-
చేసి చూపిస్తా!
భారతీయ అందాల తారలు ఐశ్వర్యారాయ్, సోనమ్‌కపూర్, మల్లికా శెరావత్లు ఇప్పటికే కాన్స్ చలన చిత్రోత్సవాల్లో మెరిసిన విషయం తెలిసిందే. సోమవారం ఫ్రిదా పింటో కూడా సందడి చేశారు. ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ సినిమాతో ఒక్కసారిగా ఇంటర్నేషనల్ సెలబ్రిటీగా మారిపోయి, ఇప్పుడు హాలీవుడ్ చిత్రాలతో బిజీ అయిపోయారు ఫ్రిదా. తాజాగా ఆమె నిర్మాతగా కూడా మారనున్న సంగతి తెలిసిందే. ‘వియ్ డూ ఇట్ టుగెదర్’ పేరుతో ఓ స్వచ్ఛంద సంస్థను స్థాపించి, మహిళల కోసం సినిమాలు తీయనున్నారు. జెస్సికా , జూలియట్ బినోచి, క్వీన్ లతీఫా, క్యాథరిన్ హార్డ్ వికే వంటి ప్రముఖ హాలీవుడ్ తారలతో కలిసి ఈ సంస్థను ప్రారంభించిన ఫ్రిదా దీని ప్రచారం కోసమే కాన్స్ చలనచిత్రోత్సవాలకు వెళ్లారు. ‘‘మహిళా సాధికారతను ప్రతిబింబించే బుల్లితెర రియాలిటీ షోలే కాకుండా సినిమాలు కూడా తీస్తాం. హాలీవుడ్, బాలీవుడ్‌లలో పురుషులు, మహిళల పారితోషికాల్లో వ్యత్యాసం ఉంది. దీనిలో మార్పు రావాల్సి ఉంది. అయినా మేం మాటలు చెప్పేవాళ్లం కాదు... చేతల్లో చూపించే వాళ్లం. అందుకే మా సంస్థకు ట్యాగ్‌లైన్ ‘డూయర్ నాట్ ఎ టాకర్’ అని పెట్టాం. మహిళల కోసం మహిళ లు తీసే ఈ సినిమాలను అందరూ ఎంజాయ్ చేయొచ్చు’’ అని ఫ్రిదా చెప్పారు. -
హాలీవుడ్లో హార్రర్...
ఐశ్వర్యా రాయ్, మల్లికా శెరావత్ హాలీవుడ్ చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. ప్రియాంక చోప్రా అమెరికన్ టీవీ సిరీస్ ‘క్వాంటికో’లో నటించి, ఆ విధంగా హాలీవుడ్ రంగప్రవేశం చేశారు. ఇప్పుడీ తారల జాబితాలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ చేరనున్నారు. ఇప్పటికే హిందీలో పలు క్రేజీ ప్రాజెక్ట్స్‌లో నటిస్తున్న ఈ బ్యూటీ ఓ హాలీవుడ్ చిత్రంలో నటిస్తున్నారు. ‘డెఫినిషన్ ఆఫ్ ఫియర్’ పేరుతో రూపొందుతున్న ఈ చిత్రానికి జేమ్స్ సింప్సన్ దర్శకుడు. నలుగురు అమ్మాయిలు హాలిడే ట్రిప్ కోసం ఏకాంతంగా గడపడానికి పెద్ద అపార్ట్మెంట్లో దిగుతారు. కానీ అనుకోకుండా జరుగుతున్న సంఘటనలు వాళ్లకు ముచ్చెమటలు పట్టిస్తాయి. రహస్యంగా తమను ఎవరో గమనిస్తున్నారన్న సంగతి అర్థమవుతుంది. ఆ తర్వాత వీళ్లేం చేశారు? అనే కథాంశంతో తెరకెక్కిన హార్రర్ మూవీ ఇది.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్‌కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్‌పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
ఒకపుడు జర్నలిస్టు, అంబానీని మించిన ఇంద్రభవనంలో : అత్యంత అందమైన రాణి
ఒకపుడు జర్నలిస్టు, అంబానీని మించిన ఇంద్రభవనంలో : అత్యంత అందమైన రాణి
చరణ్.. నిన్ను చూస్తే గర్వంగా ఉంది.. ఉపాసన పోస్ట్
ప్రచారంలో వివాదాస్పద వ్యాఖ్యలు.. ఈసీ సీరియస్
కేంద్ర హోం శాఖకు బాంబు బెదిరింపు.. నార్త్ బ్లాక్ హై అలర్ట్
కావ్యా మారన్‌తో ఫొటోలకు ఫోజులు.. ఈ బ్యూటీ గురించి తెలుసా? (ఫొటోలు)
ఈవెంట్లో ప్రియాంక చోప్రా.. వందల కోట్ల విలువైన నెక్లెస్‌తో!
రూ. 2.1 లక్షల కోట్లు.. ప్రభుత్వానికి ఆర్బీఐ రికార్డ్ డివిడెండ్
చరిత్ర సృష్టించిన శ్రేయస్ అయ్యర్.. 17 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలోనే
అధిక స్థాయిలోనే పెట్రోలు, డీజిల్ రేట్లు..
తప్పక చదవండి
- ప్రచారంలో వివాదాస్పద వ్యాఖ్యలు.. ఈసీ సీరియస్
- T20: బంగ్లాకు షాకిచ్చిన పసికూన.. మినీ టీమిండియా అంటూ..
- చనుగొండ్లలో చిరుత పిల్లల సంచారం.. భయాందోళనలో గ్రామస్తులు
- ఇజ్రాయెల్ హెచ్చరిక.. రాయబారులు వెనక్కి రండి
- మూడేళ్ల చిన్నారిపై విద్యుత్ చౌర్యం కేసు
- నిర్మాత మోసం.. నిజాలు బయటపెట్టిన హీరోయిన్ నమిత
- వరంగల్‌లో అర్ధరాత్రి బాంబుల మోత, కారణం ఏంటంటే..
- నేమ్‌ప్లేట్ మార్చేసిన సూపర్ మామ్ సానియా మీర్జా ఫోటోలు వైరల్
- RR vs RCB: వార్ వన్‌సైడ్.. గెలిచేది ఆ జట్టే: టీమిండియా దిగ్గజం
- Kalki 2898: 12 సెకన్లు.. రూ.3 కోట్లు, రాజమౌళిని ఫాలో అవుతున్న ‘కల్కి’టీమ్!
Advertisement