-
వచ్చిన అవకాశాన్ని జారవిడుచుకోవద్దు!
2016 జనవరి 9 నుంచి 15 వరకు టారో బాణి ఏరిస్ (మార్చి 21- ఏప్రిల్ 20) దీర్ఘకాలంగా వేధిస్తున్న ఒక సమస్య పరిష్కారమయ్యే సూచన కనిపిస్తోంది. అదే మీరు అవివాహితులయినట్లయితే మీ ప్రేమబంధం కొద్దిపాటి సవాళ్లతో కూడుకుని ఉంటుంది. మీ ప్రేమను గెలిపించుకోవడానికి ఇంచుమించు ముళ్లబాట మీద నడవాల్సి వస్తుంది. కెరీర్‌కి, పనికి సంబంధించి కొంత అయోమయం నెలకొనే అవకాశం ఉంది. కలిసొచ్చేరంగు: వైట్ టారస్ (ఏప్రిల్ 21-మే 20) వృత్తిపరంగా స్థిరత్వం వస్తుంది. ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశం కనిపిస్తోంది. వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా ఉంటుంది. దీర్థకాలికంగా పెండింగ్‌లో ఉన్న ఆస్తి వివాదమొకదానికి ఈ వారంలో సులభ పరిష్కారం లభించనుంది. వ్యాపారంలో లేదా పనిలో పెట్టుబడి పెట్టండి. మంచి రాబడి ఉంటుంది. కలిసొచ్చే రంగు: బ్లూ జెమిని (మే 21-జూన్ 21) పనిప్రదేశంలోనూ, ఇంటిలోనూ కొన్ని ప్రధానమైన మార్పులు సంభవించవచ్చు. వాటిప్రభావం మీపై గణనీయంగా పడుతుంది. అయితే భయపడాల్సిన పనిలేదు. మంచే జరుగుతుంది. ఇంటిని లేదా ఆఫీస్‌ని అందంగా అలంకరిస్తారు. అదృష్టం కలిసొస్తుంది. కొన్ని మార్మిక సంఘటనలు జరగవచ్చు. పిల్లల వల్ల ఆనందం కలుగుతుంది. కలిసొచ్చే రంగు: రెడ్ క్యాన్సర్(జూన్22-జూలై 23) కుటుంబ సమస్యల పరిష్కారంలో దైవబలం తోడుగా ఉండటం వల్ల విజయం సాధిస్తారు. వృత్తిపరమైన సమస్యలను అధిగమిస్తారు. ప్రేమజీవితం రసకందాయంలో పడుతుంది. అంతా ఫలప్రదంగా నడుస్తుంది. ఒక సంఘటన నుంచి గుణపాఠాన్ని నేర్చుకుంటారు. మీలో మార్పు వస్తుంది. షాపింగ్‌తో బిజీగా గడుపుతారు. కలిసొచ్చే రంగు: ఆరంజ్ లియో (జూలై 24-ఆగస్టు 23) విస్తృతంగా ప్రయాణాలు ఉండవచ్చు.గతంలో ఆరంభించిన ఒకపనికి సంబంధించి తుది నిర్ణయం తీసుకోవడంలో గందరగోళం నెలకొంటుంది. ఆచితూచి ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిది. మీ చుట్టూ చేరి మిమ్మల్ని ప్రభావితం చేయాలని చూసే వారు ఉన్నప్పటికీ అంతరాత్మ ప్రబోధానుసారం నడుచుకోవడం మంచిది. కలిసొచ్చే రంగు: ఎల్లో. వర్గో (ఆగస్టు24-సెప్టెంబర్ 23) కెరీర్లో మీరనుకున్న విధంగా ముందుకు వెళ్తున్నందుకు సంతోషిస్తారు. మీ ప్రత్యర్థి కంపెనీ నుంచి మీకు ఉద్యోగావకాశం వస్తుంది దానిని అంత తేలిగ్గా కొట్టేయవద్దు. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మీ జీవితం మలుపు తిరగవచ్చు. ఎక్సర్సైజ్లు, వాకింగ్ వంటివి చేస్తూ ఆరోగ్యంపై దృష్టి సారించవలసిన తరుణమిది. కలిసొచ్చే రంగు: గ్రీన్ లిబ్రా (సెప్టెంబర్ 24- అక్టోబర్ 23) మీ శక్తియుక్తులన్నింటినీ కేంద్రీకరించి ఒక సమస్యను ఎదుర్కొనవలసి వస్తుంది. ఇది మీ సహనానికి పరీక్ష. ధైర్యంగా, నిబ్బరంగా ఉండండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు. పరిస్థితులను జాగ్రత్తగా, సమయస్ఫూర్తితో ఎదుర్కొనండి. తొందరపాటు, అధైర్యంవద్దు. బేలతనం అసలేవద్దు. కలిసొచ్చే రంగు: ఆలివ్ గ్రీన్ స్కార్పియో (అక్టోబర్ 24-నవంబర్ 22) ఈ వారం ప్రమాద సూచన కనిపిస్తోంది. మీ మనస్తత్వం ప్రకారం సాహసాలు చేయడానికి ఇష్టపడరు కానీ, చేయడం వల్ల మీకు బాగానే కలిసొస్తుంది. ఆర్థికంగా కొద్దిపాటి ఒడుదొడుకులు ఎదురైనప్పటికీ ఏమాత్రం కంగారుపడవద్దు. అంతా సజావుగానే గడుస్తుంది. కలిసొచ్చేరంగు: పర్పుల్ శాజిటేరియస్ (నవంబర్23-డిసెంబర్ 21) ఏ విధంగా పావులు కదిపితే ఏమవుతుందో మీకు బాగా తెలుసు. కానీ మీరు ఏదో జంకుతో వెనుకంజ వేస్తున్నారు. ధైర్యంగా ముందుకు వెళ్లండి మంచే జరుగుతుంది. బిజినెస్‌పరంగా మీ అంచనాలు ఫలిస్తాయి. పైస్థాయి వారితో కొన్ని ఒప్పందాలు కుదురుతాయి. ప్రేమజీవితం పట్ల కొంచెం విసుగు జనించవచ్చు. కలిసొచ్చే రంగు: ముదురు నారింజ క్యాప్రికార్న్ (డిసెంబర్ 22-జనవరి 20) అడుగులు ఆలస్యంగా పడుతున్నాయని బాధపడవద్దు. ఆచితూచి అడుగులు వేయడం లాభదాయకమే కానీ, నష్టం కలిగించదని గుర్తుంచుకోండి. అధ్యయనం మీద దృష్టి పెట్టండి. మనశ్శాంతిగా ఉండండి. గొంతెమ్మ కోరికలను వెనక్కు నెట్టి, మీ అంతర్గత శక్తిసామర్థ్యాలను వెలికి తీయండి. షాపింగ్‌లో బిజీగా ఉంటారు. కలిసొచ్చే రంగు: సిల్వర్ అక్వేరియస్ (జనవరి 21-ఫిబ్రవరి 19) ధనం సమృద్ధిగా లభిస్తుంది.అనుకున్నవి జరగలేదని నిరుత్సాహపడకండి. దేనికైనా దాని టైమ్ వచ్చినప్పుడే అవుతుందని గుర్తుంచుకోండి. మీ ఇంటి ముంగిట లేదా పెరడులో తూర్పుదిశగా వెదురుమొక్కని నాటడం వల్ల కలిసొస్తుంది. మీ కుటుంబంలో కొత్త సభ్యులు జతకూడతారు. వారి రాక మీకెంతో ఆనందం కలిగిస్తుంది. కలిసొచ్చేరంగు: గ్రీన్ పైసిస్ (ఫిబ్రవరి 20-మార్చి 20) సినిమా హాలుకు వెళ్లినా, ఇరుగుపొరుగుతో పిచ్చాపాటీగా మాట్లాడుతున్నా, కొత్త ఉద్యోగంలో చేరినా, అందరి దృష్టి మీ మీదే ఉంటుంది. మీ ప్రియతముల రాక ఆనందం కలిగిస్తుంది. ఆఫీస్‌లో మీకిచ్చిన పనులను సమర్థంగా చేసి, శభాషనిపించుకుంటారు. అందరినీ ఆకట్టుకుంటారు. కలిసొచ్చే రంగు: ఎల్లో టారో ఇన్సియా టారో అనలిస్ట్ రేకీ గ్రాండ్ మాస్టర్ సౌర వాణి ఏరిస్ (మార్చి 21- ఏప్రిల్ 20) చెప్పలేనంత మానసిక ధైర్యం మీకొస్తుంది. ఏదో జరిగిపోతుందేమో అనే ఆందోళన పూర్తిగా తొలగిపోతుంది. కింది ఉద్యోగులూ పై అధికారులూ తోటి ఉద్యోగస్థులూ కూడా పూర్తి సహకారాన్నందిస్తారు. వ్యాపారస్థులకి తోటి భాగస్వాములు అండగా నిలబడతారు. ప్రభుత్వాధికారుల నుండి ఏ తీరు వేధింపులూ పరిశీలనలూ పరీక్షలూ లేక సుఖంగా గడుస్తుంది ఈ వారం. టారస్ (ఏప్రిల్ 21-మే 20) దంపతుల్లో వాదవివాదాలు పెరుగుతాయి. అయితే అన్యోన్యతా విషయంలో ఇబ్బంది తలెత్తదు. ఒక ముఖ్యమైన పనిని చేపట్టే విషయంలో ‘ఔను- కాదు’ అనే చర్చలే తప్ప పరస్పర నిందారోపణలు కావు కాబట్టి దాంపత్యానికి లోటు లేదు. సమస్య ఉండదు. ఈ సమస్యా నివారణ /పరిష్కార దిశలో మరొకరికి అవకాశాన్నివ్వకూడదని గ్రహించుకోవాలి. జెమిని (మే 21-జూన్ 21) అకస్మాత్తుగా వచ్చిన అనుకోని ధనంతో వస్తువులనీ ఆభరణాలనీ కొంటారు. వీలయినంత వరకూ కుటుంబాన్ని గురించిన గుంభనతో ఉండడం అంటే అన్నింటినీ వెల్లడించి చెప్పేయడం ప్రస్తుతానికి అంత మంచిది కాదు. చేస్తున్న ప్రతిపనినీ శ్రద్ధ పెట్టి చేయాల్సిందే తప్ప ఏదో యాంత్రికంగా చేయకూడదు. క్యాన్సర్ (జూన్22-జూలై 23) తేలికగా అంటే మరొకరి అవసరం ఏమాత్రమూ లేని పనుల్ని పూర్తి చేసుకోండి. కష్టమైన పనుల్ని తాత్కాలికంగా వాయిదా వేసుకోండి. శత్రువులు ప్రయత్నిస్తారు కాని మిమ్మల్ని ఏమీ చేయలేరు. మీ బాధ్యతలకి తోడుగా మరిన్ని /బాధ్యతగాని చేపట్టవలసి వస్తే మొగమాటం లేకుండా చేయలేననే మీ అశక్తతని నిదానంగా చెప్పండి. లియో (జూలై 24-ఆగస్టు 23) చేయవలసిన పనుల్లో ఏది మీతోనే పూర్తి చేసుకోగల అవకాశముందో ఆ పనుల్ని వాయిదా వేసుకోకుండా ముగించుకోండి. ఇతరుల సహకారం ప్రమేయమున్న పనుల్ని నెత్తిమీద పెట్టుకోకండి ఈ వారంలో. మీ ఉద్యోగానికో వృత్తికో వ్యాపారానికో ఓ అదనపు బాధ్యత అప్పగించే పరిస్థితులు రావచ్చు. సిద్ధపడి ఉండండి మానసికంగా. వర్గో (ఆగస్టు24-సెప్టెంబర్ 23) ఈ వారం మీకు అనుకూలంగా ఉంటుంది. మీ కింది ఉద్యోగుల అభినందనలూ, మీపై అధికారుల ప్రశంసలూ మీకెంతో ఆనందాన్ని కల్గిస్తాయి. మీ గురించి మీరు ఆలోచించుకోండి తప్ప మీ గొప్పదనాన్ని చూపించుకోవడం కోసం మరెవరి విషయాన్నో తలకెత్తుకుని శ్రమపడకండి. మీ గురించి మీరు మర్తిగా పట్టించుకోవలసి వారం ఇది అనుకోండి. లిబ్రా (సెప్టెంబర్ 24- అక్టోబర్ 23) వడ్డించిన విస్తరీ, వడ్డించేందుకు వ్యక్తీ, చక్కటి భోజనశాలా... ఇలా అన్నీ ఉన్నా కూడా కాలదన్నుకుంటూ ఏదో దురదృష్టం మిమ్మల్ని వెన్నాడుతున్నట్లుగా భావించుతారు మీరు. మీ వ్యక్తిగత జీవితాన్ని గురించి మీకంటే రెండురెట్ల వయసుసున్న అనుభవజ్ఞుల్ని ముఖ్యంగా పక్షపాత బుద్ధి లేకుండా ధర్మాన్ని చెప్పేవారిని సంప్రదించండి. మీ సమస్య మొత్తం తీరిపోతుంది. స్కార్పియో (అక్టోబర్ 24-నవంబర్ 22) మీకు అన్యాయం జరుగుతోందన్న విషయం సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడన్నంత సత్యం. ధర్మానికీ న్యాయానికీ కట్టుబడి ఉన్న మీకు జరిగిన అన్యాయానికి బెదిరిపోకండి. కత్తులూ కటారులూ కాకుండా ధర్మఖడ్గంతోనే పోరాడుతూనే ఉండండి. పట్టుదల విడవకండి. శత్రువులు దిగొస్తారు. శరీర శ్రమకీ మానసికమైన ఒత్తిడికీ సిద్ధపడి పోరాడండి. విజయం మీదే. శాజిటేరియస్ (నవంబర్23-డిసెంబర్ 21) విందులతో వినోదాలతో చక్కగా గడుస్తుంది ఈ వారం. దూరపు ప్రయాణాలు చేయడంగానీ, స్థలాన్ని మార్చడం గానీ జరగొచ్చు. వద్దని అనుకున్నా ఎంతగా వారించినా మీ కుటుంబంలో ఇతరుల జోక్యం తప్పనిసరి కావచ్చు. దానికి కారణం మీరు లోగడ వారికిచ్చిన చనువే. మీ కుటుంబం సుఖంగా ఉండాలంటే మౌనంగా ముభావంగా ఉండడం మంచిది. క్యాప్రికార్న్ (డిసెంబర్ 22-జనవరి 20) మీరు మీదైన వృత్తి కాకుండా మీలో దాగిన ఇతర రంగాలలోని ప్రావీణ్యాన్ని ప్రదర్శించుకోగల అవకాశం వస్తుంది. తద్వారా మీ కీర్తిప్రతిష్ఠలు మరింతగా పెరిగే సూచన కనిపిస్తోంది. మీరు చెప్పదలచిన ఏ మాటనైనా పరుష భాషతోనూ కఠిన వైఖరితోనూ చెప్పడం వల్ల శత్రువులు పెరిగే అవకాశం ఉంది. మాట మెత్తగా, భావం గట్టిగా ఉండాలని గమనించండి. అక్వేరియస్ (జనవరి 21-ఫిబ్రవరి 19) అన్నదమ్ముల మధ్యా అప్పచెల్లెళ్ల మధ్యా మంచి సహకారం పెంపొందుతుంది. వృత్తిలో అనుకూల పరిస్థితులు బాగా కనిపిస్తున్నాయి. ఆరోగ్యంలో చక్కటి అనుకూలమైన ఫలితాలు కన్పిస్తాయి. పోటీ పరీక్షలకి వెళ్లాలనీ ఉద్యోగంలో అలాగే వ్యాపారం లేదా వృత్తిలో మరింత అభివృద్ధి సాధించాలనీ ఓ ఆలోచన వస్తుంది. దాన్ని అమలు చేయడం మంచిది. పైసిస్(ఫిబ్రవరి 20-మార్చి 20) అన్ని రంగాల్లోనూ అననుకూలత కన్పిస్తూ ఉంటుంది. ముఖ్యంగా వాణిజ్యంలో నష్టాలు కన్పించవచ్చు. ఉద్యోగంలో తోటివారితో అభిప్రాయభేదాలూ మనఃస్పర్థలూ కన్పించవచ్చు. అనుకోకుండా బంధువులకి చెందిన ఓ స్థిరమైన ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. వచ్చిన ఈ అవకాశాన్ని జారవిడుచుకోవద్దు. కృషి చేసి సాధించుకోండి. డా॥మైలవరపు శ్రీనివాసరావు సంస్కృత పండితులు -
ప్రయాణాలలో జాగ్రత్త పాటించండి
డిసెంబర్ 19 నుంచి 25 వరకు టారో బాణి ఏరిస్ (మార్చి 21- ఏప్రిల్ 20) మీ అంతర్వాణి శక్తి, దానితోబాటే మీరు చెప్పే జోస్యమూ ఫలిస్తూ వస్తుంది. అంతర్వాణిని జాగ్రత్తగా ఆలకించి, సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోగలగడం మీకెంతో ఉపకరిస్తుంది. వాగ్దానాలను నెరవేర్చడంలో అలక్ష్యం చేయవద్దు. అలాగే మీకు ఇతరులు చేసిన వాగ్దానాలు కూడా నెరవేరే సూచనలు కనిపిస్తున్నాయి. కలిసొచ్చే రంగు: సముద్రపు పాచి రంగు టారస్ (ఏప్రిల్ 21-మే 20) అదృష్టం వరిస్తుంది. భాగస్వామ్య వ్యవహారాలు, వ్యక్తిగతమైన విషయాలు, వృత్తిసంబంధమైన విషయాలలో మీరు అనుకున్న విధానంలోనే ముందుకెళ్లడం మంచిది. లీగల్ డాక్యుమెంట్ లేదా కాంట్రాక్ట్‌పై చేసే ఒక సంతకం మీకు ఎంతో మేలు చేస్తుంది. జీవితం మీకు అనుకూలమైన మలుపు తిరుగుతుంది. కలిసొచ్చే రంగు: ఆలివ్ గ్రీన్ జెమిని (మే 21-జూన్ 21) మీరు ఏమైతే కోరుకుంటున్నారో, దేని గురించయితే కలలు కంటున్నారో అది ఈ వారం తప్పక నెరవేరుతుంది. కొంతకాలంగా మీరు అనుభవిస్తున్న మనోవ్యాధి లేదా శారీరక రుగ్మత తొలగిపోయి, జీవితం ఎంతో సంతోషంగా, ఆనందకరంగా సాగుతుంది. బంధువులు లేదా హితుల నుంచి బహుమతులు అందుతాయి. కలిసొచ్చే రంగు: దొండపండు రంగు క్యాన్సర్ (జూన్22-జూలై 23) మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న పరిస్థితుల నుంచి బయట పడతారు. మీరు అనుకున్న పనులు, సాధించాలనుకున్న లక్ష్యాలు ఎవరి ద్వారా అవుతాయనుకుంటున్నారో వారిద్వారా ఆత్మవిశ్వాసంతో చేయించుకుంటారు. తండ్రి సూచనలు, సహకారం, అండదండలు లభిస్తాయి. అవివాహితులకు వివాహ సూచనలు కనిపిస్తున్నాయి. కలిసొచ్చే రంగు: నారింజ లియో (జూలై 24-ఆగస్టు 23) ఇతరులతో శాంతిని, సామరస్యాన్ని, సత్సంబంధాలను కోరుకుంటున్నట్లయితే ఈ వారం అవి మీకు సంపూర్ణంగా లభిస్తాయి. జీవితం తిరిగి మీ చెప్పుచేత ల్లోకొస్తుంది. ఆర్థిక ఒడుదొడుకుల నుంచి బయటపడతారు. కుటుంబ సంబంధాలు మెరుగుపడతాయి. ప్రశాంతంగా, సహనంగా ఉండవలసిన సమయమిది. కలిసొచ్చే రంగు:వంకాయరంగు వర్గో (ఆగస్టు24-సెప్టెంబర్ 23) పనిపరంగా, కెరీర్‌పరంగా కొద్దిపాటి సందిగ్ధపరిస్థితులు నెలకొనవచ్చు. వాటిమూలంగా మీకు నిస్సత్తువగా అనిపిస్తుంది. అయితే కొత్త సవాళ్లను ఎదుర్కొనేందుకు కొత్త శక్తిని పుంజుకుని సంసిద్ధంగా ఉంటారు. ప్రేమ విషయంలో సున్నితమైన పరిస్థితి ఎదురవుతుంది. మనసు దృఢం చేసుకోవడం మంచిది. కలిసొచ్చే రంగు: ఆకుపచ్చ లిబ్రా (సెప్టెంబర్ 24- అక్టోబర్ 23) నిశ్చితార్థం కుదురుతుంది లేదా భాగస్వామ్య ఒప్పందంపై సంతకం చేస్తారు. జరిగిన పరిణామాలు ఆనందం కలిగిస్తాయి. భవిష్యత్తుపై కొత్త ఆశలు చిగురిస్తాయి. కుటుంబంలో ఒక శుభకార్యం జరగడమో లేదా విందు వినోదాలలో పాల్గొనడమో జరగవచ్చు. అయితే న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా నడుచుకోవడాన్ని మరచిపోవద్దు. కలిసొచ్చే రంగు: ఊదారంగు శాజిటేరియస్ (నవంబర్23-డిసెంబర్ 21) అనుకోకుండా అదృష్టం వరిస్తుంది. ఈ వారమంతా చాలా అదృష్టకరంగా గడుస్తుంది. ఆర్థికంగా చాలా బాగుంటుంది. ప్రేమ లేదా వైవాహిక బంధం బలంగా మారుతుంది. రొమాన్స్‌లో పడతారు. జరుగుతున్న వాటిని అడ్డుకోవాలని చూడొద్దు. జీవితమనే ప్రవాహం ఎటు తీసుకెళితే అటు కొట్టుకెళ్లడం మంచిది. కలిసొచ్చే రంగు: గోధుమ రంగు క్యాప్రికార్న్ (డిసెంబర్ 22-జనవరి 20) వ్యాపారపరంగా కొత్త అవకాశం రావచ్చు. కాదనకుండా చేస్తే మంచి అదృష్టం కలిసి వస్తుంది. ఏదైనా కొత్త పనిని చేపట్టడానికిది అనుకూలమైన సమయం. ప్రకృతిలో మమేకమై హాయిగా, విశ్రాంతిగా గడుపుతారు. లేనిపోని భయాలన్నింటినీ అవతలకు నెట్టి జీవితాన్ని సంతోషంగా అనుభవించడం నేర్చుకోండి. కలిసొచ్చే రంగు: పసుప్పచ్చ అక్వేరియస్ (జనవరి 21-ఫిబ్రవరి 19) ఈ వారం కొంచెం అసహనంగా, చికాకుగా అనిపిస్తుంది. అవిశ్రాంతంగా గ డుపుతారు. కొన్ని విషయాలలో మార్పుచేర్పులు అవసరం కావచ్చు. వాటిని మీ ఇష్టం వచ్చినట్లు మలుచుకోవలసిన బాధ్యత మీదే. మీ శక్తి సామర్థ్యాలను మెరుగుపరచుకోవడం మీద దృష్టి పెట్టండి. కలిసొచ్చే రంగు: నీలం పైసిస్ (ఫిబ్రవరి 20-మార్చి 20) ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో మీకొచ్చిన పనులు, నిపుణతలను మరొకరితో పంచుకుని, వారికి వచ్చిన వాటిని మీరు తెలుసుకోవడం వల్ల మీ శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. మీ నైపుణ్యం పెరుగుతుంది. రావలసిన డబ్బందుతుంది. ఇంటి ఆవరణలో మొక్కలు నాటండి, ఇంటిని పచ్చదనంతో నింపండి. అదృష్టం కలిసి వస్తుంది. కలిసొచ్చే రంగు: ఆకుపచ్చ టారో ఇన్సియా టారో అనలిస్ట్ రేకీ గ్రాండ్ మాస్టర్ సౌర వాణి ఏరిస్ (మార్చి 21- ఏప్రిల్ 20) ప్రయోజనాత్మకమైన ప్రయాణాలు చేస్తారు. అయితే ప్రయాణాల కాలంలో వస్తువుల భద్రత అతి ముఖ్యమని గ్రహించండి ఈ వారం. దాంతోపాటు వాహన ప్రయాణాన్ని మీరే గనక నడుపుతూ చేస్తున్న పక్షంలో నిదానించి ప్రయాణించండి. ప్రమాదమేమీ లేదుగానీ తగుమాత్రపు జాగ్రత తప్పనిసరి అని గ్రహించండి. టారస్ (ఏప్రిల్ 21-మే 20) వ్యవసాయదారులై న పక్షంలో అనాలోచితంగా పొలాలని తెగనమ్మకండి. ఇలా చేతికి ధనం వచ్చిన కారణంగా తాత్కాలికంగా కొత్త చిక్కులొచ్చే అవకాశం ఉంది. మీ పిల్లలు చదువుకునే దశలోనే ఉన్నట్లయితే మీరు వారి పక్కనే కూర్చుని మీకు మీరు చదువుకుంటూ వాళ్లని చదువుకునేలా చేయండి. జెమిని (మే 21-జూన్ 21) ఇష్టం లేని పని అయినప్పటికీ కుటుంబానికి శ్రేయోదాయకం కాబట్టి ఆ పనిలో భాగస్వాములు కావడం మంచిది. వృత్తి లేదా ఉద్యోగమే కాదు; కుటుంబంతో గడపడమూ అత్యవసరమని భావించండి. పొరపచ్చాలు పెద్దవి కాకుండా జాగ్రత్తపడండి. సంతానం విషయంలో ఎక్కువమొత్తం ఖర్చు చేయాల్సి రావచ్చు. మాటలో తేలిపోకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. క్యాన్సర్ (జూన్22-జూలై 23) ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న ధనం అందుతుంది. ఎంతో శ్రమతో సంపాదించిన ధనం తిరిగి మీకు చెందడాన్ని గొప్ప అదృష్టంగా భావిస్తారు. దానధర్మాలపట్ల, తీర్థయాత్రలకి వెళ్లాలనే ఊహాలపట్ల ఆసక్తి చూపిస్తారు. ఇతరుల్ని నిందించకండి పదిమందిలో. అది చిలవలు పలవలై మిమ్మల్ని ఇరకాటంలో పెట్టొచ్చు. లియో (జూలై 24-ఆగస్టు 23) ధైర్యసాహసాలే పెట్టుబడిగా పెట్టి చేసిన వ్యాపారంలో మీకు మంచి లాభం చేకూరే అవకాశముంది. ఇతరులకి ఏదైనా వాగ్దానాన్ని చేసి ఉన్నట్లయితే, వెంటనే దానిని నెరవేర్చండి. లేని పక్షంలో ఆ విషయాన్ని చెప్పెయ్యండి తప్ప నెత్తిమీదికి తెచ్చుకోకండి. ఇతరుల వస్తువుల్నీ సొమ్ముల్నీ మీ దగ్గర భద్రపరచలేనని చెప్పండి. వర్గో (ఆగస్టు24-సెప్టెంబర్ 23) అవసరాలు పోను అనూహ్యంగా కొంత ధనం చేతికందుతుంది. ఆ ధనానికి అప్పు చేసి మరీ మరికొద్ది ధనాన్ని చేర్చి ఇళ్లస్థలాన్ని లేదా పొలాన్ని కొనాలనుకుంటారు. అయితే తొందరపడి ఎక్కువ మొత్తం వెచ్చించకండి. వ్యవహారాన్ని తెగ్గొట్టుకోకుండా జాగ్రత్తగా బేరసారాలు చేసి, విజయాన్ని సాధించండి. లిబ్రా (సెప్టెంబర్ 24- అక్టోబర్ 23) ఆర్థికంగా కొద్దిగా బలహీనంగా ఉండచ్చు. ఇంటికి బంధువుల రాకపోకలు హెచ్చుగా ఉన్న కారణంగా విసుగ్గా, చికాకుగా అన్పించవచ్చు. జీవితంలో పట్టుదల, ప్రతీకారం, విద్వేషం... ఇవే మన ధ్యేయాలైన పక్షంలో మనశ్శాంతి అనే మాటే మనకి గగనకుసుమమౌతుందని భావించాలి. పెద్దల మార్గాన్ని అనుసరించడం శ్రేయస్కరమని గ్రహించండి. స్కార్పియో (అక్టోబర్ 24-నవంబర్ 22) దాంపత్య జీవితమనేది వాణిజ్యపు ఒప్పందంలా ఈ రాశిలోని కొందరి విషయంలో ఉండొచ్చు. అదే తీరుగా సంతానానికి తమ ఇల్లు ఓ విహారయాత్రాశాల లాగానో వినోదమందిరంగానో అన్పించవచ్చు. దాపరికం లేకుండా ఇంటివిషయాలని వివరించి చెప్పి, ఓ తీరు నమ్మకాన్ని కుటుంబ సభ్యులకి కల్గించడం ఈ వారంలో అవసరం. శాజిటేరియస్ (నవంబర్23-డిసెంబర్ 21) ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఎవరేమనుకున్నా నాకేమిటనే దృక్పథం పెరిగిపోతుంది. అయితే ఎదుటివారు తమ ఓటమిని అంగీకరించిన పక్షంలో వారికి దాసులయిపోయే వీరి స్వభావం వల్ల వారికి కీలుబొమ్మలుగా మారిపోతారు ఈవారంలో. ఇతరుల దృష్టిలో మీరు తండ్రిమాట వింటారనే పేరుంటుంది కానీ అది కేవలం పేరుకి మాత్రమే అని గ్రహించాలి. క్యాప్రికార్న్ (డిసెంబర్ 22-జనవరి 20) కుటుంబాన్ని మీ అదుపులో పెట్టుకుంటారు. ఇతరులకి సహాయపడటం మంచిదేకాని, వారికి సహాయపడే క్రమంలో ఇంటిని మరచిపోవ ద్దు. అన్నింటా మిమ్మల్ని విజయం వరించే ఈ వారంలో మీరు సంయమనంతో వ్యవహరించని పక్షంలో వ్యయమనేది మీ అంచనాలు మించవచ్చు. అప్పులు వద్దు ఈ వారంలో. అక్వేరియస్ (జనవరి 21-ఫిబ్రవరి 19) కలిసొచ్చే వారం ఇది మీకు. మీ బంధుజనంతో విందువినోదాలతో కాలక్షేపం చేస్తారు. మీ ఇంటి విషయాలని గూర్చిన ఆసక్తికర చ ర్చ జరిగి దానిలో కొత్త నిర్ణయాలు తీసుకుని, అభివృద్ధి పథాన సాగుతారు. దాంతోపాటు ఇందరు అండగా ఉన్నార నే మనోధైర్యాన్ని పొందుతారు. చర్మవ్యాధి విషయంలో నిర్లక్ష్యం తగదు. పైసిస్ (ఫిబ్రవరి 20-మార్చి 20) వ్యక్తిగత కీర్తిని గురించి మీరు ఆలోచించరు. చిన్న అవమానం జరిగినా పట్టించుకోరు ఈ వారంలో. అనుక్షణం మీ గురించి మీరు పట్టించుకునే లక్షణం ఉన్నకారణంగా కష్టాలు దాదాపు దరిచేరవు. అది సంతోషించదగ్గ పరిణామం. ఆధ్యాత్మిక బోధల్ని వింటూ మంచి రచనల్ని చదివే అలవాటున్న మీకు తాత్కాలికంగా వచ్చిన కష్టమనేది పెద్దగా బాధించదు. డా॥మైలవరపు శ్రీనివాసరావు సంస్కృత పండితులు -
రుణానికీ... కలహానికీ వెళ్లకండి
నవంబర్ 28 నుంచి డిసెంబర్ 3 వరకు టారో బాణి ఏరిస్ (మార్చి 21- ఏప్రిల్ 20) ఈ వారం చాలా అభివృద్ధికరంగా ఉంటుంది. వస్తు వాహనాలను. వివిధ రకాల గృహోపకరణాలను కొనుక్కుంటారు. సృజనాత్మకంగా ఆలోచిస్తారు. కళాత్మకంగా పని చేస్తారు. చేతినిండా డబ్బు వస్తుంది. హాయిగా, సంతోషంగా ఉంటారు. మీ అంతరాత్మ ప్రబోధానుసారం నడుచుకోండి. కలిసొచ్చే రంగు: ఆకుపచ్చ టారస్ (ఏప్రిల్ 21-మే 20) చాలాకాలంగా మిమ్మల్ని తికమక పెడుతూ, భయాందోళనలకు గురి చేస్తున్న వివిధ రకాల అంశాలపై మీకు ఒక స్పష్టత వస్తుంది. చేసిన పనికి ఫలితాన్ని తెలుసుకోవాలన్న ఆతృతలో ఉంటారు. ఎందుకంటే ఆ పనిని సక్రమంగా చేశానో లేదోనన్న అనుమానం మిమ్మల్ని పీడిస్తుంటుంది కాబట్టి. కలిసొచ్చే రంగు: మీగడ రంగు జెమిని (మే 21-జూన్ 21) విజయం మీ వెంటే ఉందని మీకు తెలుస్తోంది కాని, మీకు అందీ అందకుండా మిమ్మల్ని ఊరిస్తూ, మీ సహనానికి పరీక్ష పెడుతుంటుంది. మీ తండ్రి, భార్య లేదా భర్త, ఇతర కుటుంబ సభ్యులనుంచి మీరు ఎదురు చూస్తున్న సహకారం అందుతుంది. అయితే జీవితాన్ని యాంత్రికం చేసుకోవద్దు. కలిసొచ్చే రంగు: నీలం క్యాన్సర్(జూన్22-జూలై 23) జీవితంలో లేదా కుటుంబంలో ఒక విధమైన ప్రశాంతతను పొందుతారు. కెరీర్ పరంగా స్థిమిత పడ్డానన్న భావన మీకు ఊరటనిస్తుంది. ఎన్ని ఒడుదొడుకులు ఎదురైనా ప్రశాంతంగానే ఎదుర్కోగలిగే మార్గాన్ని కనిపెడతారు. అయితే జీవితమనేది అనుభవించడానికి కూడా అనేదాన్ని గ్రహించండి. కలిసొచ్చే రంగు: నారింజ లియో (జూలై 24-ఆగస్టు 23) ప్రేమకోసం... జీవితంలో మీరు పొందాలనుకున్న ప్రేమకోసం తీవ్ర అన్వేషణ సాగిస్తారు. ఒకవేళ మీరు ఎదురు చూడకపోయినా, మీ ప్రేమకోసం ఎదురు చూస్తున్నానని ఒకరు చె ప్పడం మీకు ఆశ్చర్యాన్నిస్తుంది. ఏది ఏమైనా ఇది మీ జీవితంపై ప్రభావం చూపే పరిణామం అని గ్రహించండి. కలిసొచ్చే రంగు: దొండపండు రంగు వర్గో (ఆగస్టు24-సెప్టెంబర్ 23) ఏది మంచిదో తెలుసుకోలేని తికమకలో ఉన్నారు మీరు. ఈ సమయంలో ఎవరైనా మీకు సలహా ఇవ్వడం లేదా మార్గదర్శనం చేస్తే బాగుండునని ఎదురు చూస్తుంటారు. అయితే అందరికీ అన్ని విషయాలూ తెలుసునని భ్రమపడవద్దు. మీ మనసులోని మాటను మీరే చెబుతారని మీ ప్రేమికులు ఎదురు చూస్తుంటారు. కలిసొచ్చే రంగు: నారింజ లిబ్రా (సెప్టెంబర్ 24- అక్టోబర్ 23) ప్రస్తుతం మీకు ఎదురవుతున్న రకరకాల పరిణామాల దృష్ట్యా మీరు నిర్మించుకున్న కలల సౌధం కూలిపోతుందేమోనని భయపడుతుంటారు. ఈ పరిస్థితుల్లో ఏమి చేయాలో తెలియని గందరగోళంలో పడతారు. అయితే మీ అంతరాత్మ చెప్పిన విధంగా నడుచుకోవడం మంచిది. కలిసొచ్చే రంగు: నలుపు స్కార్పియో (అక్టోబర్ 24-నవంబర్ 22) మీ చిరకాల కోరిక నెరవేరుతుంది. చాలా కాలంగా మీరు అనుభవిస్తున్న గడ్డు పరిస్థితుల నుంచి బయట పడతారు. ఇప్పటి నుంచి అదృష్టకరమైన సమయంగా భావించవచ్చు. జీవితంపై కొత్త ఆశలు చిగురిస్తాయి. ప్రేమ/ ఉద్యోగం/ కెరీర్/ ప్రయాణం కోసం ఎదురు చూస్తుంటే గనక ఆలస్యం చేయవద్దు. కలిసొచ్చే రంగు: ఎరుపు శాజిటేరియస్(నవంబర్23-డిసెంబర్ 21) మీకు రావలసిన దానికోసం లేదా జరగవలసిన దానికోసం చాలా ఆశగా ఎదురు చూస్తూ ఉండి ఉంటారు. విజయమనేది మనం చేసినదాన్ని బట్టి కొంత, అదృష్టాన్ని బట్టి కొంత ఉంటుందని గ్రహించండి. అధికారాన్ని దుర్వినియోగం చేయవద్దు. సాయం చేస్తానన్న వారిపై ఎక్కువ భారాన్ని వేయవద్దు. కలిసొచ్చే రంగు: పసుప్పచ్చ క్యాప్రికార్న్ (డిసెంబర్ 22-జనవరి 20) కొత్త అవకాశాలు వస్తాయి. ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడానికిది మంచి సమయం. ఆత్మవిశ్వాసాన్ని సడలనివ్వద్దు. జీవితమనే నౌక ఎటు తిప్పితే అటు తిరుగుతూ, ఎక్కడికి తీసుకెళితే అక్కడికి చేరడమే జీవితమంటే! మీ భాగస్వామికి మీ సహాయ సహకారాలు అవసరమని తెలుసుకోండి. కలిసొచ్చే రంగు: గోధుమ రంగు అక్వేరియస్(జనవరి 21-ఫిబ్రవరి 19) ఒంటరిగా గడపడానికి ఇది తగిన సమయం. ఒంటరితనంలోని ఆనందాన్ని, ప్రశాంతతను అనుభవించండి. మిమ్మల్ని వేధిస్తున్న సమస్యలకు, ప్రశ్నలకు సమాధానం లభిస్తుంది. అయితే తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. మానసికంగా, శారీరకంగా బాగుండకపోతే నిర్లక్ష్యం చేయవద్దు. కలిసొచ్చే రంగు: పాచిరంగు పైసిస్(ఫిబ్రవరి 20-మార్చి 20) మరీ యాంత్రికంగా తయారు కావద్దు. జరిగేదేదో జరగనివ్వండి, ఆందోళన పడకండి. మీ మనసును కలుషితం చేయడానికి, మీ భావోద్వేగాలను దెబ్బతీయడానికి ఇతరులకు అవకాశం ఇస్తున్నారని తెలుసుకోండి. వారికి ఆ అవకాశం ఇచ్చి, తిరిగి వారిని నిందించడం సరికాదు. కలిసొచ్చేరంగు: వంకాయరంగు టారో ఇన్సియా టారో అనలిస్ట్ రేకీ గ్రాండ్ మాస్టర్ సౌర వాణి ఏరిస్(మార్చి 21- ఏప్రిల్ 20) గ్రహ ప్రభావం కారణంగా బంధుమిత్రులతోనూ, సహోద్యోగులతోనూ అకాల శత్రుత్వం కలిగే అవకాశం కనిపిస్తోంది. జాగ్రత్తగా ఉండడం, నిష్కారణంగా నింద వస్తే అనుభవించడమే తప్ప, ఎదురు తిరిగి సాధించుకోగల కాలం కాదిది. అలాగని మరీ మౌనంగా ఉండమని భావం కాదు. ‘కరవద్దు గాని బుస్సుమనకుండా కూడా ఉండొద్దు’ అని దీనర్థం. టారస్ (ఏప్రిల్ 21-మే 20) మీరు చేస్తున్న ఉద్యోగంలో గాని వ్యాపారంలోగాని మీకు ఓ తీరు విసుగూ అసంతృప్తీ పుట్టే కాలం కావచ్చు. అంతమాత్రాన దీన్ని విడిచేయవద్దు. మరో చోటికి ఉద్యోగానికి వెళ్తే అక్కడ ఇంతకంటే జటిలమైన పరిస్థితులు ఎదురు కావచ్చు. కాబట్టి ఉన్న ఉద్యోగంలోనే సంతోషాన్నీ పైవాళ్ల విశ్వాసాన్నీ పొందడం మంచిది ప్రస్తుతం. జెమిని (మే 21-జూన్ 21) మొహమాటం... బద్ధకం... కొత్త ప్రదేశానికి వెళ్తే ఎలా ఉంటుందో అనే సంకోచం వల్ల- కొత్త ప్రదేశంలో ఉద్యోగం చేయడానికి కదలరు. కుటుంబానికి ఆప్తులయిన ఎవరో ఒకరు మీ స్థిరాస్తి మీద ఓ కన్నేసి ఉంచిన కారణంగా పూర్తి దురుద్దేశ్యంతో కొత్త ఆలోచనని రేకెత్తింప జేస్తారు. గమనించండి. జాగ్రత్తపడండి. క్యాన్సర్(జూన్22-జూలై 23) లౌకిక ప్రయత్నాల వల్ల ఫలితం లేదని గ్రహించి, వయసుల తారతమ్యాన్ని విడిచి పూజాపురస్కారాల ధోరణికి వచ్చేస్తారు. దంపతుల్లో ఒకరు ఉద్యోగరీత్యా లేదా మరే కారణంగా గాని ఒక పదిరోజుల పాటు వేరే ప్రదేశంలో ఉండే అవకాశం ఉంది. అక్కడి వాతావరణం, మనుషుల ప్రభావం లేకుండా చూసుకోగలగాలి. విందు వినోదాలతో రోజులు గడుపుతారు. లియో(జూలై 24-ఆగస్టు 23) భార్యాభర్తలు వినోద యాత్ర లేదా తీర్థయాత్ర చేస్తారు. కుటుంబంలోని ఐకమత్యంలో ఉండే ఆనందాన్ని అనుభవిస్తారు. సంతానం అభివృద్ధికి సంబంధించిన వార్తల్ని వింటారు. ఉద్యోగంలో ఉన్నతిని లేదా వేతనాభివృద్ధిని పొందుతారు. వచ్చే పోయే బంధుమిత్రులకి మన ఇంటి విషయాలని చె ప్పాల్సిన అవసరం లేదనే యథార్థాన్ని గుర్తు చేసుకుంటారు. వర్గో(ఆగస్టు24-సెప్టెంబర్ 23) ఓ పద్ధతీ క్రమం లేకుండా సొమ్ము అనవసరంగా ఖర్చయ్యే పరిస్థితి గోచరిస్తోంది. ముందు జాగ్రత్త అవసరం. పొరపాటున కూడా ఈ మాసంలో రుణానికీ అలాగే కలహానికీ వెళ్లకండి. అది దీర్ఘకాల వ్యాధిలా మారే అవకాశముంది. మీ ఉద్యోగంలో మరో శాఖకి లేదా మరో ప్రదేశంలోని కార్యాలయానికో బదిలీ అవుతారు. అధికారులతో విరోధించకండి. లిబ్రా (సెప్టెంబర్ 24- అక్టోబర్ 23) మీరు చేసే ప్రయత్నాలన్నీ పైకి విజయవంతమైనట్లు మీరు భావించవచ్చేమో గాని అవన్నీ కరిమింగిన వెలగపండు చందమే అని గ్రహించండి. ప్రస్తుత దశ పెద్దగా యోగించేది కానందువల్ల విరోధానికీ కలహాలకీ సంబంధించిన ప్రయత్నాలు చేసినా అపకీర్తీ ఆందోళనా తప్ప ప్రయోజనం ఉండదు. పట్టుదలని విడిస్తే మంచిది. స్కార్పియో (అక్టోబర్ 24-నవంబర్ 22) నిష్కారణంగా ఇబ్బందికి గురై దాదాపు ఏడాదిన్నర నుండీ అనుభవిస్తున్న మనోవేదన నుంచి కొంత సాంత్వన కలుగుతుంది. మీ నిజాయితీ, ధైర్యం, వీటికి తోడుగా మీ దైవారాధన శక్తి మీకు అండగా నిలుస్తాయి. ఎన్ని ఇబ్బందులున్నా, గురుగ్రహం అండగా ఉన్న కారణంగా ఉద్యోగాన్ని సక్రమంగా చే స్తున్నారు, చేస్తారు కూడా. దిగులు పడకండి. శాజిటేరియస్ (నవంబర్23-డిసెంబర్ 21) చేసిన- చేపట్టిన పనుల్లో విజయావకాశాలు మెండు. కుటుంబ, కార్యాలయ పనుల్లో మీ ప్రతిభని మీరు చాటుకున్నా, ఆరోగ్య విషయంలో తగినంత శ్రద్ధని చూపించడం లేదని గ్రహించండి. మీ జీతానికి మించిన శ్రమపడే మీరు మీ జీవితారోగ్యాన్ని గురించి ఎందుకు పట్టించుకోవడం లేదో మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. ఇబ్బంది పొంచి ఉంది తస్మాత్ జాగ్రత్త! క్యాప్రికార్న్ (డిసెంబర్ 22-జనవరి 20) ఒత్తిడిని తగ్గించుకోవడం కోసం విహార యాత్ర చేసే అవకాశం ఉంది. వ్యాపారాన్ని పెంచే దిశగా ఆలోచించడంలో కొద్ది జాప్యం జరుగుతూ ఉండొచ్చు. మీకు సహాయకులుగానూ, భాగస్వాములుగానూ ఉన్న ఈ సిబ్బందిలో ఏ ఒక్కరు మిమ్మల్ని వ్యతిరేకించినా నడుపుకోగల సమర్థతని సంపాదించుకోవడానికి తీవ్ర కృషి అవసరం. అక్వేరియస్ (జనవరి 21-ఫిబ్రవరి 19) కొనుగోళ్లూ అమ్మకాలూ అనేవి ఆస్తి విషయాల్లో సర్వసాధారణం. మనవాళ్లే కదా అనే భరోసాతో మీరు కొన్ని ముఖ్యపత్రాల విషయంలో అశ్రద్ధని చేయవద్దు. వ్యవహారంలో బంధుత్వానికి చోటు లేదు. శరీరానికి చర్మవ్యాధిగాని, ఇబ్బంది పెట్టే జలుబు గాని వచ్చే అవకాశం ఉంది కాబట్టి ముందు జాగ్రత్త మంచిది. పైసిస్(ఫిబ్రవరి 20-మార్చి 20) మీకు ప్రస్తుతం జరుగుతున్నది శిక్షణ తరగతి వంటి పరిస్థితి. ఏ కుటుంబ సభ్యుల ఉద్దేశ్యం ఎటువంటిదో, ఏ మిత్రులు దేన్ని మీ నుండి ఆశిస్తున్నారో, మీరు ఏ దిశగా ప్రయాణించాలని వీరంతా ఓ ప్రణాళికని వేశారో అర్థం చేసుకోండి. ఈ అందరినీ గమనించుకోండి తప్ప, ఎవరినీ వేలెత్తి చూపే గ్రహ అనుకూల దశ ప్రస్తుతానికి మీకు లేదని గ్రహించండి. డా॥మైలవరపు శ్రీనివాసరావు సంస్కృత పండితులు -
అనవసర ఆడంబరాలకు పోవద్దు
సెప్టెంబర్ 19 నుంచి 25 వరకు టారో బాణి ఏరిస్ (మార్చి 21- ఏప్రిల్ 20) కొత్త అవకాశాలు వస్తాయి. మీ లక్ష్యాలు, ఆశయాలు నెరవేరే రోజు దగ్గరలోనే ఉంది. కొన్ని బంధాలు విసుగు పుట్టిస్తాయి. కొత్త ఉద్యోగానికి మారే ముందు మీరు ప్రస్తుతం ఉన్నదే మెరుగుపడే అవకాశం ఉందేమో చూసుకోండి. ఇల్లు మారతారు లేదా కొత్త ఇంటి కలను నెరవేర్చుకునే మార్గాన్ని అన్వేషిస్తారు. పాజిటివ్‌గా ఆలోచించండి. కలిసొచ్చే రంగు: పీచ్ టారస్ (ఏప్రిల్ 21-మే 20) ఇంతవరకూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన విషయాలే ఇప్పుడు మీకు చాలా సులభమనిపిస్తాయి. రిలాక్స్డ్గా అనిపిస్తుంది. ఫిట్నెస్ మీద శ్రద్ధ పెడతారు. కొత్త ప్రాజెక్టుల గురించి కలలు కంటారు. వాటిని నెరవేర్చుకునే దిశగా అడుగులు వేస్తారు కూడా. ప్రేమ ఫలిస్తుంది. కలిసొచ్చే రంగు: బ్లూ షేడ్ ఆధ్యాత్మికంగా మీరు చాలా ఉన్నతికి చేరతారు. మీరు చేయాలనుకున్న వాటిని ప్రశాంతంగా చేస్తారు. పింక్ కలర్ దుస్తులు, యాక్సెసరీస్‌ను ధరించడం వల్ల మరింత అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తారు. కొత్త పెట్టుబడులు పెడతారు. మరింత డబ్బును ఆర్జిస్తారు. కలిసొచ్చే రంగు: పింక్ జెమిని (మే 21-జూన్ 21) విజయం మీకు చేరువలోనే ఉంది. స్థిరాస్తికి, డబ్బుకు సంబంధించిన వ్యవహారాల్లో గట్టి నిర్ణయం తీసుకోవలసిన అవసరం కనిపిస్తోంది. ఇతరుల సలహాను వినండి, మీ వంతు నిర్ణయాన్ని తీసుకోండి కానీ, గుడ్డిగా నమ్మవద్దు. ఉద్యోగంలో లేదా మీ పనిప్రదేశంలో మార్పునకు అవకాశం కనిపిస్తోంది. కలిసొచ్చే రంగు:ఎల్లో క్యాన్సర్ (జూన్22-జూలై 23) అహాన్ని అదుపులో పెట్టి, శ్రేయోభిలాషులు చెప్పిన మాటను చెవిన వేసుకోండి. నలుపు దుస్తులను ధరించడం ద్వారా మీరు అహంకారులు కారని చాటుకోండి. వాహన యోగం కనిపిస్తోంది. మీరు కన్న కొన్ని కలలు మీకు నిద్రను దూరం చేస్తాయి. అయితే ఆ కలలను సాకారం చేసుకునే ప్రయత్నం చేయండి. కలిసొచ్చే రంగు: బ్లాక్ లియో (జూలై 24-ఆగస్టు 23) విజయం మీ తలుపు తడుతుంది. కొన్ని మార్పులు జరగవచ్చు. పనివిషయంలో మంచి ఉత్పాదకతను సాధిస్తారు. కష్టపడి పని చేసే మీ తత్వమే మీ లక్ష్యాలను చేరుకునేలా చేస్తుంది. దురలవాట్లను వదిలి, మంచివాటిని అలవరచుకోవలసిన తరుణమిది. సూర్యనమస్కారాలు లేదా సన్ యోగా చేయడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.. కలిసొచ్చే రంగు: గోల్డ్ వర్గో (ఆగస్టు24-సెప్టెంబర్ 23) ఈ వారం మీరు చాలా ఆనందంగా ఉంటారు. మీ లక్ష్యాలను చేరుకునేందుకు ఒక స్త్రీ సహాయం లభిస్తుంది. చేతినిండా డబ్బు వస్తుంది. ఒక విషయంలో మీరు గట్టి నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. ప్రయాణ సూచనలున్నాయి. రొటీన్ నుంచి బయట పడి, విశ్రాంతిగా గడపవలసిన తరుణమిది. కలిసిచ్చే రంగు: ఆరంజ్ లిబ్రా (సెప్టెంబర్ 24- అక్టోబర్ 23) ఈ వారం మీకు అదృష్టకరంగా ఉంటుంది. మీ ప్రతిభకు, సామర్థ్యానికి తగిన గుర్తింపు లభిస్తుంది. ఆర్థికంగా లోటు లేకుండా గడుస్తుంది. ప్రేమలో ఓటమి ఎదురు కావచ్చు. అనవసరంగా అహానికి పోయి లేనిపోని చిక్కులు తెచ్చుకోవద్దు. కలిసొచ్చే రంగు: ఆరంజ్ స్కార్పియో (అక్టోబర్ 24-నవంబర్ 22) ఊహించని గొప్ప అవకాశమొకటి మీ తలుపు తడుతుంది. దాన్ని వీలైనంత త్వరగా అందిపుచ్చుకుని పనిలో దిగండి. ఎప్పటి నుంచో ఉన్న ఓ బలమైన కోరిక నెరవేరుతుంది. గతంలో మీ జీవితంలో ఉండి వెళ్లిన ఓ వ్యక్తి మీకు మళ్లీ తారసపడతారు. వారితో మీ బంధాన్ని పునరుద్ధరించుకోవాలని మీరు ప్రయత్నిస్తారు. కలసివచ్చే రంగు: క్రీమ్ శాజిటేరియస్ (నవంబర్23-డిసెంబర్ 21) మీ ప్రేమ, వ్యక్తిగత జీవనం మిమ్మల్ని అయోమయంలో పడేస్తాయి. ముందు పెళ్లి చేసుకోవాలా లేక ఇల్లు కొనుక్కోవాలా? ఏది ముందు? ఏది వెనకో తెలియక కొంచెం తికమక పడతారు. ఆహారం విషయంలో కఠోరంగా వ్యవహరించక తప్పదు. ఖర్చులు అదుపులో ఉంచుకోండి. ఎక్సర్సైజులు చేయండి. కలిసొచ్చే రంగు: ఆలివ్ గ్రీన్ క్యాప్రికార్న్ (డిసెంబర్ 22-జనవరి 20) మీ పనిలో విజయం సాధిస్తారు. అధికారంలోకి రావడానికి, మీ ఉనికిని చాటుకోవడానికీ తగిన పనులు చేపడతారు. పెట్టుబడులకు ఇది మంచి సమయం. జీవిత భాగస్వామితో కలతలు రేగకుండా జాగ్రత్త పడండి. అనవసరంగా వాదోపవాదాలకు దిగకండి. వాదనలు పెట్టుకున్నారంటే వివాదాలు తెచ్చిపెట్టుకున్నట్లే. కలిసొచ్చే రంగు: ఆరంజ్ అక్వేరియస్ (జనవరి 21-ఫిబ్రవరి 19) మీరేమిటో, మీ సత్తా ఏమిటో నిరూపించుకోవలసిన వారమిది. మీరు ఏమీ తెలియని వారు, అమాయకులు అనుకున్న వారు మిమ్మల్ని చూసి షాకయ్యేవిధంగా ప్రవర్తిస్తారు. మనసులో ఒకటి, బయటికి ఒకటి అన్నట్లుగా ప్రవర్తించే అవకాశం ఉంది. అయితే మీలో ఆత్మవిశ్వాసం పెరగడం వల్ల అన్నింటినీ అధిగమిస్తారు. కలిసొచ్చే రంగు: పర్పుల్ సౌర వాణి చేసే వృత్తి ప్రోత్సాహకరంగా ఉంటుంది. తోటి ఉద్యోగులు సహకరించే అవకాశం ఉంది. వ్యాపారం క్రమక్రమంగా పుంజుకుంటుంది. బంధువులు సకాలంలో తగు సహాయాన్ని చేసి ఆదుకునే స్థితి గోచరిస్తోంది. ఆదాయం లేని స్థిరమైన ఆస్తిని అమ్మేసే ఆలోచన రావచ్చు. దాన్ని కొద్దికాలం వాయిదా వేయండి. చదువుల నిమిత్తం కొంత పొదుపు అవసరం. అకస్మాత్తుగా వచ్చిపడే ఖర్చులతో మీరు బాధపడుతుంటే, మీ నుంచి రుణాన్ని కోరినవారు, మీరు ఇవ్వలేదంటూ నిందవేసే అవకాశం ఉంది. అటువంటివారిని ఉపేక్షించకుండా ధైర్యంగా సమాధానమివ్వండి. ఉదాసీనంగా వ్యవహరించవద్దు. అపరిచితులకు మాట సాయాన్ని కూడా చేయకండి. తాత్కాలికంగా గ్రహాల ప్రతికూల సంచారం జరుగుతోంది. ఏదో మాట్లాడుతున్న వంకతో బంధువులకీ, మిత్రులకు మీకు కావలసిన రుణాన్ని గురించి వివరించండి. మీతో నిజమైన బాంధవ్యం, మైత్రీ నెరపేవారెవరో, అభిమానించేవారు ఎవరో మీకు మీరుగా గ్రహించుకోండి. మీ సంతానం యొక్క బుద్ధి విద్యారంగంలో మరింత చురుకుగా, ఉత్సాహంగా ఉంటుందని గమనించండి. బాగా ఆలోచించి ఓ నిర్ణయానికొచ్చి, ఓ ప్రణాళికను ఏర్పాటు చేసుకోగానే మొత్తం ప్రణాళికని మార్చవలసిన అవసరం వస్తుంది. ఈ స్థితి మొత్తం తాత్కాలిక శారీరక అనారోగ్యానికి సాక్ష్యం తప్ప మరోటి కాదు. మీ అత్తమామలూ, తలిదండ్రులూ సఖ్యతతో గడుపుతారు. ఉద్యోగం ఎప్పుడు పోతుందా అనే మనోవేదనతో ఉండకండి. ఆ అవసరం ఇప్పట్లో లేదు. ధనార్జనకి లోటుండదు గానీ, అధిక శ్రమమీద లభిస్తుంది. ఒకప్పుడు ఎంత తేలిగ్గా సొమ్ము ఆర్జించారో, అదే సొమ్ముని ఆర్జించడానికి నేడు పడే శ్రమ మీకు తెలియడం జీవితంలో చక్కని మలుపు. మీకు తెలియకుండానే పొదుపరితనం అలవడుతుంది. కుటుంబ వ్యక్తుల సంపూర్ణ సహకారం లభిస్తూ, ఆర్థిక విషయాల్లో మీకు మరింత అనుకూలించడం మీ అదృష్టం. ఎంత ప్రయత్నించినా మీ ఖర్చులను మీరు నియంత్రించుకోలేని పరిస్థితి కన్పిస్తోంది. ఉన్నంతలోనే జాగ్రత్తగా ఖర్చు చేయండి తప్ప రుణాలను చేయనేవద్దు. ఆడంబరం, ఆర్భాటమనేవే మధ్యతరగతి సంసారాలని పాతాళానికి పడేసే భూకంపాలు. బంధుమిత్రులపై ఆధారపడకుండా మీ ప్రయత్నాలను మీరే చేసుకోండి, విజయం పొందుతారు. జీవిత భాగస్వామితో విరోధం ఉన్నట్లయితే, మధ్యవర్తులతో, ఉత్తరప్రత్యుత్తరాలతో కాలక్షేపం చేయకుండా నేరుగా వెళ్లి వారితో మాట్లాడుకుని, పరిస్థితిని సానుకూలపరచుకోవడం సరైన కర్తవ్యం. పట్టుదలకైనా ఓ సడలింపు ఉండడం మంచిదని గ్రహించండి. లేనిపక్షంలో పరిస్థితి మీ చేతినుండి అదుపుతప్పి తీరుతుంది. ఒకప్పుడు మీకున్న పట్టుదలా, కోపమూ పూర్తిగా తొలగిపోయి శాంతంగా మారిపోతారు. బంగారంలో మాలిన్యం తొలగినట్లు మేలిమి బంగారమైనట్లు ఉంటారు మీరు. ధైర్యంగా ఉంటే చిక్కుముడులన్నీ క్రమంగా వీడిపోతాయి. వ్యవసాయ రంగంలోని వారికి, పరిశ్రమల రంగంలోని వారికి ఆర్థికంగా కొంత ఇబ్బంది అన్పిస్తుంది. మీరు చేస్తున్న వృత్తిలో మీ ప్రతిభ గుర్తించబడి మీ స్థానం పెరుగుతుంది. ఇప్పుడే మీరు జాగ్రత్తగా ఉండాలి. పై అధికారులు మిమ్మల్ని ప్రశంసిస్తున్నారనిపించగానే యాజమాన్యానికి సంబంధించిన విషయాల్లోకి వెళ్లి సలహాలూ, సూచనలూ ఇవ్వద్దు. శారీరక శ్రమ ఎక్కువగా ఉండే కారణంగా అనారోగ్యం కలిగే ప్రమాదం ఉంది. జాగ్రత్తగా ఉండండి. పని ఒత్తిడిమూలంగా మీరు తీసుకునే తాత్కాలిక నిర్ణయాల కారణంగా కుటుంబ వ్యక్తులు సంతృప్తికరంగా ఉండకపోవచ్చు. కుటుంబసభ్యులను పట్టించుకోవడం అవసరమని గ్రహించండి. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఏదో ఎర చూపించి ఉద్యోగాలు ఇప్పిస్తానంటే, ఎంత పెద్దవారినైనా నమ్మవద్దు. తొందర్లోనే ఉద్యోగం లభిస్తుంది. సంతానం చేస్తున్న ఖర్చులని ఓమారు జాగ్రత్తగా సరిచూసుకోవడం ఎంతైనా అవసరం. తల్లిదండ్రుల్ని మీరు మీ దగ్గరుండి చూసుకుని ఆనందపరచండి లేదా వీలుచేసుకుని ఓరోజు వాళ్ల దగ్గర ఉండి రండి. వాళ్ల ఆశీస్సులు మీకు పరిష్కార మార్గాలవుతాయి. మీకున్న సమస్యలకు ఏ సందర్భంలోనూ ఎటువంటి పరిస్థితిలోనూ న్యాయస్థానపు తలుపు తట్టవద్దు. మీ విషయాల్ని వేరే వ్యక్తుల నుండి తెలుసుకుని, మీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ, మీతో చనువు పెంచుకుంటున్న వ్యక్తుల్ని విశ్వసించకండి. మీ సమస్యలను వారికి చెప్పకండి. మీ కుటుంబానికి ఆప్తులూ, పట్టుదలకు పోనివారు అయిన వ్యక్తుల ద్వారా సమస్య పరిష్కారానికి ప్రయత్నించండి. నూటికి 60 శాతం అనుకూలించే అవకాశం వుంది. -
ఆచితూచి అడుగేయండి
సెప్టెంబర్ 12 నుంచి 18 వరకు టారో బాణి ఏరిస్ (మార్చి 21- ఏప్రిల్ 20) సంతోషకరమైన సమయం రానుంది. అన్ని విషయాల్లోనూ దృఢచిత్తంతో ఉండండి. ప్రశంసలు, బహుమానాలు, ఇంక్రిమెంటులు పొందే సమయం ఇది. మీకు, మీ భాగస్వామికి మధ్య అప్యాయతానురాగాలు ఇనుమడిస్తాయి. వారమంతా దాదాపు ప్రశాంతంగానే గడుస్తుంది. మరింత ప్రశాంతత కోసం ధ్యానం చేయండి. కలసివచ్చే రంగు: తెలుపు టారస్ (ఏప్రిల్ 21-మే 20) ఓపికగా ఉండటం అవసరం. ఏ పని చేసినా లాభనష్టాలను బేరీజు వేసుకోండి. ఏం చేయొచ్చో, ఏం చేయకూడదో ప్రాక్టికల్‌గా ఆలోచించి చేయండి. మీలోని సృజనాత్మకతను వెలికి తీయడానికి ఇదో గొప్ప తరుణం. బాంధవ్యాలు సంతోషాన్ని కలిగిస్తాయి. కాకపోతే చిన్నపాటి అనారోగ్యాలు విసిగించే అవకాశం ఉంది. కలసివచ్చే రంగు: వంకాయ రంగు జెమిని (మే 21-జూన్ 21) ఇది మీకు కీలక సమయం. మీలోని నాయకత్వ లక్షణాలను బహిర్గత పర్చాల్సిన తరుణం. సమస్యలను ఛేదించడానికి సమాయత్తమవ్వండి. మీలో ఆధ్యాత్మిక ఆలోచనలు కూడా పెరుగుతాయి. కొత్త వాహనాన్ని కొంటారు. కొత్త ప్రాజెక్టులు చేపడతారు. కలసివచ్చే రంగు: కాషాయం క్యాన్సర్ (జూన్22-జూలై 23) ఈ వారం మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. మీ ఆలోచనలు సంచలన విజయాలను రుచి చూపిస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు లాభిస్తాయి. వృత్తిపరంగా దూసుకుపోతారు. వ్యక్తిగత జీవితంలో ఉన్న సమస్యలు కూడా పరిష్కార దశకు చేరుకుంటాయి. కలసివచ్చే రంగు: పసుపు లియో (జూలై 24-ఆగస్టు 23) కొత్త ప్రదేశాలు చూడటానికి, మీ కలలు నెరవేర్చుకోవడానికి, లక్ష్యాలు అందుకోవడానికి కూడా ఇది తగిన సమయం. కొత్తగా ప్రారంభించే వ్యాపారాలు లాభాల బాట పట్టిస్తాయి. అయితే కొన్ని బంధాల విషయంలో అభద్రతాభావానికి లోనవుతారు. దక్షిణ దిశలో రెండు ఎరుపురంగు కొవ్వొత్తులను వెలిగించి పెడితే మంచి జరుగుతుంది. కలసివచ్చే రంగు: గులాబి వర్గో (ఆగస్టు24-సెప్టెంబర్ 23) ఎప్పటినుంచో అనుకుంటోన్న కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. మీ తెలివితేటలు మిమ్మల్ని విజయం వైపు నడిపిస్తాయి. అయితే ఆలోచనలను అమలకు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రేమ వ్యవహారాలు చేదును మిగల్చవచ్చు. మీకు తగిన వ్యక్తి తప్పకుండా వస్తారన్న నమ్మకంతో ఆ బాధను అధిగమించండి. కలసివచ్చే రంగు: సీ గ్రీన్ లిబ్రా (సెప్టెంబర్ 24- అక్టోబర్ 23) వృత్తిపరంగా ఒడిదుడుకులు వస్తాయి. చేసే పనిలో నిరాసక్తత ఏర్పడుతుంది. ఓ మంచి అవకాశం చేజారిపోతుంది. మరో నెల రోజుల్లో మంచి సమయం వస్తుంది, కాబట్టి నిరుత్సాహపడకండి. మీ ఆఫీసులో ఉత్తరం వైపున గోల్డ్‌ఫిష్ ఉన్న బౌల్‌ని పెట్టుకుంటే పరిస్థితులు మెరుగుపడటంతో పాటు ఆర్థికంగా బలోపేతమవుతారు. కలసివచ్చే రంగు: లేత నారింజరంగు స్కార్పియో (అక్టోబర్ 24-నవంబర్ 22) ఈవారం చాలావరకూ విహార, వినోదయాత్రలతో కాస్త సరదాగానే గడిచిపోతుంది. డబ్బులు బాగానే ఖర్చు చేస్తారు. మీ కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో కొద్దిగా విసుగులు చోటు చేసుకుంటాయి. చిన్న చిన్న విషయాలకే మనసు కష్టపెట్టుకోకండి. కలసివచ్చే రంగు: చాకొలెట్ బ్రౌన్ క్యాప్రికార్న్ (డిసెంబర్ 22-జనవరి 20) పని చేసే చోట మీతోపాటు మీ స్నేహితుడు కూడా కష్టాలను ఎదుర్కొంటారు. మీ ఇద్దరి మధ్య పొడసూపిన అపార్థాల వల్లే ఆ కష్టాలు వస్తాయి. ఆర్థికంగా బలపడతారు కానీ అది మెల్లగా జరుగుతుంది. మీ జీవిత భాగస్వామికి మీ పట్ల ఉన్న ప్రేమ రెట్టింపవుతుంది. తనతో గడిపే మధుర క్షణాలను ఆనందమయం చేసుకోండి. కలసివచ్చే రంగు: సన్‌షైన్ యెల్లో అక్వేరియస్(జనవరి 21-ఫిబ్రవరి 19) ఊహించని గొప్ప అవకాశమొకటి మీ తలుపు తడుతుంది. దాన్ని వీలైనంత త్వరగా అందిపుచ్చుకుని పనిలో దిగండి. ఎప్పటి నుంచో ఉన్న ఓ బలమైన కోరిక నెరవేరుతుంది. గతంలో మీ జీవితంలో ఉండి వెళ్లిన ఓ వ్యక్తి మీకు మళ్లీ తారసపడతారు. వారితో మీ బంధాన్ని పునరుద్ధరించుకోవాలని మీరు ప్రయత్నిస్తారు. కలసివచ్చే రంగు: గోల్డెన్ బ్రౌన్ పైసిస్ (ఫిబ్రవరి 20-మార్చి 20) పెద్దమొత్తంలో లాభాలు వచ్చే సమయం. విజయం మీకు దగ్గరలోనే ఉంది. దాన్ని అందిపుచ్చుకోవాలంటే మీలోని సృజనాత్మకతను వెలికి తీయాల్సిన అవసరం ఉంది. విద్యార్థులకు కూడా ఇది కలసివచ్చే సమయం. నిజాయతీగా ఉండే ఓ వ్యక్తితో ప్రేమలో పడతారు. మీకు తనపై ఉన్న నమ్మకం, ప్రేమలను మరింత బలపర్చుకోండి. కలసివచ్చే రంగు: లేత గులాబి ఇన్సియా కె. టారో అండ్ ఫెంగ్‌షుయ్ అనలిస్ట్, న్యూమరాలజిస్ట్ సౌర వాణి ఏరిస్ (మార్చి 21- ఏప్రిల్ 20) మీ మాట నేర్పరితనం, నిజాయితీల వల్ల శత్రుబాధ తొలగుతుంది. కుటుంబంలో ఐకమత్యం కారణంగా మానసికమైన ఒత్తిడి తగ్గుతుంది. మరింత బలంగా కనిపిస్తున్న రవి (సూర్యగ్రహం) మీకు కొత్తవైన ఆలోచనలనిస్తూ సాధారణ పరిస్థితులను తెచ్చేస్తాడు. అనుభవజ్ఞులూ, పెద్దలూ అయినవారి పరిచయాలను పొందే కారణంగా సుఖంగా గడుపుతారు. టారస్ (ఏప్రిల్ 21-మే 20) అనుకోకుండా వ్యయం నెత్తినపడే కారణంగా ఆర్థికమైన అంచనాలు తప్పుతూ కొంత మానసికమైన వ్యధకి గురికావచ్చు. ముందుజాగ్రత్తతో వ్యవహరించడం మంచిది. కుజుని మార్పు కన్పిస్తున్న కారణంగా మనస్తాపపడే సందర్భాలు రావచ్చు. కాబట్టి తొందరపడి మాట అనవద్దు, అనిపించుకునే పరిస్థితి తెచ్చుకోవద్దు. జెమిని(మే 21-జూన్ 21) మీరు ప్రయత్నిస్తున్న పనులు ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ ధైర్యంతో ప్రయత్నాలు చేయడం మానవద్దు. గతంలో పడ్డ మనోవేదనని గుర్తుంచుకుని పని విషయంలో తగినంత శ్రద్ధ చూపుతూ ఉండండి. పన్ను చెల్లింపులు, సమాధానం ఇవ్వకుండా తాత్సారం చేస్తున్న పత్రాల విషయంలో శ్రద్ధ చూపండి. క్యాన్సర్(జూన్22-జూలై 23) వివాహేతర సంబంధాల విషయంలో ఇబ్బంది పడే సూచనలున్నాయి కాబట్టి పరిచయాలను తెంచుకోండి. అవసరానికి సరిపోయినంత ఆదాయం ఉంటుంది. మరింత పొదుపు చేయాలనే ఆలోచన సరికాదని గుర్తించండి. శత్రువులతో చనువూ, విరోధమూ రెండూ వద్దు. ఉదాసీనంగా ఉండండి. సాధ్యమైనంతవరకు విదేశీ ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. లియో (జూలై 24-ఆగస్టు 23) ఎదుటివారు చేసిన వాగ్దానాలను నమ్మి కార్యరంగంలోకి దూకవద్దు. నిస్వార్థంగా మీ విషయంలో ఎవరు సహకరిస్తున్నారో వారే మీకు సహాయపరులని గుర్తించండి తప్ప, తప్పకుండా సహకరిస్తారని ఎవరి గురించి మీరు అనుకుంటున్నారో వారిని విశ్వసించకండి. ఎటువంటి ఒత్తిళ్లకు లొంగకండి. వర్గో(ఆగస్టు24-సెప్టెంబర్ 23) తెలియని ఓ అనారోగ్యం మిమ్మల్ని పీడిస్తూ వుండే అవకాశముంది కాబట్టి, వైద్యపరీక్షలు అవసరమని గ్రహించండి. కుటుంబంలోని వ్యక్తులు, మీ తోటి ఉద్యోగులు మీకు సహకరించని పరిస్థితి కనిపిస్తోంది. వాళ్లని నిలదీయడం మాని, మీ పని మీరు చేసుకువెళ్లండి. మీ మాట గురితప్పని బాణంలా ప్రయాణించబోతోంది కాబట్టి, ఎంత అవసరమో అంతే మాట్లాడండి. లిబ్రా (సెప్టెంబర్ 24- అక్టోబర్ 23) ఎదుటివారు ఎన్ని ప్రయత్నాలు చేసినా ‘మీ మాటే మీది’గా వ్యవహరిస్తూ వచ్చారు ఇప్పటికి. గాలిలోకి ఎగిరిన రాయి ఎప్పుడు ఎక్కడ ఎంత బలంగా పడుతుందో వేచిచూడాల్సిన సమయం ఇది. సమీప బంధువుల ఆరోగ్యం కొంత ఆందోళన కల్గించవచ్చు కాబట్టి తరచూ వారిని పరామర్శిస్తూ వుండండి. స్కార్పియో(అక్టోబర్ 24-నవంబర్ 22) నమ్ముకున్న వ్యవసాయం, చేస్తున్న వ్యాపారం, ఉద్యోగం... క్రమంగా అగమ్యగోచరంగా అనిపించి, నిరుత్సాహాన్ని, నిరాసక్తతనీ మీలో కలిగించవచ్చు. ప్రస్తుతం మీరు ఎత్తుని ఎక్కుతున్నారనే ఊహలో ఉండండి. ఇంతకష్టమూ ఒక్కసారిగా తొలగిపోయే అవకాశం బలీయంగా ఉంది కాబట్టి కొన్నాళ్లపాటు ఆ సమయం కోసం ఎదురుచూస్తూ ఉండండి. శాజిటేరియస్ (నవంబర్23-డిసెంబర్ 21) వాయిదాపడ్డ పనులను, బద్దకించి చేసుకోలేకపోయిన పనులను ఈవారంలో కొంతవరకు పూర్తి చేయడం గానీ, పూర్తి చేసుకోగలననే నమ్మకాన్ని గానీ పొందుతారు. దానధర్మాలు, సహాయాలు చేయడం మంచిదేకానీ, ప్రస్తుతం సరికాదని గ్రహించండి. ఎవరి విషయాలనో తెలుసుకుని, వాటికి పరిష్కారాలు ఆలోచించడం మాని, మీ గురించి మీరు శ్రద్ధ వహించండి. క్యాప్రికార్న్ (డిసెంబర్ 22-జనవరి 20) తేలికగా ముగియవలసిన పని ఎంతోశ్రమతో మాత్రమే పూర్తికాగలదు. ‘దీనికింత శ్రమపడాలా?’ అని ఎవరైనా గేలిచేస్తే, సమాధానం చెప్పి నోరు మూయించాలనే ఆలోచనకి రాకండి. కుటుంబంలోని వాళ్లు అసంతృప్తిగా వున్నా, మీకున్న సహజకోపంతో వాళ్లని కడిగేయాలనుకోకండి. నష్టపోతారు. అక్వేరియస్ (జనవరి 21-ఫిబ్రవరి 19) ఏదోఒక పని కారణంగా మీ పనులను మీరు పర్యవేక్షించుకోలేకపోవచ్చు. మీ పర్యవేక్షణ లేని కారణంగా వచ్చిన నష్టాన్ని లెక్కచేయకండి. ఎవరు మిత్రులో, ఎవరు శత్రువులో, ఎవరు అనుకూలంగా పైకి కన్పించే శత్రువులో, ఎవరు మార్గదర్శకులో... స్వయంగా గ్రహించుకో గలుగుతారు. పైసిస్ (ఫిబ్రవరి 20-మార్చి 20) మీకు సంబంధించిన అపరిష్కృత ఆర్థికసమస్యల పరిష్కారానికి, మరేదో ముఖ్యమైన విచారణకి మీ తల్లిదండ్రులు లేదా అత్తమామలు రావచ్చు. వారి ముందు జంకులేకుండా నిఆన్ని నిజంగానే చెప్పండి తప్ప, బాంధవ్యం వంకతో మౌనంగా, లేదా తటస్థంగా వుంటే మీరు ఓడిపోయేందుకు సిద్ధపడిన సైనికుడే అవుతారు. మైలవరపు శ్రీనివాసరావు
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పలమనేరు: ఉప్పొంగిన అభిమాన సంద్రం (ఫొటోలు)
అషూ రెడ్డి అందాల జాతర.. పాయల్ క్యూట్ మూమెంట్స్
రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
ముంబై కథ ముగిసింది.. జట్టులో యూనిటీ లేదు: పఠాన్
ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్
ముస్లింలకు రిజర్వేషన్లు ఉండి తీరాల్సిందే: సీఎం జగన్
భార్యాభర్తలిద్దరూ స్టార్ క్రికెటర్లే.. అతడు కాస్ట్లీ.. ఆమె కెప్టెన్!(ఫొటోలు)
టీడీపీలో భగ్గుమన్న వర్గపోరు.. తన్నుకున్న తెలుగు తమ్ముళ్లు
నాకు జాబ్ ఇవ్వండి.. నేనే రూ.40 వేలిస్తా!
రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
తప్పక చదవండి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్‌సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- తప్పుడు ప్రచారాలతో చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్
- షుగర్ వచ్చిందని బెదిరిపోకండి.. ఇవి ఖచ్చితంగా పాటిస్తే షుగర్ పరార్!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement