-
లింగాను పట్టుకున్న కొచ్చాడియన్
చెన్నై: సూపర్ స్టార్ రజనీకాంత్ లింగ వివాదానికి ముగింపు ఇలా పలికాడో లేదో అలా మరో వివాదం చుట్టుముట్టింది. ఎడి బ్యూరో కంపెనీ రజనీకాంత్ భార్య లత రజనీకాంత్ తమను మోసం చేశారని ఆరోపిస్తోంది. కొచ్చాడియన్ విడుదలకు ఇబ్బందుల్లో ఉన్నపుడు తాము ఆదుకున్నామని సంస్థ అధినేత అభిర్ చంద్ నహార్ చెబుతున్నారు. లతా రజనీకాంత్ హామీ ఇచ్చిన మీదటనే కొచ్చాడియన్ నిర్మాణ సంస్థ మీడియావన్ ఎంటర్టైన్మెంట్ ప్రయివేట్ లిమిటెడ్‌కు పదికోట్ల రూపాయలు అప్పుగా ఇచ్చామంటున్నారు. అంతేకాదు కొచ్చాడియన్ సినిమా తమిళనాడు హక్కులను తనకు తెలియకుండా రెట్టింపు రేటుకు అమ్ముకున్నారని కూడా ఆయన ఆరోపిస్తున్నారు. రజనీకాంత్ కల్పించుకొని తనకు న్యాయం చేయాలని నహర్ కోరుతున్నారు. అయితే మీడియావన్ ఎంటర్టైన్మెంట్ ప్రయివేట్ లిమిటెడ్ ముఖ్య అధికారి జయకుమార్ ఈ ఆరోపణలను ఖండించారు. ఫైనాన్స్ చేసిన మొత్తంలో ఇప్పటికే తొమ్మిది కోట్ల రూపాయలను చెల్లించామనీ, అభిర్ చంద్ అధిక వడ్డీ డిమాండ్ చేస్తున్నాడని.. ఈ విషయంలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామనీ అన్నారు. పైగా వారికి సంబంధం లేని డిస్ట్రిబ్యూషన్ హక్కులను అడగడం విడ్డరంగా ఉందన్నారు. -
మళ్లీ ఆస్కార్ బరిలో ఏఆర్ రెహ్మాన్
లాస్ఏంజల్స్: రెండు ఆస్కార్ అవార్డులు అందుకున్న ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ మరోసారి ఆస్కార్ బరిలో నిలిచారు. రెహ్మాన్ స్వరాలు సమకూర్చిన మూడు చిత్రాలు 87వ అస్కార్ అవార్డుల ఒరిజినల్ స్కోర్ కేటగిరిలో నామినేషన్లు సాధించాయి. మిలియన్ డాలర్ ఆర్మ్, ద హండ్రెడ్ ఫుట్ జర్నీ, రజనీకాంత్ హీరోగా నటించిన కొచ్చాడయాన్ చిత్రాలకుగానూ రెహ్మాన్‌కు నామినేషన్లు దక్కాయి. 2009లో స్లమ్‌డాగ్ మిలియనియర్ చిత్రం ద్వారా ఆయనకు రెండు అవార్డులు వచ్చిన విషయం తెలిసిందే. ఒరిజినల్ స్కోర్ కేటగిరీలో మొత్తం 114 చిత్రాలు పోటీపడుతున్నాయి. ఈ అవార్డుల తుది నామినేషన్లను వచ్చే ఏడాది జనవరి 15న ప్రకటిస్తారు. అవార్డుల ప్రధానోత్సవం ఫిబ్రవరి 22 జరుగుతుంది. ** -
బిటీష్ ఫిలిం ఇన్స్టిట్యూట్కు కోచ్చడయూన్
కోచ్చడయాన్ చిత్రం బ్రిటీష్ ఫిలిం ఇన్స్టిట్యూట్లో ప్రదర్శనకు సిద్ధం అవుతోంది. మోషన్ క్యాప్చరింగ్ టెక్నాలజీతో, త్రీడీ ఫార్మెట్లో తెరకెక్కిన తొలి భారతీయ చిత్రం కోచ్చడయాన్. సూపర్ స్టార్ రజనీకాంత్ కోచ్చడయాన్, రాణా, సేనాలుగా త్రిపాత్రాభినయం చేసిన ఈ చిత్రానికి ఆయన రెండో కూతురు సౌందర్య రజనీకాంత్ అశ్విన్ దర్శకత్వం వహించారు. తొలి ప్రయత్నంలోనే వెండి తెరపై అద్భుతాలు సృష్టించిన ఆమె దర్శక నైపుణ్యానికి చిత్ర ప్రముఖులు అభినందిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనే హీరోయిన్గా నటించిన తొలి తమిళ చిత్రం ఇది. ప్రపంచ వ్యాప్తంగా ఆరు (తమిళం, తెలుగు, హిందీ, మరాఠీ, పంజాబ్, బోజ్‌పురి)భాషల్లో నాలుగు వేల థియేటర్లలో 3డి, 2డి ఫార్మెట్లలో ఇటీవల విడుదలయిన కోచ్చడయూన్ విశేష ఆదరణను పొందుతోంది. ముఖ్యంగా 3డి ఫార్మెట్లో చిత్రాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నట్లు చిత్ర నిర్మాతలు తెలిపారు. కోచ్చడయాన్ చిత్రాన్ని యూఎస్ తొలి ప్రముఖ హాలీవుడ్ స్టూడియో స్పెషల్ ఎఫెక్ట్ నిపుణులు ఇది ఇండియాలో రూపొందిన చిత్రమా? అంటూ ఆశ్చర్యపోతున్నారని నిర్మాతలు పేర్కొన్నారు. కోచ్చడయాన్ చిత్రం దక్షిణాదిలో మూడవ వారంలో కూడా 350 థియేటర్లలో ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. అలాగే చిత్రాన్ని ఈ నెలాఖరున బ్రిటీష్ ఫిలిం ఇన్స్టిట్యూట్లో ప్రదర్శించడానికి ఏర్పా టు చేస్తున్నట్లు చెప్పారు. అలాగే కోచ్చడయాన్ను జపాన్‌లో భారీ ఎత్తున విడుదల చేయనున్నట్లు నిర్మాతలు వెల్లడించారు. -
కుమార్తెకు రజనీ అభినందనలు
తన కుమార్తె ప్రతిభను జనులు పొగుడుతుండగా, ఆ ఆనందానుభూతిని పొందుతున్న సూపర్‌స్టార్ రజనీ కాంత్ కూడా దర్శకురాలు సౌందర్యను అభినందించా రు. కన్న తండ్రి సినిమాకు కుమార్తె దర్శకత్వం చేయడం అనేది అపూర్వమైన, అరుదైన విషయం. అది ఒక అద్భుత ప్రయోగంతో చిత్ర రూపకల్పన చేసి విజయం సాధించడం సాధారణ విషయం కాదు. ఈ రెండు అసాధారణ విషయాలను సుసాధ్యం చేశారు. రజనీకాంత్. ఆయన రెండవ కూతురు సౌందర్య. వీరి అద్భుత సృష్టి కోచ్చడయాన్. ఇప్పుడు ప్రపంచ ప్రేక్షకుల ప్రశంసలను అందుకుంటోంది. విజయం అనేది అంత సులభంగా రాదు. దానికి నిరంతర కృషి, పట్టుదల, శ్రమ అవసరం. కోచ్చడయాన్ చిత్రం రూపకల్పన వెనుక ఇవన్నీ ఉన్నాయి. చిత్రం విడుదల తల్లి పురుటి నొప్పులతో సమానం అంటారు. కోచ్చడయాన్ చిత్రం విడుదలకు ముందు చాలా ప్రతి ఘటనలను ఎదుర్కొంది. ఎన్నో వదంతులకు గురైంది. కొన్ని సాంకేతిక కారణాల వల్ల తప్పనిసరి పరిస్థితిలో విడుదల తేదీ వాయిదా పడితే చిత్రంపై రకరకాల పుకార్లు పుట్టుకొచ్చాయి. అలాంటి అవరోధోలను దాటి కోచ్చడయాన్ శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా ఆరు వేల థియేటర్లలో విడుదలై సెన్సేషనల్ హిట్ టాక్‌ను రాబట్టుకుంది. ఫేస్బుక్, ట్విట్టర్లలో కోచ్చడయాన్ ప్రశంసల పరంపర కొనసాగుతోంది. చిత్ర యూనిట్లో విజయ దరహాసం తొణికిసలాడుతోంది. ఒక పక్క కోచ్చడయాన్ చిత్రానికి అభినందలు వెల్లువెత్తుతుంటే మరో రజనీకాంత్ ఈ విజయం కోసం అహర్నిశలు శ్రమించిన తన కూతురు చిత్ర దర్శకురాలు సౌందర్య రజనీకాంత్ అశ్విన్‌ను, చిత్ర కళాకారులను సాంకేతిక వర్గాన్ని ప్రంశంసించారు. వదంతులను తిప్పికొట్టింది వదంతులను తిప్పికొట్టి అలాంటివి ప్రచారం చేసిన వారికి కోచ్చడయాన్ విజయం సరైన బుద్ధి చెప్పిందని రజనీ అభిమానులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కోచ్చడయాన్ బొమ్మల చిత్రం అంటూ ఎద్దేవా చేసిన వారికి చిత్ర విజయమే సమాధా నం చెప్పిం దన్నారు. చెన్నై రజనీకాంత్ అభిమాన సంఘం నిర్వాహకులు రామదాస్, రవి, సూర్య తదితరులు విడుదల చేసిన ఈ ప్రకటనలో పేర్కొంటూ తమ తలైవర్ (నాయకుడు) నటించిన కోచ్చడయాన్ విజయం సాధించిందన్నారు. ఈ అద్భుత విజయాన్ని అందించిన ప్రపంచ వ్యాప్త ప్రేక్షకులకు రజనీ కాంత్ అభిమాన సంఘం తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామన్నారు. చిత్రం పైరసీకి గురికాకుండా రజనీ అభిమానులంతా అప్రమత్తంగా ఉండి అలాంటి సంఘటనలు జరిగితే పోలీసులకు సమాచారాన్ని అందించాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
రజనీ అభిమానుల హంగామా
చెన్నై : కోచ్చడయాన్ చిత్రం విడుదలవుతున్న సందర్భంగా సూపర్‌స్టార్ రజనీకాంత్ అభిమానుల హంగామా మొదలైంది. రజనీకాంత్ ద్విపాత్రాభినయం చేసి న చిత్రం కోచ్చడయాన్. ఆయన రెండో కూతురు సౌందర్య రజనీకాంత్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ దీపిక పదుకొనే హీరోయిన్. భారతీయ సినీ చరిత్రలోనే తొలి సారిగా హాలీవుడ్ చిత్రం అవతార్ తరహాలో మోషన్ క్యాప్చరింగ్ టెక్నాలజీతో 3డీ ఫార్మెట్లో తెరకెక్కిన బ్రహ్మాండ చిత్రం కోచ్చడయాన్. రేపు (శుక్రవారం) ప్రపంచ వ్యాప్తంగా తమిళం, తెలుగు, హిందీ, ఇంగ్లిషు భాషల్లో ఆరు వేల థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది. దీంతో రజనీ అభిమానుల హంగామా బుధవారం నుంచే మొదలైంది. చిత్ర బ్యానర్లతో మారథాన్ నిర్వహిస్తున్నారు. పర్యావరణ సంరక్షణ, క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. సైదాపేటకు చెందిన రజనీ అభిమాన సంఘం నిర్వాహకుడు సైదై రవి, నందంబాక్కం షణ్ముగ పాండియన్ల ఆధ్వర్యంలో ఊరేగింపుగా గిండి నుంచి బయలుదేరి నెలై్ల, మదురై జిల్లాల్లో కోచ్చడయాన్ చిత్రం విజయం సాధించాలని పలు ఆలయాల్లో విశేష పూజలు నిర్వహించారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్‌కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
జగన్ మళ్లీ సీఎం కావడం రాష్ట్రానికి అవసరం
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల రేపటి షెడ్యూల్ ఇదే..
- మస్క్‌కు లైన్ క్లియర్?..చైనాలో టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు..
- ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
- కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
- సీఎం మమత సర్కార్‌కు సుప్రీం కోర్టులో ఊరట
- బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
Advertisement