-
తొలి సోలార్ ఎలక్ట్రిక్ వాహనం..రేంజ్ ఎంతంటే..!
ప్రపంచవ్యాప్తంగా పలు కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టిసారించాయి. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో టెస్లా ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిలో దూసుకుపోతుంది. తాజాగా ఎలక్ట్రిక్ వాహనాలు స్టార్టప్ లైట్‌ఇయర్ వన్ ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి కోసం ఫిన్లాండ్కు చెందిన వాల్మెట్ ఆటోమోటివ్‌ను నియమించుకున్నట్లు తెలుస్తోంది. ఈ కంపెనీలు తొలి సోలార్ ఎలక్ట్రిక్ వెహికల్‌ను రూపోందించనున్నాయి. ఈ భాగస్వామ్యంతో 2022 జనవరి వరకు ప్రోటోటైప్ వాహనాల నిర్మాణం జరుగుతుందని కంపెనీ భావిస్తోంది. నెదర్లాండ్స్‌లో కూడా లైట్‌ఇయర్ ఉంది. ఈ కంపెనీ తయారుచేసిన ఈవీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 724.2 కిలోమీటర్ల రేంజ్‌ను ఇవ్వనుంది. బ్రిడ్జ్‌స్టోన్ వంటి కంపెనీలతో లైట్‌ఇయర్ వన్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇప్పటికే లైట్‌ఇయర్ వన్ 60 కిలో వాట్ల బ్యాటరీ ప్యాక్, 3.5 కిలో వాట్ల సోలార్ ప్యానెల్స్‌తో 710 కిలోమీటర్ల స్థిరమైన రేంజ్‌ను అందిస్తోన్నట్లు రుజువు చేసింది. ప్రస్తుతం ఈ కంపెనీ రెండో ప్రోటోటైప్ కార్‌ను సిద్ధంచేయాలని కంపెనీ భావిస్తోంది. అంతేకాకుండా పరిమిత స్థాయిలో లైట్ ఇయర్ వన్ ఎస్ఈవీ(సోలార్ ఎలక్ట్రిక్ వెహికిల్) ఉత్పత్తికి కంపెనీ చర్యలు తీసుకుంటుంది. వాల్మెట్ భాగస్వామ్యంలో ఎస్ఈవీ వాహనాల ఉత్పత్తి మరింత వేగం కానుందని కంపెనీ పేర్కొంది. వాల్మెట్ ఆటోమొబైల్ ఇండస్ట్రీలో సుమారు 50 సంవత్సరాలకు పైగా కాంట్రాక్ట్ తయారీదారుగా ఉంది. మెర్సిడెస్ బెంజ్, పోర్స్చే వంటి దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీలతో కలిసి పనిచేసిన అనుభవం ఉంది. ఫిన్లాండ్లో వాల్మెట్ ఆటోమోటివ్ స్వంత బ్యాటరీ తయారీ పరిశ్రమను కలిగి ఉంది. -
సూర్యుడు సర్రుమనిపిస్తాడు
పెట్రోలు, డీజిళ్లకు రోజులు దగ్గర పడ్డాయి. ఒకవైపు ఫ్రాన్స్ లాంటి దేశాలు.. ఇంక కొన్నేళ్లలోనే తాము ఈ శిలాజ ఇంధనాల వాడకానికి స్వస్తి చెబుతామని స్పష్టం చేస్తూంటే.. ఇంకోవైపు విద్యుత్‌తోపాటు నేరుగా సౌరశక్తితోనే నడిచే కార్లు, వాహనాలు బోలెడన్ని మార్కెట్లోకి వచ్చే ప్రయత్నాల్లో ఉన్నాయి. ఎలన్ మస్క్ కంపెనీ టెస్లా ఇప్పటికే విద్యుత్ కార్ల విషయంలో రికార్డులు బద్దలు కొడుతూంటే నెదర్లాండ్స్‌కు చెందిన కంపెనీ లైట్‌ఇయర్ వన్ సౌరశక్తితో నడిచే కార్ల విషయంలో సంచలనాలు సృష్టించేందుకు సిద్ధమవుతోంది. ఫొటోలో కనిపిస్తున్నది లైట్ ఇయర్ వన్ కారే! ఏంటి దీని ప్రత్యేకతలూ అంటే... ఫొటోలు కొంచెం జాగ్రత్తగా గమనించండి. చిన్న ఫొటోలో పలకల్లాంటివి కనిపిస్తున్నాయా? అవన్నీ సోలార్ ప్యానెల్స్. కారు బాడీలోకి కలగలిసిపోయిన ఈ ప్యానెళ్లతో రోజంతా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌తో దీన్ని ఏకంగా 750 కిలోమీటర్లు నడిపేయవచ్చు. ఇంకోలా చెప్పాలంటే పెట్రోలు, డీజిళ్ల వంటి ఇంధనాలేవీ లేకుండా కేవలం సూర్యుడి శక్తితోనే హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లపోవచ్చునన్నమాట. ఎండలు బాగా ఉండే మనలాంటి దేశాల్లోనైతే.. ఇలాంటి కార్లను చార్జింగ్ అనేది చేసుకోకుండా నెలలపాటు నడిపేయవచ్చు. విద్యుత్తుతో నడిచే కార్లను అప్పుడప్పుడూ చార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు అనుగుణంగా అక్కడక్కడా చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. లైట్ ఇయర్ వన్‌తో ఇలాంటి చిక్కులేవీ ఉండవు. ఏ దశలోనైనా ఎండ అనేది దొరక్క కారు నిలిచిపోతే.. సాధారణ విద్యుత్ ప్లగ్‌ను వాడుకుని చార్జ్ చేసుకునే సౌకర్యమూ ఉంది దీంట్లో! ఇంకో విశేషం ఏమిటంటే.. ఈ కారు కోసం ఎంతో కాలం వేచి ఉండాల్సిన అవసరమేమీ లేదు. కావాలంటే ఇప్పుడే కొనుక్కోవచ్చు. కాకపోతే బేసిక్ మోడల్ కారు ధరే రూ.87 లక్షల దాకా ఉంది. అంతే! – సాక్షి నాలెడ్జ్ సెంటర్
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్‌స్టాప్‌గా...
- ఐపీఎల్‌పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్‌బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
Advertisement