-
యూపీ వారియర్జ్ కోచ్‌గా జాన్ లూయిస్
మహిళల ప్రీమియర్ లీగ్‌లో క్యాప్రి గ్లోబల్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కొనుగోలు చేసిన ఉత్తరప్రదేశ్ (యూపీ) ఫ్రాంచైజీ జట్టుకు యూపీ వారియర్జ్ అని పేరు పెట్టారు. ఈ జట్టుకు ఇంగ్లండ్ మాజీ క్రికెటర్, ప్రస్తుత ఇంగ్లండ్ మహిళల జట్టు హెడ్ కోచ్‌గా పనిచేస్తున్న జాన్ లయిస్ను హెడ్ కోచ్‌గా నియమించారు. భారత మాజీ క్రికెటర్ అంజూ జైన్ అసిస్టెంట్ కోచ్‌గా, యాష్లే నోఫ్కీ (ఆస్ట్రేలియా) బౌలింగ్ కోచ్‌గా, లీసా స్థాలేకర్ (ఆస్ట్రేలియా) మెంటార్‌గా వ్యవహరిస్తారు. చదవండి: Axar Patel: 'మాకు మాత్రమే సహకరిస్తుంది'.. అక్షర్ అదిరిపోయే పంచ్ -
లూయిస్ విధ్వంసం
♦ అజేయ సెంచరీతో విండీస్‌ను గెలిపించిన ఓపెనర్ ♦ ఏకైక టి20లో భారత్ ఓటమి కింగ్స్టన్: లూయిస్ విండీస్ ఓపెనర్. వన్డే సిరీస్‌లో నాలుగు మ్యాచ్‌లాడి 67 పరుగులే చేశాడు. కానీ ఏకైక టి20లో మాత్రం శతక్కొట్టాడు. భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అరడజను ఫోర్లు, డజను సిక్సర్లతో మ్యాచ్‌ను పోటీలేకుండా ముగించాడు. దీంతో గ్యాలరీలోనే ప్రేక్షకులే కాదు... మైదానంలోని భారత ఆటగాళ్లు ప్రేక్షకులయ్యారు. మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. ఓపెనర్‌గా దిగిన కోహ్లి (22 బంతుల్లో 39; 7 ఫోర్లు, 1 సిక్స్), దినేశ్ కార్తీక్ (29 బంతుల్లో 48; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగారు. రిషభ్ పంత్ (35 బంతుల్లో 38; 2 ఫోర్లు, 1 సిక్స్) కూడా రాణించాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన విండీస్ 18.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 194 పరుగులు చేసి విజయభేరి మోగించింది. ఓపెనర్ లూయిస్ (62 బంతుల్లో 125 నాటౌట్; 6 ఫోర్లు, 12 సిక్సర్లు) ఉప్పెన ముందు భారత లక్ష్యం కుదేలైంది. శామ్యూల్స్ (29 బంతుల్లో 36 నాటౌట్; 5 ఫోర్లు, 1సిక్స్) రాణించాడు. లూయిస్ వ్యక్తిగత స్కోరు 46, 55 వద్ద అతను ఇచ్చిన క్యాచ్‌లను భారత ఫీల్డర్లు వదిలేయడం గమనార్హం. ధనాధన్... వెస్టిండీస్ ఇన్నింగ్స్ నింపాదిగా మొదలై మెరుపుల మలుపు తీసుకుంది. క్రిస్ గేల్, లూయిస్‌లు మెల్లిగా ఆడటంతో తొలి 3 ఓవర్లలో 17 పరుగులే వచ్చాయి. కానీ ఆ తర్వాతి ఓవర్ నుంచే లూయిస్ దంచుడు మొదలైంది. షమీ వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో లూయిస్ వరుసగా మూడు బౌండరీలు బాదాడు. గేల్ కూడా ఓ ఫోర్ కొట్టడంతో ఆ ఒక్క ఓవర్లోనే 19 పరుగులు జతచేరాయి. దీంతో జట్టు స్కోరు డబులైంది. ఆరు బంతుల తేడాతో 17 పరుగుల నుంచి అమాంతం 36కు చేరింది. ఇక అక్కడి నుంచి పరుగుల ప్రవాహం మొదలైంది. ప్రతి ఓవర్ సిక్స్‌లు, లేదంటే ఫోర్లు లేకుండా ముగియలేదు. ఓవర్‌కు సగటున 10 పరుగులు వచ్చాయి. 24 బంతుల్లోనే (4 ఫోర్లు, 4 సిక్సర్లు) లూయిస్ అర్ధసెంచరీ పూర్తయింది. తొలి వికెట్‌కు 82 పరుగులు జోడించాక గేల్ ఔటయ్యాడు. తొలి అంతర్జాతీయ టి20 మ్యాచ్ ఆడిన కుల్దీప్ ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్లో గేల్ (20 బంతుల్లో 18; 1 ఫోర్, 1 సిక్స్)ను పెవిలియన్ చేర్చాడు. దీంతో వన్‌డౌన్‌లో వచ్చిన శామ్యూల్స్... లూయిస్‌కు జతయ్యాడు. మ్యాచ్ సాగుతున్నకొద్దీ ఓపెనర్ లూయిస్ పరుగుల ప్రవాహం కాస్తా... విధ్వంసం స్థాయికి చేరింది. అతను కొట్టే సిక్సర్లకు మైదానమే చిన్నబోయింది. భారత బౌలర్లకు పగలే చుక్కల్ని చూపించాడు. ముఖ్యంగా షమీ పరుగుల్ని సమర్పించుకోవడం మినహా చేసేదేమీలేకపోయింది. ఉరిమే ఉత్సాహంతో సెంచరీకి సమీపించిన లూయిస్... జడేజా వేసిన ఇన్నింగ్స్ 15వ ఓవర్లో వరుస సిక్సర్లు బాది టి20లో తన రెండో శతకాన్ని పూర్తి చేశాడు. కేవలం 53 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్సర్లతో ఈ ఫీట్‌ను సాధించాడు. మరోవైపు శామ్యూల్స్ కూడా ఓ వైపు లూయిస్‌కు స్ట్రయిక్ ఇస్తూనే... అడపాదడపా బౌండరీలు బాదారు. ఈ క్రమంలో ఇద్దరు మరో వికెట్ పడకుండా జట్టును గెలిపించారు. దీంతో మరో 9 బంతులు మిగిలుండగానే విండీస్ విజయం సాధించింది. సూపర్ ఆరంభం ధావన్‌తో కలిసి భారత్ ఇన్నింగ్స్‌ను కోహ్లి మెరుపు వేగంతో ఆరంభించాడు. ఎదుర్కొన్న తొలి బంతినే బౌండరీగా మలిచాడు భారత కెప్టెన్. బద్రీ వేసిన ఈ తొలి ఓవర్లో శిఖర్ ధావన్ కూడా రెండు ఫోర్లు కొట్టాడు. తర్వాత టేలర్ వేసిన ఓవర్లోనూ భారత ఓపెనర్లు మూడు ఫోర్లు బాదారు. దీంతో రెండే ఓవర్లలో 26 పరుగులు... 4.4 ఓవర్లలో జట్టు స్కోరు 50 దాటింది. ఇలా ధాటిగా సాగుతున్న ఇన్నింగ్స్‌ను విలియమ్స్ దెబ్బతీశాడు. ఇన్నింగ్స్ ఆరో ఓవర్ తొలి రెండు బంతుల్ని 6, 4గా తరలించిన కోహ్లి ఆ మరుసటి బంతికి ఔటయ్యాడు. భారీ షాట్‌కు ప్రయత్నించి నరైన్‌కు క్యాచ్ ఇచ్చి కోహ్లి నిష్క్రమించాడు. దీంతో తొలి వికెట్‌కు 64 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత రిషభ్ పంత్ క్రీజులోకి వచ్చాడు. కానీ ఈ జోడి కథ రెండు బంతుల వ్యవధిలోనే ముగిసింది. సమన్వయలేమితో జోరు మీదున్న ధావన్ (12 బంతుల్లో 23; 5 ఫోర్లు) రనౌటయ్యాడు. ఈ దశలో రిషభ్‌కు దినేశ్ కార్తీక్ జతయ్యాడు. వీరిద్దరు ఓపెనర్లిచ్చిన దూకుడును కొనసాగించారు. శామ్యూల్స్ వేసిన ఇన్నింగ్స్ 11వ ఓవర్లో దినేశ్ కార్తీక్ భారీ సిక్సర్, బౌండరీ బాదడంతో భారత్ స్కోరు 100కు చేరింది. ఆ తర్వాత బ్రాత్‌వైట్ వేసిన 13వ ఓవర్లోనూ దినేశ్ కార్తీక్ రెండు సిక్సర్లు కొట్టాడు. దీంతో 15 ఓవర్లు ముగిసేసరికి జట్టు 2 వికెట్లకు 140 పరుగులు చేసింది. 16వ ఓవర్లో రిషభ్ తన బ్యాట్‌కు పనిచెప్పాడు. శామ్యూల్స్ ఓవర్లో వరుసగా సిక్స్, ఫోర్‌తో వేగం పెంచాడు. కానీ అదే ఓవర్లో జట్టు స్కోరు 151 పరుగుల వద్ద దినేశ్ కార్తీక్‌ను చక్కని బంతితో శామ్యూల్స్ బోల్తా కొట్టించాడు. దీంతో మూడో వికెట్‌కు 86 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. తర్వాత వచ్చిన వారెవరూ ఈ స్థాయిలో మెరుపులు మెరిపించకపోవడంతో పరుగుల వేగం మందగించింది. దీంతో 200 పరుగులు దాటాల్సిన స్కోరు 190 పరుగులకే పరిమితమైంది. ‘హెడ్స్’ అన్నా... ‘టెయిల్’ అన్నా... వెస్టిండీస్ పర్యటనలో కోహ్లికి ఫలితాలు కలిసొచ్చాయి. కానీ బొమ్మబొరుసే ఏ మ్యాచ్‌కూ కలిసిరాలేదు. టూర్ అసాంతం కోహ్లి టాస్‌లో మాత్రం గెలవలేదు. ఐదు వన్డేల సిరీస్‌లో టాస్ కెళ్లిన ప్రతీసారి ‘హెడ్స్’అనే చెబితే టెయిల్ పడింది. ఈసారి... ఏకైక టి20 మ్యాచ్‌లో మాత్రం ‘టెయిల్’ను నమ్ముకుంటే ‘హెడ్స్’ వచ్చింది. అయ్యయ్యో కోహ్లి! స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: కోహ్లి (సి) నరైన్ (బి) విలియమ్స్ 39; ధావన్ రనౌట్ 23; రిషభ్ పంత్ (సి) వాల్టన్ (బి) టేలర్ 38; దినేశ్ కార్తీక్ (బి) శామ్యూల్స్ 48; ధోని (సి) శామ్యూల్స్ (బి) టేలర్ 2; జాదవ్ (సి) నరైన్ (బి) విలియమ్స్ 4; జడేజా నాటౌట్ 13; అశ్విన్ నాటౌట్ 11; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి) 190. వికెట్ల పతనం: 1–64, 2–65, 3–151, 4–156, 5–156, 6–164 బౌలింగ్: బద్రీ 4–0–31–0, టేలర్ 4–0–31–2, విలియమ్స్ 4–0–42–2, బ్రాత్‌వైట్ 2–0–26–0, నరైన్ 3–0–22–0, శామ్యూల్స్ 3–0–32–1. విండీస్ ఇన్నింగ్స్: క్రిస్ గేల్ (సి) ధోని (బి) కుల్దీప్ 18; లూయిస్ నాటౌట్ 125; శామ్యూల్స్ నాటౌట్ 36; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (18.3 ఓవర్లలో వికెట్ నష్టానికి) 194. వికెట్ల పతనం: 1–82. బౌలింగ్: భువనేశ్వర్ 4–0–27–0, అశ్విన్ 4–0–39–0, షమీ 3–0–46–0, కుల్దీప్ యాదవ్ 4–0–34–1, జడేజా 3.3–0–41–0. 3 అంతర్జాతీయ టి20 చరిత్రలో గేల్, మెకల్లమ్ తర్వాత రెండు సెంచరీలు సాధించిన మూడో బ్యాట్స్‌మన్ లూయిస్. -
కండల బ్రదర్స్!
