-
తిరుమలలో రామ్ చరణ్ కూతురు 'క్లీంకార' ఫేస్ రివీల్
తిరుమల శ్రీవారిని సినీనటుడు రామ్‌చరణ్ , ఉపాసన దంపతులు దర్శించుకున్నారు. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా తన కుటుంబంతో పాటు తిరుమల చేరుకున్నారు. కుమార్తె క్లీంకారతో కలిసి స్వామి వారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. ఈ క్రమంలో వారు ముద్దల కూతురు ఫోటో రివీల్ అయింది. శ్రీనివాసుని సన్నిధి నుంచి వారు వస్తుండగా అక్కడ ఉన్న కొందరు మీడియా వారు క్లీంకార ఫోటోను తీయడం జరిగింది. అది కాస్త అభిమానులకు చేరువ కావడంతో వారు ఎంతో సంతోషంగా ఉన్నారు. గతేడాది జూన్ 20న జన్మించిన క్లీంకార ఫేస్‌ను ఇప్పటి వరకు ఎక్కడా కూడా రివీల్ కాకుండా వారు జాగ్రత్తపడ్డారు. కానీ నేడు తిరుమలలో శ్రీవారి దర్శనానికి వెళ్తున్న సమయంలో కొందరు ఫోటోలు తీశారు. అవి కాస్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. View this post on Instagram A post shared by TIRUMALA DEVASTANAM OFFICIAL (@anandanilayam_) -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రామ్ చరణ్ దంపతులు
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నేడు (మార్చి 27) 39వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబంతో కలిసి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి తిరుమల వెళ్లారు. పుట్టినరోజు నాడు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని ఉపాసనతో పాటుగా చరణ్ దర్శించుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శనంలో వెంకన్న సేవలో వారు పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శనం ఏర్పాటు చేశారు. దర్శన అనంతరం స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు. వారితోపాటు తన కూతురు క్లిన్ కారను కూడా శ్రీనివాసుడి సన్నిధికి తీసుకుకొచ్చారు. దీంతో ఆలయం వద్ద రామ్‌చరణ్‌ను చూసేందుకు భక్తులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ క్రమంలో ఆయనకు అభిమానులు కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. -
Klin Kaara Beach Photos: క్లీంకారకు బీచ్‌ని పరిచయం చేసిన రామ్‌చరణ్.. ఫొటోలు వైరల్
-
'అమ్మా, నాన్నతో తొలిసారి అలా'.. ఉపాసన పోస్ట్ వైరల్!
మెగా హీరో రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ మూవీ షూటింగ్ షెడ్యూల్ ప్రస్తుతం వైజాగ్‌లో జరుగుతోంది. ఈ చిత్రానికి శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ భామ కియారా అద్వానీ చెర్రీ సరసన కనిపించనుంది. ఇటీవలే ఈ మూవీకి సంబంధించిన రామ్ చరణ్ లుక్ నెట్టింట తెగ వైరలైన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. చెర్రీ డిఫరెంట్ చూసి ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేశారు. అయితే షూటింగ్‌కు కాస్తా విరామం లభించండంతో గ్లోబల్ స్టార్ ఫ్యామిలీతో కలిసి చిల్ అయ్యారు. వైజాగ్ సముద్ర తీరాన తన ముద్దుల కూతురు, భార్య ఉపాసనతో కలిసి ఎంజాయ్ చేశారు. క్లీంకారతో ఎత్తుకుని బీచ్‌లో ఆడుకుంటున్న దృశ్యాలు అభిమానులకు కనువిందు చేస్తున్నాయి. ఈ వీడియోను ఉపాసన తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. వైజాగ్ మా హృదయాలను దోచేసింది.. క్లీంకారతో ఫస్ట్ బీచ్ ఎక్స్పీరియన్స్ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఇదే వీడియోలో మెగా అభిమానులు రామ్ చరణ్‌ను గజమాలతో సత్కరించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) -
ఉపాసన.. చరణ క్లీంకారం!
మెగా హీరో, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల పరిచయం అక్కర్లేని పేరు. ఇండస్ట్రీతో సంబంధం లేకపోయినా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో టచ్‌లో ఉంటోంది. అయితే ఈ జంటకు పెళ్లయిన 11 ఏళ్ల తర్వాత కూతురు జన్మించిన సంగతి తెలిసిందే. గతేడాది జూన్‌లో మెగా వారసురాలు ఇంట్లోకి అడుగుపెట్టింది. తన ముద్దుల మనవరాలికి మెగాస్టార్ చిరంజీవి పేరు కూడా పెట్టారు. క్లీంకారగా నామకరణం చేశారు. ఉపాసన-రామ్ చరణ్ లవ్ స్టోరీ.. మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్, ఉపాసన చిన్నప్పటి నుంచి స్నేహితులు. 2010లో విడుదలైన ‘ఆరెంజ్’ సినిమా తర్వాత వీరిద్దరూ డేటింగ్ చేయడం మొదలుపెట్టారు. దాదాపు 5 ఏళ్ల పాటు ప్రేమలో ఉన్న వీరిద్దరు కుటుంబాల అంగీకారంతో జూన్ 14, 2012న వివాహం చేసుకున్నారు. అపోలో హాస్పిటల్ ఛైర్మన్, సహ వ్యవస్థాపకుడు డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి మనవరాలు ఉపాసనకు సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి సంబంధం లేదు. ప్రస్తుతం ఆమె ఎంటర్‌ప్రెన్యూరర్‌గా రాణిస్తున్నారు. తాజాగా ఇవాళ వాలెంటైన్స్ డే సందర్భంగా అరుదైన ఫోటోను పంచుకుంది. వాలెంటైన్ డేను పురస్కరించుకుని ఉపాసన తాజాగా పోస్ట్ చేసిన ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది. తమ ముద్దుల కూతురు క్లీంకారతో కలిసి రామ్ చరణ్ ఉపాసన దంపతులు ఒకరి చేతిలో ఒకరు చేతులు వేసి ఉన్న ఫోటోను షేర్ చేసింది. అంతే కాకుండా లవ్ సింబల్ జతచేస్తూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఇది చూసిన అభిమానులు లవ్లీ కపుల్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. రెండు రోజుల క్రితమే తన సిస్టర్ అనుశ్ పాల కుటుంబంతో దిగిన పిక్స్‌ను పంచుకున్నారు. ట్విన్ సిస్టర్స్‌ను కలిసిన క్లీంకార అంటూ పోస్ట్ చేసింది. కాగా.. రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ చిత్రంతో బిజీగా ఉన్నారు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కియారా హీరోయిన్గా నటిస్తోంది. ♾️❤️ pic.twitter.com/ZkNd6GeKwW — Upasana Konidela (@upasanakonidela) February 14, 2024
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కుప్పంలో చంద్రబాబు రాజకీయంగా భూస్థాపితం కావడం ఖాయం: పెద్దిరెడ్డి
నర్రెడ్డి నాటకాలు చాలు
థ్యాంక్స్ టూ మనీష్ మల్హోత్రా.. సమ్మర్ 2024 స్పెషల్ డిజైన్స్ (ఫొటోలు)
సీఎం జగన్ పేదలకు డబ్బు పంచడంపై పోసాని హాట్ కామెంట్స్
కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఎన్నికల ప్రచారం
టీ20 వరల్డ్‌కప్ 2024 కోసం మరో జట్టు ప్రకటన
శ్యామ్ పిట్రోడా వ్యాఖ్యలపై స్పందించిన కాంగ్రెస్
‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
హైదరాబాద్‌లో భారీగా భూమిని కొన్న మైక్రోసాఫ్ట్!
సీఎం జగన్ రేపటి ప్రచార సభల షెడ్యూల్ ఇలా..
తప్పక చదవండి
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ఈవీఎంకు పూజలు.. చిక్కుల్లో మహిళా కమిషన్ అధ్యక్షురాలు
- ఓటు వేద్దాం ఇలా.!
- వెస్ట్ నైలు వైరస్‌ని తొలిసారిగా అక్కడ గుర్తించారు! ఎవరికి ప్రమాదమంటే..
- SRH vs LSG: ఉప్పల్ మ్యాచ్‌కు వెళ్తున్న వారికి అలర్ట్! ఇలా అయితే..
- అధికారం శాశ్వతం కాదు.. వడ్డీతో చెల్లించే టైం వస్తుంది:కేటీఆర్
- ఎయిరిండియా సిబ్బంది సిక్ లీవ్.. 70కి పైగా విమానాలు రద్దు
- CM Jagan అంటే ఒక పాఠం: నటి శ్యామల
- ధోని ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్‌గా..
- Konathala Ramakrishna: మీ సంగతి చూస్తాం
Advertisement