-
Phu Quoc: వెహికిల్స్‌కు నో ఎంట్రీ.. ఎందుకంటే ఇది... కిస్సింగ్ బ్రిడ్జి
వియత్నాంలో అది అనగనగా ఓ వంతెన. కానీ దాన్ని కట్టింది అన్ని వంతెనల మాదిరిగా అటూ ఇటూ దాటడానికి కాదు. ముద్దులు పెట్టుకోవడానికి! అవును. వినడానికే విచిత్రంగా ఉంది కదూ! దక్షిణ వియత్నాంలోని ఫూక్వోక్ ద్వీపం అందమైన బీచ్‌లకు ప్రసిద్ధి. అక్కడి సన్‌సెట్ సిటీలో ఇటీవల నిర్మించిన 800 మీటర్ల పై చిలుకు పొడవైన బ్రిడ్జి అందరినీ ఎంతగానో అలరిస్తోంది. ఇది ముద్దుల బ్రిడ్జి కావడమే ఇందుకు కారణం. దీని డిజైన్‌ను ఇటలీకి చెందిన ఆర్కిటెక్ట్ మార్కో కాసామోంటీ రూపొందించాడు. లగ్జరీ టూరిజం డెవలపర్ సంస్థ సన్ గ్రూప్ నిర్మించింది. ఆడమ్ సృష్టికి సంబంధించి ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారుడు మైకేలాంజిలో సిస్టిన్ చాపెల్‌లో సృజించిన ఫ్రెస్కో పెయింటింగ్ స్ఫూర్తితో దీని డిజైన్‌కు రూపకల్పన చేశారు. రెండు సగాలుగా ఈ బ్రిడ్జి నిర్మాణం జరిగింది. ఆ పెయింటింగ్‌లోని రెండు చూపుడు వేళ్ల మాదిరిగానే బ్రిడ్జి తాలూకు రెండు సగాలు కూడా పరస్పరం తాకవు. వాటి మధ్య 30 సెంటీమీటర్ల దూరముంటుంది. దూరంనుంచి చూస్తే ఆ రెండు కొనలూ ఒకదాన్నొకటి చుంబించుకుంటున్నట్టుగానే ఉండటం మరో విశేషం! ముద్దులాడాలనుకునే జంటలో ఒకరు ఆ సగం నుంచి, మరొకరు ఈ సగం మీద నుంచుని వీలైనంతగా ముందుకు వంగాలన్నమాట! ఆ మీదట పెదాలకు పని చెబుతూ తమ ప్రేమను వ్యక్తపరుచుకోవచ్చు. పెళ్లికి ప్రపోజ్ చేసుకోవచ్చు. ఈ బ్రిడ్జి పేరు చౌ హోన్. దాని అర్థం కూడా ‘పెళ్లికి ప్రపోజ్ చేసుకోవడం’ కావడం మరో విశేషం. వారం క్రితం ప్రారంభించిన ఈ బ్రిడ్జి చూస్తుండగానే ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారింది. దాన్ని చూడటానికి, చెరోవైపు నుంచి రొమాంటిక్‌గా ముద్దులాడటానికి జంటలు భారీగా వస్తున్నాయట! – సాక్షి, నేషనల్ డెస్క్ -
ముద్దు పెట్టుకోవడం వల్ల మొటిమలు వస్తాయా?
అయిచాలామంది టీనేజ్ పిల్లలనే కాదు కొందరూ పెద్దల్లో కూడా ఈ మొటిమలు ఇబ్బంది పెడుతుంటాయి. వేడి చేసి కూడా వస్తుంటాయని అంటారు కొందరూ. కానీ వాటి వల్ల ముఖం కమిలి ర్యాషెస్ వచ్చినట్లుగా పోతాయి. ఆయిల్ వస్తువులు తినడం వల్ల వచిందా? లేక తలలోని చుండ్రు కారణమా అని మాత్రమే ఆలోచిస్తాం. కానీ ముద్దు పెట్టుకోవడం వల్ల మొటిమలు రావడం ఏమిటి అని ఆశ్చర్యపోకండి ఇది నిజం. వినడానికి నమ్మశక్యం కానంత వింతగా అనిపిస్తుందని కొట్టిపారేయొద్దు. ఎలా సాధ్యమో సవివరంగా తెలుసుకునేందుకే ఈ కథనం. ముద్దు మీ మానసిక ఆరోగ్యానికి, వ్యక్తిగత జీవితానికి ప్రయోజనకరమైనదే అయినా ఒక్కోసారి ఇది కొన్ని సమస్యలు తెచ్చుపెడుతుంది. ముద్దు వల్ల చర్మం ఇరిటేషన్‌కి గురై ఆ తర్వాత మొటిమలు ఏర్పడేందుకు దాదితీస్తాయని చర్మ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా జిడ్డు, మొటిమలు బారినపడే చర్మం ఉన్నవారైతే వారిలో బ్యాక్టీరియా, నూనెను బదిలీ చేసే కారకాలు ఎక్కువుగా ఉంటాయి. ఇలాంటి వారు ముద్దు పెట్టుకుంటే లాలాజలం ఒకరి నుంచి మరొకరికి ట్రాన్స్ఫర్ అయ్యి చర్మం చికాకుగా అయ్యి మొటిమలు వస్తాయని చెబుతున్నారు నిపుణులు. ముద్దు పెట్టుకున్న వెంటనే మొటిమలు రావు. అలాగే ఇది అంటు వ్యాధి కాదు. లిప్ బామ్‌లు వంటివి వాడే వారైతే అవి మీ చర్మానికి సరిపడనది అయ్యి సమస్యలు తప్పవు అంటున్నారు వైద్యులు. జిడ్డు చర్మం, ప్రధానంగా డెడ్్ స్కిన్ సెల్స్, బ్యాక్టీరియాతో మూసుకుపోయిన రంధ్రాల వల్ల ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. ముద్దు పెట్టుకోవడం వల్ల నేరుగా రాకపోయిన వారి అపరిశుభ్రత కారణంగా పరోక్షంగా మొటిమొలు వచ్చేందుకు దోహదం చేస్తాయని చర్మ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఎక్కువ సేపు ముద్దులు పెట్టుకోవడం వల్ల ఈ సమస్య మరింత తీవ్రతరంగా ఉంటుంది. మీరు, మీ భాగస్వామి మధ్య అవగాహనతో మంచి పరిశుభ్రతతో ఉంటే ఎటువంటి సమస్యలు ఉండవు. అందులో ఒక్కరూ వ్యక్తిగత శుభ్రతలో లోపం ఉన్నా ముద్దుల వల్ల సమస్య వస్తుంది. అది మొటిమలు వరకే కాదు ఇంకే ఇతర అనారోగ్య సమస్యలైన ఇలానే వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందనే విషయం మరిపోవద్దని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. (చదవండి: పార్లర్‌కి వెళ్లక్కర్లేకుండా..ఈ మెషిన్‌తో ఈజీగా వ్యాక్సింగ్, థ్రెడింగ్..) -
మెట్రోలో లవర్స్ పాడుపని.. ట్రెండింగ్‌లో వీడియోలు
సోషల్ మీడియాలో లైక్స్, వ్యూస్ కోసం కొందరు బరితెగిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో పిచ్చి చేష్టలతో రెచ్చిపోతున్నారు. ఇతరులకు ఇబ్బంది కలుగుతుందన్న సోయి లేకుండా హద్దుమీరి ప్రవర్తిస్తున్నారు. బస్సు, మెట్రో, విమానం, రైల్లో ఆకతాయిల ఆగడాలు ఈమధ్య ఎక్కువై పోతున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ మెట్రోలో అసాంఘిక కార్యక్రమాలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. పాపులర్ కావాలని చేస్తున్నారా? లేక పొరపాటుగా అలా జరిగిపోతోందా? తెలియదుగానీ మెట్రో పరువైతే బజారున పడే పరిస్థితి దాపురించింది. ఈ క్రమంలో ట్విటర్లో #DelhiMetro హాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. గతంలో కొందరు ప్రేమికులు మెట్రోలో పబ్లిక్ ముందే ముద్దులు పెట్టుకుంటూ ఇబ్బందులకు గురిచేసిన విషయం తెలిసిందే. మరో వ్యక్తి మెట్రో రైలు కోచ్‌లో బనియన్, టవల్‌తో దర్శనమిచ్చాడు. ఇది మరవకముందే మరో జంట సిగ్గు విడిచి లిప్ కిస్ ఇచ్చుకున్నారు. నిన్న కాక మొన్న ఓ యువతి బికినీ ధరించి మెట్రోలో ప్రయాణించింది. ఈ వీడియోలన్నీ నెట్టింట్లో తెగ చక్కర్లు కొట్టాయి. అయితే వరుస సంఘటనలకు సంబంధించిన వీడియోలను నెటిజన్లు ట్విటర్లో షేర్ చేస్తూ ఫిర్యాదు చేస్తున్నారు. పబ్లిక్ ప్లేసెస్‌లో ఇలాంటి పనులేంటని ప్రశ్నిస్తూ.. వీటిని అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. #DelhiMetro హాష్‌ట్యాగ్‌తో సోషల్ మీడియాలో గళమెత్తుతున్నారు. कल से सिर्फ Delhi Metro में ही travel करूंगा !!!!!! pic.twitter.com/l228ZEao1q — Hasna Zaroori Hai 🇮🇳 (@HasnaZarooriHai) April 3, 2023 View this post on Instagram A post shared by 🇮🇳मोहित गौहर 🇮🇳 (@mohitgauhar) Another video of Delhi Metro. If this is an example of WOMEN EMPOWERMENT, then alas our young generation GIRLS can be victim of such EMPOWERMENT 🤦♂️ And this is exactly what SHAMELESS FEMINISTS want. I would call it CULTURAL GEN*CIDE.#delhimetro @OfficialDMRC pic.twitter.com/BrmjBQ3u32 — Barkha Trehan 🇮🇳 / बरखा त्रेहन (@barkhatrehan16) March 31, 2023 -
బహిరంగంగానే మహిళా నేతను ముద్దు పెట్టుకున్న శివసేన ఎమ్మెల్యే?
ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే వర్గానికి చెందిన శివసేన ఎమ్మెల్యే ప్రకాష్ సర్వే చిక్కుల్లో పడ్డారు. దహిసర్‌లో ఆశీర్వాద్ యాత్రలో భాగంగా నిర్వహించిన బహిరంగ ర్యాలీలో పార్టీ మహిళా నేతను ముద్దు పెట్టుకోవడం వివాదాస్పదమైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో ఎమ్మెల్యే.. పార్టీ అధికార ప్రతినిధి షీతల్ మ్హత్రేను బుగ్గ మీద ముద్దాడినట్లు కనిపిస్తుంది. మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే ర్యాలీకి శివసేన ఎమ్మెల్యే ప్రకాశ్ సర్వే, పార్టీ అధికార ప్రతినిధి శీతల్ మ్హత్రే హాజరయ్యారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే ప్రకాష్ వాహనం మీద ఉన్నారు. ఆయన పక్కనే షీతల్ నిలబడి ఉన్నారు. ఉన్నట్టుండి ఎమ్మెల్యే రెండుసార్లు కిందకు వంగి మహిళా నేతను ముద్దు పెట్టుకున్నట్లు, ఆమె వైపు చూస్తూ నవ్వడం వీడియో ద్వారా తెలుస్తోంది. దీంతో ఎమ్మెల్యే అసభ్య ప్రవర్తనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ వీడియోపై ఎమ్మెల్యే స్పందించారు. నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో ఫేక్ అని తేల్చారు. తన పరువు తీసేందుకు, రాజకీయ జీవితాన్ని నాశనం చేయడానికి వీడియోను మార్ఫింగ్ చేశారని ఎమ్మెల్యే ఆరోపించారు. అంతేగాక దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. శివసేన నేతలు ముద్దుపెట్టుకుంటున్న వీడియోను మార్ఫింగ్ చేశారన్న ఆరోపణలపై ఐపీసీ సెక్షన్లు 354,509,500,34, 67 కింద దహిసర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసుతో సంబంధమున్న ఇద్దరు నిందితులను 26 ఏళ్ల మానస్ కువార్, 45 ఏళ్ల అశోక్ మిశ్రాగా గుర్తించిన పోలీసులు వారిని అరెస్టు చేశారు. తదుపరి విచారణ కొనసాగుతోందన్నారు. खुल्लम खुल्ला प्यार करेंगे हम दोनो. .. .. pic.twitter.com/6ubh6gg4MZ — जाग्रुत जनता (@foundat11) March 12, 2023 అంతేగాక ఈ వ్యవహారంపై శీతల్ మ్హత్రే స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విటర్లో ’రాజకీయాల్లో ఒక మహిళ వ్యక్తిత్వాన్ని కించపరిచేందుకు ఇంత నీచానికి దిగజారుతారా? ఇదేనా మీ సంస్కృతి? మాతోశ్రీ అనే ఫేస్బుక్ పేజీ నుంచి మార్ఫింగ్ చేసిన వీడియోని అప్లోడ్ చేసినట్లు తెలిసింది. ఆ సమయంలో మీకు బాలాసాహెబ్ సంస్కారం గుర్తుకు రాలేదా?’ అంటూ దుయ్యబట్టారు. राजकारणामधील महिलेसंदर्भात बोलण्यासारखे काही नसले तर तिचे चारित्र्यहनन करणे हेच उद्ध्वस्त गटाचे संस्कार आहेत?? मातोश्री नावाच्या fb पेजवरुन एका स्त्री संदर्भात असा morphed video upload करताना बाळासाहेबांचे संस्कार नाही का आठवले? pic.twitter.com/rpaqbMtiZU — sheetal mhatre (@sheetalmhatre1) March 11, 2023 -
భయానక స్టంట్: ఏకంగా కింగ్ కోబ్రా తలపై ముద్దు: వీడియో వైరల్
ఇటీవల కాలంలో పాములతో రకరకాల స్టంట్లు చేస్తున్నారు. ఆ స్టంట్లలో చాలా వరకు బెడిసి కొట్టిన ఘటనలే చూశాం. అదీగాక విషసర్పలతో కామెడీ చేస్తే ప్రాణాలకే ముప్పు అని చాలా విషయాల్లో ప్రూవ్ అయ్యింది కూడా. ఇటీవలే ఒక వ్యక్తి నాగుపాము నుదుట ముద్దు పెట్టుకోబోతే రివర్స్‌లో కాటేసిన సంఘటన చూశాం. అయిన పలువురు స్నేక్ క్యాచర్లు ఇలాంటి స్టంట్లే చేస్తున్నారు. ఇక్కడొక స్నేక్ క్యాచర్ ఏకంగా కింగ్ కోబ్రా తలపై ముద్దు పెట్టే స్టంట్ చేశాడు. వివరాల్లోకెళ్తే..ఈ హార్ట్ రైజింగ్ స్టంట్ వీడియోని సౌరబ్ జాదవ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఆ వీడియోలో ఒక వ్యక్తి కింగ్ కోబ్రా తలపై ముద్దు పెట్టుకునే స్టంట్ చేశాడు. ఈ స్టంట్ చేసిన వ్యక్తి వావా సురేష్ అనే కేరళ వాసి. అతను ఇప్పటివకరకు సుమారు 38 వేల విషసర్పాలను పట్టుకున్నాడు. మూడువేల సార్లుకు పైగా పాము కాటుకి గురయ్యాడు. అంతేగాదు సుమారు 190కి పైగా కింగ్ కోబ్రాలను రక్షించాడు. దీంతో అతన్ని అందరూ కేరళ స్నేక్ మ్యాన్‌గా పిలుస్తుంటారు. అసలు ఈ వీడియో చూస్తే.. అతను ఎలా ఉన్నా టెన్షన్‌తో చూస్తున్న మనకు గుండె ఆగిపోయినంత భయం వేస్తుంది. View this post on Instagram A post shared by Saurabh Jadhav Jadhav (@10_viper_21) (చదవండి: మానవత్వం అంటే ఇది కదా! రోడ్లపై చెత్త కాగితాలు ఏరుకుంటున్న ఆమెను..)
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్‌స్టాప్‌గా...
- ఐపీఎల్‌పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
Advertisement