సమ్‌థింగ్ కుంబ్రియ (ఇంగ్లాండ్)కు చెందిన లెవీస్ హ్యారిసన్, ఒవెన్ హ్యారిసన్లు కవలసోదరులు. వారి పోలికలే కాదు... అభిరుచులు కూడా సేమ్ టు సేమ్. స్కూల్లో చదివే రోజుల్లో ఫుట్‌బాల్ ఆడడం అంటే ఇద్దరికీ తెగ ఇష్టం. చిన్నప్పుడు వాళ్లు సన్నగా ఉండేవారు. అడపాదడపా వెక్కిరింతలకు కూడా గురయ్యేవారు. సినిమాలో కండల వీరులను చూసినప్పుడల్లా ‘‘అలా మేము కూడా ఉండే బాగుండేది’’ అనుకునేవారు. ‘‘అది మీ చేతుల్లోనే ఉంది. మీరు తలుచుకుంటే అలా తయారవ్వడం పెద్ద విషయమేమీ కాదు’’ అని వాళ్ల నాన్న ఒకరోజు చెప్పాడు. అలా పదిహేను సంవత్సరాల ప్రాయంలో... ఈ ఇద్దరు సోదరులు బాడీబిల్డింగ్ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఇద్దరు కలిసి ఉదయాన్నే జిమ్‌కు వెళ్లేవారు. ఇద్దరు కలిసి ఫిట్నెస్ మ్యాగజైన్లు తెగ చదివేవారు. రెండు సంవత్సరాలు గడిచేసరికి... సోదరులిద్దరూ శారీరక దారుఢ్యంతో ‘వావ్’ అనిపించేలా తయారయ్యారు. పీలగా ఉండే యువకులకు ఈ సోదరురులు ఇప్పుడు రోల్మోడల్లు! ఇరవై మూడు సంవత్సరాల ఈ సోదరులు తమ దగ్గరకు వచ్చే యువకులుకు కేవలం తమ కండల గొప్పదనం గురించి మాత్రమే కాకుండా... ఏది తినాలి, ఏది తినకూడదు, వ్యామాయాలు ఎలా చేయాలి... మొదలైన మంచి విషయాలు కూడా చెబుతున్నారు. మంచిదే కదా!
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కేంద్ర బలగాల అండ..
ఆడపడుచులకు అండగా ఉంటాం..
కాంగ్రెస్‌లోకి మధిర మున్సిపల్ వైస్ చైర్మన్, కౌన్సిలర్లు
ఖమ్మం బస్టాండ్‌లో వడదెబ్బతో సొమ్మసిల్లిన మహిళ
తెలుగు అధ్యాపకుడికి డాక్టరేట్
ఘనంగా కేవీకే స్వర్ణోత్సవాలు
ఆర్మీ ఉద్యోగికి జైలుశిక్ష
హిందూ, ముస్లింలను వేరు చేస్తున్న బీజేపీ
మూగ జీవాలను రక్షించుకోవాలి..
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్‌లో ఉన్నా: నటి
- హీట్‌వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్‌తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement