ఈ నెల 18న ప్రకటిస్తాం’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల, క్రియేటివ్డ్యూసర్: కృతీ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సుజిత్ కుమార్ కొల్లి. Wishing my Super Hero @TejaSajja123 Super talented @Karthik_gatta & Super passionate @vishwaprasadtg garu all the best for #PMF36 🤗 Title Announcement Glimpse on 𝗔𝗣𝗥𝗜𝗟 𝟭𝟴𝘁𝗵 #SuperYodha 🥷 pic.twitter.com/aOqpz1z08E — Prasanth Varma (@PrasanthVarma) April 15, 2024 -
ఈగల్ కథ వినగానే చేసేద్దాం అన్నారు
‘‘ఈగల్’ కాన్సెప్ట్‌లోనే విధ్వంసం ఉంది. అయితే హీరో చేసే విధ్వంసం సమాజం కోసమే. అది ఏంటి? అనేది ప్రేక్షకులకు ఇవాళ తెలిసిపోతుంది. ఈ సినిమాలో పత్తి రైతు పాత్ర చేశారు రవితేజగారు. అయితే ఆయన పోరాడే సమస్య అంతర్జాతీయ స్థాయిలో ఉంటుంది. మనకి కూడా దగ్గరగా ఉంటుంది. ‘రాంబో, టెర్మినేటర్’ లాంటి హాలీవుడ్ సినిమాలని చాలా ఎంజాయ్ చేస్తాం. అలాంటి సినిమాలు తీసుకు రావాలనే ప్రయత్నమే ‘ఈగల్’. అద్భుతమైన యాక్షన్, డ్రామా, ఎంటర్టైన్మెంట్ ఉన్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారు’’ అని డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని అన్నారు. రవితేజ హీరోగా, కావ్యా థాపర్, అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్లుగా నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరించిన ‘ఈగల్’ నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని విలేకరులతో పంచుకున్న విశేషాలు. ► దర్శకునిగా నా తొలి సినిమా నిఖిల్‌తో ‘సూర్య వర్సెస్ సూర్య’ చేశాను. ఆ తర్వాత మళ్లీ కెమెరామేన్‌గా బిజీ అయిపోవడంతో దర్శకునిగా వెంట వెంటనే సినిమాలు చేయలేకపోయాను. రవితేజగారి ‘ధమాకా’ సినిమాకి కెమెరామేన్‌గా చేశాను. ఆ సమయంలో ‘ఈగల్’ కథ ఆయనకి చెప్పాను. వినగానే.. ‘ఇది మంచి కమర్షియల్ సినిమా.. చేసేద్దాం’ అన్నారు రవితేజగారు. దర్శకునిగా ‘ఈగల్’ నా రెండో సినిమా. ముందు నుంచీ యాక్షన్ సినిమాలు చేయడం నాకు ఇష్టం. అయితే కెరీర్ బిగినింగ్‌లో కొన్ని పరిమితులుంటాయి. ఇప్పుడు ‘ఈగల్’తో పూర్తి స్థాయి యాక్షన్ సినిమా చేసే అవకాశం రావడం ఆనందంగా ఉంది. ► రవితేజగారు అద్భుతమైన నటుడని అందరికీ తెలుసు. కానీ, కొన్నిసార్లు వాణిజ్య అంశాల కారణంగా ఒకే సినిమాలో కామెడీ, డ్యాన్స్, యాక్షన్.. ఇలా చాలా రకాలు చేయాల్సి వస్తుంది. ‘ఈగల్’లో మాత్రం ఆయన ఒక పాత్రగానే కనిపిస్తారు. ఆ తేడా సినిమా చూసే ప్రేక్షకులకు అర్థం అవుతుంది. ఇంటెన్స్‌గా ఉంటూ కూల్‌గా ఉండటం ఆయనలో డిఫరెంట్ క్వాలిటీ. ‘ఈగల్’లో నన్ను నేను చూసుకునే పాత్ర చేశాను’ అని రవితేజగారు అనడం సంతోషం. చాలా క్రమశిక్షణ కలిగిన నటుడు. ఆయన ఆహారపు అలవాట్లు, నిద్రపోయే వేళలు పర్ఫెక్ట్గా ఉంటాయి.. సెల్ఫ్ కంట్రోల్ ఎక్కువ. చాలా ఆనందమైన జీవితం గడుపుతారు. ► పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నాకు హోమ్ బ్యానర్‌లా అయిపోయింది. సినిమాకి కావాల్సిన ప్రతిదీ ఒక్క ఫోన్ కాల్‌తో సమకూర్చుతారు. విశ్వప్రసాద్, వివేక్గార్లకు కృతజ్ఞతలు. ఈ మూవీలో అనుపమ జర్నలిస్ట్ పాత్ర చేశారు. కావ్యా థాపర్, నవదీప్ పాత్రలకి చాలా ప్రాధాన్యత ఉంది. మరో చిన్న పాప పాత్ర కూడా కీలకంగా ఉంటుంది. ఇక హిందీలో ‘ఈగల్’ పేరుతో ఓ సినిమా ఉంది. దీంతో ‘సహదేవ్ వర్మ’ టైటిల్‌తో అక్కడ రిలీజ్ చేస్తున్నాం. ప్రస్తుతం తేజ సజ్జా హీరోగా ఓ సినిమా చేస్తున్నాను. -
ఆ రోజు గోల గోల చేద్దాం
‘‘మీ అందరి (అభిమానులు) ఉత్సాహం చూస్తుంటే ఆనందంగా ఉంది. ‘ఈగల్’ వైవిధ్యమైన మాసీ ఫిలిం. వినోదం అద్భుతంగా ఉంటుంది. నాకు విపరీతంగా నచ్చింది.. మీ అందరికీ తెగ నచ్చుతుంది. జనవరి 13న అందరూ థియేటర్స్‌కి వచ్చేయండి.. గోల గోల చేద్దాం’’ అన్నారు హీరో రవితేజ. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రవితేజ, కావ్యా థాపర్ జంటగా నటించిన చిత్రం ‘ఈగల్’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా జనవరి 13న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. దేవ్ జాంద్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘గల్లంతే..’ అంటూ సాగే రెండో పాటని సెయింట్ మార్టిన్ ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థుల సమక్షంలో విడుదల చేశారు. ఈ పాటకు కృష్ణకాంత్ సాహిత్యం అందించగా, కపిల్ కపిలన్, లిన్ పాడారు. కావ్యా థాపర్ మాట్లాడుతూ – ‘‘గల్లంతే..’ పాట నాకు చాలా ప్రత్యేకం. రవితేజగారితో నటించడం ఒక గౌరవంగా భావిస్తున్నాను’’ అన్నారు. ‘‘రవితేజగారికి నేను పెద్ద అభిమానిని. ఆయన సినిమాకి సంగీతం ఇవ్వడంతో నా కల నెరవేరినట్టు అయింది’’ అన్నారు దేవ్ జాంద్. ఈ వేడుకలో కార్తీక్ ఘట్టమనేని, టీజీ విశ్వప్రసాద్, సహ నిర్మాత వివేక్ కూఛిబొట్ల, నటుడు నవదీప్ తదితరులు పాల్గొన్నారు. కోటికి రవితేజ వాయిస్ తేజ సజ్జా, అమృతా అయ్యర్ జంటగా ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన చిత్రం ‘హను–మాన్’. చైతన్య సమర్పణలో ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్పై కె. నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా జనవరి 12న విడుదలవుతోంది. ఈ సినిమాలో కోటి పాత్రలో నటించిన వానరానికి హీరో రవితేజ డబ్బింగ్ చె΄్పారు. ‘‘రవితేజగారి వాయిస్‌తో కోటి పాత్ర మరింత హ్యూమరస్, ఎనర్జిటిక్‌గా ఉంటుంది. ఇందుకు ఆయనకు కృతజ్ఞతలు’’ అని మేకర్స్ అన్నారు. -
ఈగల్లో నన్ను కొత్తగా చూస్తారు
రవితేజ హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఈగల్’. ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్, కావ్యా థాపర్ హీరోయిన్లు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ చిత్రం జనవరి 13న విడుదల కానుంది. అలాగే రవితేజ, శ్రీలీల జంటగా నక్కిన త్రినాథ రావు దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన హిట్ ఫిల్మ్ ‘ధమాకా’ విడుదలై ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా ‘ఈగల్ x ధమాకా’ సెలబ్రేషన్స్‌ను నిర్వహించారు మేకర్స్. ఈ వేడుకలో రవితేజ మాట్లాడుతూ– ‘‘ధమాకా’ విడుదలై ఏడాది పూర్తయిందంటే నమ్మబుద్ధి కావడం లేదు. నిన్నో మొన్నో రిలీజైనట్లుగా అనిపిస్తోంది. ఈ సినిమాతో హీరోయిన్గా శ్రీలీల, మ్యూజిక్ డైరెక్టర్‌గా భీమ్స్కు మంచి పేరు వస్తుందని ముందే చెప్పాను. అది నిజమైంది. ‘ధమాకా’ యూనిట్ సభ్యులందరికీ పేరు పేరునా ధన్యవాదాలు. ఇక ‘ఈగల్’ విషయానికొస్తే... ఈ చిత్రంలో కొత్త రవితేజను చూస్తారు. కార్తీక్ ఘట్టమనేనికి దర్శకుడిగా మంచి భవిష్యత్ ఉందని నా నమ్మకం. నిర్మాత విశ్వగారితో నా జర్నీ కొనసాగుతుంది’’ అన్నారు. ‘‘అన్ని కమర్షియల్ అంశాలు ఉన్న మంచి చిత్రం ‘ఈగల్’. థియేటర్స్‌లో చూడండి’’ అన్నారు కార్తీక్ ఘట్టమనేని. ‘‘గత ఏడాదిని బ్లాక్‌బస్టర్‌తో ఎండ్ చేశాం. వచ్చే ఏడాదిని బ్లాక్‌బస్టర్‌తో ఆరంభిస్తాం’’ అన్నారు టీజీ విశ్వప్రసాద్. అవసరాల శ్రీనివాస్, హైపర్ ఆది తదితరులు మాట్లాడారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోలింగ్ కేంద్రాల తనిఖీ
పట్టుదలతో చదవండి
స్వర్ణకారుల సమస్యలు పరిష్కరిస్తాం
ఆదాయపు పన్ను మాఫీ చేయిస్తాం
ఓపెన్ కాస్టుల్లో పనివేళలు మార్చండి
కమిషనింగ్ పూర్తిచేయండి
ఓదెల మల్లన్న సాక్షిగా చెబుతున్నా..
సర్కారు ఆస్పత్రిలో గడువు ముగిసిన మందులు!
ఎన్నికల ప్రచార వ్యయం నమోదుపై సమావేశం
వేడెక్కిన ప్రచారం
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్‌లో ఉన్నా: నటి
- హీట్‌వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్‌తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement