-
షాకింగ్ విషయాలు వెల్లడించిన నిర్మాత
సాక్షి, ముంబై: రిలీజ్‌కు ముందు తమ సినిమాలను ప్రమోట్ చేసుకోవడానికి దర్శకనిర్మాతలు రకరకాల ఎత్తుగడలు వేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల వివాదాలు కూడా సిన్మాలను జనంలోకి తీసుకెళ్లడానికి అస్త్రంగా పనికొస్తున్నాయి. వివాదాలతో సినిమాలకు ఫ్రీ పబ్లిసిటీ లభిస్తోంది. అయితే, ఈ వివాదాలు సినిమా పబ్లిసిటీ కోసం కావాలనే సృష్టిస్తున్నారా? కావాలనే కల్పిత స్కాండళ్లను జనంలోకి వదులుతున్నారా? అంటే మార్కెట్ ట్రెండ్ అలాగే కనిపిస్తోందని అంటున్నారు బాలీవుడ్ దర్శక-నిర్మాత నిఖిల్ అద్వానీ.. జియో మమి 19వ ముంబై చిత్రోత్సవంలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు ఆసక్తిక విషయాలు వెల్లడించారు. ఆయన నిర్మించిన తాజా సినిమా 'లక్నో సెంట్రల్' ప్రమోషన్ కోసం ఓ స్కాండల్ (అశ్లీల బాగోతాన్ని)ను సృష్టించాలంటూ మార్కెటింగ్ టీమ్ తనకు సూచించిందని ఆయన వెల్లడించారు. ఫర్హాన్ అఖ్తర్ హీరోగా తెరకెక్కిన 'లక్నో సెంట్రల్'.. కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో రూపొందిన 'సిమ్రన్' సినిమాలు ఒకేసారి సెప్టెంబర్ 15న విడుదలయ్యాయి. వివాదాలతో మంచి పబ్లిసిటీ పొందిన 'సిమ్రన్' సినిమా ఓ మోస్తరు వసూళ్లు రాబట్టింది. అదే సమయంలో 'లక్నో సెంట్రల్' కనీస వసూళ్లు రాబట్టలేక.. ఘోరంగా ప్లాప్ అయింది. సినీ ప్రమోషన్ విషయంలో మార్కెటింగ్ గురించి ప్రశ్నించగా ఈ యువ నిర్మాత స్పందిస్తూ.. 'కంగనా స్కాండల్ (హృతిక్ రోషన్‌తో తన ఎఫైర్ గురించి ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కంగనా పేర్కొన్న విషయాలు పతాక శీర్షికలకు ఎక్కిన సంగతి తెలిసిందే) జోరుగా పబ్లిసిటీ పొందుతోందని మార్కెటింగ్ నిపుణుడు నాకు ఫోన్ చేశాడు. ఫర్హాన్ కూడా ఒక స్కాండల్ చేస్తే.. మన సినిమాను ప్రమోట్ చేసుకోవచ్చని చెప్పాడు. నేను ఏం స్కాండల్ అని అడిగాను. ఏ స్కాండల్ పర్వాలేదు. ఆ అవసరం మనకు ఉందని అన్నాడు. సినిమా కోసం ఓ స్కాండల్ చేసి పెట్టవా అని నేను ఫర్హాన్‌ని ఎలా అడిగేది' అంటూ నిఖిల్ అద్వానీ వివరించారు. -
ఎరవాడ జైల్లో సాంగ్ లాంచ్
నిజజీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన మరో బాలీవుడ్ మూవీ లక్నో సెంట్రల్. ఫర్హాన్ అక్తర్ లీడ్ రోల్ లో నటించిన ఈ సినిమాకు రంజిత్ తివారీ దర్శకుడు. త్వరలో రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాన్ని విభిన్నంగా నిర్వహించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఓ పాటను ఎరవాడ జైల్లో రిలీజ్ చేశారు. తీన్ కబూతర్ అంటూ సాగే ఈ పాటకు చిత్రయూనిట్ పాటు జైల్ లోని 300 మంది ఖైదీలు కూడా డ్యాన్స్ చేయటం విశేషం. అంతేకాదు సినిమాను కూడా జైల్లో ప్రదర్శించేందుకు అనుమతి కోరినట్టుగా నటుడు ఫర్హాన్ అక్తర్ వెల్లడించారు. ఇప్పటికే ఎరవాడ అదనపు డీజీపీ భూషణ్ కుమార్ తో ఈ విషయం పై చర్చించామని, ఆయన ఉన్నతాధికారులతో ఈ విషయాన్ని చరిస్తామన్నారని తెలిపారు. లక్నో సెంట్రల్ సినిమాను సెప్టెంబర్ 15న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్‌కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్‌పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పాపం రాహుల్ త్రిపాఠి.. షాక్‌లో కావ్య మారన్! వీడియో వైరల్
పుష్ప-2 మరో అప్డేట్ వచ్చేసింది.. అదేంటంటే?
రామేశ్వరం కేఫ్ పేలుడు.. పలు రాష్ట్రాల్లో ఎన్ఐఏ దాడులు
ఓ వైపు టెన్షన్.. మరోవైపు ఉత్సాహం: స్టేడియంలో తళుక్కుమన్న షారుఖ్ (ఫొటోలు)
అప్పుడు 'నీ తండ్రి స్థాయి తెలుసా అన్నారు': దీపిందర్ గోయల్
HYD: ఏసీపీ నివాసంలో సోదాలు.. బయటపడుతున్న నోట్ల కట్టలు
శ్యామలపై తప్పుడు కథనాలు.. చట్టపరంగానే ముందుకెళ్తానన్న యాంకర్!
స్టార్క్ సూపర్ డెలివరీ.. హెడ్‌కు ఫ్యూజ్‌లు ఔట్
భారీగా పెరిగిన ఫ్లిప్‌కార్ట్ గ్రోసరీ బిజినెస్
లిక్కర్ కేసు: మనీష్ సిసోడియాకు మళ్లీ చుక్కెదురు
తప్పక చదవండి
- రాహుల్ విరామం తీసుకోవడమే మేలు: పీకే
- హార్దిక్ తప్పేం లేదు.. అంతా సీనియర్ల వల్లే: ముంబై మాజీ కెప్టెన్
- లవ్ ఫర్ లగ్జరీ కార్ : నాగ చైతన్య కొత్త కారు, ధర తెలిస్తే!
- మాజీ జడ్జి గంగోపాధ్యాయ ప్రచారంపై ‘ఈసీ’ బ్యాన్
- 2030 నాటికి భారత్ 11.5 కోట్ల ఉద్యోగాలను సృష్టించాలి.. లేకుంటే?
- ఎల్లో మీడియాకు చెప్పకుండా బాబు ఎక్కడికి వెళ్లారు? జోగి రమేష్
- జూన్ 1 నుంచి డ్రైవింగ్ లెసెన్స్‌లు జారీ చేయనున్న ప్రైవేట్ కంపెనీలు
- అంతర్జాతీయ 'టీ' దినోత్సవం! ఈ వెరై'టీ'లు ట్రై చేశారా?
- వైఎస్సార్సీపీ గెలుపును ఖరారు చేసిన ఎల్లో మీడియా!.. ఈ రాతలు అందుకేనా?
- బంగారం కొనుగోలు దారులకు భారీ ఊరట
Advertisement