-
16 ఏళ్ల క్రికెటర్‌కు బంపరాఫర్.. ఐపీఎల్లో ఎంట్రీ! ఎవరంటే?
ఐపీఎల్-2024 సీజన్‌కు కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆటగాడు, అఫ్గానిస్తాన్ స్టార్ స్పిన్నర్ ముజీబ్ ఉర్ రెహ్మాన్ గాయం కారణంగా దూరమైన సంగతి తెలిసిందే. తాజాగా అతడి స్ధానాన్ని అఫ్గానిస్తాన్ యువ స్పిన్నర్ అల్లాహ్ ఘజన్‌ఫర్‌తో కేకేఆర్ ఫ్రాంచైజీ భర్తీ చేసింది. 16 ఏళ్ల ఘజన్‌ఫర్‌ను రూ. 20 లక్షల బేస్ ప్రైస్‌కు కోల్‌కతా సొంతం చేసుకుంది. ఘజన్ఫర్ ఇటీవలే ఐర్లాండ్‌తో వన్డే సిరీస్‌తో అఫ్గానిస్తాన్ తరపున అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టాడు. అతడు కేకేఆర్ తరపున క్యాప్ అందుకుంటే ఐపీఎల్లో అరంగేట్రం చేసిన అతి పిన్న వయస్కుడిగా రికార్డులకెక్కుతాడు. మరోవైపు రాజస్తాన్ రాయల్స్ సైతం ప్రసిద్ధ్ కృష్ణ స్ధానాన్ని భర్తీ చేసింది. అతడి స్థానంలో దక్షిణాఫ్రికాకు చెందిన కేశవ్ మహరాజ్‌ను యాజమాన్యం జట్టులోకి తీసుకుంది. మోకాలి గాయం కారణంగా ప్రసిద్ద్ ఈ ఏడాది సీజన్ నుంచి తప్పుకున్నాడు. అశ్విన్,చాహల్‌కు బ్యాకప్ స్పిన్నర్‌గా మహారాజ్ ఉండనున్నాడు. కేశవ్ మహారాజ్ ఇప్పటి వరకు 27 టీ20లు, 44 వన్డేలు, 50 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. అంతర్జాతీయ క్రికెట్లో 237 వికెట్లు సొంతం చేసుకున్నాడు. రాజస్థాన్ యాజమాన్యం అతడిని రూ.50 లక్షలకు సొంతం చేసుకుంది. -
ఐపీఎల్: ఆ ఫ్రాంచైజీలకు గుడ్‌న్యూస్.. ఆ ముగ్గురి ఆటగాళ్లకు లైన్ క్లియర్
ఐపీఎల్-2024 సీజన్‌కు ముందు అఫ్గానిస్తాన్ త్రయం ముజీబ్ ఉర్ రెహ్మాన్, ఫజల్హాక్ ఫరూకీ, నవీన్-ఉల్-హక్లకు ఊరట లభించింది. ఈ ఏడాది ఐపీఎల్లో పాల్గోనేందుకు అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు కొన్ని షరుతులతో కూడిన నో-అబ్జెక్షన్స్ సర్టిఫికేట్లను (NOC) మంజూరు చేసింది. కాగా గత నెలలలో జాతీయ జట్టును కాదని ఫ్రాంఛైజీ క్రికెట్‌కు ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటున్న కారణంగా ఈ ముగ్గరిపై అఫ్గానిస్తాన్ క్రికెట్ కొన్ని ఆంక్షలు విధించింది. విదేశీ లీగ్‌లలో రెండేళ్ల పాటు ఆడకూడకుండా నిషేధం విధించింది. ముగ్గురి సెంట్రల్ కాంట్రాక్టుల విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది. అయితే ఆ తర్వాత ఈ ముగ్గురు ఆటగాళ్లు అఫ్గాన్ క్రికెట్ బోర్డుతో చర్చలు జరిపారు. ఈ క్రమంలో బోర్డు నిబంధనలకు వీరి ముగ్గురు అంగీకరించడంతో అఫ్గాన్ క్రికెట్ తమ నిర్ణయాన్ని వెనుక్కి తీసుకుంది. కాగా ఐపీఎల్-2023 సందర్భంగా రూ. 50 లక్షలకు పేసర్ నవీన్ ఉల్ హక్‌ను సొంతం చేసుకున్న లక్నో సూపర్ జెయింట్స్.. 2024 వేలానికి ముందు అతడిని రిటైన్ చేసుకుంది. 2023 సీజన్లో నవీన్.. మొత్తంగా 11 వికెట్లు పడగొట్టి జట్టు విజయాల్లో తన వంతు పాత్ర పోషించాడు. అదే విధంగా ఫజల్హక్ ఫారూకీని ఎస్ఆర్హెచ్ రూ. 50 లక్షలు వెచ్చించి రిటైన్ చేసుకుంది. వీరిద్దరితో పాటు ఐపీఎల్-2024 మినీ వేలంలో ముజీబ్ ఉర్ రహ్మాన్‌ను కేకేఆర్.. రూ. 2 కోట్ల కనీస ధరకు అతడిని కొనుగోలు చేసింది. చదవండి: T20 WC:రోహిత్, కోహ్లిల రీఎంట్రీపై గరం గరం చర్చ! -
టీమిండియాతో సిరీస్‌కు అఫ్గన్ జట్టు ప్రకటన: ప్లేయర్‌గా రషీద్.. కెప్టెన్?
Ind vs Afg T20 Serie- Rashid Khan returns in squad but might not play: టీమిండియాతో టీ20 సిరీస్‌కు అఫ్గనిస్తాన్ తమ జట్టును ప్రకటించింది. భారత్ వేదికగా జరుగనున్న సిరీస్‌కు 19 మంది సభ్యులతో కూడిన టీమ్‌ను ఎంపిక చేసింది. వెన్నునొప్పితో బాధపడుతున్న కెప్టెన్, స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌కు కూడా ఈ జట్టులో చోటిచ్చినట్లు వెల్లడించింది. కెప్టెన్‌గా మళ్లీ అతడే అయితే, భారత జట్టుతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో.. అతడు ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం లేదని పేర్కొంది. రషీద్ ఖాన్ స్థానంలో ఇబ్రహీం జద్రాన్ మరోసారి కెప్టెన్‌గా వ్యవహరించనున్నట్లు తెలిపింది. ఇందుకు సంబంధించి అఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డు శనివారం ప్రకటన విడుదల చేసింది. కాగా జనవరి 11 నుంచి టీమిండియా- అఫ్గనిస్తాన్ మధ్య మూడు మ్యాచ్‌ల సిరీస్ ఆరంభం కానుంది. కాగా గాయం కారణంగా రషీద్ ఖాన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో టీ20 సిరీస్‌కు దూరం కాగా.. అతడి స్థానంలో స్టార్ బ్యాటర్ ఇబ్రహీం జద్రాన్ సారథ్య బాధ్యతలు నిర్వహించాడు. ఇక ఈ 22 ఏళ్ల రైట్‌హ్యాండ్ బ్యాటర్ కెప్టెన్సీలో యూఏఈ సిరీస్‌ను పర్యాటక అఫ్గనిస్తాన్ 2-1తో అఫ్గన్ గెలుచుకుంది. సర్జరీ చేయించుకున్న రషీద్ ఖాన్.. అఫ్గన్‌కు ఇదే తొలిసారి ఇక వెన్నునొప్పికి సర్జరీ చేయించుకున్న రషీద్ ఖాన్.. ఇంకా పూర్తి స్థాయి ఫిట్నెస్ సాధించలేదు. కాబట్టి.. జట్టుకు ఎంపికైనప్పటికీ అతడు టీమిండియాతో మ్యాచ్‌లు ఆడే అవకాశం లేదు. ఇదిలా ఉంటే.. టీ20 సిరీస్ కోసం అఫ్గనిస్తాన్ భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో పటిష్ట, నంబర్ 1 టీమిండియాతో పోటీపడటం తమకు సంతోషాన్నిస్తోందన్న అఫ్గన్ బోర్డు.. మెరుగైన ప్రదర్శనతో అండర్ డాగ్స్ అనే ముద్ర చెరిపేసుకుంటామని పేర్కొంది. టీమిండియాతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు అఫ్గనిస్తాన్ జట్టు ఇబ్రహీం జద్రాన్ (కెప్టెన్), రహ్మతుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), ఇక్రమ్ అలీఖిల్ (వికెట్ కీపర్), హజ్రతుల్లా జజాయ్, రహ్మత్ షా, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ, కరీం జనత్, అజ్మతుల్లా ఒమర్జాయ్, షరాఫుద్దీన్ అష్రఫ్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, ఫజల్ హక్ ఫారూఖీ, ఫరీద్ అహ్మద్, నవీన్ ఉల్ హక్, నూర్ అహ్మద్, మహ్మద్ సలీం, కైస్ అహ్మద్, గుల్బదిన్ నైబ్, రషీద్ ఖాన్. చదవండి: శతక్కొట్టిన పుజారా: ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ముందు సెలక్టర్లకు స్ట్రాంగ్ మెసేజ్ -
ఆంక్షల ఫలితం... అఫ్గాన్ స్టార్ క్రికెటర్‌పై వేటు!
జాతీయ జట్టుకు తొలి ప్రాధాన్యత ఇవ్వకుండా ఫ్రాంచైజీ టి20 లీగ్‌లవైపు మొగ్గుచూపుతున్న తమ దేశ క్రికెటర్లు ముజీబ్ ఉర్ రెహ్మన్, నవీన్ ఉల్ హక్, ఫజల్హక్ ఫరూఖీలపై గతవారం అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ) ఆంక్షలు విధించింది. ఇవి అమల్లోకి రావడంతో ఆ్రస్టేలియాలో ప్రస్తుతం జరుగుతున్న బిగ్‌బాష్ టి20 లీగ్‌లో మంగళవారం మెల్బోర్న్ స్టార్స్‌తో మ్యాచ్‌లో మెల్బోర్న్ రెనెగెడ్స్ తరఫున ఆడాల్సిన ముజీబ్‌ను ఆ జట్టు తప్పించింది. ఈ సీజన్లో రెనెగెడ్స్ తరఫున ఆడిన ఏకైక మ్యాచ్‌లో ముజీబ్ 20 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. చదవండి: IND-W vs AUS-W: విజయంతో ప్రారంభించాలని... -
నవీన్ సహా ఆ ఇద్దరిపై రెండేళ్ల నిషేధం.. ఐపీఎల్ జట్లకు ఎదురుదెబ్బ
Afghanistan Cricket Board (ACB) Impose Ban: స్టార్ బౌలర్లు నవీన్ ఉల్ హక్, ఫజల్హక్ ఫారూకీ, ముజీబ్ ఉర్ రహ్మమాన్లకు ఊహించని షాకిచ్చింది అఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డు. విదేశీ లీగ్‌లలో రెండేళ్ల పాటు ఆడకూడకుండా నిషేధం విధించింది. అంతేగాకుండా.. ఈ ముగ్గురి సెంట్రల్ కాంట్రాక్టుల విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది. నవీన్, ఫారూకీ, ముజీబ్.. జాతీయ జట్టును కాదని ఫ్రాంఛైజీ క్రికెట్‌కు ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటున్న కారణంగా ఈ మేరకు ఏసీబీ కఠిన నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని లోతుగా పరిశీలించేందుకు విచారణ కమిటీని కూడా నియమించింది. ఒకవేళ జాతీయ జట్టు ప్రయోజనాలకు భంగం కలిగించే విధంగా వ్యవహరించారని తేలితే నవీన్, ఫారూకీ, ముజీబ్ సెంట్రల్ కాంట్రాక్టులను ఏడాది పాటు రద్దు చేసేందుకు సిద్ధమైనట్లు ఏసీబీ తెలిపింది. ఐపీఎల్ జట్లకు ఎదురుదెబ్బ అఫ్గన్ బోర్డు నిర్ణయం కారణంగా ఐపీఎల్ ఫ్రాంఛైజీలు కోల్‌కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. కాగా ఐపీఎల్-2024 మినీ వేలంలో భాగంగా రైటార్మ్ స్పిన్నర్ ముజీబ్ ఉర్ రహ్మాన్‌ను కేకేఆర్.. రూ. 2 కోట్ల కనీస ధరకు అతడిని కొనుగోలు చేసింది. మరోవైపు.. ఐపీఎల్-2023 సందర్భంగా రూ. 50 లక్షలకు పేసర్ నవీన్ ఉల్ హక్‌ను సొంతం చేసుకున్న లక్నో.. 2024 వేలానికి ముందు అతడిని రిటైన్ చేసుకుంది. 2023 సీజన్లో నవీన్.. మొత్తంగా 11 వికెట్లు పడగొట్టి జట్టు విజయాల్లో తన వంతు పాత్ర పోషించాడు. ఇక సీమర్ ఫజల్హక్ ఫారూకీని ఎస్ఆర్హెచ్ రూ. 50 లక్షలు వెచ్చించి రిటైన్ చేసుకుంది. పదహారో ఎడిషన్‌లో అతడు ఏడు మ్యాచ్‌లు ఆడి ఆరు వికెట్లు కూల్చాడు. దేశానికి ఆడే ఉద్దేశం లేదా? వేటు తప్పదు సౌతాఫ్రికా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ క్వింటన్ డికాక్, న్యూజిలాండ్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ వంటి చాలా మంది క్రికెటర్లు దేశానికి కాదని ఫ్రాంఛైజీ క్రికెట్‌కే ప్రాధాన్యం ఇస్తున్నారు. తాజాగా అఫ్గన్ బౌలర్లు నవీన్, ఫారూఖీ, ముజీబ్ కూడా ఈ జాబితాలో చేరాలని భావించారు. ఈ నేపథ్యంలో అఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డు కఠిన చర్యలకు ఉపక్రమించింది. ‘‘ముగ్గురు జాతీయ క్రికెటర్ల సెంట్రల్ కాంట్రాక్టులు, విదేశీ లీగ్‌లలో ఆడే విషయంపై ఏసీబీ నిబంధనలు విధించాలని నిర్ణయించింది. నో ఆబ్జక్షన్ లెటర్ ఇచ్చేదే లేదు వచ్చే ఏడాది వారికి సెంట్రల్ కాంట్రాక్టులు ఇవ్వాలా లేదా అన్నది తర్వాత నిర్ణయిస్తాం. ముజీబ్ ఉర్ రహ్మాన్, ఫజల్హక్ ఫారూకీ, నవీన్ ఉల్ హక్ మురీద్ వార్షిక కాంట్రాక్టులు వదులుకుని ఫ్రాంఛైజీ క్రికెట్ ఆడాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. వరల్డ్‌కప్-2023లో మెరుగైన ప్రదర్శన అయితే, విదేశీ లీగ్‌లలో ఆడేందుకు నిరభ్యంతర పత్రం ఇచ్చేందుకు బోర్డు నిరాకరిస్తోంది. ఫ్రాంఛైజీ క్రికెట్ ఆడకుండా రెండేళ్ల పాటు వాళ్లపై నిషేధం విధిస్తున్నాం’’ అని అఫ్గన్ బోర్డు ప్రకటన విడుదల చేసింది. కాగా వన్డే వరల్డ్‌కప్-2023లో అండర్‌డాగ్‌గా బరిలోకి దిగిన అఫ్గనిస్తాన్ అంచనాలకు మించి రాణించింది. డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్, పాకిస్తాన్ వంటి పటిష్ట జట్లను మట్టికరిపించి సంచలన విజయాలు నమోదు చేసి ఒకానొక సందర్భంలో సెమీస్ రేసులోనూ నిలిచింది. ఇలాంటి తరుణంలో అంతర్జాతీయ క్రికెట్లో తమదైన ముద్ర వేస్తున్న సమయంలో కీలక ఆటగాళ్లు ఇలా ఫ్రాంఛైజీ క్రికెట్‌కు ప్రాధాన్యం ఇవ్వడాన్ని ఏసీబీ తీవ్రంగా పరిగణించి కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. చదవండి: Rohit Sharma On His T20 Career: నాకూ ఆడాలనే ఉంది.. టీ20 కెరీర్‌పై రోహిత్ శర్మ క్లారిటీ!
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్‌కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
ఇరాన్ నుంచి పారిపోయి కొచ్చికి భారత మత్స్యకారులు
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
Video: కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్‌లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్‌తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement