-
ఫ్రెండ్ ఫోన్ చేసి ‘వొద్దకో జినెసో?’ అని అడగవచ్చు!
ఒకరోజు మీ ఫ్రెండ్ ఫోన్ చేసి ‘వొద్దకో జినెసో?’ అని అడగవచ్చు. ఎప్పుడైనా ఏ ఫ్రెండ్‌కో మీరు ఫోన్ చేసి ‘హౌ ఆర్ యూ?’ అని అడిగితే అటునుంచి ‘చైల్ చినెమో’ అని జవాబు రావచ్చు. కొరియన్లో ‘వొద్దకో జినెసో?’ అంటే ‘ఎలా ఉన్నావు?’ అని, ‘చైల్ చినెమో’ అంటే ‘ఐయామ్ ఫైన్’ అని అర్థం. ఒక్క కొరియన్ మాత్రమే కాదు ప్రపంచంలోని పలు భాషలు చూస్తూ చూస్తూనే నేర్చుకోవచ్చు.... నెట్‌ఫ్లిక్స్‌లో! మీరు ఫ్రెంచ్ భాష నేర్చుకోవాలనుకుంటున్నారా? ‘30 రోజుల్లో...’లాంటి పుస్తకాలు చదవనక్కర్లేదు. ఏ ఇన్స్టిట్యూట్కో వెళ్లి శిక్షణ పొందనక్కర్లేదు. మీ ఇంట్లోనే ఎటు కదలకుండా నెట్‌ఫ్లిక్స్‌లో లుపిన్, ఇన్ టూ ది నైట్, కాల్ మై ఏజెంట్...ఇంటర్నేషనల్ టీవీడ్రామాలు, మిల్ఫ్, ఆఫ్రికన్ డాక్టర్, ది క్లైంబ్...కామెడీలు, ఏజ్ ఆఫ్ టాంక్స్, టోనీ పార్కర్–ది ఫైనల్ షాట్, కిల్ హిట్లర్...డాక్యుమెంటరీలు చూస్తే చాలు! కడుపుబ్బా నవ్వించే కామెడీ సినిమాలు, వెంట్రుకలు నిక్కబొడుచుకునే హారర్ సినిమాలు, పిడికిళ్లు బిగిసే యాక్షన్ సినిమాలు చూస్తూనే ప్రపంచంలోని ఏదో ఒక భాష ఎంతో కొంత నేర్చుకుంటే ఎంత హ్యాపీ! ‘లాంగ్వేజ్ లెర్నింగ్ విత్ నెట్‌ఫ్లిక్స్’ (ఎల్ఎల్ఎన్) అనే క్రోమ్ ఎక్సెటెన్షతో ఇది సాధ్యమవుతుంది. ఈ ఎక్స్‌టెన్షన్‌ను డేవిడ్ వికిన్సన్, ఒగ్న్జెన్లు రూపొందించారు. ‘ఇష్టమైన మాధ్యమంలో ఎలాంటి కష్టం లేకుండా సరదా సరదాగా కొత్త భాషలు నేర్చుకోవచ్చు’ అంటాడు వికిన్సన్. ప్రేక్షక ఆదరణ పొందిన సిరీస్‌కు సంబంధించిన అల్టర్నెటివ్ ఆడియోట్రాక్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే వేరే భాషలకు సంబంధించిన ఆడియోలకు, సబ్‌టైటిల్స్ మ్యాచ్ కావు. ఈ పరిమితిని సరిదిద్దారు. నిజానికి 2017లోనే ఒకే సమయంలో రెండు సబ్ టైటిల్స్ ప్రదర్శితమయ్యే లెర్నింగ్ మోడ్‌ను వికి(స్ట్రీమింగ్ సర్వీస్ ఫర్ ఏషియన్ డ్రామాస్) ప్రవేశపెట్టింది. మన పనిని సులభతరం చేయడానికి విస్తృతమైన కెటలాగ్ కూడా ‘ఎల్ఎల్ఎన్’లో రెడీగా ఉంది. లాంగ్వేజ్ యూ స్టడీ, యువర్ నెట్‌ఫ్లిక్స్ కంట్రీలలో మనకు ఇష్టమైనవి ఎంపిక చేసుకోవచ్చు. సినిమా పోస్టర్, సినాప్సిస్, నిడివి, రేటింగ్, జానర్, ఏ దేశంలో అందుబాటులో ఉన్నాయి...