-
Aadi Swaroopa: లేడీ రజనీకాంత్.. సూపర్ టాలెంట్.. ‘వైరస్’ను గుర్తు చేసింది!
-
లేడీ రజనీకాంత్.. సూపర్ టాలెంట్.. ‘వైరస్’ను గుర్తు చేసింది!
ఈ అమ్మాయి గురించి తెలిసిన వారందరూ ఆమెను ‘లేడీ రజనీకాంత్’ అంటూ మెచ్చుకుంటున్నారు. ఈ యువతి పేరు ఆది స్వరూప. రెండు చేతులను సరి సమానంగా ఉపయోగించడం ఈమె ప్రత్యేకత. కర్ణాటకలోని మంగళూరుకు చెందిన 17 ఏళ్ల ఈ యువతి తన స్పెషల్ టాలెంట్‌తో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఒకే సమయంలో రెండు చేతులతో ఇంగ్లీషు, కన్నడ, తుళు, హిందీ, మళయాలం భాషల్లోనూ రాయగలదు. ఒక నిమిషంలో తన రెండు చేతులతో ఒకే దిశలో 45 పదాలను లిఖించి ఎక్స్‌క్లూజివ్ వరల్డ్ రికార్డు సృష్టించింది. లతా ఫౌండేషన్ ఈ రికార్డును గుర్తించింది. అంతేకాదు కళ్లగు గంతలు కట్టుకుని కూడా రెండు చేతులతో రాసి అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. స్వరూప సాధించిన రికార్డుకు సంబంధించిన వీడియోలు గతంలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా ఈ వీడియో ట్విటర్లో రీ షేర్ చేయడంతో మళ్లీ వెలుగులోకి వచ్చింది. నెటిజన్ల ప్రశంసలు ఆమెను ‘లేడీ రజనీకాంత్’ అని ఒకరు ప్రశంసించగా.. ‘త్రి ఇడియట్స్’ హిందీ సినిమాలో ‘వైరస్’పాత్ర చేసిన బొమన్ ఇరానీ గుర్తుకొచ్చారని మరో నెటిజన్ పేర్కొన్నారు. ఆమె ప్రతిభ చాలా ప్రత్యేకమైందని మరికొంత మంది మెచ్చుకున్నారు. స్వరూప గురించి తెలిసిన వారంతా ఆమె గిన్నీస్ రికార్డు సాధిస్తుందని ఆకాంక్షిస్తున్నారు. బహుముఖ ప్రతిభ ఆది స్వరూప.. బహుముఖ ప్రతిభతో ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకుంది. నటన, చిత్రలేఖనం, అనుకరణ(మిమిక్రీ)లోనూ రాణిస్తోంది. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ 2021లోనూ తన పేరును లిఖించుకుంది. కుటుంబ సభ్యులతో కలిసి తరచుగా పర్యాటక ప్రాంతాల విహారానికి వెళ్లే స్వరూపకు జంతువులన్నా, పక్షులన్నా ఎంతో ప్రేమ. అన్నట్టు తన వీడియోలు, ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తుంటుంది. పాకిస్తాన్ బౌలర్ రికార్డు రెండు చేతులతో సమానంగా ఉపయోగించి పాకిస్తాన్ బౌలర్ యాసిర్ జాన్ 2017లో గిన్నీస్ రికార్డుకు ఎక్కాడు. తన కుడి చేతితో 145, ఎడమ చేతితో 135 కిలోమీటర్ల స్పీడ్‌తో బౌలింగ్ చేసి అతడు ఈ ఘనత సాధించాడు. -
ఫేస్బుక్ ఫ్రెండ్ పై పోలీసులకు ఫిర్యాదు
మంగళూరు: ఫేస్బుక్ లో పరిచయమైన యువతిని మోసగించి మరో పెళ్లికి సిద్ధమైన ప్రబుద్ధుడిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. పెళ్లి చేసుకుంటానని తనను వంచించి మరో యువతిని పెళ్లి చేసుకునేందుకు రెడీ అయ్యాడని పర్వేజ్ ముషారఫ్ అనే వ్యక్తి కర్ణాటకలోని మంగళూరుకు చెందిన యువతి(26) పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనకు దగ్గరయ్యాడని, తర్వాత మొహం చాటేశాడని వాపోయింది. నాలుగు నెలల నుంచి తనను తప్పించుకుని తిరుగుతున్నాడని ఆమె తెలిపింది. బంధువుల అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవుతున్నాడని తెలుసుకున్న బాధితురాలు.. అతడిని నిలదీసింది. తమ మధ్య సంబంధాన్ని మర్చిపోవాలని ఆమెకు సూచించాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్‌కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
హీరామండి సిరీస్‌లో పెద్ద తప్పులు.. ఇవి కూడా చూసుకోరా?
భూకబ్జాలు చేసేవారికి ఈ యాక్ట్ రావడం ఇష్టముండదు: సజ్జల
ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. 25 ఏళ్లలో..
రేపు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష.. ఏపీలో 29 పరీక్షా కేంద్రాలు
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (03-05-2024))
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
ఆర్సీబీతో మ్యాచ్.. గుజరాత్ జట్టులోకి కొత్త ప్లేయర్! తుది జట్లు ఇవే
గవర్నర్‌పై ఆరోపణలు.. మమత సర్కారు దూకుడు
తప్పక చదవండి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్‌బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్‌సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement