-
సుప్రీంకోర్టులో కేసుల విచారణ ప్రత్యక్ష ప్రసారం
-
చనిపోతూ ఫేస్బుక్లో లైవ్ స్ట్రీమింగ్!
న్యూయార్క్: ట్రాఫిక్ స్టాప్ వద్ద పోలీసుల ఆజ్ఞలను పట్టించుకోకుండా అనుచితంగా వ్యవహరించడంతోపాటు వాహనంతో ఢీకొట్టేందుకు యత్నించిన ఓ వ్యక్తిపై పోలీసు కాల్పులు జరపడం ఫేస్బుక్లో లైవ్ స్ట్రీమింగ్ అయింది. అమెరికాకు చెందిన రోడ్నీ జేమ్స్ హెస్ గురువారం తనపై పోలీసులు కాల్పులు జరిపినపుడు ఫేస్బుక్ లైవ్‌లో ఉన్నట్లు అతడి కుటుంబ సభ్యులు తెలిపారు. వెస్ట్ టెన్నెస్సీలోని అలమో పట్టణం సమీపంలోని హైవేపై వాహనాన్ని అడ్డంగా పార్క్ చేయడంతో హెస్ వాహనం దగ్గరకు పోలీసులు వెళ్లారని, అయితే వారి ఆజ్ఞలను అతడు పట్టించుకోలేదని టెన్నెసీ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారి జోష్ డివినె తెలిపారు. అంతేకాకుండా పోలీసులను వాహనంతో ఢీకొట్టేందుకు ప్రయత్నించడంతో ఓ పోలీస్ అధికారి అతడిపై కాల్పులు జరిపాడని వివరించారు. మా ఆంటీ ఫోన్ చేసి ఈ విషయం చెప్పారు. నేను వెంటనే ఫేస్బుక్లో లాగిన్ అయి ఆ వీడియో చూశాను అని హెస్ కాబోయే భార్య తెలిపారు. హెస్ మానసిక రుగ్మతతో బాధపడుతున్నాడని, ఇలాంటి వారితో ఎలా వ్యవహరించాలో ప్రజలకు అవగాహన ఉండాలని ఆమె అన్నారు. పోలీసులు టైర్లపై షూట్ చేయాల్సింది లేదా ఇంకోలా డీల్ చేయాల్సింది. అతడిపై కాల్పులు జరిపి ఉండాల్సింది కాదు అని పేర్కొన్నారు. ఈ ఘటనపై అధికారులు విచారణ జరుపుతున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్‌కప్‌కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్‌గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్‌లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
Advertisement