-
మోడల్ పట్టణాలుగా తాడేపల్లి, మంగళగిరి
సాక్షి, అమరావతి: తాడేపల్లి, మంగళగిరిని మోడల్ పట్టణాలుగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన సమగ్రప్రాజెక్టు నివేదిక రూపకల్పనకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తాడేపల్లి, మంగళగిరి పట్టణాలను రూ.1,173 కోట్లతో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ఇదివరకే నిర్ణయించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా 20 కోట్ల రూపాయలను పాలనా అనుమతి కింద మంజూరు చేస్తూ పురపాలక శాఖ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. సమగ్రప్రాజెక్టు నివేదిక రూపకల్పన బాధ్యతలను ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసెట్ మేనేజ్మెంట్ లిమిటెడ్(ఏపీయూఐఏఎంఎల్)కు అప్పగించింది. (అపెక్స్ కౌన్సిల్ భేటీ వాయిదా!) చదవండి: (షర్మిలమ్మ పాదయాత్ర చారిత్రక ఘట్టం ) -
మోడల్ పట్టణంగా అనకాపల్లి
రూ.65 కోట్లతో శాశ్వత మంచినీటి ప్రణాళిక ఏలేరు కాలువ నుంచి నీటి మళ్లింపు ఆధునిక బస్షెల్టర్లు, సెంట్రల్ లైటింగ్ జీవీఎంసీ కమిషనర్ సత్యనారాయణ అనకాపల్లిరూరల్: అనకాపల్లిని మోడల్ పట్టణంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని జీవీఎంసీ కమిషనర్ సత్యనారాయణ వెల్లడించారు. అనకాపల్లి జోనల్ కార్యాలయంలో శుక్రవారం వివిధ శాఖల అధికారులతో కమిషనర్ సమీక్ష నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పట్టణ వాసుల మంచినీటి సమస్య శాశ్వతంగా పరిష్కరించేందుకు రూ.65 కోట్లతో ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. అలాగే రూ.70 లక్షలతో పాతపైపులైన్ల స్థానంలో కొత్తవి వేస్తామని చెప్పారు. పూడిమడక రోడ్డులో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు, రూ.18.5 లక్షలతో నూకాంబిక గుడి, వేల్పులవీధి, చిరంజీవి బస్టాప్, కూరగాయల మార్కెట్ వద్ద మరుగుదొడ్లు నిర్మాణం చేపట్టనున్నట్లు వివరించారు. అలాగే రూ.3.5 లక్షలతో ఆధునిక బస్షెల్టర్లు నిర్మిస్తామని చెప్పారు. మున్సిపల్ మైదానం వద్ద ఇద్దరు నైట్వాచ్మన్లను, లైట్లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. నీటి వృథా అరికట్టేందుకు రూ.2.65 లక్షలతో కుళాయిలకు హెడ్స్ బిగిస్తామని చెప్పారు. కొత్తగా 20 చోట్ల బోరుబావులు తవ్విస్తామని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న 400 బీపీఎల్ కుళాయి కనెక్షన్లు తక్షణం మంజూరు చేయనున్నట్లు చెప్పారు. డంపింగ్ యార్డు సమస్య పరిష్కారం పట్టణాన్ని వేధిస్తున్న డంపింగ్ యార్డు సమస్యకు కూడా త్వరలోనే పరిష్కారం కనుక్కుంటామని చెప్పారు. శారదనగర్‌లో ప్రస్తుతం ఉన్న చెత్తను పూర్తిగా తొలగిస్తామని తెలిపారు. పారిశుద్ధ్యం మెరుగుకు పక్కా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో జోనల్ కమిషనర్ శ్రీనివాసరావు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ సత్యనారాయణరాజు, శానిటరీ ఇన్స్పెక్టర్ పి.వి.జగన్నాథరావు పాల్గొన్నారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్‌పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కోనసీమ: ఉడుమూడిలో ఘోర రోడ్డు ప్రమాదం
త్రినయని సీరియల్ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్ (ఫోటోలు)
స్టార్ హీరో గొప్పమనసు.. రూ. కోటి చెక్ విరాళం!
ఎరక్కపోయి ఇరుక్కుపోయి
మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
కేఎల్ రాహుల్ మాస్టర్ ప్లాన్.. మెక్ గర్క్ సిల్వర్ డక్! వీడియో
Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్‌గా మళ్లీ కోహ్లినే!
రామ్- పూరి కాంబో.. డబుల్ మాస్ అప్డేట్ వచ్చేసింది!
స్వాతి మలివాల్‌పై దాడి నిజమే.. అంగీకరించిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్
'ఆ రూలే ఐపీఎల్‌ను మార్చేసింది.. వారు పునరాలోచనలో పడ్డారు'
తప్పక చదవండి
- తెలంగాణ లోక్‌సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్‌పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్‌కుమార్ ఆగ్రహం
Advertisement