-
మతిచెడి వచ్చారు.. మనసిచ్చిపుచ్చుకున్నారు.. ఇద్దరూ పట్టభద్రులే!
మోడువారిన చెట్టు చిగురిస్తే.. బీడు భూమిని వర్షపు చినుకు పలకరిస్తే.. ఆ ఆనందమే వేరు. ఆ అనుభూతికి ఏదీ సరికాదు. ఇది అక్షరాల నిజం అంటోంది.. ఆ జంట. అవును.. జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలుతిని వారు మానసిక రోగులయ్యారు.. చివరికి.. తమవారెవరో కూడా గుర్తించలేని దుస్థితికి చేరుకున్నారు. చికిత్స పొందే సమయంలో ఒకరిపై ఒకరు ఆప్యాయత పెంచుకున్నారు. తమకు కొత్త జీవితాన్ని ఇచ్చిన ఆస్పత్రి సిబ్బంది సాయంతోనే నేడు ఒక్కటయ్యేందుకు సిద్ధమయ్యారు. ఉన్నత చదువులు చదివినా.. జీవితమనే వెకుంఠపాళిలో చిక్కి.. శల్యమై.. భవిష్యత్‌పై ఆశలు వదిలేసుకున్న రెండు మనస్సులు.. బాధలను దిగమింగి.. కోటి ఆశలతో వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్నాయి. వారికి మనమూ చెబుతాం.. ఆల్..ది..బెస్ట్..! సాక్షి, చెన్నై: ప్రేమ.. ఈ రెండక్షరాల పదం.. ఇద్దరి మనస్సులను ఒక్కటి చేస్తుంది. పాతాలానికి పడిపోయినా.. ప్రపంచాన్ని ఎదిరించగలమనే శక్తినిస్తుంది. దీన్ని అక్షరాల నిజం చేసింది ఆ జంట. వివరాలు.. చెన్నై కీల్పాకం మానసిక రోగుల ఆసుపత్రికి 200 ఏళ్ల చరిత్ర ఉంది. ఇక్కడ వందలాది మంది మానసిక రోగులు చికిత్స తర్వాత సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యారు. ఇందులో చెన్నైకు చెందిన పీజీ పట్టభద్రుడైన మహేంద్రన్ (42) కూడా ఉన్నాడు. కుటుంబ గొడవలతో అతడు మానసిక రోగిగా మారాడు. ఇతడిని చికిత్స నిమిత్తం స్థానికులు కీల్పాకం మానసిక రోగుల ఆసుపత్రిలో చేర్చారు. ఇక్కడే వేలూరుకు చెందిన టీచర్ దీప (36) కూడా చికిత్స పొందుతున్నారు. తండ్రి మరణంతో తీవ్ర మనో వేదన గురై.. ఆమె మానసిక రోగిగా మారారు. ఈ ఇద్దరికీ ఆసుపత్రి డైరెక్టర్ పూర్ణ చంద్రిక నేతృత్వంలోని సిబ్బంది చికిత్స అందించారు. ఈ సమయంలో మహేంద్ర, దీప కలిసి మెలిసి ఉండేవారు. వెళ్లనని మారం చేసి మరీ... సేవలోకి.. రెండేళ్ల చికిత్స తర్వాత మహేంద్రన్, దీప సంపూర్ణ ఆరోగ్య వంతులయ్యారు. ఆసుపత్రి జీవితం నుంచి బయటి ప్రపంచంలో విహరించేందుకు వీరికి అవకాశం వచ్చింది. అయితే, తాము ఆసుపత్రి నుంచి వెళ్లబోమని, మిగిలిన వారికి సాయం చేస్తూ.. జీవితాన్ని సాగిస్తామని పట్టుబట్టి.. అక్కడే పనిలో చేరారు. రోగుల శిక్షణ కేంద్ర పర్యవేక్షణ పనుల్లో మహేంద్రన్, వంట పనుల్లో దీప భాగమయ్యేవారు. ఈ క్రమంలో వారు మరింతగా ఒకరిపై ఒకరు ఆప్యాయత పెంచుకున్నారు. ఓ రోజు మహేంద్రన్ ప్రేమిస్తున్నట్లు దీపాకు చెప్పాడు. ఆమెకు కూడా అంగీకరించడంతో ఈ విషయాన్ని డైరెక్టర్ పూర్ణ చంద్రికకు చెప్పి..తన భవిష్యత్‌కు కొత్త బాట వేసుకోవాలని వీరిద్దరూ నిర్ణయించారు. వీరి ప్రేమను గుర్తించిన ఆస్పత్రి వర్గాలు తామే దగ్గరుండి వివాహం చేస్తామని ఆ జంటకు హామీ ఇచ్చాయి. ఆస్పత్రి ఆవరణలోని సిద్ధి , బుద్ధి వినాయకుడి ఆలయంలో శుక్రవారం వివాహానికి ఏర్పాట్లు చేశారు. కాగా వివాహ అనంతరం ఈ దంపతుల కొత్త జీవితానికి అవసరమయ్యే అన్ని రకాల వస్తువులను తమ సొంత నగదుతో కొనుగోలు చేసి అందించాలని ఆసుపత్రి సిబ్బంది నిర్ణయించడం విశేషం. దీపావళి వేళ నిశ్చయం అయిన వీరి వివాహం.. దీప.. మహేంద్రన్ జీవితాల్లో సరి కొత్త వెలుగులు నింపాలని మనమూ కోరుకుందాం. -
ప్రతి జిల్లాలో ఓ మానసిక వైద్య కేంద్రం
రాయచూరు రూరల్ : మానసిక వ్యాధిగ్రస్తులకు వైద్య సేవలు అందించేందుకు ప్రతి జిల్లాలో మానసిక వైద్య కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర మానసిక ఆరోగ్య ప్రాధికారం అధ్యక్షుడు అశోక్‌పై తెలిపారు. శుక్రవారం ఆయన స్థానిక ఏసీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. డీఈఎం టీ పథకం కింద 2016 నాటికి రాష్ర్టంలోని ప్రతి జిల్లాలో 50 పడకల మానసిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటుకు కేంద్రం రూ.2కోట్ల మేర కేటాయించిందన్నారు. మహిళలు, యువతులపై జరుగుతున్న ఆత్యాచారాలనియంత్రణకు సంబంధించి ప్రభుత్వానికి నివేదికలు సమర్పించామన్నారు. మానసిక అస్వస్థులకు శివమొగ్గలో మానసిక ఆరోగ్య కేంద్రంలో చికిత్సలు నిర్వహిస్తామన్నారు. రాష్ట్రంలో హైస్కూల్ స్థాయిలో 14-17 సంవత్సరాల మధ్య వయస్సున్న విద్యార్థులకు వచ్చే ఏడాది నుంచి లైంగిక విద్యా బోధన ప్రవేశపెట్టాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. సమావేశంలో జిల్లాధికారి శశికాంత్ సెంథిల్, ఏసీ మారుతి, డీహెచ్ఓ సురేంద్రబాబు పాల్గొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
అమెరికా వరల్డ్‌కప్ జట్టులో ఐదుగురు భారత సంతతి ఆటగాళ్లు..
చావ్లా అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో రెండో బౌలర్‌గా
గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న నటుడి కూతురు (ఫోటోలు)
పార్టీ ఆఫీసులో రాహుల్ గాంధీ పూజలు - వీడియో వైరల్
వెంకటేశ్ అయ్యర్ అద్భుత పోరాటం.. ముంబై టార్గెట్ ఎంతంటే?
సీఎం జగన్ రేపటి ప్రచార సభల షెడ్యూల్ ఇలా..
పిల్లల్ని ఎందుకు కనలేదో తొలిసారి చెప్పిన వితికా
ధనుష్‌తో విడిపోయిన ఐశ్వర్య.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)
సొంతగూటికి సంజయ్ నిరుపమ్
అమిత్‌షాపై కోడ్ ఉల్లంఘన కేసు
తప్పక చదవండి
- వరల్డ్‌కప్‌కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్‌గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్‌లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్‌తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement