-
బాప్రే! ఈ పేయింటింగ్ ధర రూ. 260 కోట్లా!!
Frida Kahlo Self Portrait Painting: మెక్సికన్ దిగ్గజ కళాకారిణి ఫ్రిదా కహ్లో వేసిన అరుదైన పెయింటింగ్ న్యూయార్క్ వేలంలో దాదాపు 35 మిలియన్ డాలర్లకు (సుమారు రూ.260 కోట్లు ) అమ్ముడుపోయింది. అయితే ఈ చిత్రం గొప్పతనమేమిటంటే కళాకారిణి ఫ్రిదా తన స్వీయ చిత్రాన్ని తానే చిత్రించడమే కాక ఆ చిత్రంలో తన భర్త డియెగో రివెరా ముఖం తన నుదిటి పై ప్రతిబింబించేలా చిత్రిస్తుంది. (చదవండి: ఇజ్రాయెల్ అందాల పోటీలో విజేతగా 86 ఏళ్ల బామ్మ) పైగా ఈ పెయింటింగ్‌లో ఆమె విలక్షణమైన కనుబొమ్మలతో చీకటి కళ్ళపై నుండి కొన్ని కన్నీటి చుక్కలు వస్తున్నట్లు చిత్రించింది. అంతేకాదు ఫ్రిదా ఈ పెయింటింగ్‌ని తన భర్త "డియెగో వై యో" పేరుతో చిత్రించడం గమనార్హం. అయితే ఆమె భర్త డియెగో రివెరా మెక్సికన్ నటి ఫెలిక్స్‌తో సన్నిహితంగా మెలగడంతోనే ఆమె ఈ విధంగా తన భర్త ముఖాన్ని తన నుదిటపై మూడవ కన్నుగా చిత్రీకరించిందంటూ కొంతమంది కళాకారులు అభిప్రాయపడుతున్నారు. పైగా ఈ పెయింటింగ్ అతను ఆమె ఆలోచనలను ఏ స్థాయిలో హింసించాడో అనేదాన్ని కూడా సూచిస్తుందని అంటున్నారు. ఈ మేరకు ఈ పేయింటింగ్ చరిత్రలో వేలంలో అత్యంత ఖరీదకు అమ్ముడుపోయిన లాటిన్ అమెరికా కళాకృతిగా నిలిచింది. (చదవండి: వామ్మో! మొసలిని కౌగలింతలతో ఎలా ఉక్కిరిబిక్కిరి చేసేస్తోందో!!) -
హేయ్.. హాయ్.. అయామ్ విల్..
నయా సాల్.. నయా జోష్.. నయా హోప్స్ Do not seek to follow in the footsteps of the men of old.. seek what they sought.. అన్న జపాన్ కవి బషో మాటను పాటించాలనుకుంటోంది ఈతరం!. తనకంటూ ప్రత్యేకతను చాటుకోవాలనుకుంటోంది. ఆ సృజనకు 2015ను వేదికగా మలచుకుంటోంది. ప్రియాంక, నివేదిత, సూర్య, వీళ్ల రంగాలు వేరు. ఆశయాలు కొత్తవి. సాధించాలన్న తపన మెండు.. అదే స్ఫూర్తితో వాళ్ల వాళ్ల రంగాల్లో ‘హేయ్. హాయ్, ఐయామ్ విల్’ అంటూ నయాసాల్‌లో యువోత్సాహంతో ముందుకు సాగుతున్న వారి ‘న్యూ’ స్టోరీస్ ఇవి.. - సరస్వతి రమ/ కళ హేయ్.. ప్రియాంక ఏలె. కళా ప్రపంచంలో సుపరిచితమైన పేరు! తండ్రి లక్ష్మణ్ ఏలె నుంచి వారసత్వంగా అబ్బిన చిత్రకళకు తన రంగులద్దే ప్రయత్నం చేస్తున్న యువ కళాకారిణి. ఈ నెల 3న ‘జ్ఛిడ. జిజీ, జ్చీఝ ఠీజీ’ పేరుతో కళాకృతి ఆర్ట్ గ్యాలరీలో షో ప్రారంభించనున్నారు. పెర్ఫార్మెన్స్, వీడియో ఇన్స్టలేషన్, చిత్రాలు.. ఇదీ ‘హేయ్.. హాయ్.. ఐయామ్ విల్’ సంపూర్ణ రూపం!. మెక్సికన్ ఆర్టిస్ట్ ఫ్రీదాకాలే తనకు స్ఫూర్తి అని చెప్పే ప్రియాంక.. చిత్రకారిణిగా తన ప్రయాణాన్ని రెండు రకాలుగా విభజిస్తారు. ‘అన్వేషి’ వాళ్ల ‘విమెన్ రైటింగ్స్ ఇన్ ఇండియా’ పుస్తకం చదవడానికి ముందు, చదివిన తర్వాత అని!. పుస్తకం చదివాకే స్త్రీ సమస్యలపై ఫోకస్ స్టార్ట్ చేశారు ప్రియాంక. హాయ్.. సాధారణంగా ఏ షోకైనా ఒక పదంతోనే శీర్షిక ఉంటుంది. కానీ ప్రియాంక ‘హేయ్.. హాయ్.. ఐయామ్ విల్’.. అంటూ మూడు పదాలతో శీర్షిక పెట్టి తన ప్రత్యేకతను చూపించాలనుకున్నారు. పేరుతోనే ఆ తరాన్ని, ఈ తరాన్ని షోకి దగ్గర చేయాలని ఆమె ఉద్దేశం. స్త్రీ, ప్రకృతి.. పురుషుడు.. ఈ షో కాన్సెప్ట్! నిజానికి ఈ షోలో తన పెయింటింగ్స్ కన్నా వీడియో ఇన్స్టలేషన్, పెర్ఫార్మెన్స్‌కే ప్రాధాన్యమివ్వాలనుకుంటున్నారామె. ఇక డ్రాయింగ్స్.. అవి వాటంతటవే మాట్లాడుతాయి. ద్వాపరయుగంలోని ద్రౌపది నుంచి కలియుగంలోని నిర్భయ వరకు.. ఆయా కాలాలకు చెందిన అయిదుగురు మహిళలు.. వాళ్లను సమాజం చూసిన తీరును గీతల్లో.. కదిలే బొమ్మల్లో.. కదలని బొమ్మల్లో (మెనిక్వీన్) ఒకేసారి ప్రదర్శించనున్నారు. పెర్ఫార్మెన్స్.. ఒక్కో క్యారెక్టర్ తనను పరిచయం చేసుకునే వాయిస్‌ఓవర్‌తో మొదలవుతుంది. కుంచెతో గీసిన చిత్రాల్లో ప్రకృతి.. కదిలే బొమ్మల్లో స్త్రీ..కదలని బొమ్మతో సమాజం వైఖరి.. ‘హేయ్, హాయ్, ఐయామ్ విల్’లో ఆర్ట్ లవర్స్‌ను ఆకట్టుకోనున్నాయి!. అయామ్ విల్.. ఆర్ట్ షో విత్ పెర్ఫార్మెన్స్ అనేది కచ్చితంగా హైదరాబాద్‌కు కొత్తే. బయటి దేశాల్లో ఆర్టిస్టులు చాలా బోల్డ్‌గా పెర్ఫార్మ్ చేస్తారు. మన దగ్గర ఇంకా ఆ కల్చర్ లేదు. హైదరాబాద్‌లాంటి చోటైతే మరీ కష్టం. మెనిక్వీన్తో పెర్ఫార్మెన్స్ చేస్తానంటే క్యురేటర్స్ కొన్ని జాగ్రత్తలు, సూచనలు చెప్పారు. నిస్సందేహంగా ఇదో సాహసమే. ఇకపై నా ప్రతి షోలోనూ పెర్ఫార్మెన్స్ ఉంటుంది. చిన్నప్పటి నుంచి కల్చరల్ యాక్టివిటీస్‌లో ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసేదాన్ని. కూచిపూడి, భరతనాట్యం, గిటార్, వయోలిన్ నేర్చుకున్నాను. మోడలింగ్ చేసేదాన్ని. ఈ ఎక్స్‌పీరియన్సే ఇప్పుడీ షోలో పెర్ఫార్మెన్స్కి ఉత్సాహాన్నిస్తోంది. నా ఈ ఆలోచనకి ప్రోత్సాహమిచ్చి నన్ను ముందుకు నడిపిస్తోంది మాత్రం నాన్నే. ఆర్టిస్ట్‌గా నేను డిఫరెంట్ పాత్ని ఏర్పరచుకోవాలనే నా తపనకూ ఆయనే స్ఫూర్తి!. - ప్రియాంక ఏలె హేయ్.. రెడ్ ఎఫ్ఎం ఆర్జే సూర్య... సిటీలో వన్ ఆఫ్ ద యంగ్ ఆర్జే. వీకెండ్స్‌లో సండే-ఫండేతో ఏడాదిగా అలరిస్తున్న సూర్య ఈ మధ్యే వీజేగా మారాడు. తన ఆర్జేయింగ్కు మిమిక్రీ జోడించి వారం వారం నవ్వించే సూర్య న్యూ ఇయర్‌తో తన పంథాలో కొత్త మార్పులు చేయనున్నాడు. హాయ్.. తనకొచ్చిన మిమిక్రీతో చిన్నా చితకా షోలు చేస్తూ.. వచ్చిన డబ్బులతో చదువుసాగించాడు. ఆంధ్రా యూనివర్సిటీ యూత్ ఫెస్టివల్లో మిమిక్రీలో గోల్డ్ మెడల్ సాధించాడు. అనుకోకుండా రెడ్ ఎఫ్ఎం ఆడిషన్స్‌లో పాల్గొని తన గళంతో మెప్పించాడు. రేడియోలో ఎలా మాట్లాడుతారో తెలియని ఇతగాడు తనకొచ్చిన మిమిక్రీకి స్పాంటేనిటీ మిక్స్ చేసి సక్సెస్ కొట్టాడు. కామ్‌గా ఎంకామ్ చదువుకుంటూనే ఆర్జేగా అదరగొడుతున్నాడు. అయామ్ విల్.. ఈ తరం అనుకున్నది సాధించగలదు. అయితే వాళ్ల ముందున్న అవకాశాలను, టెక్నాలజీని.. వాటిని ఎలా ఉపయోగించుకోవాలో నాకు తెలిసిన రీతిలో వాళ్లకు చెప్తాను. ఇంత వరకూ కేవలం వినోదానికి మాత్రమే పరిమితం చేసిన నా షోస్ ద్వారా, ఇలాంటి మెసేజ్ నా ఫన్ స్టైల్లోనే అందించాలనుకుంటున్నాను. అలాగే ఈ ఏడాది, ఆర్జే, వీజేయింగ్తో పాటు ఆడియో లాంచ్‌లు, ఈవెంట్స్ ద్వారా కూడా వీలైనంత ఎక్కువగా ఎంటర్టైన్ చెయ్యాలనుకుంటున్నాను. యాక్టర్ కావాలనే నా కోరిక తీరుతుందని ఆశిస్తున్నా. - సూర్య హేయ్.. నివేదిత.. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. చిన్నప్పటి నుంచి ఉన్న రీడింగ్ హాబీ ఆమెకో కొత్త ఐడియానిచ్చింది. దాంతో ఆమె జీవితమే మారిపోయింది. క్యాంపస్ సెలక్షన్లో వచ్చిన ఉద్యోగాన్ని కాదనుకొని రాయిటర్స్‌లో జర్నలిస్ట్‌గా చేరి తర్వాత పబ్లిషర్ అయ్యారు. హాయ్ ఈ నెల 10, 11 తేదీల్లో రెండురోజుల రైటర్స్ కార్నివాల్ నిర్వహించబోతున్నారు నివేదిత. దీనికి హైదారబాద్‌లోని రసన, జ్యోత్స్న ఫనాజి లాంటి రచయితలే కాక ముంబై నుంచి రొషల్ పోత్కర్లాంటి పదిమంది ప్రముఖ రచయితలు హాజరవుతున్నారు. రచనా వ్యాసంగంలోని అన్ని అంశాలపై ఇందులో చర్చ ఉంటుంది. చిల్డ్రన్ ఆథర్స్, చిల్డ్రన్ కోసం ఒకరోజు కేటాయించారు. అయామ్ విల్ ‘లుంబినీ పార్క్‌లో బాంబ్ బ్లాస్ట్ అయినప్పుడు నేను నా స్నేహితులతో కలిసి అక్కడే ఉన్నాను. బేసిగ్గా హైదరాబాద్ లవర్ని. నేనెంతగానో ప్రేమించే హైదరాబాద్కైన ఆ గాయం చూశాక చాలా కలత చెందాను. చదివే అలవాటు, ఆ గాయం.. నేను బ్లాగ్ రాసేలా ప్రేరేపించాయి. అందుకే ఇంజనీరింగ్ బ్యాక్‌గ్రౌండ్‌తో వచ్చిన ఉద్యోగాన్నీ కాదనుకున్నాను. మాస్ కమ్యూనికేషన్లో పీజీ డిప్లమా చేసి రాయటర్స్‌లో చేరాను. అమ్మ ప్రోత్సాహంతో పబ్లిషర్నయ్యాను. డాలర్ నా డ్రీమ్ కాదు.. నేనుంటున్న ప్రదేశం గొప్పదనాన్ని చాటడమే నా ఎయిమ్. ఏ ప్రాంతానికైనా ఆ ప్రాంతం లిటరేచర్ కన్నా గొప్ప సంపద ఇంకేమీ ఉండదు. అందుకే పబ్లిష్ చేస్తున్నాను. చిన్నపిల్లల సాహిత్యం, చిల్డ్రన్ ఆథర్స్, ఇప్పటి వరకు వెలుగులోకి రాని రైటర్స్‌కి ఒక డయాస్ ఇవ్వడమే మా నివాసిని పబ్లిషర్స్ లక్ష్యం. - నివేదిత
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
గాజువాకలో జనజాతర
బీజేపీతోనే దేశ భద్రత, అభివృద్ధి
పటాన్‌చెరుపై పట్టెవరిదో?
బీఆర్ఎస్, కాంగ్రెస్ చేసిందేమీ లేదు
No Headline
అదనపు పోలింగ్ సిబ్బందికి శిక్షణ
బీజేపీ, టీడీపీ, జనసేన తోడు దొంగలు..!
అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
గాజువాకలో సీఎం రోడ్ షో, పాత గాజువాక సెంటర్లో ప్రారంభమైన బహిరంగ సభ (ఫోటోలు)
దర్శకుడిగా మారిన ప్రముఖ ఫోటోగ్రాఫర్
తప్పక చదవండి
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
- LS Elections: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్.. ఓటింగ్ శాతం ఎంతంటే..
Advertisement