-
ప్రయాణికులపై విరిగిన లాఠీ
-
ప్రయాణికులపై విరిగిన లాఠీ
► సికింద్రాబాద్ స్టేషన్లో తోపులాట.. ► పోలీసుల లాఠీచార్జీ.. పలువురికి గాయాలు ► భోగి రోజూ కిటకిటలాడిన బస్సులు, రైళ్లు ► సొంత ఊళ్లకు తరలివెళ్లిన 5 లక్షల మంది సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లేవారితో నగరంలోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. ఇవికాక ప్రైవేటు వాహనాల్లోనూ పయనమవడంతో రోడ్లూ కిక్కిరిసి పోయాయి. భోగి రోజు కూడా సిటిజనులు భారీగా పయనమయ్యారు. వివిధ మార్గాల్లో శుక్రవారం ఒక్క రోజే దాదాపు ఐదు లక్షల మంది హైదరాబాదీలు తమ ఊళ్లకు వెళ్లినట్టు అంచనా. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో కాలు పెట్టలేని పరిస్థితి. ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ జనరల్ బోగీల్లో ఎక్కేందుకు ప్రయాణికులు తోసుకోవడంతో తొక్కిసలాట జరిగింది. ప్రయాణికులను నియంత్రించే క్రమంలో పోలీసులు లాఠీలు ఝులిపించారు. దీంతో పలువురికి గాయాలయ్యాయి. ఒక మహిళ తలకు తీవ్ర గాయం అయింది. 250 అదనపు బస్సులు... వారం క్రితం ప్రారంభమైన సంక్రాంతి రద్దీ శుక్రవారం కూడా కొనసాగింది. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్లు, ఎంజీబీఎస్, జూబ్లీ బస్స్టేషన్లు, నగరానికి నాలుగు వైపులా ప్రధాన కూడళ్లు... ఎక్కడ చూసినా సొంతూళ్లకు పయనమయ్యే ప్రయాణికులే కనిపించారు. 3,500 రెగ్యులర్‌తో పాటు, మరో 250 బస్సులను ఆర్టీసీ అదనంగా నడిపింది. వీటికితోడు 80కి పైగా ఎక్స్‌ప్రెస్‌లు, మరో 1000 ప్యాసింజర్ రైళ్లు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించాయి. మరోవైపు ప్రైవేటు బస్సులు, వాహనాలు రోడ్లపై పోటెత్తాయి. అంతా కలిపి దాదాపు ఐదు లక్షల మంది నగరవాసులు సంక్రాంతిని సొంతూళ్లలో జరుపుకొనేందుకు పయనమయ్యారు. అతిగా ప్రవర్తించిన పోలీసులు... సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ప్రయాణికులను అదుపు చేసే క్రమంలో పోలీసులు అతిగా ప్రవర్తించినట్లు కొందరు ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ ప్లాట్‌ఫామ్ మీద ఆగీఆగక ముందే ఎక్కేందుకు.. ప్రయాణికులు ఒక్కసారిగా తోసుకుని ముందుకు వచ్చారు. పరిస్థితి అదుపు తప్పుతుందని భావించిన ఇద్దరు కానిస్టేబుళ్లు ప్రయాణికులపై లాఠీలతో తమ ప్రతాపాన్ని చూపారు. శ్రీకాకుళానికి చెందిన మహిళ పల్లవి తలపై లాఠీతో కొట్టారు. తీవ్ర గాయమైన ఆమెకు పోలీసులు వెంటనే ప్రథమ చికిత్స చేయించి పంపించారు. పోలీసుల తీరుపై ప్రయాణికులు నిరసన తెలిపారు. సరైన సదుపాయాలు కల్పించలేని రైల్వే అధికారులు... లాఠీలతో కొట్టించడం దారుణమన్నారు. అదుపు చేసే క్రమంలోనే లాఠీలకు పనిచెప్పాల్సి వచ్చిందని సికింద్రాబాద్ రైల్వే పోలీస్ ఇన్స్పెక్టర్ ఆంజనేయులు తెలిపారు. బోసిపోయిన స్టేషన్... నిత్యం తెల్లవారు జాము నుంచి అర్ధరాత్రి వరకు ప్రయాణికుల సందడి కనిపించే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఒక్కసారిగా బోసిబోయింది. సంక్రాంతికి ఊళ్లకెళ్లేవారితో మూడు రోజులుగా ఇసుకేస్తే రాలనంత రద్దీగా ఉన్న స్టేషన్... శుక్రవారం రాత్రి 7 గంటల నుంచి ఆ సందడి కనిపించక ప్లాట్‌ఫామ్‌లు వెలవెలబోయాయి.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
హైదరాబాద్‌లో భారీగా భూమిని కొన్న మైక్రోసాఫ్ట్!
మరో మహిళతో రొమాన్స్.. చాలా ఎగ్జైట్ అయ్యానన్న సోనాక్షి
‘రైతుల భూ డాక్యుమెంట్లను బుగ్గిపాలు చేసింది బాబేగా!’
ఈవీఎంకు పూజలు.. చిక్కుల్లో మహిళా కమిషన్ అధ్యక్షురాలు
తానేటి వనిత ఘటన..వాసిరెడ్డి పద్మ సంచలన కామెంట్స్
తెలుగులో డైరెక్ట్‌గా ఓటీటీలోకి వస్తున్న మూవీ, స్ట్రీమింగ్ ఎక్కడంటే?
వరంగల్‌ను BRS, కాంగ్రెస్ బారి నుంచి కాపాడాలి: ప్రధాని మోదీ
కొవిషీల్డ్ వ్యాక్సిన్‌ను రద్దు చేసిన ఆస్ట్రాజెనెకా.. కారణం తెలుసా..
పేదవాడు జీవచ్ఛవం కాకూడదని సీఎం జగన్ ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు
పవన్‌ను గెలిపించాలని చిరంజీవి ఎలా అడుగుతారు?: పోసాని
తప్పక చదవండి
- ఈవీఎంకు పూజలు.. చిక్కుల్లో మహిళా కమిషన్ అధ్యక్షురాలు
- ఓటరు గుర్తింపు కార్డు లేకున్నా ఓటేయవచ్చు!
- వెస్ట్ నైలు వైరస్‌ని తొలిసారిగా అక్కడ గుర్తించారు! ఎవరికి ప్రమాదమంటే..
- SRH vs LSG: ఉప్పల్ మ్యాచ్‌కు వెళ్తున్న వారికి అలర్ట్! ఇలా అయితే..
- అధికారం శాశ్వతం కాదు.. వడ్డీతో చెల్లించే టైం వస్తుంది:కేటీఆర్
- ఎయిరిండియా సిబ్బంది సిక్ లీవ్.. 70కి పైగా విమానాలు రద్దు
- CM Jagan అంటే ఒక పాఠం: నటి శ్యామల
- ధోని ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్‌గా..
- Konathala Ramakrishna: మీ సంగతి చూస్తాం
- రెచ్చిపోయిన పచ్చ మూక.. హోం మంత్రి తానేటి వనితపై దాడికి యత్నం
Advertisement