మొదలైన వివరాలు ఈ కెటలాగ్లో మనకు కనిపిస్తాయి. సెట్టింగ్స్‌లో మెషిన్, హ్యూమన్ ట్రాన్స్లెషన్ ఆప్షన్స్ ఉన్నాయి. మెషిన్ ట్రాన్స్‌లేషన్‌లో మక్కీకిమక్కీ అనువాదం ఉన్నా, మన టార్గెట్ లాంగ్వేజ్‌కి సంబంధించిన వాక్యనిర్మాణంపై స్పష్టత వస్తుంది. అయితే ఈ మెషిన్లో తప్పులు దొర్లే అవకాశం లేకపోలేదు. కీ బోర్డ్‌లో... ‘ఎ’ ప్రీవియస్ సబ్ టైటిల్ ‘యస్’ రిపీట్ సబ్‌టైటిల్స్ ‘డి’ నెక్ట్స్ సబ్‌టైటిల్ టస్పేస్బార్–ప్లే, పాజ్ వెకబలరీ హైలిటింగ్ ఫీచర్ నుంచి పాప్–అప్ డిక్షనరీ వరకు ‘ఎల్ఎల్ఎన్’లో రకరకాల భాషలలోని పదాలు, వాక్యాలపై పట్టు పెంచుకోవచ్చు. మెల్ల మెల్లగా మాట్లాడనూ వచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ట్రై చేసి చూడండి మరి. -
వైఫల్యం నేర్పిన విజయపాఠం
గతంలో ఢిల్లీ, బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పొందిన ఘోర పరాజయం తర్వాత బీజేపీ వ్యూహకర్తలు వేగంగా పాఠాలు నేర్చుకున్నారు. ఎన్నికల్లో విజయానికి మోదీపైనే ఆధారపడలేమని గ్రహించి, రాష్ట్ర స్థాయి నేతలను కలుపుకునిపోవడమే బీజేపీకి అసోంలో అనూహ్య విజయాన్ని అందించింది. ఢిల్లీ, బిహార్ శాసనసభ ఎన్నికల ఫలితాలతో భారతీయ జనతాపార్టీ చావుదెబ్బ తిని వెనుకంజ వేసిన నేపథ్యంలో ఈ గురువారం ప్రకటించిన తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా వ్యక్తిగత విజయానికి చక్కటి నిదర్శనంగా నిలి చాయి. అసోంలో బీజేపీ సాధించిన గణనీయ విజయంవల్ల, పశ్చిమబెంగాల్, కేరళ వంటి రాష్ట్రాల్లో బీజేపీ అనూహ్యంగా విస్తరిం చడంవల్ల పార్టీలో మోదీ-షా ద్వయం విశ్వసనీయత, అధికారం పున స్థాపితమయింది. ముఖ్యంగా, అత్యంత సంక్లిష్ట రాష్ట్రం ఉత్తర ప్రదేశ్‌లో వచ్చే ఏడు జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రగతిని సాధించే దిశగా ఈ ఫలితాలు ఇరు నేతల్లోను ఉత్సాహాన్ని నింపాయి. ఢిల్లీ, బిహార్‌లో బీజేపీ ఘోర పరా జయం పొందడంతో మోదీ-షా ద్వయం నాయకత్వానికి ప్రమాదం ఏర్పడనప్పటికీ, ఆ రెండు రాష్ట్రాల్లో షా అమలుపర్చిన ఎన్నికల ప్రచార వ్యూహం గురించి పార్టీలో అంతర్గతంగా పలు ప్రశ్నలు తలెత్తాయి. పనితీరులో అమిత్ షా అనుసరించిన పరమ నియం తృత్వ శైలిపై పార్టీ సభ్యులు అంతర్గ తంగా తీవ్ర విమర్శలు గుప్పించారు. పార్టీ అధ్యక్షుడిగా షా మళ్లీ ఎన్నిక కావడం కూడా ప్రశ్నార్థకమైంది. పైగా చెదిరిపోతున్న మోదీ ఆకర్షణ, విజయ సాధనలో ఆయన సామర్థ్యంపై పుకార్లు చెలరేగాయి. ఈ గురువారం పార్టీ సాధించిన విజయంతో బీజేపీలో మోదీ-షా విమర్శకుల నోళ్లు మూతపడ్డాయనే చెప్పాలి. గత తప్పిదాల నుంచి ఎలాంటి గుణపాఠాలూ నేర్చుకోని కాంగ్రె స్లా కాకుండా, ఢిల్లీ, బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అవమానకరమైన ఓటమి తర్వాత బీజేపీ వ్యూహకర్తలు మళ్లీ మూలాల్లోకి వెళ్లి ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలకు తాజా వ్యూహాన్ని రూపొందించుకున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో గెలుపొందడానికి మోదీపైనే ఎక్కువగా ఆధారపడలేమని, రాష్ట్ర స్థాయి నేతలను కలుపుకోవడం అవసరమని పార్టీ గ్ర హించింది. అసోంలో ఎన్నికలు ప్రకటించడానికి ఎంతో ముందే సర్బానంద సోనో వాల్ని ముఖ్యమంత్రి పదవికి అభ్యర్థిగా ప్రకటించింది. స్థానిక అంశా లపై ప్రధానంగా దృష్టి పెట్టే రాష్ట్ర స్థాయి నేతలను ప్రచారంలో భాగం చేసింది. బిహార్ ప్రచారంలో వలె కాకుండా, బీజేపీ కేంద్ర నాయకత్వం అసోంలో ప్రచారాన్ని బాగా తగ్గించుకుంది. ప్రచార రూపకల్పన, అమ లులో బయటి నుంచి జోక్యం దాదాపుగా లేకుండా పోయింది. దీర్ఘకాలంగా ఉద్యమ నిర్మాణంలో తలపండిన అసోం గణ పరిషత్, బోడో పీపుల్స్ ఫ్రంట్లను తనకు అనుకూలంగా మార్చుకున్న బీజేపీ వాటితో వ్యూహాత్మక పొత్తులను కుదుర్చుకుంది. పైగా, 15 ఏళ్లపాటు రాష్ట్రాన్ని ఏలిన తరుణ్ గొగోయ్‌ను దాటుకుని అసోం ప్రజలు మార్పుకు సిద్ధం కావడం కూడా బీజేపీకి తోడ్పడిందనే చెప్పాలి. కాంగ్రెస్ పార్టీలో గొగోయ్ బద్ధశత్రువు హిమంత్ బిశ్వశర్మను ఆకర్షించి తనలోకి చేర్చుకోవ డంలో బీజేపీ అసాధారణ ప్రయత్నం చేసి నెగ్గింది కూడా. కాంగ్రెస్‌తో లెక్కలు సరిచేయడమనే ఏకసూత్ర ఎజెండాతో ముందు కొచ్చిన శర్మ ఈ ఎన్నికల్లో బీజేపీ స్టార్ కేంపెయినర్‌గా, ప్రధాన వ్యూహ కర్తగా ఆవిర్భవించారు. అన్నిటికీ మించి, బోడో పీపుల్స్ ఫ్రంట్, ఏజీపీ లను చర్చలకు రప్పించడంలో కీలకపాత్ర పోషించారు. సరిహద్దుల నుంచి చొరబాటు వంటి అత్యంత సున్నిత సమస్యపై ప్రజల్లో బలపడు తున్న అసమ్మతిని మోదీ, షా, శర్మ చక్కగా వినియోగించుకోగలిగారు. ఆ వ్యూహం ఎంతగా ఫలించిందంటే ఈశాన్య భారత్‌కు ప్రవేశ ద్వారం వంటి అసోం వంటి కీలక రాష్ట్రంలో బీజేపీ తొలిసారి ప్రభు త్వాన్ని ఏర్పర్చగలిగే స్థాయికి చేరుకుంది. దీంతో కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న ఈశాన్య రాష్ట్రాల్లోకి బీజేపీ ప్రవేశించడం చాలా సులువైంది. అసోంలో గెలుపుతోపాటు కేరళలో బీజేపీ తొలిసారి ఖాతా తెరవడం, పశ్చిమబెంగాల్లో తన ఓట్ల, సీట్ల శాతాన్ని మెరుగు పర్చుకోవడం విశేషం. ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీకి ఇంతవరకు చెప్పుకో దగిన ఉనికి లేదు. కాషాయ పార్టీ, దాని కూటమి కలిసి కేరళలో 15 శాతం ఓట్లు దండుకున్నాయి. ఆ రాష్ట్ర అసెంబ్లీలో తొలి బీజేపీ ఎమ్మెల్యేగా రాజ గోపాల్ అడుగుపెట్టనున్నారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఒకటి నుంచి 5 స్థానా లకు ఎగబాకగా, ఓట్ల శాతం 20 శాతానికి చేరడం దిగ్భ్రాంతి గొలిపే విషయం. బీజేపీ ప్రతినిధి సుధాంశు త్రివేదీ ఈ విషయాన్నే స్పష్టం చేశారు. ‘బీజేపీ అన్ని రాష్ట్రాల్లో