-
టీ20 వరల్డ్‌కప్ జట్టులో హార్దిక్‌కు నో ఛాన్స్.. అతడికే అవకాశం?
ఐపీఎల్-2024 సీజన్ ముగిసిన వెంటనే మరో క్రికెట్ మహాసంగ్రామానికి తెరలేవనుంది. జాన్ 1 నుంచి టీ20 వరల్డ్‌కప్-2024 షురూ కానుంది. ఈ ఏడాది పొట్టిప్రపంచకప్నకు అమెరికా, వెస్టిండీస్‌లు సంయుక్తంగా సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి. అయితే ఈ మెగా ఈవెంట్ కోసం భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఏప్రిల్ చివరి ప్రకటించే అవకాశముంది. ఈ నేపథ్యంలో భారత టీ20 వరల్డ్‌కప్ జట్టులో ఎవరుండాలన్న అన్న విషయంపై మాజీలు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. తాజాగా ఈ జాబితాలో భారత మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ చేరాడు. వరల్డ్‌కప్ జట్టులో హార్దిక్ పాండ్యాకు కాకుండా ఆల్‌రౌండర్ శివమ్ దూబేకు ఛాన్స్ ఇవ్వాలని తివారీ సూచించాడు. "హార్దిక్ పాండ్యా ఆల్ రౌండర్‌గా భారత టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకోవాలంటే కచ్చితంగా ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో బౌలింగ్ చేయాలి. గత మూడు మ్యాచ్‌ల నుంచి హార్దిక్ బౌలింగ్ చేయడం లేదు. అంతకముందు బౌలింగ్ చేసినా దాదాపు 11 పైగా ఏకనామీతో పరుగులు సమర్పించుకున్నాడు. హార్దిక్ ప్రస్తుత ఫామ్‌ను చూస్తే టీ20 వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కించుకోవడం కష్టమనే చెప్పుకోవాలి. అగార్కర్ సెలక్షన్ కమిటీ చైర్మెన్‌గా ఉన్నాడు కాబట్టి కచ్చితంగా కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటాడు. శివమ్ దూబే కచ్చితంగా సెలక్టర్ల దృష్టిలో ఉంటాడని నేను భావిస్తున్నాను. ఒక వేళ టీ20 ప్రపంచకప్ జట్టులో దూబేకు చోటు దక్కకపోతే అందుకు బాధ్యత సీఎస్కే వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో చెన్నై అతడికి బౌలింగ్ చేసే ఛాన్స్ ఇవ్వడం లేదు. హార్దిక్‌కు ప్రత్నామ్యాయంగా దూబేను సెలక్టర్లు ఎంపిక చేస్తారని నేను ఆశిస్తున్నానని" క్రిక్‌బజ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తివారీ పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2024లో శివమ్ దూబే దుమ్ములేపుతున్నాడు. మిడిలార్డర్ బ్యాటర్లలో బ్యాటింగ్‌కు వచ్చి సీఎస్కే విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. -
హార్దిక్ పాండ్యాపై సంచలన వ్యాఖ్యలు చేసిన టీమిండియా మాజీ క్రికెటర్
ముంబై ఇండియన్స్ సారధి హార్దిక్ పాండ్యాపై టీమిండియా మాజీ ప్లేయర్, బెంగాల్ క్రీడా మంత్రి మనోజ్ తివారీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుత ఫామ్‌తో హార్దిక్ టీ20 వరల్డ్‌కప్‌కు ఎంపిక కావడం కష్టమని మనోజ్ అన్నాడు. హార్దిక్‌కు ప్రత్యామ్నాయంగా ఆల్‌రౌండర్ కోటాలో శివమ్ దూబేను ఎంపిక చేయాలని సూచించాడు. ఐపీఎల్లో హార్దిక్ బౌలర్‌గా పేలవ ప్రదర్శన చేస్తున్నాడని తెలిపాడు. వరల్డ్‌కప్‌కు ఎంపిక కావాలంటే హార్దిక్ బౌలింగ్‌పై దృష్టి పెట్టాలని సూచించాడు. ఐపీఎల్లో హార్దిక్ గత మూడు మ్యాచ్‌ల్లో కలిపి కేవలం ఒకే ఒక ఓవర్ వేశాడని.. ఈ సీజన్లో అతని ఎకానమీ రేట్ 11కు పైగా ఉందని గుర్తు చేశాడు. భారత జట్టు తరఫున ఆల్‌రౌండర్‌గా ఆడాలంటే హార్దిక్ బౌలింగ్‌లో తప్పక రాణించాల్సి ఉందని అన్నాడు. బౌలర్‌గా సత్తా చాటకపోతే భారత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ హార్దిక్‌కు వరల్డ్‌కప్ జట్టుకు ఎంపిక చేయడని చెప్పాడు. హార్దిక్‌కు ప్రత్యామ్నాయంగా ఎంపిక కావాలంటే దూబే కూడా బౌలింగ్‌లో రాణించాల్సి ఉంటుందని తెలిపాడు. కేవలం బ్యాటింగ్ మెరుపులతో శివమ్ దూబే వరల్డ్‌కప్ జట్టుకు ఎంపిక కాలేడని అన్నాడు. దూబే వరల్డ్‌కప్ జట్టుకు ఎంపిక కావాలంటే ఐపీఎల్లో ఎక్కువగా బౌలింగ్ చేయాలని సూచించాడు. ఒకవేళ దూబే వరల్డ్‌కప్ జట్టుకు ఎంపిక కాలేదంటే అది సీఎస్కే తప్పే అవుతుందని అన్నాడు. సీఎస్కే కెప్టెన్ దూబేను బౌలర్‌గా కూడా వాడుకోవాలని సూచించాడు. ఈ సీజన్లో దూబే బౌలింగ్ సేవలను సీఎస్కే పెద్దగా వినియోగించుకోలేదని గుర్తు చేశాడు. దూబే చాలా తెలివైన బౌలర్ అని మనోజ్ కితాబునిచ్చాడు. ఇలాంటి స్మార్ట్ బౌలర్‌ను సీఎస్కే ఎందుకు వినియోగించుకోవడం లేదో అర్దం కావట్లేదని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. దూబే, వెంకటేశ్ అయ్యర్ (కేకేఆర్ ఆల్‌రౌండర్) లాంటి ఆల్‌రౌండర్లతో ఆయా జట్లు ఎందుకు బౌలింగ్ చేయించట్లేదో అంతు చిక్కడం లేదని అన్నాడు. కాగా, ఈ ఏడాది జూన్ 1 నుంచి మొదలయ్యే టీ20 వరల్డ్‌కప్ కోసం భారత జట్టును ఈ నెలాఖరులోగా ప్రకటించే అవకాశం ఉంది. టీమిండియా బెర్తులు ఎవరెవరికి ఖరారవుతాయనేది ఐపీఎల్ ప్రదర్శనలపై ఆధారపడి ఉంటుంది. శివమ్ దూబేను సెలెక్టర్లు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. -
IPL 2024: ముంబై కెప్టెన్సీ నుంచి హార్దిక్ ఔట్.. ? రియాక్ట్ అయిన సెహ్వాగ్
ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. గత రెండు సీజన్లలో గుజరాత్ టైటాన్స్‌ను ఓసారి ఛాంపియన్, మరోసారి రన్నరప్‌గా నిలిపిన హార్దిక్.. ఈసారి మాత్రం తన కెప్టెన్సీ మార్క్ చూపించలేకపోతున్నాడు. ఈ ఏడాది సీజన్లో అతడి సారథ్యంలో ముంబై ఇండియన్స్ వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి హార్దిక్ పాండ్యా తప్పుకోవాలని పెద్దఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి. మళ్లీ రోహిత్ శర్మకు జట్టు పగ్గాలను అప్పగించాలని పలువురు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. ఈ జాబితాలో టీమిండియా మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ కూడా చేరాడు. ఈ మెగా ఈవెంట్లో తమ తదుపరి మ్యాచ్‌కు ముందు హార్దిక్ పాండ్యా ముంబై కెప్టెన్సీ నుంచి వైదొలగతాడని తివారీ జోస్యం చెప్పాడు. అంతేకాకుండా రోహిత్ శర్మనే తిరిగి మళ్లీ ముంబై సారథ్య బాధ్యతలు చేపడతాడని అతడు అభిప్రాయపడ్డాడు. కాగా ముంబై ఇండియన్స్ తమ తదుపరి మ్యాచ్‌లో ఏప్రిల్ 7న వాంఖడే వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. ఈ విరామంలోనే ముంబై కెప్టెన్సీలో మార్పు జరుగుతుందని తివారీ చెప్పుకొచ్చాడు. "హార్దిక్ పాండ్యా ప్రస్తుతం తీవ్రమైన ఒత్తడిలో ఉన్నాడు. గత మూడు మ్యాచ్‌ల్లో బౌలర్లను హార్దిక్ సరిగ్గా ఉపయోగించలేకపోయాడు. ఆరంభంలో బౌలర్లు విఫలమవుతున్నప్పటికి మళ్లీ వారినే ఎటాక్‌లో తీసుకువచ్చి హార్దిక్ భారీ మూల్యం చెల్లించుకున్నాడు. ముంబై ఇండియన్స్‌లో అద్బుతమైన బౌలర్లు ఉన్నారు. సరిగ్గా రోటాట్ చేయడంలో పాండ్యా విఫలమయ్యాడు. స్వింగ్ అవుతున్న పిచ్‌లపై బుమ్రాను కాదని తొలుత తను బౌలింగ్ చేయడం కూడా హార్దిక్ తప్పిదమే అని చెప్పుకోవాలి. హార్దిక్ కూడా బంతిని స్వింగ్ చేయగలడు. కానీ ముంబై తరపున ఇప్పటివరకు మూడు మ్యాచ్‌ల్లో హార్దిక్ బౌలర్‌గా తన మార్క్‌ను చూపించలేకపోయాడు. ముంబై తమ తదుపరి మ్యాచ్‌లో ఢిల్లీతో తలపడనుంది. ఈ విరామంలో ముంబై ఫ్రాంచైజీ నుంచి ఓ బిగ్ న్యూస్ వచ్చే ఛాన్స్ ఉంది. హార్దిక్ పాండ్యా తిరిగి ముంబై కెప్టెన్సీని రోహిత్ శర్మకు అప్పగించేస్తాడని నేను భావిస్తున్నాను. ఎందుకంటే గతంలో కూడా చాలా ఫ్రాంచైజీలు ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నాయి. ఇప్పుడు ముంబై కెప్టెన్సీ విషయంలో కూడా అదే జరిగే అవకాశముందని" క్రిక్‌బజ్ షోలో తివారీ పేర్కొన్నాడు. ఇదే షోలో పాల్గోన్న టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్.. మనోజ్ తివారీ కామెంట్స్‌పై స్పందించాడు. "హార్దిక్ కెప్టెన్సీపై మనోజ్ కాస్త తొందపడి ఇటువంటి వ్యాఖ్యలు చేశాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రోహిత్ కెప్టెన్సీలో కూడా జట్టు వరుసగా ఐదు మ్యాచ్‌లలో ఓడిపోయింది. ఆ ఏడాది సీజన్లో వారు ఛాంపియన్లుగా నిలిచారు. కాబట్టి మనం కాస్త ఓపిక పట్టాలి. మనం మరో రెండు మ్యాచ్‌ల కోసం వేచి ఉండాలి. ఆ తర్వాతే మన అభిప్రాయాలను వెల్లడిస్తే బాగుంటుందని సెహ్వాగ్ రిప్లే ఇచ్చాడు. -
అంపైర్లపై సంచలన ఆరోపణలు చేసిన మనోజ్ తివారి.. తాగొచ్చేవారంటూ కామెంట్స్..!
టీమిండియా మాజీ క్రికెటర్, ఇటీవలే ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన బెంగాల్ క్రీడా మంత్రి మనోజ్ తివారి దేశవాలీ అంపైర్లపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. రిటైర్మెంట్ అనంతరం జరిగిన కార్యక్రమంలో అతను మాట్లాడుతూ ఇలా అన్నాడు. ఆటగాళ్లు డోప్ పరీక్షలకు వెళ్లవలసి వస్తే, దానిని దేశీయ అంపైర్లకు కూడా విస్తరించాలి. నేను చాలాసార్లు అంపైర్లు నిద్రపోతున్నట్లు చూశాను. అలా అంపైర్లను చూసిన సందర్భాల్లో.. సార్ నిన్న రాత్రి మీరు ఏమి తాగారని వారిని అడిగేవాడిని. అందుకు వాళ్లు నవ్వుతూ.. నేను విస్కీని ఇష్టపడతానంటూ సమాధానం ఇచ్చేవారు. అలా జరగకుండా దేశీయ అంపైర్లలో సీరియస్‌నెస్ రావాలంటే బీసీసీఐ తగిన చర్యలు తీసుకుని, వారికి కూడా డోప్ పరీక్షలు నిర్వహించాలని తివారి అన్నాడు. ఈ వ్యాఖ్యలు చేయకముందు తివారి దేశవాలీ క్రికెట్‌పై, ముఖ్యంగా రంజీలపై, టీమిండియాలో తన కెరీర్ అర్దంతరంగా ముగియడంపై, ఐపీఎల్ కాంట్రాక్ట్ పొందిన ఆటగాళ్లపై పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. బాగా రాణిస్తున్నా టీమిండియాలో తనను తొక్కేశారంటూ ధోనిని ఉద్దేశిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుత క్రికెటర్ల మాదిరి తనకూ ప్రోత్సాహం లభించి ఉంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలా ఉన్నత శిఖరాలకు చేరుకునేవాడినని అన్నాడు. కాగా, రంజీ ట్రోఫీ 2024 సీజన్లో భాగంగా బీహార్‌తో జరిగిన మ్యాచ్ తర్వాత తివారి తన 19 ఏళ్ల ఫస్ట్‌క్లాస్ కెరీర్‌కు ముగింపు పలికాడు. ఫస్ట్‌క్లాస్ కెరీర్లో 148 మ్యాచ్‌లు ఆడిన తివారి.. 10,195 పరుగులు సాధించాడు. ఇందులో 30 సెంచరీలు, 45 అర్ధ శతకాలు ఉన్నాయి. లిస్ట్-ఏ క్రికెట్ లో 169 మ్యాచ్‌లు ఆడిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. 5581 రన్స్ చేశాడు. ఇందులో ఆరు శతకాలు, 40 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 183 టీ20ల్లో 3436 పరుగులు సాధించిన తివారి.. 2008-2015 మధ్యలో టీమిండియా తరఫున 12 వన్డేలు, 3 టీ20లు ఆడి 287, 15 పరుగులు చేశాడు. వన్డేల్లో తివారి అత్యధిక స్కోరు 104 నాటౌట్‌గా ఉంది. -
సెంచరీ చేసినా.. ధోని నన్ను ఎందుకు తప్పించాడో?
'I Had The Potential To Be A Hero': టీమిండియాలో తనకు తగినన్ని అవకాశాలు రాలేదని బెంగాల్ మాజీ క్రికెటర్ మనోజ్ తివారి వాపోయాడు. అందరు క్రికెటర్ల మాదిరిగానే తనకూ ప్రోత్సాహం లభించి ఉంటే కచ్చితంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిల ఉన్నత శిఖరాలకు చేరుకునేవాడినని పేర్కొన్నాడు. మెరుగ్గా ఆడినప్పటికీ తనను జట్టు నుంచి ఎందుకు తప్పించారో అర్థంకాలేదని మనోజ్ తివారి ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా టీమిండియా మాజీ బ్యాటర్, దేశవాళీ క్రికెట్లో బెంగాల్ జట్టు కెప్టెన్‌గా వ్యవహరించిన మనోజ్ ఆటకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. రంజీ ట్రోఫీ 2024 సీజన్లో భాగంగా బిహార్‌తో మ్యాచ్ తర్వాత... 19 ఏళ్ల ఫస్ట్‌క్లాస్ కెరీర్‌కు ముగింపు పలుకుతున్నట్లు తెలిపాడు. ఈ నేపథ్యంలో తన అంతర్జాతీయ క్రికెట్ గురించి మాట్లాడిన మనోజ్ తివారి కీలక వ్యాఖ్యలు చేశాడు. తొక్కేశారు! ‘‘2011లో నేను సెంచరీ బాదాను. అయితే, తర్వాతి మ్యాచ్‌లోనే నన్ను తుదిజట్టు నుంచి తప్పించారు. నాపై ఎందుకు వేటు వేశారని ధోనిని అడగాలనుకున్నా! రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలా రాణించగల సత్తా నాకుంది. కానీ వాళ్లలా నాకు అవకాశాలు రాలేదు. కానీ.. ఈరోజుల్లో యువ ఆటగాళ్లకు ఎన్నో ఛాన్సులు ఇస్తున్నారు. ఇదంతా చూసినప్పుడు నా గురించి తలచుకుంటే బాధగా అనిపిస్తుంది’’ అని తివారి ఉద్వేగానికి లోనయ్యాడు. కోల్‌కతా స్పోర్ట్స్' జర్నలిస్టు క్లబ్లో తనకు సన్మానం జరిగిన సమయంలో మనోజ్ తివారి ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. అదే విధంగా.. యువ క్రికెటర్లు ప్రస్తుతం ఐపీఎల్‌కే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారన్న అతడు.. రంజీ ట్రోఫీ ఆడాల్సిన ఆవశ్యకతను వారు అర్థం చేసుకోవాలని సూచించాడు. దేశవాళీ క్రికెట్లో దుమ్ములేపాడు కాగా ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 148 మ్యాచ్‌లు ఆడిన మనోజ్ తివారి.. 10,195 పరుగులు సాధించాడు. ఇందులో 30 సెంచరీలు, 45 అర్ధ శతకాలు ఉన్నాయి. లిస్ట్-ఏ క్రికెట్ లో 169 మ్యాచ్‌లలో ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. 5581 రన్స్ చేశాడు. ఇందులో ఆరు శతకాలు, 40 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అదే విధంగా 183 టీ20లలో 3436 పరుగులు సాధించిన మనోజ్ తివారి.. 2008- 2015 మధ్య కాలంలో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. మొత్తంగా 12 వనేడ్లు, 3 టీ20లు ఆడి ఆయా ఫార్మాట్లలో 287, 15 పరుగులు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్లో మనోజ్ తివారి అత్యధిక స్కోరు 104*. చెన్నైలో వెస్టిండీస్‌తో మ్యాచ్ సందర్భంగా ఈ మేరకు స్కోరు సాధించాడు. అయితే, ఆ తదుపరి మ్యాచ్‌లో మాత్రం అతడికి ఆడే అవకాశం రాలేదు. ఇక 38 ఏళ్ల మనోజ్ తివారి బెంగాల్ రాష్ట్ర క్రీడామంత్రి కూడా! చదవండి: IPL All Time Greatest Team: ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ ఐపీఎల్ జట్టు కెప్టెన్‌గా ధోని.. రోహిత్‌కు చోటే లేదు! Few moments bring tears to your eyes, few moments make you emotional... 🙌#GoodByeCricket pic.twitter.com/d4Pd8nSXbZ — MANOJ TIWARY (@tiwarymanoj) February 19, 2024
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్‌పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్‌లు ఔట్! వీడియో
ఐపీఎల్‌పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్‌పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్‌లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్‌పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్‌బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement