-
ఎన్ఐఏ అధికారి భార్య కూడా..
న్యూఢిల్లీ : జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారి మొహమ్మద్ తంజిల్ అహ్మద్ భార్య ఫర్జానా అహ్మద్ (44) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందారు. ఉత్తరప్రదేశ్‌లో ఈ నెల 4వ తేదీన తంజిల్ అహ్మద్‌పై ఇద్దరు దుండగులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ సంఘటనలో తంజిల్ అక్కడికక్కడే మృతి చెందగా, ఆయన సతీమణి తీవ్రంగా గాయపడ్డారు. ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ ఆమె ఈరోజు ఉదయం 11 గంటలకు మరణించారు. తంజీల్ దంపతులకు ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ప్రధాన నిందితుడు మాత్రం పరారీలోనే ఉన్నాడు. కాగా వ్యక్తిగత కారణాలతోనే ఎన్ఐఏ అధికారిపై కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. -
ఎన్ఐఏ అధికారి హత్యకేసులో ఇద్దరి అరెస్ట్
లక్నో: ఎన్ఐఏ అధికారి తంజిల్ అహ్మద్ హత్యకేసుకు సంబంధించి ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. తంజిల్ హత్యకేసులో శనివారం జైనుల్, రీయాన్ను అదుపులోకి తీసుకున్నట్లు బిజ్నూర్ జోన్ ఐజీ విజయ్ కుమార్ మీనా తెలిపారు. కాగా ఈ కేసులో ప్రధాన నిందితుడు మునీర్ మాత్రం పరారీలోనే ఉన్నాడు. అతనిపై రూ.50వేల రివార్డు కూడా ఉంది. పఠాన్ కోట్ ఉగ్రదాడి కేసు దర్యాప్తు అధికారిగా ఉన్న మొహమ్మద్ తంజీల్ అహ్మద్ ఈ నెల 4వ తేదీన స్వగ్రామంలో జరిగిన వివాహానికి హాజరై కుటుంబంతో సహా కారులో తిరిగివస్తుండగా బిజ్నూర్ సమీపంలో దుండగులు అతణ్ని కాల్చిచంపిన సంగతి తెలిసిందే. 24 బుల్లెట్లు దూసుకెళ్లడంతో తంజీల్ అక్కడికక్కడే మరణిచారు. అతని పక్కసీట్లో కూర్చున్న భార్య ఫాతిమాకు నాలుగు బుల్లెట్లు తగిలాయి. ప్రస్తుతం ఆమె ఎయిమ్స్‌లో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. -
ఎన్ఐఏ అధికారి హత్య: దర్యాప్తులో కీలక మలుపు
లక్నో: భారత్ లోనేకాక పాకిస్థాన్ లోనూ సంచలనం కలిగించిన ఎన్ఐఏ అధికారి తంజిల్ అహ్మద్ హత్యకుసు దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. స్వగ్రామం సాహస్ పూర్ లో తంజీల్ హాజరైన వివాహవేడుకకు హాజరైన ఇద్దరు వ్యక్తులే హంతకులై ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు పెళ్లి వీడియోను కూలంకషంగా పరిశీలించారు. ఇద్దరు ఆ అనుమానితుల్లో ఒకరిని ఆర్షిగా గుర్తించామని, అతను తంజీల్ కుటుంబానికి స్నేహితుడని బిజ్నూర్ ఎస్పీ సుభాస్ సింగ్ బఘేల్ తెలిపారు. రెండో వ్యక్తిని ఇంకా గుర్తించాల్సిఉందన్నారు. ఇప్పటివరకు లభించిన ఆధారాలను బట్టి వ్యక్తిగత కక్షలే తంజీల్ హత్యకు కారణమై ఉండొచ్చని పోలీసులు పేర్కొన్నారు. పఠాన్ కోట్ ఉగ్రదాడి కేసు దర్యాప్తు అధికారిగా ఉన్న మొహమ్మద్ తంజీల్ అహ్మద్ గత ఆదివారం స్వగ్రామంలో జరిగిన వివాహానికి హాజరై కుటుంబంతో సహా కారులో తిరిగివస్తుండగా బిజ్నూర్ సమీపంలో దుండగులు అతణ్ని కాల్చిచంపిన సంగతి తెలిసిందే. 24 బుల్లెట్లు దూసుకెళ్లడంతో తంజీల్ శరీం ఛిధ్రమైపోయి అక్కడికక్కడే మరణిచారు. అతని పక్కసీట్లో కూర్చున్న భార్య ఫాతిమాకు నాలుగు బెల్లెట్లు తగిలాయి. నోయిడాలోని ఫోర్టిస్ ఆసుపత్రిలో ఆమెకు ఆపరేషన్ నిర్వహించారు. ప్రస్తుతం ఫాతిమా ఆరోగ్యపరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు. అనేక విమర్శలు చెలరేగిన నేపథ్యంలో తంజీల్ హత్యకేసు సీరియస్ గా తీసుకున్న యూపీ పోలీసులు దర్యాప్తు నిమిత్తం ఎనిమిది బృందాలను ఏర్పాటుచేశారు. యూపీలోని డ్రగ్స్ మాఫియా, హవాలా వ్యాపారులు సహా మాజీ నేరస్తులను కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. వీలనైన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగించామని, లభించిన ఆధారాలను బట్టి వ్యక్తిగత కక్షలే హత్యకు కారణంగా భావిస్తున్నామని, ఒకటి రెండు రోజుల్లో దర్యాప్తు ముగింపునకు వచ్చేఅవకాశం ఉన్నట్లు ఓ అధికారి చెప్పారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- Prajwal Revanna: ఏ గదిలో ఏం జరిగింది?
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్‌స్టాప్‌గా... జెట్ స్పీడ్‌లో
Advertisement