-
ఇరోమ్ షర్మిల బాటలో మరో మహిళ
ఇంఫాల్: మణిపూర్ లో సైనిక బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని(ఏఎఫ్ఎస్పీఏ) రద్దుచేయాలంటూ 16 ఏళ్లపాటు చేసిన నిరాహార దీక్షను ఇరోమ్ షర్మిల విరమించిన నేపథ్యంలో మరో మహిళ పోరాటానికి సిద్ధమవుతున్నారు. ఆరంబం రోబిత లీమా అనే 32 ఏళ్ల మహిళ నిరవధిక దీక్షకు సిద్ధమవుతున్నారు. ఇంఫాల్ పశ్చిమ జిల్లాలోని కమ్యునిటీ హాల్ లో సోమవారం నిరాహారదీక్ష చేపట్టనున్నట్టు రోబిత తెలిపారు. ఏఎఫ్ఎస్పీఏ రద్దు చేయడంతో పాటు ఇన్నర్ లైన్ పర్మిట్(ఐఎల్పీ) వ్యవస్థను అమలు చేయాలన్న డిమాండ్ తో దీక్షకు దిగుతున్నట్టు ఆమె ప్రకటించారు. రోబితకు డైమండ్(10), తంపామణి(4) అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇరోమ్ షర్మిల అంటే తనకు గౌరవమని, ఏఎఫ్‌ఎస్‌పీఏకు వ్యతిరేకంగా ఆమె చేసిన పోరాటాన్ని తాను కొనసాగించాలనుకుంటున్నట్టు రోబిత తెలిపారు. కుమార్తెల భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని నిరవధిక దీక్షకు దిగొద్దని పలు మహిళా సంఘాల నేతలు రోబితను వారించారు. అయితే తన నిర్ణయానికే ఆమె కట్టుబడ్డారు. -
జాత్యహంకారం: 'ఈశాన్య' యువతికి అవమానం
న్యూఢిల్లీ: అమెరికాలో నల్ల జాతీయులపై దాడులు, ప్రతిదాడులను ప్రపంచమంతా ఖండిస్తున్నవేళ.. దేశ రాజధాని ఢిల్లీలో ఈశాన్య పౌరుల పట్ల 'అహంకారం' మరోసారి పురివిప్పింది. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇంటర్నేషనల్ ఇమిగ్రేషన్ కౌంటర్ అధికారి.. ఓ మణిపురి యువతిపై జాత్యంహకార వ్యాఖ్యలుచేశాడు. అంతర్జాతీయ సదస్సుకు భారత ప్రతినిధిగా బయలుదేరిన ఆమెను 'నువ్వు భారతీయురాలిలా లేవే' అని అవమానించాడు. తాను ఎదుర్కొన్న జాతి వివక్షను వివరిస్తూ ఫేస్ బుక్ లో ఆ యువతి పోస్ట్ చేసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ అయింది. వివరాల్లోకి వెళితే.. పాతికేళ్ల యువతి మోనికా కంగెంబం.. ఇంపాల్(మణిపూర్) కేంద్రంగా సామాజిక ఉద్యమాల్లో పాలుపంచుకుంటోంది. గతంలో ఈశాన్య రాష్ట్రాల్లో 'ప్రత్యేక ఆయుధ చట్టాం'కు వ్యతిరేకంగా పోరాడిన ఆమె.. ప్రస్తుతం విమెన్ అండ్ యూత్ ఫర్ పీస్ అండ్ డెవలప్ మెంట్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి ఈశాన్య రాష్ట్రాల యువత, మహిళల జీవన స్థితిగతుల బాగు కోసం కార్యక్రమాలు నిర్వహిస్తోంది. విద్యార్థినిగా ఉన్నప్పుడే గ్లోబల్ ఛేంజ్ మేకర్స్, ఆసియా యూత్ సమ్మిట్ లాంటి పలు అంతర్జాతీయ వేదికలపై భారత ప్రతినిధిగా పాల్గొన్న మోనికా.. జులై రెండో వారంలో సియోల్ (దక్షిణ కొరియా)లో జరగనున్న ప్రపంచ మహిళా సదస్సుకు కూడా భారత్ ప్రతినిధిగా ఎంపికయ్యారు. సియోల్ వెళ్లేందుకు శనివారం రాత్రి ఢిల్లీ విమానాశ్రయానికి వెళ్లిన ఆమెను ఇమిగ్రేషన్ అధికారి తీవ్రంగా అవమానించినట్లు మోనికా ఆరోపిస్తున్నారు. 'నా పాస్ పోర్టును తీక్షణంగా పరిశీలించిన ఇమిగ్రేషన్ అధికారి.. 'నువ్వు భారతీయురాలిలా కనిపించట్లేదే' అని అన్నాడు. 'ఇండియాలో ఎన్ని రాష్ట్రాలున్నాయో చెప్పు..'అని ప్రశ్నించాడు. అంతవరకు ఓపిక పట్టిన నేను లేట్ అవుతోందనగానే.. 'మిమ్మల్ని వదిలేసి విమానం ఎక్కడికీ పోదు. ముందు నా ప్రశ్నలకు జవాబులు చెప్పండి' అని అన్నాడు. ఆ అధికారి పక్కనున్న మహిళ కూడా మొత్తం వ్యవహారాన్ని ముసిముసి నవ్వులతో చూసిందే తప్ప అతణ్ని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు' అని మోనికా తన లేఖలో వివరించింది. 'ఇది కచ్చితంగా జాత్యహంకారమే. అయితే నేను మాత్రం నా స్పూర్తిని వదులుకోను' అంటూ లేఖకు ముక్తాయింపునిచ్చారామె. గతంలోనూ దేశ రాజధాని ఢిల్లీలో ఈశాన్య రాష్ట్రాలకు చెందిన పౌరులపై దాడులు జరిగిన నేపథ్యంలో మోనికాకు జరిగిన అవమానంపై విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్పందిచాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. మోనికాపై గతంలో పలు జాతీయ పత్రికల్లో వచ్చిన కథనాల్లో కొన్ని..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్‌కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్‌గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్‌కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్‌తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement