-
లైంగిక దాడికి యత్నం
రొద్దం : మండలంలోని గౌరాజుపల్లికి చెందిన ఓ వివాహితపై అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి బుధవారం రాత్రి లైంగిక దాడికి యత్నించినట్లు గురువారం తమకు ఫిర్యాదు అ ందినట్లు ఎస్ఐ మునీర్ అహమ్మద్ తెలిపారు. రాత్రి 8 గంటలకు బహిర్భూమికని ఇంటి సమీపంలోని కంపచెట్లలోకి వెళ్లగా అక్కడే మాటు వేసి ఉన్న సదరు వ్యక్తి ఆమె చెయ్యి పట్టుకుని బలవంతంగా లాగినట్లు ఫిర్యాదులో పేర్కొన్నట్లు వివరించారు. దీంతో ఆమె గట్టిగా కేకలు వేయగా అతను పారిపోయాడన్నారు. ఘటనపై విచారణ చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
బాలికపై లైంగిక దాడికి యత్నం
ఆటో డ్రైవర్‌కు దేహశుద్ధి నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు బాధితులు ఫిర్యాదు చేయలేదని వదిలేసిన పోలీసులు దొడ్డబళ్లాపురం, న్యూస్‌లైన్ : బాలికపై లైంగికదాడికి యత్నించిన కామాంధుడిని స్థానికులు పట్టుకొని దేహశుద్ధి చేసిన ఘటన రైల్వేస్టేషన్ రోడ్డులోని శ్రీనగర్‌లో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు..శ్రీనగర్ నివాసి చంద్రకుమార్(25) ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. రైల్వేస్టేషన్ సర్కిల్లో పానీ పూరి వ్యాపారం చేసుకుని జీవనం సాగిస్తున్న వ్యక్తి కుమార్తె (10) బుధవారం సాయంత్రం కెంపేగౌడ నగర్‌లోని ట్యూషన్‌కు కాలినడకన బయల్దేరింది. ఆ సమయంలో చంద్రకుమార్ వచ్చి బాలికను ఆటోలో ఎక్కించుకున్నాడు. తెలిసిన వ్యక్తే కావడంతో బాలిక అభ్యంతరం వ్యక్తం చేయలేదు. ఆ తర్వాత చంద్రకుమార్ ఆటోను కెంపేగౌడ నగర్‌కు కాకుండా పట్టణ శివారులోని స్కౌట్ క్యాప్ సమీపంలో ఉన్న నిర్జనప్రదేశానికి తీసికెళ్లాడు. ఇక్కడికెందుకు తీసుకొచ్చావని బాలిక నిలదీస్తుండగానే నోరు నొక్కి లైంగి దాడికి యత్నించాడు. అటుగా వెళ్తున్న కొందరు గమనించి బాలికను రక్షించి చంద్రకుమార్‌ను శ్రీనగర్‌కు తీసుకెళ్లారు. అక్కడ స్థానికులు కామాంధుడిని స్తంభానికి కట్టివేసి దేహశుద్ధి చేశారు. చెప్పులు, పరకలతో చితకబాదారు. పట్టణ పోలీసులు అక్కడకు చేరుకొని నిందితుడి అదుపులోకి తీసుకున్నారు. అయితే బాధితులు ఫిర్యాదు చేయలేదని చెబుతూ నిందితుడిని గురువారం వదిలేశారు. -
మోడల్‌పై లైంగికదాడి కేసు.. దర్యాప్తు ముమ్మరం
‘జీరో ఎఫ్ఐఆర్’ నమోదు కుట్ర, లైంగికదాడి సహా ఐదు సెక్షన్ల కింద ఆరోపణలు రూ.1.20 లక్షల సొత్తు దోపిడీకి గురైనట్లు నిర్థారణ రిటర్న్ టిక్కెట్‌ను సేకరించిన దర్యాప్తు అధికారులు నగరానికి బయలుదేరిన పోలీసులు, బాధితురాలు సాక్షి, సిటీబ్యూరో: ‘న్యూ ఇయర్’ ఈవెంట్ కోసమంటూ రప్పించి, ముంబై మోడల్‌పై హైదరాబాద్‌లో సామూహిక లైంగికదాడికి పాల్పడిన కేసును వెర్సోవా పోలీసులు ‘జీరో ఎఫ్ఐఆర్’గా నమోదు చేశారు. నిందితులపై కుట్ర, సామూహిక లైంగికదాడి సహా ఐదు సెక్షన్ల కింద ఆరోపణలు మోపారు. మోడల్‌కు చెందిన రూ.1.2 లక్షల సొత్తు కూడా దోపిడీకి గురైందని నిర్ధారించారు. ప్రాథమిక ఆధారాల సేకరణ పూర్తి చేసిన పోలీసులు బాధితురాలిని తీసుకుని గురువారం హైదరాబాద్‌కు బయలుదేరారు. బదిలీ కోసమే ‘జీవో ఎఫ్ఐఆర్’ నిబంధనల ప్రకారం నేరం ఏ ఠాణా పరిధిలో జరిగితే కేసును అక్కడే నమోదు చేయడాన్ని జ్యూరిస్డిక్షన్ అంటారు. ఇలా నమోదైన ప్రతి ప్రాథమిక సమాచార నివేదిక (ఎఫ్ఐఆర్)కూ ఓ క్రమసంఖ్యను ఇస్తారు. ఎఫ్ఐఆర్ జారీ అయిన వెంటనే ఆ సమాచారాన్ని సంబంధిత కోర్టుకు సమర్పించాలి. ఈ కేసులో బాధితురాలి కథనం ప్రకారం లైంగికదాడి ఉదంతం వెర్సోవాలో జరగలేదు. అయితే పరిధితో సంబంధం లేకుండా ప్రతి ఫిర్యాదునూ కచ్చితంగా స్వీకరించాలని, ప్రాథమిక ఆధారాలు లభిస్తే తప్పనిసరిగా ఎఫ్ఐఆర్గా జారీ చేయాలని గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మహిళలపై జరిగిన నేరాల విషయంలో దీన్ని మరింత పక్కాగా అమలు చేయాలని స్పష్టం చేసింది. మోడల్ ఫిర్యాదును తొలుత తిరస్కరించిన వెర్సోవా పోలీసులు జన్‌శక్తి ఫౌండేషన్ చొరవతో స్వీకరించి కేసు నమోదు చేశారు. అయితే నేరం జరిగింది వారి పరిధిలో కాదు కాబట్టి సంబంధిత ప్రాంతానికి బదిలీ చేసేందుకు అనువుగా సదరు ఎఫ్ఐఆర్కు ఎలాంటి నెంబరు కేటాయించలేదు. దీనివల్ల ప్రాథమిక దర్యాప్తు పూర్తయిన వెంటనే కేసును కోర్టుతో నిమిత్తం లేకుండా నేరుగా నేరం జరిగిన ప్రాంతానికి బదిలీ చేసే అవకాశం ఏర్పడుతుంది. దీన్నే ‘జీవో ఎఫ్ఐఆర్’గా పరిగణిస్తారు. బాధితురాలి నుంచి ఆధారాల సేకరణ లైంగికదాడికి గురైన మోడల్‌కు వెర్సోవా పోలీసులు బుధవారం రాత్రి అంధేరీలోని కూపర్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం అందులోనే ఇన్-పేషెంట్‌గా చేర్చారు. గురువారం ఆమెను మరోసారి విచారించిన పోలీసులు వాంగ్మూలాన్ని నమోదు చేశారు. మరిన్ని ఆధారాలూ సేకరించారు. లైంగికదాడి అనంతరం మగతలో ఉన్న తనను ముంబై తిప్పి పంపేందుకు ముష్కరులు కొండాపూర్‌లో ఉన్న జెన్ జబ్బార్ టూర్స్ అండ్ ట్రావెల్స్‌లో బస్సు టిక్కెట్ కొన్నారని పోలీసులకు తెలిపిన బాధితురాలు ఆధారాన్ని సైతం అందించింది. అందులో టిక్కెట్ కొన్న వ్యక్తిగా మంజూర్ పేరు ఉన్నట్లు వెర్సోవా అధికారులు గుర్తించారు. విమానాశ్రయం నుంచి దాదాపు అరగంట ప్రయాణ దూరంలో ఉన్న ఓ కాలేజీ ఁసి*తో ప్రారంభమయ్యే పేరుతో ఉందని, దాని సమీపంలో ఉన్న ఐసీఐసీఐ బ్యాంకు ఏటీఎం సెంటర్ నుంచే తన కార్డును వినియోగించి డబ్బు డ్రా చేశారని వివరించింది. మరోపక్క లైంగికదాడికి గురైన సమయంలో బాధితురాలు ధరించిన దుస్తుల్నీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హుస్సేన్‌సాగర్ ఎక్స్‌ప్రెస్‌లో సిటీకి... నిందితులపై వెర్సోవా పోలీసులు పటిష్ట సెక్షన్ల కిందే కేసు నమోదు చేశారు. ఐపీసీతో పాటు నిర్భయ చట్టాన్నీ చేర్చారు. ఇందులో 120-బి (కుట్ర), 328 (నేరం చేసే ఉద్దేశంతో మత్తు మందు/విషం ఇవ్వడం), 376-ఇ (మహిళపై ఒకటి కంటే ఎక్కువసార్లు సామూహిక లైంగిక దాడికి పాల్పడటం), 379 (తస్కరణ), 420 (మోసం) సెక్షన్ల కింద ఆరోపణలు మోపారు. బాధితురాలి సెల్‌ఫోన్, బంగారు ఆభరణాలు, నగదుతో సహా మొత్తం రూ.1.2 లక్షల విలువైన సొత్తును నిందితులు దోచుకున్నట్లు గుర్తించారు. ఆమె చెప్పిన వివరాల ప్రకారం హ్యాపీ, అలీ, మంజూర్ తదితరుల్ని ప్రాథమికంగా అనుమానితుల జాబితాలో చేర్చారు. మరోపక్క ఈ ఘటనతో సైబరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆర్జీఐఏ పోలీసులు వెర్సోవా అధికారుల్ని గురువారం సంప్రదించారు. ఘటన శంషాబాద్ విమానాశ్రయం నుంచి గంటన్నర ప్రయాణం చేసిన తరవాత వచ్చే ప్రాంతంలో జరిగినట్లు అక్కడి పోలీసులు వీరికి తెలిపారు. పటాన్చెరు సమీపంలో లైంగికదాడి జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. జనరల్ డైరీలో ఎంట్రీ, కేసు నమోదు, ప్రాథమిక విచారణ, ఆధారాల సేకరణ తదితర ప్రక్రియల్ని పూర్తి చేసిన వెర్సోవా పోలీసులు దర్యాప్తు, కేసు ఫైల్ అందించేందుకు బాధితురాలిని తీసుకుని ఓ ఇన్స్పెక్టర్ నేతృత్వంలో ముగ్గురు మహిళా కానిస్టేబుళ్లు హుస్సేన్‌సాగర్ ఎక్స్‌ప్రెస్‌లో హైదరాబాద్‌కు గురువారం పయనమయ్యారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు రాష్ట్రానికి అమిత్ షా, రాజ్‌నాథ్‌సింగ్ రాక
జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
Jammu and Kashmir: ఉగ్ర ఘాతుకం
తెల్దేవర్పల్లి @ 46.7
బాలసదనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం
సోషల్ మీడియా ప్రకటనలపై నిఘా : ఎస్పీ
చెరువు శిఖం కబ్జా
ఎన్నికల విధుల కేటాయింపులో ఇష్టారాజ్యం
రిజర్వేషన్లపై మోదీ స్పష్టత ఇచ్చినా.. రేవంత్ గోబెల్స్ ప్రచారం
తప్పక చదవండి
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- Prajwal Revanna: ఏ గదిలో ఏం జరిగింది?
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్‌స్టాప్‌గా... జెట్ స్పీడ్‌లో
Advertisement