లబ్ధి పొందింది. పార్టీ భౌగోళిక, రాజకీయ విస్తరణను ఈ ఎన్నికలు ప్రతి బింబించాయి’. మరొక సీనియర్ నేత మాట్లాడుతూ హిందీ ప్రాంతంలో ప్రాబల్యమున్న పార్టీగానూ తమను ఇక పిలువలేరని దేశవ్యాప్తంగా పలుకుబడి కలిగిన, దేశంలోనే అతి ముఖ్యమైన శక్తిగా బీజేపీ అవతరిం చిందని పేర్కొన్నారు. ప్రస్తుత ఫలితాలు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి తోడ్పడ నున్నాయి. పార్లమెంటులో తనదైన ఎజెండాను ముందుకు తీసుకు పోవడం బీజేపీకి ఇక నల్లేరుపై నడక కానుంది. ఇంతవరకు రాజ్యసభలో సంఖ్యాపరమైన ఆధిక్యతతో కాంగ్రెస్ పార్టీ పాలక కూటమిని పదే పదే అడ్డుకుంటూ వచ్చింది. ఎగువసభలో ఇప్పటికీ కాంగ్రెస్ ఏకైక పెద్ద పార్టీగా ఉంటున్నప్పటికీ తాజా పరాజయాలతో మోదీ ప్రభుత్వంతో బలంగా పోరాడే విశ్వసనీయతను అది కోల్పోయింది. ప్రాంతీయ పార్టీలతో వ్యవహారం నడపటం కేంద్ర ప్రభుత్వానికి ఇక సులభం. ఏఐడీఎంకే, బిజు జనతాదళ్ ఇప్పటికే బీజేపీపట్ల స్పష్టంగానే మొగ్గు చూపాయి. పశ్చిమబెంగాల్లో మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ మరింత ఆత్మస్థైర్యంతో బీజేపీతో వ్యవహారాలు నడపగలదు. బీజేపీ ప్రాంతీయ పార్టీలతో వ్యవహరించడానికే ప్రాధాన్యమిస్తూ వస్తోంది.. మా పార్టీని బలహీనపర్చాలనే దాని ప్రధాన లక్ష్యానికి ఇదే కారణం అని ఒక సీనియర్ కాంగ్రెస్ నేత సరిగ్గానే వ్యాఖ్యానించారు. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రతిపాదించిన బీజేపీ వ్యతి రేక ఫ్రంట్‌కు తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో ఎదురుదెబ్బ తగిలి నట్లే. ఈ కూటమిని నడిపించాలనుకున్న కాంగ్రెస్.. ఇతర పార్టీలు ఇకపై తనతో కూటమికి సిద్ధపడలేనంతగా దిగజారిపోనుంది. తమ తమ రాష్ట్ర స్థాయి అవసరాల రీత్యా బీజేపీయేతర, కాంగ్రెసేతర పార్టీలు కూడా భవిష్యత్తులో ఒక ఉమ్మడి వేదికలోకి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడా లబ్ధి చేకూరేది బీజేపీకేనని చెప్పనవసరం లేదు. - అనితా కత్యాల్, సీనియర్ జర్నలిస్టు scroll.in సౌజన్యంతో
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
లక్నోను చిత్తు చేసిన కేకేఆర్.. 98 పరుగుల తేడాతో ఘన విజయం
IPL 2024: చరిత్ర సృష్టించిన జడేజా.. ధోని రికార్డు బద్దలు
జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్‌కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్‌గా
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్‌కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్‌తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement