-
మూడోరోజూ మార్కెట్ ముందుకే...
ముంబై: స్టాక్ సూచీలు గురువారం స్వల్పంగా లాభపడి మూడోరోజూ ముందడుగేశాయి. అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్, దేశీయ క్యూ2 జీడీపీ వృద్ధి రేటు, అక్టోబర్ ద్రవ్యలోటు డేటా వెల్లడి నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించారు. అమెరికా మార్కెట్లలో నెలకొన్న బలహీన సంకేతాలు సెంటిమెంట్‌పై ప్రభావం చూపాయి. ట్రేడింగ్‌లో 460 పాయింట్ల పరిధిలో కదలాడిన సెన్సెక్స్ చివరికి 87 పాయింట్లు పెరిగి 66,988 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 37 పాయింట్లు బలపడి 20,133 వద్ద నిలిచింది. ఉదయం స్వల్ప లాభాలతో మొదలైన సూచీలు నవంబర్ నెలవారీ డెరివేటివ్‌ల గడువు ముగింపు కావడంతో ట్రేడింగ్ ఆద్యంతం తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. ఫార్మా, కన్జూమర్, రియలీ్ట, పారిశ్రామిక, క్యాపిటల్ గూడ్స్, కన్జూమర్ షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపారు. బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు ఒకశాతం మేర లాభపడ్డాయి. బ్యాంకులు, యుటిలిటీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఆసియాలో చైనా, హాంగ్‌కాంగ్ స్టాక్ సూచీలు లాభపడ్డాయి. యూరప్ మార్కెట్లు సానుకూలంగా ట్రేడయ్యాయి. డాలర్ మారకంలో రూపాయి విలువ 5 పైసలు బలహీనపడి 83.37 వద్ద స్థిరపడింది. -
బడుగు వర్గాలపై ప్రధాని మోదీ కక్ష సాధింపు
న్యూఢిల్లీ: ఓపెన్ మార్కెట్ సేల్ స్కీమ్(ఓఎంఎస్ఎస్) కింద రాష్ట్రాలకు ఇచ్చే బియ్యం, గోధుమలను ఇకపై ఇవ్వకుండా కేంద్రం నిలిపివేయడాన్ని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ గురువారం తప్పుపట్టారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడంతో ప్రధాని మోదీ మనోవేదనకు గురవుతున్నారని, అందుకే బడుగు వర్గాల ప్రజలపై కక్ష సాధింపు చర్యలు పాల్పడుతున్నారని ఆరోపించారు. బీజేపీ పేదల వ్యతిరేక పార్టీ అని కాంగ్రెస్ సీనియర్ నేత రణదీప్ సూర్జేవాలా ఆరోపించారు. కర్ణాటకకు కేంద్రం బియ్యం ఇవ్వకపోవడం దారుణమని విమర్శించారు. కర్ణాటకలో కాంగ్రెస్ విజయం సాధించడాన్ని మోదీ సహించలేకపోతున్నారని మండిపడ్డారు. రాష్ట్రాలకు సెంట్రల్ పూల్ నుంచి బియ్యం, గోధుమల పంపిణీని కేంద్రం నిలిపివేసింది. పేదలకు ఉచితంగా ఆహార ధాన్యాలు ఇస్తామని హామీ ఇచ్చిన కర్ణాటక ప్రభుత్వం దీనివల్ల నష్టపోనుంది. -
స్వల్ప లాభాల్లో సూచీలు, అదానీ ట్విన్స్ షేర్లలో కొనుగోళ్ళ జోష్
సాక్షి,ముంబై: అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లలో ప్రతికూల సంకేతాల మధ్య దేశీయ స్టాక్‌మార్కెట్లు ఫ్లాట్‌గా ట్రేడింగ్‌ను ఆరంభించాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 70 పాయింట్లు ఎగిసి 60710 వద్ద నిఫ్టీ 30 పాయింట్ల లాభంతో 17 వేల 945 వద్ద కదలాడుతోంది. అదానీ ఎంటర్ ప్రైజెస్, విప్రో అదానీ పోర్ట్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్ టాప్ విన్నర్స్‌గానూ, యాక్సిస్ బ్యాంకు, హెచ్‌యూఎల్, బజాజ్ ఫిన్సర్వ్, టైటన్, ఏషియన్ పె యింట్స్ నష్టపోతున్నాయి. -
స్వల్ప లాభాలకు పరిమితం: ఆటో, రియల్టీ గెయిన్
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిసాయి. సోమవారం ఉదయం ఆరంభం తరువాత 150 పాయింట్ల మేర లాభాల్లోకి మళ్లినప్పటికీ చివరల్లో వెల్లువెత్తిన అమ్మకాలతో చివరికి సెన్సెక్స్ 13.54 పాయింట్లు లేదా 0.02 శాతం లాభంతో 59,847 వద్ద, నిఫ్టీ 27.30 పాయింట్లు లేదా 0.16 శాతం పెరిగి 17,626 వద్ద ముగిశాయి. ఆటో, రియల్టీ రంగ షేర్ల లాభాలు మార్కెట్‌కు ఊతమిచ్చాయి. మరోవైపు బ్యాంకులు ఫైనాన్షియల్స్ భారీగా నష్ట పోయాయి. టాటా మోటార్స్, విప్రో మరియు పవర్‌గ్రిడ్ టాప్ గెయినర్లుగాను, బజాజ్ ఫైనాన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్‌యుఎల్ టాప్ లూజర్స్‌గా నిలిచాయి. అటు దేశీయ కరెన్సీ రూపాయి బలహీనంగా ముగిసింది. మునుపటి సెషన్‌లోని 81.88తో పోలిస్తే అమెరికా డాలర్ మారకంలో రూపాయి 81.98 వద్ద ముగిసింది. -
Today StockMarket: స్వల్ప లాభాలతో ముగిసిన మార్కెట్
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ గురువారం ఫ్లాట్‌గా ముగిసింది. గ్లోబల్ మార్కెట్లలో సానుకూల సంకేతాలతో ఆరంభంలో లాభాలతో ఉన్నప్పటికీ ఆ తరువాత ఒడిదుడుకులనెదుర్కొన్నాయి. చివరికి 44.4 పాయింట్ల లాభంతో సెన్సెక్స్ 61,320 వద్ద, నిఫ్టీ50 20 పాయింట్లు పెరిగి 18,036 వద్ద స్థిరపడింది. ఐటీ, ఫైనాన్షియల్, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్ల లాభాలు మద్దతిచ్చి యూఎస్ ఫెడ్ వడ్డీరేటు పెంపు ఉండకపోవచ్చుననే అంచనాలు ఆందోళనలను తగ్గించింది. ఓఎన్జీసీ, టెక్‌మహీంద్ర, అపోలో హాస్పిటల్స్, దివీస్ ల్యాబ్స్, నెస్లే టాప్ గెయినర్స్‌గా, బీపీసీఎల్, హెచ్డీఎఫ్సీ లైఫ్, హెచ్‌యూఎల్, ఎం అండ్, బజాజ్ ఫినాన్స్ టాప్ లూజర్స్‌గా స్థిరపడ్డాయి. అటు డాలరు మారకంలో రూపాయి 10పైసలు 82.71 వద్ద ముగిసింది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మండుటెండల్లోనూ నిండా ముంచే..రాష్ట్రవ్యాప్తంగా తడిసిన ధాన్యం
ప్రజలకు భరోసా కల్పించడమే లక్ష్యం
నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం
నక్సలైట్లమని నకిలీ పిస్టల్‌తో బెదిరింపులు
సకుటుంబ సపరివార సమేతం
పలకరించిన వరుణుడు
ఉన్న పెన్షన్లు తీసేస్తారు
‘బాబు కుయుక్తుల్లో చిక్కుకున్న ఎన్నికల కమిషన్’
ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని మీ కేశవ్ మెచ్చుకోలేదా బాబూ?
బాగా పనిచేస్తున్నారు.. ఇదే స్ఫూర్తి కొనసాగాలి
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement