-
ప్రపంచంలోనే అరుదైన దొంగతనం
-
ప్రపంచంలోనే అరుదైన దొంగతనం
లాస్‌వెగాస్: కుడి చేతికి కూడా తెలియకుండా ఎడమచేత్తో దొంగతనాలు చేస్తూ చోరకళకు గుర్తింపుతెచ్చేవారు కొందరైతే, కళను అపహాస్యం చేస్తూ వార్తల్లో నిలిచేవాళ్లు మరికొందరు! ఈ ఫొటోలో కనిపిస్తున్నవాడు రెండో రకం. తన బృందంతోకలిసి ఓ గోడౌన్‌లోకి చొరబడ్డ వీడు.. ఏకంగా 30 వేల కండోమ్స్, వందలకొద్దీ సెక్స్ టాయ్స్‌ని ఎత్తుకెళ్లాడు. రెండు రోజుల పాటు వీరి దోపిడీపర్వం కొనసాగింది. అభివృద్ధి చెందిన అమెరికాలో కండోమ్స్ విరివిగా దొరుకుతున్నా, వీళ్లిలా దొంగతనం చేయడంపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఒకేసారి ఇంత పెద్ద సంఖ్యలో కండోమ్స్ దొంగతనానికి గురికావడం ప్రపంచంలో ఇదే మొదటిసారి! లెలో అనే స్విడిష్ సెక్స్ టాయ్స్ కంపెనీకి లాస్‌వెగాస్‌లో ఓ గోడౌన్ ఉంది. అక్కడ నిలువుచేసే కండోమ్స్, సెక్స్‌టాయ్స్ లాంటి ఉత్పత్తులను రకరకాల ప్రాంతాలకు రవాణాచేస్తుంటారు. మెమోరియల్ డే సెలవుల సందర్భంగా వారంపాటు గోడౌన్ తెరవలేదు. దీనిని అవకాశంగా భావించిన దొంగలు.. సోమ, మంగళ వేర్‌హౌస్‌లోని 30 వేల కండోమ్స్, సెక్స్టాయ్లను దొంగిలించారు. సెక్యూరిటీ లేకపోవడంతో ఏకంగా కారునే లోపలికి తెచ్చి వస్తువులను దోచుకెళ్లారు. తమ గోడౌన్లో దొంగతనం జరిగిన విషయాన్ని లెలో సంస్థ తన అఫీషియల్ ఫేస్బుక్ ద్వారా వెల్లడించింది. దానికి సంబంధించిన వీడియో ఫుటేజీని కూడా పోస్ట్ చేసింది. ‘అన్ని కండోమ్స్‌ను వాళ్లు ఏం చేసుకుంటారో ఎంత ఆలోచించినా అర్థం కావట్లేదు. అది తెలిస్తేగనుక ఆ పార్టీకి స్పాన్సరర్స్‌గా ఉండేవాళ్లం..’అని చమత్కరించారు లెలో ప్రతినిధులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వైఎస్సార్సీపీ అభ్యర్థులకే మా మద్దతు
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
తప్పక చదవండి
- షర్మిల.. ఎందుకిలా..!
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- భారత్ సేవల రంగం నెమ్మది
- ఈసారి ఉల్లంఘిస్తే జైలే: ట్రంప్‌కు కోర్టు హెచ్చరిక
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అక్రమాలు కో‘కొల్లు’లు
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement