-
మిల్లర్లకు తీపి కబురు
తాడేపల్లిగూడెం : లెవీ రూపంలో మిల్లర్ల నుంచి బియ్యం సేకరించే విషయంలో నెలకొన్న మీమాంస తొలగిపోయింది. ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ (కేఎంఎస్) కుదింపు ఉండబోదని ఎఫ్‌సీఐ స్పష్టం చేసింది. సెప్టెంబర్ 30వ తేదీ వరకూ లెవీ సేకరణను యథాతథంగా జరపాలని నిర్ణయించింది. రాష్ట్ర విభజన ప్రభావం లెవీపై ఉంటుందని, కేఎం ఎస్‌ను కుదిస్తారని ఎఫ్‌సీఐ అధికారులు తొలుత భావించారు. జూన్ 30వ తేదీతో సేకరణను అర్ధాంతరంగా నిలిపివేస్తారని మిల్లర్లు భయపడ్డారు. గడువు కుదింపు లేదని ఎఫ్‌సీఐ ఉన్నతాధికారులు స్పష్టం చేయడంతో వారంతా ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ విషయంపై ఎఫ్‌సీఐ ఏరియా మేనేజర్ కేవీ రాజును సంప్రదించగా.. గడువు కుదింపు లేద ని, గడువు పూర్తయ్యేవరకు మిల్లర్ల నుంచి బియ్యం సేకరిస్తామని చెప్పారు. రాష్ట్ర విభజన ప్రభావం ప్రస్తుత ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌పై ఉండదన్నారు. జాగా బాగుంది లెవీ కింద జిల్లాలోని అన్ని డిపోల నుంచి ఎఫ్‌సీఐకి బియ్యం వెళుతున్నారుు. ఎఫ్‌సీఐ నుంచి పౌర పంపిణీ నిమిత్తం ఇతర ప్రాంతాలకు సైతం తరలిస్తున్నారు. జిల్లాలోని గోదాముల్లో జాగా కూడా బాగా ఉండటంతో పూర్తిస్థారుులో బియ్యం సేకరణకు అవకాశం ఉంది. నెలకు 6 చొప్పున స్పెషల్స్ ర్యాక్స్‌ను రైల్వే శాఖ కేటాయిస్తుండటంతో రవాణా సమస్య కూడా తీరింది. ఫలితంగా బియ్యం సేకరణ వేగం పుంజుకుంది. జిల్లాలో లెవీ సేకరణ లక్ష్యం 11 లక్షల 75 వేల మెట్రిక్ టన్నులు కాగా, ఇప్పటివరకు 8 లక్షల 14 వేల మెట్రిక్ టన్నులుసేకరించారు. వీటిలో 7 లక్షల 85 వేల మెట్రిక్ టన్నుల పచ్చి బియ్యం, 28 వేల 500 మెట్రిక్ టన్నుల ఉప్పుడు బియ్యం ఉన్నాయి. -
శివకుమార్‌కు సేవారత్న అవార్డు
గుమ్మిడిపూండి, న్యూస్‌లైన్: పంచాయతీని అభివృద్ధి చేయడమేకాకుండా పలు ప్రజాహిత కార్యక్రమాల్లో చేపట్టిన పంచాయతీ అధ్యక్షుడు కేఎంఎస్ శివకుమార్ సేవారత్న అవార్డు ను అందుకున్నారు, గుమ్మిడిపూండి యూనియన్ పరిధి ఈగువారిపాళెం పంచాయతీకి అధ్యక్షుడిగా ఉన్నారు. రెండు రోజుల కిందట రాష్ర్ట గవర్నర్ రోశయ్య చేతులమీదుగా అవార్డును అందుకున్నారు. తెలుగు గ్రామమైన ఈగువారిపాళెంకు 2012లో శివకుమార్ పంచాయతీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యా రు. ఎంకామ్ చదవిన ఈయన ఒక పక్క పంచాయతీని అభివృద్ధి చేస్తూనే మరో పక్క పంచాయతీ పరిధిలోని ప్రైవేటు కంపెనీల సహాకారంతో ప్రజాహిత కా ర్యక్రమాలు చేపట్టారు. వైద్యశిబిరాలు, ప్లాస్టిక్ నిషేదం,మద్య నిషేదం,బడిమానివేసిన పిల్లలను బడిలో చేర్పించడం వంటి కార్యక్రమాలను చేపట్టారు. అం తేకాకుండా బాల్యవివాహాలు,అంటరానితనంపై ప్రజల్లో అవగాహన కల్పిం చారు. పంచాయతీ పరిధిలో వంద శా తం మరుగుదొడ్ల నిర్మాణం, పారిశుద్ధ్య మెరుగు, ప్రతి గ్రామంలో సభలో నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకుని వెంటనే పరిష్కారం చూపుతూ అతి కొద్ది కాలంలోనే ఈ యువ పంచాయతీ అధ్యక్షుడు ప్రజల మన్నలు పొం దారు. అంతేకాకుండా చెన్నైకి చెందిన చెన్నై మెట్రో వార్త పత్రికలో ఈ పంచాయతీ అభివృద్ధి భవిష్యత్తు ప్రణాళిక వ్యాసాలు రాశారు. వీటికి గుర్తింపుగా చెన్నై మెట్రో పత్రిక 2013 సంవత్సరంకుగాను రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తమ పంచాయతీ అభివృద్ధి చేసిన అధ్యక్షుడు ఎంపిక చేసింది. అందుకుగాను ఈ తెలుగు గ్రామ అధ్యక్షుడు శివకుమార్ సేవారత్న 2013 అవార్డును పొందారు. ఈ అవార్డును రాష్ట్ర గవర్నర్ రోశయ్య చేతుల మీదగా శివకుమార్ రెండు రోజుల క్రితం అందుకున్నారు. ఈ సం దర్భంగా శివకుమార్ మాట్లాడుతూ, గ్రామ అభివృద్ధికి మౌలిక వసతులు కల్పన కోసం కృషి చేయనున్నట్లు చెప్పారు. తన సేవలను గుర్తించి సంస్థ సేవారత్న అవార్డుకు ఎంపిక చేసినందుకు చాలా సంతోషంగా ఉందని తెలి పారు. పంచాయతీ అభివృద్ధిలో తనకు సహకరించిన వార్డు సభ్యులు, గ్రామ నిర్వాహణాధికారి, గ్రామ పెద్దలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్‌లో ఉన్నా: నటి
- హీట్‌వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్‌తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement