-
కూలిన నగరంపై కొత్త పట్నం
మోసుల్ పేరు విన్నారా? అదేనండి.. ఈ మధ్య కాలంలో కరుడుకట్టిన ఉగ్రవాద మూక ఐసిస్ కబ్జా నుంచి విముక్తమైన ఇరాకీ నగరం. మూడేళ్ల ఐసిస్ దుశ్చర్యలకు ఈ నగరం కాస్తా కాంక్రీట్ దిబ్బగా మారిపోయింది. ఏదో అక్కడక్కడా ఒకట్రెండు భవనాలు మిగిలి ఉన్నాయేమో అంతే. ఎలాగూ ఐసిస్ పీడ విరగడైంది కాబట్టి.. ఈ నగరాన్ని మళ్లీ కట్టేయాలని స్థానిక ప్రభుత్వం ఆలోచిస్తోందట. ఎలా కడితే బాగుంటుందో చెప్పమని ఈమధ్యే ఓ పోటీ పెట్టారు కూడా. ఒకసారి ఈ ఫొటోలవైపు చూడండి. మోసుల్‌ను ఇలా ఒక ఓడలా మార్చేద్దామంటున్నారు విన్సెంట్ కాలెబో అనే ఆర్కిటెక్చర్ సంస్థ డిజైనర్లు! వారి ప్రతిపాదనలు ఎలాగున్నాయంటే... ఎలాగూ అక్కడ టైగ్రిస్ నదిపై ఐదు వంతెనలు ఉన్నాయి కదా.. వాటిపైనే ఇళ్లు కట్టేద్దాం.. అత్యాధునిక హైడ్రోపోనిక్స్ వ్యవస్థలు ఏర్పాటు చేస్తే నగర వాసులకు అవసరమైన పంటలు అక్కడికక్కడే పండించుకోవచ్చు. అవసరమైన నీటిని టైగ్రిస్ నది నుంచి తోడుకోవచ్చు. అన్ని రకాల సేంద్రియ వ్యర్థాలను కూడా రీసైకిల్ చేస్తాము కాబట్టి... పంటలకు ఎరువుల కొరత ఉండదు. త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీని వాడుకుని.. ఇస్లామిక్ సంప్రదాయ కళల స్ఫూర్తితో ఇళ్లు కట్టేద్దాం. పద్ధతిగా ఒకదానిపై ఒకటి పేర్చేసి.. అక్కడక్కడా గాలిమరలు, చిమ్నీలు ఏర్పాటు చేస్తే అడుగున ఉన్న టైగ్రిస్ నది నీటి ఆవిరి కారణంగా ఇళ్లల్లో ఉన్నవారందరికీ చల్లటిగాలి తగులుతూ ఉంటుంది. దీంతోపాటు ఇళ్లపైకప్పులపై వేసే సోలార్‌ప్యానెల్స్‌తో వేడినీటిని ఇవ్వొచ్చు. ఇక ఈ పచ్చటి నగరంలో వాడేసిన నీరు కూడా వృథా పోకుండా రీసైకిల్ చేసి మళ్లీ నదిలోకి వదిలేస్తే హోరున జారిపడే జలపాతాలూ అక్కడికక్కడే సృష్టించవచ్చు.... ఇలా ఉన్నాయి విన్సెంట్ కాలెబో ఆలోచనలు. ఇవన్నీ వాస్తవరూపం దాలుస్తాయా? ఎడారి రాజ్యంలో.. ఉగ్రవాద చర్యలతో సర్వనాశనమై పోయిన నగరంలో మళ్లీ పచ్చదనం అనే ఆశ చిగురిస్తుందా? చిగురిస్తే అద్భుతమే. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
ఏడుగురికి ఐసిస్ మరణదండన
బాగ్దాద్: యుద్ధ రంగం నుంచి పిరికిపందల్లా పారిపోయేందుకు ప్రయత్నించారనే ఆరోపణలతో ఏడుగురికి ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) మరణదండన విధించింది. తమ కీలక స్థావరం నుంచి మోసూల్ నగరం నుంచి చెప్పాపెట్టకుండా వెళ్లిపోయేందుకు ప్రయత్నించినందుకు వీరికి మరణశిక్ష అమలుచేసినట్టు స్థానిక వెబ్ సైట్ 'అరా న్యూస్' వెల్లడించింది. 'ఈ ఏడుగురు సిరియా సరిహద్దులో ఆదివారం పట్టుబడ్డారు. అధినాయకత్వం అనుమతి లేకుండా తమ పదవులను వదిలిపెట్టారు. మొసూల్ నగరం నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారు. జాతిద్రోహానికి పాల్పడినందుకు వీరిని కాల్చిచంపార'ని మీడియా కార్యకర్త అబ్దుల్లా ఆల్-మల్లా వెల్లంచినట్టు 'అరా న్యూస్' తెలిపింది. మోసుల్ నగరాన్ని దక్కించుకునేందుకు అమెరికా సైనం సహకారంలో ఇరాక్ ఆపరేషన్ మొదలుపెట్టడంతో ఐసిస్ తీవ్రంగా పోరాడుతోంది. మోసుల్ నగరాన్ని 2014లో ఐసిస్ స్వాధీనం చేసుకుని తమ రాజధానిగా ప్రకటించుకుంది. -
అమెరికా దాడుల్లో ఐసిస్ అగ్రనేతల హతం
వాషింగ్టన్: ఇరాక్‌లోని మోసుల్ నగరంపై అమెరికా గత నెల 25న జరిపిన వైమానిక దాడుల్లో ఇద్దరు ఐసిస్ సీనియర్ మిలటరీ కమాండర్లు అహ్మద్ అల్బజరీ, హతీం అల్హమ్దునీ మృతిచెందారని పెంటగన్ పేర్కొంది. దీంతో మోసుల్‌పై ఐసిస్ పట్టు కోల్పోయినట్లేనంది. పాక్‌లో ఉగ్రవాదులపై 2009-2015 మధ్యజరిపిన దాడుల్లో 116 మంది సాధారణ పౌరులు మృతిచెందారని పేర్కొంది. యూఎస్ స్వాతంత్య్ర దినమైన జూన్ 4న ఆ దేశ ఎయిర్‌పోర్టులపై దాడులు చేస్తామని ఐసిస్ సానుభూతిపరులు ట్విటర్లో హెచ్చరించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోలింగ్ కేంద్రాల తనిఖీ
పట్టుదలతో చదవండి
స్వర్ణకారుల సమస్యలు పరిష్కరిస్తాం
ఆదాయపు పన్ను మాఫీ చేయిస్తాం
ఓపెన్ కాస్టుల్లో పనివేళలు మార్చండి
కమిషనింగ్ పూర్తిచేయండి
ఓదెల మల్లన్న సాక్షిగా చెబుతున్నా..
సర్కారు ఆస్పత్రిలో గడువు ముగిసిన మందులు!
ఎన్నికల ప్రచార వ్యయం నమోదుపై సమావేశం
వేడెక్కిన ప్రచారం
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్‌లో ఉన్నా: నటి
- హీట్‌వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్‌తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement