-
Hyderabad: తెలుగు బ్యాండ్.. నయా ట్రెండ్
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరం భిన్న సంస్కృతులు, సంప్రదాయాలకు నెలవు. ప్రపంచంలోని ఏ జీవన విధానానికి చెందిన వారైనా ఇక్కడ ఇమిడిపోయే వాతావరణం సిటీ సొంతం. విభిన్న భాషల మేలు కలబోతతో విలసిల్లుతున్న హైదరాబాద్.. భాషలో, యాసలో ఆంగ్ల అనుకరణం కారణంగా కొన్నాళ్లుగా తెలుగుపై కాస్త మక్కువ తగ్గింది. ప్రస్తుతం నగర వేదికగా సంగీత వేదికలపై తెలుగు కొత్త పుంతలు తొక్కుతోంది. ఒకప్పుడు ఇంగ్లిష్ రాక్ మ్యూజిక్‌తో ఉర్రూతలూగించిన వేదికలపైనే ఇప్పుడు తెలుగు పాటలు, జానపద సాహిత్యం కొత్త ట్రెండ్‌గా మారింది. ప్రపంచవ్యాప్తంగా పేరొందిన మ్యూజిక్ బ్యాండ్స్ నగరంలో సందడి చేసేవి. కానీ ఇప్పుడు దాదాపు పాతిక తెలుగు బ్యాండ్స్ ప్రాంతీయ భాషలో అలరిస్తున్నాయి. నగరంలోని బార్లు, పబ్‌లలో జస్టిన్ బీబర్ సాంగ్స్‌కు బదులు బుల్లెట్టు బండి పాటలు మార్మోగుతున్నాయి. క్రికెట్ మ్యాచ్‌లో సిక్స్ కొడితే ఎలక్ట్రిక్ మ్యూజిక్కు బదులు టాలీవుడ్ మాస్ పాటలు వినిపిస్తున్నాయి. నగర జీవన విధానంలో పాశ్చాత్య సంగీతానికి ప్రత్యేక స్థానముంది. బంజారాహిల్స్, హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లోని రెస్టారెంట్లు, బార్, క్లబ్‌లలో ఇంగ్లిష్, హిందీ సంగీతం వినిపించేది. కొన్నేళ్లుగా ఈ స్పాట్లలో తెలుగు పాటలు ప్రారంభమయ్యాయి. కొన్ని బార్ అండ్ రెస్టారెంట్లు మాత్రం కేవలం తెలుగు సాహిత్యమే ప్రధానాంశంగా ప్రారంభించాయి. అయిదేళ్ల క్రితం ఇలాంటివి రెండు, మూడు ఉంటే ఇప్పుడు 40 వరకు పెరిగాయి. ఈ మధ్య కాలంలో అనూహ్యంగా తెలుగు బ్యాండ్స్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. స్టేజ్‌పైన లైవ్ మ్యూజిక్ బ్యాండ్‌తో మెలోడీ, మాస్, క్లాస్, జానపద పాటలు అలరిస్తుంటే ఫుడ్, సిప్‌ను ఆస్వాదిస్తున్నారు నగరవాసులు. ఈ పరిణామంతో తెలుగు బ్యాండ్స్‌కు ఉపాధి పెరిగింది. తెలుగు మ్యూజిక్ కన్సర్ట్స్ కూడా బాగానే ప్రాచుర్యంలోకి వచ్చినప్పటికీ కోవిడ్ కారణంగా కాస్త నెమ్మదించాయి. నైట్ కల్చర్ బాగా అభివృద్ధి చెందిన ప్రదేశాల్లో మాత్రం తెలుగు పాటలే కొత్త ట్రెండ్. నగరం నలుమూలల్లోని ఏ బార్, రెస్టారెంటైనా తెలుగు పాటే క్రేజీనెస్. తెలుగు సాహిత్యం ఉన్న రిసార్ట్స్, బార్లకు కస్టమర్లు కుటుంబ సమేతంగా వస్తుండటం విశేషం. తెలుగు సాహిత్యమే ప్రస్తుత నేపథ్యం.. నగరవాసులు ఇప్పుడు తెలుగు పాటల ట్రెండ్‌నే అమితంగా ఇష్టపడుతున్నారు. కేవలం తెలుగు సాహిత్యాన్ని మాత్రమే ప్రదర్శించాలనే నేపథ్యంతోనే తబులా రాసా బార్ అండ్ రెస్టారెంట్‌ను ప్రారంభించాం. ప్రస్తుతం ఎక్కడ చూసినా తెలుగు పాటలే వినిపిస్తున్నాయి. తెలుగు లైవ్ మ్యూజిక్ బ్యాండ్లకు మంచి వేదికను ఏర్పాటు చేశాం. ఈ మధ్యకాలంలో తెలుగు పాటలను వింటూ కుటుంబంతో సరదాగా గడపాలనే వారి సంఖ్య పెరిగింది. నైట్ కల్చర్‌కు పేరొందిన ప్రదేశాల్లో తెలుగు పాటలున్నవాటినే ముందు రిజర్వ్ చేసుకుంటున్నారు. – జువ్వాడి శ్రవణ్, తబులా రాసా వ్యవస్థాపకుడు, జూబ్లీహిల్స్ -
మ్యాజిక్ సిటీ.. మయామి!
మయామి : ఆగ్నేయ ఫ్లోరిడాలోని అట్లాంటిక్ తీరంలో ఉన్న పెద్ద నగరం మయామి. ఇది ఫ్లోరిడాలో అత్యంత జనసమ్మర్ధ కౌంటీ. దక్షిణ ఫ్లోరిడాకు ప్రధాన కేంద్రం. న్యూయార్క్, లాస్ ఏంజిలిస్, చికాగోల తర్వాత అమెరికాలో నాలుగో అతిపెద్ద పట్టణం. ఇదే రోజున మయామి నగరం అధికారికంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఈ నగర విశేషాలు, ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం..! ఎన్నో ప్రత్యేకతలు.. 2013 జనాభా లెక్కల ప్రకారం ఈ నగర జనాభా 4,17,650. ఆర్థిక, వాణిజ్య, సాంస్కృతిక, వినోద.. రంగాల్లో దీనికున్న అంతర్జాతీయ గుర్తింపు వల్ల ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ‘డౌన్ టౌన్ మయామి’ యూఎస్‌లోని అంతర్జాతీయ బ్యాంక్‌లకు అతి పెద్ద స్థావరం. దీంతో పాటే అనేక సంస్థల ముఖ్య కేంద్రాలు, టెలివిజన్ స్టూడియోలు ఇక్కడ కొలువుదీరాయి. పోర్ట్ ఆఫ్ మయామి ప్రపంచంలోనే అత్యంత రద్దీగల నౌకాశ్రయం. ఈ నగరానికుండే ప్రత్యేకతల వల్ల ‘మ్యాజిక్ సిటీ’గా పేరుగాంచింది. మయామి నౌకాశ్రయం.. ఇది అమెరికాలోని అతి పెద్ద నౌకాశ్రయం. ప్రపంచంలోనే అతిపెద్ద విహార ఓడల కేంద్రం. దీన్ని ‘క్రూయిజ్ కాపిటల్ ఆఫ్ ది వర ల్డ్, కార్గో గేట్‌వే ఆఫ్ ది అమెరికాస్’ అని కూడా పిలుస్తారు. ప్రపంచంలోనే అత్యంత రద్దీగల నౌకాశ్రయం కూడా ఇదే. ఇది లాటిన్ అమెరికా నుంచి సరకు ఎగుమతి, దిగుమతుల్లో న్యూ ఆర్లియన్స్‌లోని ‘పోర్ట్ ఆఫ్ సౌత్ లూసియానా’ తర్వాత రెండో స్థానంలో ఉంది. ఈ నౌకాశ్రయం దిగుమతుల్లో చైనా ప్రథమ స్థానంలో ఉంది. దీని విస్తీర్ణం 518 ఎకరాలు. ఏడు ప్రయాణికుల టెర్మినల్స్‌ను కూడా కలిగి ఉంది. చరిత్ర.. ఈ ప్రాంతంలో 1000 ఏళ్లకు పూర్వమే ప్రజలు నివసించినట్టు చారిత్రక ఆధారాల వల్ల తెలుస్తోంది. అయితే 1556లో ఈ ప్రాంతం తమదని స్పెయిన్ ప్రకటించింది. 1567లో దీని కోసం ఒక స్పానిష్ బృందాన్ని ఏర్పాటు చేశారు. 1836లో ఫోర్డ్ డల్లాస్ నిర్మించడంతో మయామి ప్రాంతం రెండో సేమినోల్ యుద్ధంలో పోరాట ప్రదేశంగా మారింది. అమెరికాలో ఒక మహిళ (జూలియా టట్టిల్) ప్రణాళిక రచించిన ఏకైక నగరం కూడా ఇదే కావడం విశేషం. ఈ పట్టణ అభివృద్ధికి టట్టిల్ చేసిన కృషికి గుర్తింపుగా ఆమెను ‘మయామి మాత’అని పిలుస్తారు. 1896 జూలై 28న అధికారికంగా 300 జనాభాతో నగరంగా ఏర్పాటైంది. ఆర్థిక వ్యవస్థ.. దేశంలోని అత్యంత ప్రధాన ఆర్థిక కేంద్రాల్లో మయామి ఒకటి. ఇది పలు వాణిజ్య, ఆర్థిక సంస్థలకు ప్రధాన స్థావరం. గ్లోబలైజేషన్ అండ్ వరల్డ్ సిటీస్ స్టడీ గ్రూప్ అండ్ నెట్వర్క్ (జీఏడబ్ల్యూసీ) ప్రపంచ నగరాలకు ఇచ్చిన ర్యాంకుల్లో దీన్ని ‘బీటా ప్రపంచ నగరం’గా గుర్తించింది. పర్యాటకం కూడా మయామిలో ముఖ్యమైన పరిశ్రమ. సముద్ర తీరాలు, సమావేశాలు, పండుగలు, వివిధ కార్యక్రమాలకు ఏటా 1.2 కోట్ల మంది ఈ నగరాన్ని సందర్శిస్తున్నారని అంచనా. సౌత్ బీచ్‌లోని చారిత్రక ఆర్ట్ డెకో జిల్లా, దాని ప్రపంచ ప్రసిద్ధ నైట్ క్లబ్బులు, చారిత్రక భవనాలు, పాపింగ్లలో ప్రపంచంలోని అత్యంత సుందరమైన నగరాల్లో ఒకటిగా విలసిల్లుతోంది. శీతోష్ణస్థితి.. మయామి అయనరేఖా రుతుపవన శీతోష్ణస్థితిని కలిగి ఉంది. వేడి, తేమతో కూడిన వేసవికాలం, స్వల్పకాలిక వెచ్చని శీతాకాలాలతో వాతావరణం పొడిగా ఉంటుంది. సముద్రమట్టపు ఉన్నతి, తీర ప్రాంతాలు.. కర్కాటక రేఖకు కొద్దిగా పైన ఉన్నాయి. శీతాకాల సగటు ఉష్ణోగ్రత 19 డిగ్రీల సెల్సియస్‌గా ఉంటుంది. గరిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీలకు మించదు. వేసవి కాలం వాతావరణంలో తేమ శాతం అధికంగా ఉంటుంది. అట్లాంటిక్ మహా సముద్రం నుంచి వచ్చే గాలుల వల్ల వేసవి ఉష్ణోగ్రతలు కొంచెం తగ్గుతాయి. సంస్కృతి.. ఈ నగరం పలు వినోద కేంద్రాలు, ప్రదర్శనశాలలు, మ్యూజియాలు, ఉద్యానవనాలకు స్థావరంగా ఉంది. కళా రంగానికి చెందిన ‘అడ్రిఎన్నే ఆర్ట్స్ సెంటర్ ఫర్ ది పెర్ఫార్మింగ్ ఆర్ట్స్’ న్యూయార్క్‌లోని లింకన్ సెంటర్ తర్వాత అమెరికాలోని రెండో అతి పెద్ద ప్రదర్శనా కేంద్రం. ఇక్కడ ఉన్న మ్యూజియాల్లో అధిక భాగం డౌన్టౌన్లో ఉన్నాయి. అనేక ఫ్యాషన్ ప్రదర్శనలకు కూడా మయామి ఆతిథ్యం ఇస్తోంది. అనధికారికంగా ‘ఒలింపిక్స్ ఆఫ్ ఆర్ట్’గా పిలిచే కార్యక్రమం ప్రతి ఏటా డిసెంబర్లో నిర్వహిస్తారు. సంగీతం.. మయామి సంగీతం విభిన్నమైంది. క్యూబన్లు వారి స్వస్థలం నుంచి తీసుకొచ్చిన కొంగ, రుంబలను అమెరికన్ సంస్కృతిలో భాగం చేశారు. డొమెనికన్లు బచట, మేరెంగ్యూలను తీసుకురాగా, కొలంబియన్లు వల్లేనాటో, కుమ్బియాలను పరిచయం చేశారు. వెస్ట్ ఇండియన్స్, కరేబియన్లు రేగ్గే, సోకా, కొంపా, జౌక్, కలిప్సో, స్టీల్పాన్లను ప్రాచుర్యంలోకి తెచ్చారు. భాషలు.. స్పానిష్ ప్రధాన భాషగా ఉంది. నివాసితుల్లో 66 శాతం మంది స్పానిష్, 25 శాతం మంది ఆంగ్లం మాట్లాడేవారున్నారు. అతి కొద్ది మంది మాత్రం హైతియన్ క్రేయోల్, ఫ్రెంచ్, పోర్చుగీస్, జర్మన్, ఇటాలియన్, అరబిక్, చైనీస్, గ్రీక్.. భాషలు మాట్లాడతారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నూతన కార్యవర్గం ఎన్నిక
ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
డెంగీతో ఒకరి మృతి
వలస కార్మికులకు అండగా..
ఆర్మూర్‌లో బైక్ చోరీకి యత్నం
కోనాపూర్‌లో అగ్ని ప్రమాదం
పొరపాట్లకు తావులేకుండా ఈవీఎంల కమిషనింగ్
చెట్టును ఢీకొని ఒకరి మృతి
విజృంభిస్తున్న ఎండలు
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు రుణమాఫీ
తప్పక చదవండి
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్‌లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్‌రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్‌రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై అనవసర రాద్ధాంతం
Advertisement