-
‘దేశద్రోహులకు మృత్యువుని’
లండన్: ‘‘నా పేరు ‘దేశద్రోహులకు మృత్యువు... బ్రిటన్‌కు స్వాతంత్య్రం’ అని బ్రిటిష్ ప్రతిపక్ష మహిళా ఎంపీ జో కాక్స్ హత్య కేసులో నిందితుడిగా అనుమానిస్తున్న థామస్ మైర్(52) వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టుకు తెలిపారు. మేజిస్ట్రేట్ నీ పేరేమిటని మైర్‌ను ప్రశ్నించగా... ఇలా స్పందించాడు. న్యాయమూర్తి అతడికి రిమాండ్ విధించారు. 41 ఏళ్ల జో కాక్స్ గురువారం తన నియోజకవర్గంలో ఓ కార్యక్రమానికి వెళుతుండగా హత్యకు గురయ్యారు. నిందితుడు ఆమెను కత్తితో పొడిచి, ఆ తరువాత తుపాకీతో కాల్చి చంపాడు. -
రేప్ చేస్తామంటూ ఎంపీకి బెదిరింపులు
లండన్: అత్యాచారం చేస్తామంటూ ఒకే రాత్రి 600కు పైగా బెదిరింపులు వచ్చాయి. బాధితురాలు సాధారణ మహిళేమీ కాదు. బ్రిటన్‌లో లేబర్‌పార్టీ ఎంపీ జెస్సీ ఫిలిప్స్. ఈ విషయాన్ని ఆమే స్వయంగా వెల్లడించారు. తనకు ట్విట్టర్లో బెదిరింపులు వచ్చాయని, ట్విట్టర్ ఈజ్ డెడ్ అంటూ జెస్సీ ఫిలిప్స్ ట్వీట్ చేసింది. ఆన్లైన్ లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా జెస్సీ ఫిలిప్స్ ఉద్యమం ప్రారంభించాక నెటిజెన్ల నుంచి ఇలాంటి బెదిరింపులు వస్తున్నాయి. నెటిజన్లు ట్విట్టర్లో జెస్సీ ఫిలిప్స్‌ను టార్గెట్ చేసుకున్నారు. ఆమెను ఉద్దేశిస్తూ అసభ్యపదజాలంతో ట్వీట్లు చేస్తున్నారు. తనను లైంగికంగా వేధించేలా వద్దా అంటూ 5 వేల మంది ట్వీట్లు చేసినట్టు జెస్పీ ఫిలిప్స్ చెప్పారు. కాగా జెస్సీ ఫిలిప్స్‌కు ఇలాంటి చేదు అనుభవం ఎదురుకావడం ఇదే తొలిసారి కాదు. 19 ఏళ్ల వయసులో తాను లైంగిక వేధింపులకు గురైనట్టు చెప్పారు. ఓ వ్యక్తి తనపట్ల దారుణంగా ప్రవర్తించాడని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. లైంగిక బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై సివిల్ లేదా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని జెస్సీ ఫిలిప్స్ డిమాండ్ చేశారు. బర్మింగ్‌హామ్ యార్డ్లీ నుంచి ఆమె బ్రిటన్ పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్‌కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్‌పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
తప్పక చదవండి
- రాహుల్ విరామం తీసుకోవడమే మేలు: పీకే
- హార్దిక్ తప్పేం లేదు.. అంతా సీనియర్ల వల్లే: ముంబై మాజీ కెప్టెన్
- లవ్ ఫర్ లగ్జరీ కార్ : నాగ చైతన్య కొత్త కారు, ధర తెలిస్తే!
- మాజీ జడ్జి గంగోపాధ్యాయ ప్రచారంపై ‘ఈసీ’ బ్యాన్
- 2030 నాటికి భారత్ 11.5 కోట్ల ఉద్యోగాలను సృష్టించాలి.. లేకుంటే?
- ఎల్లో మీడియాకు చెప్పకుండా బాబు ఎక్కడికి వెళ్లారు? జోగి రమేష్
- జూన్ 1 నుంచి డ్రైవింగ్ లెసెన్స్‌లు జారీ చేయనున్న ప్రైవేట్ కంపెనీలు
- అంతర్జాతీయ 'టీ' దినోత్సవం! ఈ వెరై'టీ'లు ట్రై చేశారా?
- వైఎస్సార్సీపీ గెలుపును ఖరారు చేసిన ఎల్లో మీడియా!.. ఈ రాతలు అందుకేనా?
- బంగారం కొనుగోలు దారులకు భారీ ఊరట
Advertisement