-
మదర్ సెంటిమెంట్‌తో బ్లాక్‌బస్టర్ కొట్టిన చిత్రాలివే
'ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవరూ లేరు' అన్న డైలాగ్ కేజీఎఫ్ సినిమాలో చెప్పిందే కావొచ్చు. కానీ ఒక తల్లి ప్రేమ అంతకు మించి ఉంటుందని మాత్రమే చెప్పగలను. తొమ్మిది నెలలు తాను ఎన్నో బాధలను దిగమింగి బిడ్డకు జన్మినిస్తుంది. అంతే కాకుండా తన పిల్లల కలలను నెరవేర్చడానికి జీవితాంతం కష్టపడుతుంది. కానీ ఎప్పుడే గానీ తన బాధను బయటికి చెప్పలేని పిచ్చి ప్రేమ అమ్మది. అలాంటి అమ్మకు మన జీవితంలో ఏం చేసినా తక్కువే అవుతుంది. తల్లికి తన బిడ్డపై ఉండే ప్రేమకు ప్రపంచంలో ఏదీ సాటిరాదు. అలాంటి అమ్మ ప్రేమను మనకు తెలియజేస్తూ చాలా చిత్రాలు వచ్చాయి. మదర్స్ డే సందర్భంగా ఆ చిత్రాలేవో ఓ లుక్కేద్దాం. 'మాతృ దేవో భవ' మాధవి, నాసర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'మాతృ దేవో భవ'. ఈ చిత్రాన్ని కెఎస్ రామారావు నిర్మించగా.. కె అజయ్ కుమార్ దర్శకత్వం వహించారు. 1993లో విడుదలైన ఈ చిత్రం క్యాన్సర్‌తో బాధపడుతున్న తల్లి కథ ఆధారంగా తెరకెక్కించారు. ఈ చిత్రం మలయాళంలో సిబి మలైల్ దర్శకత్వంలో వచ్చిన ‘ఆకాశదూతు’కి రీమేక్. ఈ చిత్రం తరువాత హిందీలో 'తులసి'గా రీమేక్ చేశారు. అదే నిర్మాత-దర్శకులు నిర్మించగా మనీషా కొయిరాలా, ఇర్ఫాన్ ఖాన్ నటించారు. ఈ చిత్రం వూట్, యూట్యూబ్‌లో అందుబాటులో ఉంది. 'బిచ్చగాడు' తమిళ నటుడు విజయ్ ఆంటోని నటించిన చిత్రం బిచ్చగాడు. 2016లో విడుదలైన పిచ్చైకారన్ అనే తమిళ చిత్రానికి తెలుగు రీమేక్. తమిళ దర్శకుడు శశి ఈ సినిమాకు దర్శకత్వం వహించగా విజయ్ ఆంటోనీ, సట్నా టైటస్ ప్రధాన పాత్రలు పోషించారు. ఒక కోటీశ్వరుడు తన తల్లి ఆరోగ్యం కోసం కొద్ది రోజులు బిచ్చగాడిగా మారడం ఈ సినిమా కథాంశం. తెలుగులో మే 13, 2016న విడుదలైంది. ప్రభాస్ 'ఛత్రపతి' 2005లో విడుదలైన ‘ఛత్రపతి’ అప్పట్లో ప్రభాస్‌కి పెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రంలో రెండు పొరలు ఉన్నాయి, అందమైన తల్లీ కొడుకుల అనుబంధం మరియు మంచి ప్రతీకార కథ. ఈ సినిమాలో భానుప్రియ, శ్రియ శరణ్ కూడా నటిస్తున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం 'ఛత్రపతి'. 2005లో రాజమౌళి దర్శకత్వంలో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాలో భానుప్రియ ప్రభాస్‌కు తల్లిగా నటించింది. తల్లి, కుమారుల మధ్య అనుబంధం ఈ సినిమాలో చూపించారు. శ్రియ శరణ్ హీరోయిన్ పాత్ర పోషించింగి. అమ్మ చెప్పింది 2006లో విడుదలైన చిత్రం ‘అమ్మ చెప్పింది’. శర్వానంద్, శ్రియా రెడ్డి, సుహాసిని ప్రధాన పాత్రల్లో నటించారు. గంగరాజు గుణ్ణం దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి నంది స్పెషల్ జ్యూరీ అవార్డు కూడా లభించింది. సంగీతాన్ని ఎమ్ఎమ్ కీరవాణి అందించారు. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. అమ్మా రాజీనామా 1991లో దాసరి నారాయణరావు దర్శకత్వంలో విడుదలైన కుటుంబ కథా చిత్రం అమ్మ రాజీనామా. జీవితాంతం కుటుంబం కోసం కష్టపడే తల్లి విలువను గుర్తించని వారి మధ్య ఒక్కసారిగా తను బాధ్యతలు మానేస్తే ఏమవుతుందో తెలిపే కథ ఇది. మహిళల జీవితాలు ప్రధాన ఇతివృత్తంగా తీసుకుని దాసరి చేసిన సినిమాల్లో ఈ చిత్రం ముందు వరుసలో ఉంటుంది. ఈ చిత్రంలో శారద ప్రధాన పాత్రలో నటించారు. 2001లో ఈ సినిమాను కన్నడలోనూ అమ్మ పేరుతో రీమేక్ చేశారు. ప్రస్తుతం జియో సినిమా, సన్ నెక్ట్స్, యూ ట్యూబ్‌లోనూ అందుబాటులో ఉంది. యమ లీల 1994లో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో విడుదలైన చిత్రం యమలీల. ఈ సినిమాలో ఆలీ, ఇంద్రజ, మంజు భార్గవి ప్రధాన పాత్రల్లో నటించారు. కైకాల సత్యనారాయణ, బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి, గుండు హనుమంతరావు తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాకు గాను సుచిత్రకు ఉత్తమ నృత్య దర్శకురాలిగా నంది పురస్కారం లభించింది. ఈ చిత్రం హిందీలో ‘తక్దీర్వాలా’గా, తమిళంలో లక్కీ మ్యాన్‌గా రీమేక్ చేశారు. ప్రస్తుతం ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. 'నిజం' కొడుకు సాయంతో భర్త మరణానికి ప్రతీకారం తీర్చుకునే తల్లి కథే నిజం. ఈ సినిమాను తేజ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ప్రిన్స్ మహేష్ బాబు, రక్షిత, రామేశ్వరి, గోపీచంద్, రంగన్నాధ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం 2003లో విడుదలైంది. ఉత్తమ నటుడిగా మహేష్ బాబు, సహాయ నటిగా రామేశ్వరి నంది అవార్డులను గెలుచుకున్నారు. ఈ సినిమా ప్రస్తుతం జియో సినిమా, సన్ నెక్ట్స్‌లో అందుబాటులో ఉంది. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ 2012లో విడుదలైన చిత్రం ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’. ఈ చిత్రానికి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అభిజిత్, సుధాకర్, కౌశిక్, షగున్, జరా షా, రష్మీ, కావ్య, నవీన్ పోలిశెట్టి, అమల ప్రధాన పాత్రలో నటించారు. తల్లి పాత్రలో అమల మెప్పించింది. ప్రస్తుతం ఈ చిత్రం హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి: 2003లో దర్శకుడు పూరీ జగన్నాధ్ కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కించిన చిత్రం అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి. ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఎమోషనల్‌గా టచ్ చేసింది. ఒక తల్లి తన కొడుకు కోసం తన భర్తతో సహా సర్వస్వం త్యాగం చేస్తుంది. ఈ సినిమాలో రవితేజ, ఆసిన్, జయసుధ, ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటించారు. యోగి: ఒక చిన్న గ్రామానికి చెందిన తల్లి తన కొడుకు కోసం నగరంలో వెతికే కథాచిత్రమే 'యోగి'. ఈ చిత్రంలో 'యే నోము నోచింది.. ఏ పూజ చేసింది' అనే పాట ప్రతి ఒక్కరి హృదయాలను కదిలించింది. తల్లి, కుమారుల ప్రేమను ఈ చిత్రంలో చక్కగా చూపించారు. ప్రభఆస్ హీరోగా నటించిన చిత్రాన్ని వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కించారు. -
తండ్రైన 'లైఫ్ ఈజ్బ్యూటిఫుల్' నటుడు సుధాకర్
'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' నటుడు సుధాకర్ కోమాకుల తండ్రి అయ్యాడు. ఈ విషయాన్ని స్వయంగా సుధాకర్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ఈనెల 14న బాబు బాబు పుట్టాడని, తల్లీ, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని పేర్కొన్నాడు. బాబుకు రుద్ర అని నామకరణం చేసినట్లు తెలిపాడు. అంతేకాకుండా చిన్నారి ఫోటోను కూడా రివీల్ చేశాడు. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు సహా పలువురు సెలబ్రిటీలు ఈ జంటకు వెస్ట్ విషెస్ తెలుపుతూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా 2002లో మనసుతో అనే సినిమాతో వెండితెరకు పరిచయం అయిన సుధాకర్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్‌తో పాపులర్ అయ్యాడు. అయితే ఆ తర్వాతే సరైన అవకాశాలు లేకపోవడం అమెరికా వెళ్లిపోయాడు. ప్రస్తుతం అక్కడే చికాగాలో వీరు సెటిల్ అయ్యారు. View this post on Instagram A post shared by sudhakarkomakula (@sudhakarkomakula) -
నాలుగు రోజులు
న్యూజిలాండ్ సరిహద్దులు మూసివున్నాయి. ఇప్పట్లో లోపలివాళ్లు బయటికి, బయటివాళ్లు లోపలికి ప్రయాణించే అవకాశాలు లేవు. ఈ పరిస్థితుల్లో ప్రధాని జెసిండా ఆర్డెర్న్ దేశంలో పర్యాటక రంగ ఆదాయాన్ని వృద్ధి చేసేందుకు ఒక దారి కనిపెట్టారు. ఉద్యోగులందరికీ వారానికి 4 రోజుల పని మాత్రమే ఉంటే మిగతా మూడు రోజుల్లో దేశం లోపల టూర్లకు వెళ్లేందుకు వీలు కల్పించినట్లవుతుంది అనుకున్నారు. ఆమె ఆలోచన ఎక్కువమందికి నచ్చింది. ఉద్యోగుల అభిప్రాయ సేకరణలో 76 శాతం మంది ‘గుడ్ ఐడియా’ అన్నారు. నైరుతి పసిఫిక్ మహాసముద్రంలోని ఈ దేశానికి భూభాగ సరిహద్దులు లేవు. వైట్ హౌస్ బట్లర్ విల్సన్ జర్మన్.. వైట్‌హౌస్‌లో ఆతిథ్యాల ప్రధాన సహాయకుడు (బట్లర్). 91 ఏళ్ల వయసులో గురువారం కోవిడ్ 19తో చనిపోయారు. మొత్తం 11 మంది అమెరికా అధ్యక్షుల దగ్గర పని చేశారు ఆయన. డ్వైట్ ఐసన్ హోవర్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు శ్వేతసౌధంలో క్లీనర్‌గా చేరారు. బరాక్ ఒబామా ఉన్నప్పుడు లిఫ్ట్ ఆపరేటర్‌గా రిటైర్ అయ్యారు. ‘ప్రథమ కుటుంబాలకు విల్సన్ దశాబ్దాల పాటు వైట్ హౌస్‌లో సేవలు అందించారు’ అని మిషెల్ ఒబామా గుర్తు చేసుకున్నారు. జాన్ ఎఫ్.కెనడీ హయాంలో విల్సన్ బట్లర్ అయ్యారు. ‘వైట్ హౌస్‌ని వైట్ హోమ్లా మార్చిన బట్లర్‌గా పేరు తెచ్చుకున్నారు. -
రోడ్డు ప్రమాదంలో హీరోకు గాయాలు.. మహిళ మృతి
సాక్షి, మంగళగిరి : శేఖర్‌కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ చిత్రంతో వెండితెరకు పరిచయమైన సుధాకర్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. మంగళగిరి మండలం చినకాకాని జాతీయ రహదారిపై శనివారం జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా, సుధాకర్ గాయపడ్డాడు. సుధాకర్ తాజాగా ‘నువ్వు తోపురా’ చిత్రంలో నటించారు. ఈ చిత్ర ప్రచారంలో భాగంగా హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై మొక్కలకు నీళ్లు పెడుతున్న మహిళను సుధాకర్ కారు ఢీకొంది. ఈ ఘటనలో ఆ మహిళ అక్కడికక్కేడే మృతి చెందగా, కారులో ఉన్న నటుడు సుధాకర్ గాయపడ్డారు. కాగా హరినాథ్ బాబు దర్శకత్వంలో సుధాకర్ నువ్వు తోపు రా అనే సినిమాలో సుధాకర్ నటించాడు. ఈ సినిమా వచ్చే నెల 3న విడుదల కానుండగా.. సినిమా ప్రమోషన్ కోసం హైదరాబాద్ నుంచి గుంటూరుకు వెళ్తోన్న క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం తెలుసుకొని ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
స్క్రీన్ టెస్ట్
► లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమాలో విలన్ గ్యాంగ్‌లో చిన్న పాత్ర పోషించిన నటుడు ఇప్పుడు టాలీవుడ్లో çసక్సెస్ఫుల్ హీరో అతనెవరో తెలుసా? ఎ) నిఖిల్ బి) రాజ్‌తరుణ్ సి) విజయ్ దేవరకొండ డి) నాగశౌర్య ► చంద్రముఖి’ డైరెక్టర్ పి.వాసు ప్రముఖ మేకప్‌మేన్ కుమారుడు. ఆయన పేరేంటి? ఎ) మాధవరావు బి) పీతాంబరం సి) మేకప్ బాబు డి) మేకప్ శీను ► పధ్నాలుగేళ్లుగా సౌత్‌లో టాప్ హీరోయిన్గా కొనసాగుతున్న నయనతార మొదట ఏ హీరోతో జతకట్టారు? ఎ) మమ్ముట్టి బి) రజనీకాంత్సి) శరత్కుమార్డి) జయరామ్ ► పరుగు ఆపటం ఓ కళ..’ పేరుతో ఈ సినీ హీరో జీవిత చరిత్రను ఆకెళ్ల రాఘవేంద్ర రచించారు. ఆ హీరో ఎవరో చెప్పుకోండి చూద్దాం? ఎ) కృష్ణ బి) శోభన్బాబుసి) అక్కినేని నాగేశ్వరరావు డి) ఎస్వీ రంగారావు ► కృష్ణ నటించిన వందో చిత్రం ‘అల్లూరి సీతారామరాజు’. ఆ సినిమా 70 శాతం పూర్తయ్యాక ఆ దర్శకుడు అనారోగ్యం పాలయ్యారు. అప్పుడా సినిమాని కృష్ణ, విజయనిర్మల పూర్తిచేశారు. 70 శాతం కంప్లీట్ చేసిన ఆ దర్శకుడెవరు? ఎ) ఆదుర్తి సుబ్బారావు బి) వి. రామచంద్రరావు సి) సాంబశివరావు డి) లక్ష్మిదీపక్ ► టాలీవుడ్ టాప్ డైరెక్టర్లు వీవీ వినాయక్, శ్రీను వైట్ల, కె.ఎస్. రవికుమార్ చౌదరి ఈ దర్శకుడి శిష్యులు? ఎ) దాసరి నారాయణరావు బి) కె.రాఘవేంద్రరావు సి) సాగర్ డి) ముత్యాల సుబ్బయ్య ► గాయని సునీత 800 పైచిలుకు సినిమాలకు డబ్బింగ్ చెప్పారు. ఆమె డబ్బింగ్ ప్రస్థానం ఏ సినిమాతో మొదలైందో తెలుసా? ఎ) పెళ్లి బి) గులాబి సి) అనగనగా ఒకరోజుడి) పెళ్లి పందిరి ► ‘మిర్చి’ సినిమాలో ‘పండగలా దిగివచ్చాడు..’ పాట రాసింది రామజోగయ్యశాస్త్రి. మరి, పాడింది ఎవరు? ఎ) హరిహరన్ బి) శంకర్ మహదేవన్ సి) శ్రీరామచంద్రడి) కైలాష్ ఖేర్ ► దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి పుట్టినరోజు అక్టోబర్ 10. అదే రోజున ఓ ప్రముఖ కమెడియన్ పుట్టినరోజు కూడా. అతనెవరో ఊహించండి.. ఎ) వేణుమాధవ్ బి) అలీ సి) బ్రహ్మానందం డి) జయప్రకాశ్‌రెడ్డి ► సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి ఏ సంగీత దర్శకుని వద్ద శిష్యరికం చేశారు? ఎ) కె.వి. మహదేవన్ బి) ఇళయరాజా సి) ఎమ్మెస్ విశ్వనాథన్ డి) చక్రవర్తి ► ‘నాకు అదో తుత్తి’ తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హాస్యనటుడు ఇప్పుడు మన మధ్య లేకపోయినా తన కామెడీతో మనసుల్లో నిలిచిపోయారు. ఆయన ఎవరు? ఎ) ఏవీఎస్ బి) కొండవలస సి) ధర్మవరపు సుబ్రహ్మణ్యం డి) ఎమ్మెస్ నారాయణ ► దాసరి దర్శకత్వంలో హీరోగా నటించిన ఆ నటుడు ఆ తర్వాత పెద్ద రచయిత. ఇప్పుడు ఒక స్టార్ హీరో సినిమా ద్వారా దర్శకుడు కాబోతున్నారు.. ఆయనెవరో చెప్పుకోండి చూద్దాం. ఎ) సురేందర్ రెడ్డి బి) కొరటాల శివ సి) వక్కంతం వంశీడి) కాశీ విశ్వనాథ్ ► భాష రాని కారణంగా మహేశ్‌బాబు సరసన బాలీవుడ్ భామ పరిణీతి చోప్రా ‘స్పైడర్’లో నటించే ఛాన్స్ కోల్పోయింది. ఆ అవకాశం ఎవరికి దక్కిందో ఈజీగానే చెప్పేస్తారు కదూ? ఎ) తమన్నా బి) తాప్సీ సి) పూజాహెగ్డే డి) రకుల్ ప్రీత్‌సింగ్ ► ఇప్పుడు వరుసగా హిట్లు మీద హిట్లు సాధిస్తున్న ఈ యువహీరో ఇద్దరు లేడీ డైరెక్టర్ల దర్శకత్వంలో నటించారు. అతడెవరు? ఎ) సిద్ధార్థ్ బి) నారా రోహిత్ సి) వరుణ్‌సందేశ్ డి) నాని ► ఏడుసార్లు నంది అవార్డు గెలుచుకున్న తెలుగు అగ్ర హీరో ఎవరో తెలుసా? ఎ) చిరంజీవి బి) బాలకృష్ణ సి) నాగార్జున డి) వెంకటేష్ ► ఈ ఫొటోలోని బుడతణ్ణి గుర్తుపట్టారా? చిన్న క్లూ.. మీరు ‘గజిని’ కాదులెండి. ఎ) ధనుష్ బి) సూర్యసి) అజిత్ డి) శింబు ► హీరోలు గాల్లో పల్టీలు కొడుతూ ఫైట్ చేస్తుంటారు. థ్రిల్‌కి గురి చేసే ఈ ఫైట్ కంపోజ్ చేయడాన్ని టెక్నికల్‌గా ఏమంటారో తెలుసా? ఎ) వైర్ వర్క్ బి) రోప్ వర్క్ సి) స్ట్రింగ్ రిమూవల్డి) స్ట్రింగ్ ఫైట్ ► అల్లు అర్జున్ ట్విట్టర్ ఐడీ ఏంటో కనుక్కోండి చూద్దాం? ఎ) ఐయామ్ అల్లు బి) ఐయామ్ బన్నీ సి) అల్లు అర్జున్ డి) యువర్స్ బన్నీ ► ఈ స్టిల్ ఏ సినిమాలోనిది? ఎ) మిస్సమ్మ బి) గుండమ్మ కథ సి) తోడి కోడళ్లు డి) మూగ మనసులు ► మహేశ్‌బాబు ఈ సినిమాలో సుపారీ (డబ్బు) తీసుకుని, షూటర్‌గా చేస్తాడు. అదే సినిమా? ఎ) ఖలేజా బి) అతడు సి) బిజినెస్మేన్డి) పోకిరి మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) సి 2) బి 3) డి 4) బి5) బి 6) సి 7) డి 8) డి 9) బి10) డి 11) ఎ 12) సి 13) డి14) డి 15) డి 16) బి 17) సి18) సి 19) ఎ20) బి
Pagination
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
కాంగ్రెస్‌కు షాక్.. నామినేషన్ వెనక్కి తీసుకున్న ఇండోర్ అభ్యర్థి
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
Bullet List Block
- అసభ్య వీడియోల వివాదం: స్పందించిన హెచ్డీ రేవణ్ణ
- ఈ పాపని గుర్తుపట్టారా? లేటెస్ట్ సెన్సేషన్.. రూ.100 కోట్ల మూవీ హీరోయిన్
- నామినేషన్ దాఖలు చేసిన రాజ్‌నాథ్ సింగ్
- గుడిలో ప్రముఖ నటికి చేదు అనుభవం.. పోస్ట్ వైరల్
- అరుదైన ఘనత సాధించే పనిలో స్టార్ హీరోయిన్ జ్యోతిక
- కొత్తపల్లి గీతకు డిపాజిట్ దక్కేనా?
- హమ్మయ్య బంగారం దిగొచ్చింది! తులం ఎంతంటే..
- శుభకార్యానికి వెళ్తూ అనంతలోకాలకు..
- పెద్దలను ఎదిరించలేక ప్రేమ జంట ఆత్మహత్య
- దాడులు, దౌర్జన్యాలు, దమనకాండే టీడీపీ అజెండా
Advertisement