-
విదేశీయానంలోనూ కార్డు..
సెలవులను ఎంజాయ్ చేసేందుకు విదేశాలకు వెళుతున్నారా? అయితే ఫారెక్స్ కార్డ్ గురించి మరిన్ని సంగతులను తెలుసుకోండి! భారతీయులు విదేశాలను సందర్శించడం ఇటీవల అధికమైంది. ఫారిన్ ప్రయాణానికి బయల్దేరేముందు సిద్ధం చేసుకోవాల్సిన తప్పనిసరి జాబితాలో విదేశీ కరెన్సీకి అత్యంత ప్రాధాన్యత ఉంది. సంప్రదాయ రీతిలో ట్రావెలర్ చెక్కులను, విదేశీ కరె న్సీని తీసుకెళ్లడం కంటే ఉత్తమమైన ఆప్షన్‌గా ప్రీపెయిడ్ ఫారెక్స్ కార్డ్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ఇది సురక్షితమైనదే కాకుండా సౌకర్యవంతంగా కూడా ఉంటుంది. డెబిట్, క్రెడిట్ కార్డ్‌లా పనిచేసే ఫారెక్స్ కార్డ్‌ను విదేశీ ఎటీఎంలలో వినియోగించవచ్చు. కనీస లావాదేవీ చార్జీలే వర్తిస్తాయి. అంతేకాకుండా కరెన్సీల్లో హెచ్చుతగ్గుల నుంచి కూడా రక్షణ లభిస్తుంది. మల్టీ కరెన్సీ కార్డ్‌లు మేలు మల్టీ కరెన్సీ ప్లాటినం ఫారెక్స్ప్లస్ కార్డ్‌లను తీసుకుంటే మరిన్ని సౌకర్యాలు లభిస్తాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మాత్రమే ఫారెక్స్ కార్డ్‌పై 18 రకాల విదేశీ కరెన్సీలను ఆఫర్ చేస్తోంది. ఇలాంటి కార్డ్ ఉంటే రకరకాల దేశాలను సందర్శించేటపుడు రకరకాల కరెన్సీలను తీసుకెళ్లాల్సిన అవసరం తప్పుతుంది. తద్వారా క్రాస్ కరెన్సీ చార్జీలనుంచి తప్పించుకోవచ్చు. ఉదాహరణకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ జారీ చేసే మల్టీ కరెన్సీ కార్డ్... యూరప్‌లో ఆరు దేశాల కరెన్సీలను ఆఫర్ చేస్తోంది. ఈ కార్డ్‌లను బ్యాంకు బ్రాంచీలలోనే కాకుండా నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆన్లైన్లో కూడా కొనుగోలు చేయవచ్చు. రిటైలర్లేకాకుండా కార్పొరేట్ సంస్థలు కూడా తమ సిబ్బంది ప్రయాణాలకు వీటినే వినియోగిస్తున్నాయి. పరిమితికిలోబడే... విదేశీ మారక చట్టాలకు అనుగుణంగా అనుమతించిన స్థాయిలో కస్టమర్లు కార్డ్‌లో కరెన్సీని లోడ్ చేసుకోవచ్చు. విదేశీ సందర్శకులైతే ఒక ఆర్థిక సంవత్సరంలో 10,000 డాలర్ల వరకూ అనుమతిస్తారు. బిజినెస్ ప్రయాణికులైతే ట్రిప్‌నకు 25,000 డాలర్లను అనుమతిస్తారు. కరెన్సీ మార్పిడి కోసం బ్రాంచీలకు వెళ్లనక్కర్లేదు. డెబిట్, క్రెడిట్ కార్డ్‌ల మాదిరిగానే ఫారెక్స్ కార్డుతో వస్తువులను కొనుగోలు చేయవచ్చు. ఒకవేళ కార్డ్ పోగొట్టుకుంటే మిగిలిన మొత్తాన్ని నిలిపివేయవచ్చు. కొన్ని సందర్భాల్లో భోజనం, వినోదం వంటి వ్యయాల్లో ఆఫర్లు లభిస్తాయి కూడా. -
ఇక మల్టీ కరెన్సీ కార్డులు
వ్యాపార అవసరాల రీత్యా కావొచ్చు లేదా విహార యాత్రలకు వెళ్లినప్పుడు కావొచ్చు.. విదేశీ పర్యటనలకి వెళ్లినప్పుడు మన కరెన్సీ అక్కడ చెల్లుబాటు కాదు కాబట్టి ఆయా దేశాల కరెన్సీ చాలా అవసరం పడుతుంది. డాలర్లు, యూరోలను వెంట తీసుకెళ్లినా అన్ని చోట్లా అవి మార్పిడి కాకపోవచ్చు కూడా. క్రెడిట్ కార్డులు, ట్రావెలర్స్ చెక్కులు ఉన్నా.. వాటికి ఉండే పరిమితులు వాటికి ఉన్నాయి. నగదు వెంట తీసుకెడితే దొంగల భయం ఒకటి ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లోనే అక్కరకొచ్చేది సురక్షితమైన మల్టీ కరెన్సీ కార్డు. విదే శీ పర్యటనల్లో కొనుగోళ్లు జరిపేందుకు, అక్కడి ఏటీఎంలలో ఆయా దేశాల కరెన్సీలో నగదు విత్‌డ్రా చేసుకునేందుకు.. ఇలా అనేక రకాలుగా ఈ మల్టీ కరెన్సీ కార్డు ఉపయోగపడుతుంది. ఇది ప్రీపెయిడ్ కార్డులాంటిది. ఈ కార్డు ఖాతాలో డాలర్లు, పౌండ్లు, యూరోలు జమ చేసుకుని, విదేశాల్లో పర్యటించినప్పుడు ఆయా దేశాల కరెన్సీలో లావాదేవీలు జరిపేందుకు ఉపయోగించుకోవచ్చు. సాధారణంగా ఉద్యోగ రీత్యా విదేశాల్లో ఉండే వారు తరచుగా వివిధ దేశాల్లో పర్యటిస్తుండే వారి కోసం మల్టీ కరెన్సీ ట్రావెల్ కార్డులను రూపొం దించారు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్, ఐఎన్జీ వైశ్యా వంటి పలు ప్రైవేట్ రంగ బ్యాంకులు ఈ కార్డులను ఇస్తున్నాయి. ప్రయాణించబోయే విమానం టికెట్, పాస్‌పోర్టు, పాన్ కార్డు నంబరు లాంటి వివరాలు మొదలైనవి ఇస్తే చాలు కార్డు చేతికి వచ్చేస్తుంది. క్రెడిట్ కార్డుతో పోలిస్తే ఈ మల్టీ కరెన్సీ కార్డులో ప్రయోజనాలు అనేకం. ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డులకు వార్షిక ఫీజులు చాలా భారీగా ఉంటాయి. ఇదే కాకుండా కొనుగోళ్లు లాంటివి జరిపినప్పుడు సందర్భాన్ని బట్టి లావాదేవీ ఫీజులు. ప్రీపెయిడ్ మల్టీ కరెన్సీ కార్డుల్లో ఈ సమస్యలు ఉండవు. ఇక, క్రెడిట్ కార్డులతో చెల్లింపులు జరిపినప్పుడు విదేశీ మారక విలువ కూడా కీలక పాత్ర పోషిస్తుంటుంది. విదేశీ మారకం విలువలు తరచూ హెచ్చు తగ్గులకు లోనవుతుంటాయన్న సంగతి తెలిసిందే. మనం కొనుగోలు చేసిన రోజున మన దేశ కరెన్సీతో పోలిస్తే ఆ దేశ కరెన్సీ విలువ అధికంగా ఉంటే ఆ మేరకు మనం ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది. అదే మల్టీ కరెన్సీ కార్డుల విషయంలో కరెన్సీ హెచ్చుతగ్గుల బాదరబందీ ఉండదు. కార్డు తీసుకున్న రోజే కరెన్సీ మారకం విలువ ఇంత ఉంటుందని ముందుగానే నిర్ణయిస్తారు.ప్రత్యేకమైన పిన్ నంబరు కలిగి ఉండే ఈ కార్డులు సురక్షితమైనవి. ఒకవేళ పోగొట్టుకున్నా 48 గంటల్లోగా మరో కార్డు అందుతుంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్‌కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్‌లో ఉన్నా: నటి
- హీట్‌వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్‌తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement