-
అర్జెంటీనా చరిత్రాత్మక నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ : అబార్షన్లను చట్టబద్ధం చేస్తూ అర్జెంటీనా బుధవారం నాడు చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. లాటిన్ అమెరికన్ దేశాల్లో ఇలాంటి నిర్ణయం తీసుకున్న ప్రధాన దేశం అర్జెంటీనా. అబార్షన్లను అనుమతించవద్దని, అది శిశువుల జీవించే హక్కును హరించడమేనంటూ క్యాథలిక్ చర్చి వ్యతిరేకతను కాదని అర్జెంటీనా సెనేట్ 38–29 ఓట్ల తేడాతో అబార్షన్లను అనుమతించే చట్టాన్ని ఆమోదించింది. బ్యూనస్ ఏర్స్‌లో ఉన్న సెనేట్ భవనం ముందు నిరీక్షిస్తున్న వేలాది మంది ప్రజలు హర్షద్వానాలతో కొత్త చట్టానికి మద్దతు పలికారు. చట్టాన్ని వ్యతిరేకించిన వారు, బిల్లు ఆమోదం పట్ల కన్నీళ్లు కార్చిన వారు కూడా లేకపోలేదు. 14 వారాల గర్భం వరకు మహిళలకు అబార్షన్లను అనుమతిస్తూ ఈ చట్టం తీసుకొచ్చారు. 2018లోనే ఈ చట్టం తీసుకొచ్చేందుకు విఫలయత్నం జరిగింది. నాడు ప్రవేశపెట్టిన బిల్లును దిగువ సభ ఆమోదించినప్పటికీ స్వల్ప ఓట్ల తేడాతో సెనేట్‌లో వీగిపోయింది. నేడు పాలకపక్షం అనుమతితో బిల్లు ఆమోదం పొందింది. -
ఏమి చేస్తే స్థిమితం కలుగుతుంది?
మంచి, చెడు సంఘటనలు జరుగుతూనే ఉండటం మన జీవితాల్లో మామూలే. అయినా చెడునే ఎప్పుడూ తలపోస్తూ ఉంటాం. దీనివల్లనే ఆతురత, ఒత్తిడి, అసహనం, భయం, ఆవేదన వంటి మానసిక ఒత్తిడులకు గురవుతున్నాం. కలతతో కూడిన అవమానకర సంఘటనలనే అనుక్షణం తలచుకుంటూ దుఃఖానికి గురవుతూంటాం. పోనీలే వదిలేద్దాం అనుకున్నా, మన ఎరుక లేకుండానే ఈ ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది. కోపతాపాల ఒరవడిలో, భావోద్వేగాల ఒత్తిడిలో ఉన్నప్పుడు మనమేం చేయాలి? ఏమి చేస్తే మనసుకు శాంతి, స్థిమితం కలుగుతాయి? మనో నిశ్చలతకు ఒక మార్గం... మంత్రం. మంత్రం అంటే మనసును గెలిచేది అని అర్థం. మంత్రాలు మనకు కొత్తేమీ కాదు. వాటిని యుగయుగాలుగా మననం చేస్తూనే ఉన్నాం. లాటిన్ అమెరికన్ చర్చలలో కూడా మరనాథ్ కనిపిస్తుంది. లాటిన్లో, సంస్కృతంలో దానికి ఒకటే అర్థం. లార్డ్ అనే పదాన్ని లాటిన్లో నాథ్ అంటారు. సంస్కృతంలో నాథ్‌కు అర్థం లార్డ్. మరనాథ్ అంటే మై లార్డ్. ఈ సంస్కృత పదాన్ని క్రైస్తవంలో కూడా ఇదే అర్థంతో వాడతారు. జై నం, బౌద్ధం, హైందవం, జొరాస్ట్రియనిజం, సిక్కిజం అన్ని దేశీయ మతాల్లో ఓంకార్ అనే పదాన్ని ఒకటే అర్థంతో వాడతాం. ఓం నమశ్శివాయ అనే మంత్రం మహామంత్రంగా చెప్పబడుతోంది. ఎందుకంటే పంచభూతాలైన భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం ... అందులో కేంద్రీకృతమై ఉన్నాయి. న అంటే భూమి, మః అంటే నీరు, శి అంటే అగ్ని, వా అంటే వాయువు, య అంటే ఆకాశం. ఓం ఈ అన్నింటి మిళితం. మంత్రోచ్చారణ చేస్తున్నా కొన్నిసార్లు మనస్సు లగ్నంకాక, పనికిరాని వాటి మీదకు పరుగెడుతుంటుంది. అంగడి తెరిచారో లేదో, భోజనం ఈరోజెవరు వండుతారో... ఇటువంటి పనికిరాని ఆలోచనలు మనస్సులో మెదులుతుంటాయి. కానీ, అభ్యాసం ద్వారా ఏకాగ్రత మెరుగవుతూ వస్తుంది. కొద్దికొద్దిగా మనోనిగ్రహం వృద్ధి చెందుతూ, సంస్కారం కలుగుతుంది. మనస్సును అలాగనే నిలుపుకునే ప్రయత్నాలు కొనసాగించాలి. ఆందోళనల వలయంలో తలమునకలవుతుంటే మనలోని శక్తి తగ్గుతూ వస్తుంది. అటువంటప్పుడు మంత్రో చ్చారణ, ధ్యానం, ఆధ్యాత్మిక ప్రక్రియలను అవలంబించాలి. మహర్షి పతంజలి యోగశాస్త్రంలో ‘యాది స్థాన సంశయ అవిరాతి ప్రమాద ఆలస్య’ అన్నారు. జబ్బునుండి తప్పించుకోవటానికి ఉత్సాహం లేకుండా ఉండటం, అనుమానితులుగా ఉండటం, ఆందోళన తో గడపటం వంటి వాటిని నిరోధించాలంటే ఏకతత్త్వ అభాస్యమే మార్గం. ఒకేమంత్రం, ఒకే ఉచ్చారణ, ఒకే అక్షరం ఎక్కువమార్లు జపం చేయటం అలవరచుకోవాలి. ఆలోచనలు, మంత్రం రెండూ మనసులో తిరుగుతున్నప్పుడు మంత్రం మీదనే శ్రద్ధం ఉంచాలి. మంత్రానికి ఉండే అపూర్వశక్తి తరంగాల వలన మనసులోని ఆందోళనలు తగ్గుముఖం పడతాయి. మంత్రోచ్చారణే మహాశక్తిగా మారుతుంది. కొద్దికాలంలోనే మన ఇల్లు, మనస్సు, దేహం, మన పరిసరాలు మొత్తం అన్నీ శక్తితో నిండిపోయి నిర్మాణాత్మకత ఏర్పడుతుంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు రాష్ట్రానికి అమిత్ షా, రాజ్‌నాథ్‌సింగ్ రాక
జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
Jammu and Kashmir: ఉగ్ర ఘాతుకం
తెల్దేవర్పల్లి @ 46.7
బాలసదనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం
సోషల్ మీడియా ప్రకటనలపై నిఘా : ఎస్పీ
చెరువు శిఖం కబ్జా
ఎన్నికల విధుల కేటాయింపులో ఇష్టారాజ్యం
రిజర్వేషన్లపై మోదీ స్పష్టత ఇచ్చినా.. రేవంత్ గోబెల్స్ ప్రచారం
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్‌కు సంబంధంలేదన్న జయశంకర్
- తోడేళ్ళను తరిమే రోజు!
Advertisement