-
ఎస్ఐని లాగి చెంపమీద కొట్టాడు!
-
ఎస్ఐని లాగి చెంపమీద కొట్టాడు!
తన పేరు చెప్పేటప్పుడు ఆ యువకుడి గొంతులో కాస్తంత గర్వం తొణికిసలాడింది. ''నా పేరు మోహిత్ యాదవ్..'' అంటూనే ఒక్కసారిగా అక్కడున్న పోలీసు అధికారి చెంప మీద కొట్టాడు. తన మేనమామ పేరు చెప్పుకొంటూ అతగాడు రెచ్చిపోయాడు. ఎందుకంటే అతడి మేనమామ ఉత్తరప్రదేశ్‌లోని ఇటా నియోజకవర్గానికి చెందిన సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్సీ!! మోహిత్ యాదవ్ అప్పటికే బాగా తాగేసి ఉన్నాడు. తనను స్టేషన్‌కు పిలిపించినందుకు అతడికి ఎక్కడలేని కోపం వచ్చింది. దాంతో ఎస్ఐ జితేంద్ర కుమార్‌ను లాగి ఒక్కటిచ్చాడు. అక్కడున్న మిగిలిన పోలీసులు అతడిని పట్టుకుని ఆపేందుకు ప్రయత్నించగా, వాళ్లలో ఒకరి కాలర్ పట్టుకున్నాడు. పోలీసు అధికారుల విధి నిర్వహణను అడ్డుకున్నందుకు యాదవ్‌ను అరెస్టు చేశారు. మోహిత్ యాదవ్ మామ రమేష్ యాదవ్ సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నాయకుడు, ప్రస్తుతం ఎమ్మెల్సీ. యూపీ ఎన్నికల సమయంలో ఆయనను బీజేపీ తమ పార్టీ నుంచి తప్పించింది. అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో ఇలాంటి ఘటనలు చాలావరకు జరిగాయి. రాజకీయ నాయకులు, వాళ్ల బంధువులు పలువురు అధికారుల మీద దాడులు చేసేవారు. అయితే కొత్తగా అధికారం చేపట్టిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాత్రం ఇలా ఎవరైనా చట్టాలను ఉల్లంఘిస్తే ఊరుకునేది లేదని స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. మోహిత్ యాదవ్ నిరుద్యోగి. వాళ్ల నాన్నకు తుపాకుల దుకాణం ఉంది. మోహిత్ పొద్దున్న ఆస్పత్రికి వెళ్లి, తన బంధువుకు ఎక్స్‌రే తీయించుకోడానికి వీఐపీ ట్రీట్మెంట్ కావాలని డిమాండ్ చేశాడు. వాళ్లను వెంటనే చూడాలని, క్యూలో వేచి ఉండేది లేదని అన్నాడు. అలా కుదరదని అక్కడి సిబ్బంది చెప్పడంతో అక్కడున్న ల్యాబ్ టెక్నీషియన్‌ను కొట్టడంతో పాటు డాక్టర్ మీద కూడా దాడి చేశాడు. ఆస్పత్రి వర్గాలు పోలీసులకు చెప్పడంతో వాళ్లొచ్చి అతడిని స్టేషన్‌కు లాక్కెళ్లారు. అక్కడ కూడా అలాగే చేయడంతో లోపల వేశారు. అతడు బాగా తాగినట్లు తెలుస్తోందని సీనియర్ పోలీసు అధికారి సత్యార్థ్ అనిరుథ్ పంకజ్ చెప్పారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
హోం ఓటింగ్ పరిశీలన
నిప్పుతో చెలగాటమా!
మాదిగలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ
‘రాహుల్ పేరు చెబితే ఓట్లు పడవు’
కాంగ్రెస్‌తోనే అన్నివర్గాలకు సముచిత న్యాయం
హామీలు నెరవేర్చడంలో రేవంత్ విఫలం
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
హామీల అమలులో కాంగ్రెస్ విఫలం
పార్లమెంట్ ఎన్నికలు బహిష్కరిస్తాం..
మూడోసారి మోదీ సర్కారే..
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్‌కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్‌తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement