-
పాప కనబడుట లేదు!
హాలీవుడ్ సినిమా / ఫ్లైట్ ప్లాన్ థ్రిల్ల్లర్ సినిమాలను రక్తి కట్టించడం చాలా కష్టం. అందులోనూ విమానం లాంటి లిమిటెడ్ లొకేషన్లో ఇంకా కష్టం. దానికి డ్రామా, సెంటిమెంట్ జోడించగలిగితే అద్భుతమనే చెప్పాలి. ఓ స్త్రీ తన భర్త, ఆరేళ్ల పాపతో బెర్లిన్‌లో హాయిగా జీవిస్తోంది. ఆమె ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజనీర్ కూడా. అనుకోకుండా ఆమె భర్త బిల్డింగ్ మీద నుంచి కిందపడి చనిపోయాడు. భర్త అంత్యక్రియలు న్యూయార్క్‌లోనే జరిపించడానికి భర్త శవపేటికతో విమానంలో బయల్దేరింది కెయిలీ (జోడీ ఫాస్టర్), కూడా ఆరేళ్ల పాప జూలియా. పాప విమానాన్ని ఓ అద్భుతంగా చూస్తోంది. ఆ విమానం ఇంజన్ల రూపకల్పనలో తల్లి కెయిలీ పాత్ర ఉంది. కిటికీ అద్దం నుంచి ఆకాశాన్ని చూస్తూ అద్దంపై తన చిన్నారి వేలితో హృదయం బొమ్మ వేసింది జూలియా. కెయిలీ విషాదాన్ని దిగమింగుతూ, చిన్న కునుకు తీసి లేచేటప్పటికి పక్కన జూలియా లేదు. ఫ్లైట్ టాయ్‌లెట్స్ అన్నీ వెదికింది - కెయిలీ. తన ఆరేళ్ల పాప కనిపించడం లేదని గగ్గోలు పెట్టింది. విమానంలో ఎవరూ ఆ పాపని చూడలేదన్నారు. ఇటు బెర్లిన్, అటు న్యూయార్క్ ఎయిర్‌పోర్ట్‌లో కూడా ప్రయాణికుల జాబితాలో జూలియా పేరు లేదు. కెయిలీ దగ్గర బోర్డింగ్ పాస్ మాయమైంది. 37 వేల అడుగుల ఎత్తున ఎగురుతున్న ఆ విమానంలో పాప ఉన్నట్లుండి ఎలా మాయమైంది. కెయిలీ రోదనా-వేదనా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఆమె మానసికస్థితి సరిగా లేదని భావించారు తోటి ప్రయాణికులంతా. భర్త చనిపోవడంతో పిచ్చిదై అలా మాట్లాడుతుందన్నారు. ఎయిర్‌మార్షల్ జెన్ కార్సన్ ఆమెకి సంకెళ్లు వేసి, పక్కనే ఉండి గమనించసాగాడు. ఫ్లైట్ కెప్టెన్ మార్కస్ రిచ్ మొదట పాప మాయమైందని నమ్మినా, తర్వాత బెర్లిన్ నుంచి వచ్చిన ఓ వైర్‌తో కెయిలీ చెబుతున్నది అబద్ధమనుకుంటాడు. జూలియా తన తండ్రితో కలిసి, రూఫ్ పైనుంచి కిందపడి, తీవ్ర గాయాలతో హాస్పిటల్లో చనిపోయిందనేది బెర్లిన్ నుంచి వచ్చిన సమాచారం. కెయిలీ ఇదంతా అసత్యమని ఎమోషనల్‌గా రియాక్టయింది. ఫ్లైట్‌లో ఉన్న ఓ సైకో థెరపిస్ట్ కెయిలీని ఓదార్చే ప్రయత్నం చేసింది. అప్పుడు కెయిలీకి తన సీటు పక్కనే కిటికీ అద్దం మీద జూలియా గీసిన హార్ట్ బొమ్మ కనపడింది. అంటే జూలియా తనతో ఫ్లైట్ ఎక్కడం నిజం. మాయం కావడం నిజం. బెర్లిన్‌లో చనిపోకపోవడమూ నిజమే. ఆ విమానంలోనే ఎక్కడో ప్రాణాలతోనో, ప్రాణాల్లేకుండానో జూలియా ఉండే ఉంటుంది. బెర్లిన్ నుంచి బయల్దేరిన ఆ విమానం న్యూయార్క్ చేరుకునేలోగా తన బిడ్డని వెదకాలి. ఆ తల్లి విమానంలో వెదుకులాట ప్రారంభించింది. వాష్‌రూమ్‌లోకి వెళ్లి, తను ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజనీర్ కాబట్టి - పై కంపార్ట్మెంట్లోకి ఎక్కి - ఎలక్ట్రానిక్ వ్యవస్థని చిన్నాభిన్నం చేసింది. విమానంలో కలకలం - మరోవైపు కెయిలీ తన భర్త శవపేటికని చూసి, మరింత భావోద్వేగానికి గురయింది. కార్సన్ ఆమెని పట్టుకుని, ఫ్లైట్ ల్యాండ్ కాగానే ఆమెని అరెస్ట్ చేయడం గ్యారెంటీ అని చెప్పాడు. ఆమె భర్త శవపేటికలో దాచిన ఎక్స్‌ప్లోజివ్స్‌ను బయటికి తీశాడు ఎయిర్ మార్షల్ కార్సన్. కెప్టెన్ దగ్గరికి వెళ్లి కెయిలీ ఓ హైజాకర్ అని, 50 మిలియన్ల డాలర్లు తను చెప్పిన బ్యాంక్ ఎకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయకపోతే విమానాన్ని పేల్చేస్తానని బెదిరిస్తున్నట్లు చెప్పాడు. నిజానికి ఎయిర్ మార్షల్ కార్సన్, ఫ్లైట్ అటెండెంట్ స్ట్టెఫనీ, బెర్లిన్‌లోని మార్చురీ డెరైక్టర్ ముగ్గురూ కలిపి పన్నిన కుట్ర ఇది. కెయిలీ భర్త డేవిడ్‌ని చంపింది వాళ్లే. పాప జూలియాని అడ్డం పెట్టుకుని - ఈ హైజాక్ డ్రామా రక్తి కట్టించడానికి జూలియాని కిడ్నాప్ చేశారు. మత్తుమందిచ్చి, ఆ ఫ్లైట్‌లోనే ఓ చోట దాచిపెట్టారు. 50 మిలియన్ల డాలర్లు చేతికి అందగానే జూలియాని చంపేసి, ఫ్లైట్ పేల్చేసి, అది కెయిలీ చేసిందని సాక్ష్యాలు సృష్టించబోతున్నట్లు కార్సన్ ప్లాన్ చేశాడు. ఈ హైజాకింగ్ డిమాండ్‌తో, ఆ ఫ్లైట్‌ని అత్యవసర పరిస్థితుల్లో కెనడాలో ల్యాండ్ చేశారు. కెప్టెన్ మాట్లాడిన మాటలతో తనని హైజాకర్‌గా చిత్రించారని కెయిలీ అర్థం చేసుకుంది. కెయిలీ ఇదే మంచి అవకాశంగా భావించింది. తనే హైజాకర్ అన్నట్లుగా ప్రవర్తిస్తూ, కార్సన్ని, మిగిలిన క్రూని ఫ్లైట్‌లోనే ఉండమంది. కాదని ఎదురు తిరిగితే కార్సన్ ఆడిన నాటకం బయటపడుతుంది. ఫ్లైట్ డోర్ మూతపడగానే - కెయిలీ అగ్నిమాపక యంత్రంతో కార్సన్ తలమీద కొట్టింది. సంకెళ్లు వేసి బంధించింది. అతని జేబులోని డిటొనేటర్‌ను స్వాధీనం చేసుకుంది. స్ట్టెఫనీని చితక్కొట్టింది. బిన్లో చివరికి స్పృహ తప్పి ఉన్న తన పాప జూలియాని దక్కించుకోగలిగింది కెయిలీ. అప్పుడు ప్రయాణికులంతా కెయిలీ మాటలని నమ్మారు. తప్పిపోయిన పాప కోసం ఓ తల్లి పడ్డ వేదన, వెదుకులాట వందలాది ప్రయాణికులను కాపాడింది. - తోట ప్రసాద్ 2005లో ఇంగ్లిష్, జర్మన్ భాషల్లో ఈ చిత్రం బడ్జెట్ 50 మిలియన్ డాలర్లు. వసూలు చేసింది 225 మిలియన్ల డాలర్లు. పీటర్ ఎ డేరింగ్ అనే బ్రిటిష్ రచయిత, బిల్లి రే అనే అమెరికన్ రచయిత కలిసి రాసిన ఈ స్క్రిప్టుకి జర్మన్ దర్శకుడైన రాబర్ట్ స్వీబెంట్క్ దర్శకత్వం వహించాడు. అను‘క్షణం’ ఉత్కంఠ కలిగించిన ఈ తాజా తెలుగు చిత్రం కూడా ఇటువంటి కథాంశంతో రూపొందించినదే. -
కెయిలీ... ఓ జవాబు దొరకని ప్రశ్న!
కేజీ అంత మంచిది కాదంటారు ఆమె గురించి తెలిసినవాళ్లు. పందొమ్మిదేళ్లకే గర్భం దాల్చి, కెయిలీకి జన్మనిచ్చింది కేజీ. కానీ ఆ బిడ్డకి తండ్రి ఎవరనేది తన తల్లిదండ్రులకు కూడా చెప్పలేదు. అయినా వాళ్లు కెయిలీని ప్రేమగా పెంచారు. కేజీ మాత్రం పాపను పట్టించుకునేదే కాదు. పబ్బులకీ, పార్టీలకీ తిరిగేది. దాంతో ఓ రోజు కూతురి మీద కోప్పడింది సిండీ. అది కేజీకి నచ్చలేదు. వెంటనే కూతుర్ని తీసుకుని వెళ్లిపోయింది. తన స్వేచ్ఛకు అడ్డుగా ఉందని ఆమే పాపను ఏదైనా చేసివుంటుందని అందరికీ అనుమానమే. కానీ ఎవరూ నిరూపించలేకపోయారు. దాంతో ఆమె కేసు నుంచి బయటపడింది. నిజాలు దేవుడికెరుక: జూన్ 15, 2008... అమెరికాలోని ఆరెంజ్ కౌంటీ... ఆఫీసులో కూర్చుని తీవ్రంగా ఆలోచిస్తున్నాడు డిటెక్టివ్ యూరీ మెలిష్. తలుపు దగ్గర శబ్దం కావడంతో అటు వైపు చూశాడు. యాభయ్యేళ్లు దాటిన ఓ మహిళ నిలబడి ఉంది. ‘‘సర్... నా పేరు సిండీ ఆంటోనీ...’’ అంది వినమ్రంగా. ‘‘ఓ మిసెస్ ఆంటోనీ... మీ కోసమే వెయిట్ చేస్తున్నారు. రండి, కూర్చోండి’’ అన్నాడు యూరీ నవ్వుతూ. ఆమె వచ్చి అతడికెదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది. ‘‘ఏదో మాట్లాడాలని అన్నారు. చెప్పండి. ఏంటి విషయం?’’ యూరీ అలా అడగ్గానే దుఃఖం ముంచుకొచ్చింది సిండీకి. ‘‘నా రెండేళ్ల మనవరాలు కెయిలీ కనిపించడం లేదు సర్. ఏమయ్యిందో అర్థం కావడం లేదు’’ అంది బొంగురుపోయిన గొంతుతో.‘‘ఎప్పట్నుంచి?’’... వివరాలు నోట్ చేసుకోవడానికి పెన్నూ పుస్తకం చేతిలోకి తీసుకుంటూ అడిగాడు యూరీ. ‘‘నెల రోజుల్నుంచి?’’ ‘‘వ్వా...ట్... నెల రోజుల్నుంచీనా? మరిప్పటి వరకూ కంప్లయింట్ ఇవ్వకుండా ఏం చేస్తున్నారు?’’‘‘తను మిస్సయ్యిందని నాకు తెలిస్తే కద సర్ కంప్లయింట్ ఇవ్వడానికి! వాళ్లమ్మ దగ్గరే ఉందనుకున్నాను. కానీ అది నిజం కాదని ఇప్పుడే తెలిసింది. తనేమయ్యిందో తెలియడం లేదు. మీరే నిజం తెలుసు కోవాలి... ప్లీజ్.’’‘‘అసలేం జరిగిందో వివరంగా చెప్పండి’’ అన్నాడు యూరీ. చెప్పడం ప్రారంభించింది సిండీ. ‘‘తెల్లవారగానే వచ్చి గార్డెన్లో పడిపోతావ్. విసుగైనా రాదా జార్జ్ నీకు’’... జ్యూస్ గ్లాసుతో వచ్చిన సిండీ విసుక్కుంది. ‘‘నో డియర్... నిన్ను ప్రేమించడం తర్వాత నాకు అంత ఇష్టమైన పని గార్డెనింగే’’... కన్నుగీటాడు జార్జ్. ‘‘చాల్లే... దీనికేం తక్కువ లేదు’’... ముద్దుగా విసుక్కుని, జ్యూస్ అతడి చేతిలో పెట్టి గేటువైపు నడిచింది. గేటుకు తగిలించివున్న పోస్ట్‌బాక్స్‌లో ఉన్న ఉత్తరం తీసుకుని వెనక్కి వచ్చింది. దాన్ని తెరచి చూస్తూనే... ‘‘జార్జ్, ఇలారా’’ అంది కంగారుగా. గబగబా ఆమె దగ్గరకు వచ్చి, ఉత్తరం అందుకుని చదివాడు. ‘‘మిస్టర్ అండ్ మిసెస్ జార్జ్ ఆంటోనీ... మీ అమ్మాయి కేజీ కారు ఇక్కడికి కొన్ని కిలోమీటర్ల దూరంలో, అడవిని ఆనుకుని ఉన్న రోడ్డులో పార్క్ చేసివుంది. వెళ్లి తెచ్చుకోండి.’’ దాన్ని చదువుతూనే భృకుటి ముడిచాడు జార్జ్. మనసు ఏదో కీడు శంకించింది. వెంటనే కూతురికి ఫోన్ చేశాడు. కనెక్ట్ కాలేదు. దాంతో పనివాణ్ని తీసుకుని వడివడిగా వెళ్లాడు. కాస్త నిర్మానుష్యంగా ఉన్న రోడ్డులో, ఓ పక్కగా పార్క్ చేసివుంది కేజీ కారు. డోరు లాక్ చేసి లేక పోవడంతో తెరచి చూశాడు. లోపల కేజీ పర్సు ఉంది. కేజీ కూతురు కెయిలీ ఆటబొమ్మలు కూడా ఉన్నాయి. కారు ఉన్న పరిస్థితిని బట్టి, దాన్ని అక్కడ పార్క్ చేసి చాలా రోజులయ్యిందనిపిస్తోంది. దానికి తోడు ఒకలాంటి వెగటు వాసన వస్తోంది. ‘‘రాబర్ట్... డిక్కీ చెక్ చెయ్’’ అన్నాడు ఆ వాసన ఏమిటా అని అంచనా వేస్తూ. యజమాని ఆదేశం అందగానే వెళ్లి చెక్ చేశాడు రాబర్ట్. ఏమీ లేదందులో. మరి వాసన ఎందుకొస్తోందో అర్థం కాలేదు. కారు తీసుకుని ఇంటికి వచ్చేశారు. ‘‘ఎందుకు మమ్మీ కంగారు పడతావ్? నా కారు కొన్ని రోజులుగా కనిపించడం లేదు. ఎవరో ఎత్తుకుపోయారు. కంప్లయింట్ కూడా ఇచ్చాను. వాళ్లే అక్కడ వదిలేసి ఉంటారు.’’కూతురి మాట నమ్మబుద్ధి కాలేదు సిండీకి. ‘‘కారు సంగతి సరే. ముందు కెయిలీని పిలు. నేను దానితో మాట్లాడి చాలా రోజులైంది’’ అంది కసిరినట్టుగా. ‘‘తను బేబీ సిట్టర్ దగ్గర ఉంది మామ్.’’ ‘‘షటప్ కేజీ... నెల రోజులుగా ఇదే చెప్తున్నావ్. రాత్రీ పగలూ కూడా పాపని అక్కడే ఉంచేస్తున్నావా ఏంటి? నేను దానితో వెంటనే మాట్లాడాలి.’’ ‘‘ఓ మామ్... యు ఆర్ క్రేజీ... ఎంత చెప్పినా అర్థం కాదు నీకు’’ అంటూనే ఫోన్ డిస్ కనెక్ట్ చేసింది కేజీ. దాంతో ఏదో అనుమానం కలిగింది సిండీకి. వెంటనే కంప్లయింట్ ఇవ్వడానికి బయలుదేరింది. సిండీ చెప్పిదంతా విని ఆలోచనలో పడ్డాడు యూరీ. కేజీ ఏదో దాచిపెడుతోందనిపించింది. దాంతో సిండీని తీసుకుని కేజీ దగ్గరకు బయలుదేరాడు. అరగంట తిరిగేసరికి ఆమె ఇంటి దగ్గరున్నాడు. పోలీసులతో వచ్చిన తల్లిని చూస్తూనే షాకయ్యింది కేజీ. ‘‘ఏంటి మమ్మీ ఇదంతా’’ అంది షాక్ తిన్నట్టుగా. ‘‘నేను చెప్తాను కేజీ ఆంటోనీ... మీ అమ్మగారు తన మనవరాలి కోసం బెంగ పెట్టుకున్నారు. తనని చూపిద్దామని తీసుకొచ్చాం. ఓసారి పాపని పిలవండి.’’ యూరీ మాటలు వింటూనే తత్తర పడింది కేజీ. ‘‘పాప లేదు.. బేబీ సిట్టర్ జేనీ ఫెర్నాండెజ్ దగ్గర ఉంది’’ అంది తడబడుతూ. ‘‘ఏం ఫర్లేదు. అక్కడికే వెళ్దాం’’ అన్నాడు యూరీ కూల్‌గా. కదల్లేదు కేజీ. ఏదో నసిగింది. బిత్తర చూపులు చూసింది. టెన్షన్‌గా అటూ ఇటూ తిరిగింది. ‘‘ఇక చాలు కేజీ... ఏం జరిగిందో చెప్పేస్తే మంచిది’’... ఈసారి యూరీ మాట కఠినంగా వచ్చింది. దాంతో కేజీ కంగారుపడింది. ‘‘అదీ... మరీ... నేను... మమ్మీ వాళ్ల దగ్గర్నుంచి వచ్చేశాక నా బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి టూర్‌కి వెళ్లాలనుకున్నాను. అందుకే పాపని జేనీ దగ్గర ఉంచాను. కానీ తను పాపను తీసుకుని ఎక్కడికో పారిపోయింది. వెతికినా దొరకలేదు.’’ అది వింటూనే ఆవేశంగా వెళ్లి కూతురి చెంప పగులగొట్టింది సిండీ. ‘‘బుద్ధి లేదా నీకు? పాప విషయంలో ఇంత నిర్లక్ష్యమా?’’ అంటూ చీవాట్లు వేసింది. యూరీకి మాత్రం ఏదో తేడా కొట్టింది. కేజీ చెబుతోన్నదాంట్లో నిజం లేదని అతడి అనుభవం పదే పదే చెప్పసాగింది. దాంతో తన టీమ్‌ని రంగంలోకి దింపాడు. అతడు అనుమానించిందే నిజమైంది. మూడు రోజుల తర్వాత... సిండీ, జార్జ్ల ఇంటి వెనుక ఉన్న పెద్ద తోటలో... ఓ పాలిథీన్ సంచిలో ఒక పుర్రె, కొన్ని ఎముకలు దొరికాయి. అవి కెయిలీవే అని తెలుసుకోవడానికి యూరీకి పెద్ద సమయం పట్టలేదు. వెంటనే కేజీ చేతికి బేడీలు వేశాడు. మూడేళ్ల తర్వాత... జూలై 17, 2011... ‘‘తన కూతురు కెయిలీని కేజీయే హత్య చేసిందనడానికి తగిన ఆధారాలు లేవు. కాకపోతే కూతురి అదృశ్యం గురించి గోప్యంగా ఉంచడం, నిర్లక్ష్యంగా వ్యవహరించడం వంటివాటికి శిక్షార్హురాలు. కానీ ఇప్పటికే మూడేళ్లు జైల్లో గడిపింది కాబట్టి ఆమెను విడుదల చేయడమైనది.’’ తీర్పు వింటూనే అమెరికా మొత్తం షాకైపోయింది. న్యాయస్థానం ఆమెను నిర్దోషిగా ఎలా ఎంచిందో ఎవరికీ అర్థం కాలేదు. ఎందుకంటే, ఏ రకంగా చూసినా కేజీయే నేరస్తురాలనడానికి సాక్ష్యాలు కనిపిస్తున్నాయి. గార్డెన్లో దొరికిన కెయిలీ పుర్రెను పరిశీలించినప్పుడు నోటిమీద టేపు కనిపించింది. ఎముకల మీద కూడా టేపు ఉంది. అంటే అరవకుండా, కదలకుండా పాపను బంధించారు. అధిక మొత్తంలో క్లోరోఫామ్ ఇచ్చి, ఊపిరాడకుండా చేసి హత్య చేశారని పోస్ట్‌మార్టమ్ నివేదికలో ఉంది. దానికి తగ్గట్టుగా కేజీ కారులో క్లోరోఫామ్ ప్యాకెట్ కనిపించింది. కేజీ కంప్యూటర్ హిస్టరీని చెక్ చేసినప్పుడు... క్లోరోఫామ్ గురించి ఆమె నలభైసార్లకు పైగా సెర్చ్ చేసినట్టు తెలిసింది. పైగా ఆమె చెప్పినవన్నీ అబద్ధాలే. పాపను జేనీ ఫెర్నాండెజ్ దగ్గర పెట్టానంది. కానీ అసలలాంటి వ్యక్తే లేదని విచారణలో తేలింది. అడిగితే.. ‘ఎవరో స్త్రీ ప్లాన్ ప్రకారం నాతో ఆ పేరు చెప్పిందేమో. నేను నమ్మి పాపను అప్పగించాను, ఎత్తుకుపోతే నేనేం చేయను’ అంది. తాను యూనివర్సల్ స్టూడియోస్‌లో పని చేస్తున్నానని కేజీ పోలీసులతో చెప్పింది. అది కూడా అబద్ధమని, ఆమె ఉద్యోగం పోయి అప్పటికి చాలా కాలమే అయ్యిందని తెలిసింది. కారును ఎత్తుకుపోవడం అనేది కూడా నమ్మశక్యంగా అనిపించలేదు. కారు అక్కడుందని కేజీ తల్లిదండ్రులకు ఉత్తరం ఎవరు పంపారో కూడా తెలీలేదు. దానికి తోడు విచారణ సమయంలో కేజీ ప్రవర్తన సందేహాలను పెంచింది. కూతుర్ని పోగొట్టుకున్న బాధ లేకుండా నవ్వుతూ తుళ్లుతూ ప్రవర్తించడం ఆశ్చర్యపరిచేది. ఆమెకు వ్యతిరేకంగా ఇన్ని సాక్ష్యాలు కనిపిస్తుంటే, ప్రతి విషయమూ అనుమానాస్పదంగా కనిపిస్తుంటే కేజీని నిర్దోషి అని ఎలా అంటారు అంటూ చాలామంది న్యాయస్థానాన్ని, ప్రభుత్వాన్ని నిలదీశారు. కానీ ప్రయోజనం లేకపోయింది. కేజీ ఇప్పుడు స్వేచ్ఛగా, సంతోషంగా జీవిస్తోంది. ఆర్టిఫీషియల్ ఇన్సెమినేషన్ ద్వారా మరో ఇద్దరు పిల్లలకు జన్మనివ్వబోతోంది. కెయిలీ గురించి ఓ తల్లిగా ఆమె ఎప్పుడూ ఎక్కడా మాట్లాడదు. కానీ ప్రపంచం మాత్రం ఇప్పటికీ కెయిలీ గురించి మాట్లాడుతోంది. ఆమె పట్ల జరిగిన దారుణాన్ని గుర్తు చేసుకుని కన్నీరు పెడుతోంది. ముద్దులొలికే ఆ చిన్నారి ఉదంతం... జవాబు దొరకని ప్రశ్నగా మిగిలిపోయింది! అయితే కెయిలీ కేసు చూసిన తర్వాత అమెరికా ప్రభుత్వం ‘కెయిలీ లా’ పేరుతో ఓ చట్టాన్ని రూపొందించింది. దాని ప్రకారం... పన్నెండేళ్లలోపు పిల్లలు ఉన్నట్టుండి కనిపించకుండా పోయినా, అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించినా, ఇరవై నాలుగ్గంటల లోపు పోలీసులకు తెలియజేయాలి. లేదంటే మొదటి అనుమానితులు తల్లిదండ్రులే అవుతారు. ఈ చట్టాన్ని కొందరు తప్పుబట్టారు. తల్లిదండ్రుల్ని అనుమా నించడం కరెక్ట్ కాదు అన్నారు. కానీ ప్రభుత్వం తమ చట్టాన్ని సమర్థించుకుంది. చిన్నపిల్లలు అదృశ్యమవడం, వారి మరణాలు ఎక్కువ కావడాన్ని దృష్టిలో ఉంచుకుని, ఈ చట్టాన్ని అమలు చేసి తీరాలని నిర్ణయించుకుంది. - సమీర నేలపూడి
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
హోం ఓటింగ్ పరిశీలన
నిప్పుతో చెలగాటమా!
మాదిగలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ
‘రాహుల్ పేరు చెబితే ఓట్లు పడవు’
కాంగ్రెస్‌తోనే అన్నివర్గాలకు సముచిత న్యాయం
హామీలు నెరవేర్చడంలో రేవంత్ విఫలం
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
హామీల అమలులో కాంగ్రెస్ విఫలం
పార్లమెంట్ ఎన్నికలు బహిష్కరిస్తాం..
మూడోసారి మోదీ సర్కారే..
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్‌కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్‌తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement