-
గుత్తి కేంద్రంగా మట్కా
ఒకప్పుడు గుత్తి పేరు వింటే వెంటనే అందరికీ గుర్తుకు వచ్చేది మట్కా! కొన్ని సంవత్సరాల పాటు ఇక్కడ మట్కా పెద్ద ఎత్తున జరిగేది. లాడ్జీలు, చిన్నపాటి గదులు ఎటు చూసినా.. మట్కా బీటర్లు, జూదం ఆడేందుకు వచ్చిన వారితో కిటకిటలాడేవి. అయితే పోలీసుల చర్యలతో ఇది కాస్త కనుమరుగైంది. ఇటీవల కొంత కాలంగా గుత్తిలో మట్కా నిర్వాహకులు మళ్లీ చెలరేగారు. సిండికేట్‌గా ఏర్పడి పొరుగున ఉన్న కర్పూలు జిల్లాలోనూ తమ కార్యకలాపాలను విస్తరించారు. ఈ విష యం గురువారం పోలీసులు జరిపిన మెరుపుదాడిలో బహిర్గతం కావడంతో పలువురిలో ఆందోళన చోటు చేసుకుంది. మళ్లీ అసాంఘిక కార్యకలాపాలకు గుత్తి కేంద్రం కాబోతుందా అనే భయం వ్యక్తమవుతోంది. – గుత్తి గుట్టు చప్పుడు కాకుండా మట్కా నిర్వహిస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టుబడిన వారిని రమణారావు, వెంకటేష్, నరేష్‌గా గుర్తించారు. వీరి నుంచి రెండు సెల్ఫోన్లు, రూ. 90,150, మట్కా పట్టీలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల వివరాలను విలేకరుల సమావేశంలో ఎస్ఐ వలీబాషుతో కలిసి సీఐ ప్రభాకర్ గౌడ వెల్లడించారు. కర్నూలు జిల్లా డోన్‌కు చెందిన కటిక రమణారావు, గుత్తి ఆర్ఎస్ నివాసి వెంకటేష్, గుంతకల్లుకు చెందిన నరేష్ గ్రూపుగా ఏర్పడి డోన్‌లో పెద్ద ఎత్తున మట్కా కంపెనీ నిర్వహిస్తున్నారు. పోలీసుల నిఘా నుంచి తప్పించుకునేందుకు తమ స్థావరాన్ని అప్పుడప్పుడూ మార్చేవారు. గుత్తి ఆర్ఎస్లోని తన ఇంటినే మట్కా స్థావరంగా వెంకటేష్ మార్చుకుని పోలీసుల కళ్లుగప్పి పెద్ద ఎత్తున మట్కా నిర్వహిస్తూ వస్తున్నాడు. రోజూ రూ. లక్షల్లో టర్నోవర్‌తో కూలీలు, నిరుపేదలను మట్కాకు బానిసలుగా చేస్తూ వచ్చాడు. నిరంతరం బీటర్ల రాకపోకలు, కొత్త వ్యక్తుల సంచారం ఎక్కువ కావడంతో చుట్టుపక్కల వారు ఇబ్బంది పడుతూ వచ్చారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సైతం నిఘా పెంచారు. ఈ క్రమంలో రమణారావు, నరేష్ గురువారం వెంకటేష్ ఇంటికి డబ్బు, పట్టీలతో వచ్చారు. అప్పటికే కాపుకాచిన పోలీసులు.. వెంకటేష్ ఇంటిపై మెరుపుదాడి చేశారు. నిందితులను అదుపులోకి తీసుకుని వారి నుంచి నగదు, సెల్ఫోన్లు, మట్కాపట్టీలు స్వాధీనం చేసుకున్నారు. మట్కా మూలాలను పసిగట్టి నిందితులను అరెస్ట్ చేయడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఐడీ పార్టీ కానిస్టేబుళ్లు రవి, ఆదిశేఖర్, రామకృష్ణ, సురేష్, సివిల్ కానిస్టేబుళ్లు నరేష్, కుళ్లాయప్పను ఈ సందర్భంగా సీఐ ప్రభాకర్ గౌడ ప్రత్యేకంగా అభినందించారు. తన సర్కిల్ లిమిట్స్‌లో మట్కా మూలాలు లేకుండా చర్యలు తీసుకుంటానని ఈ సందర్భంగా సీఐ పేర్కొన్నారు. మట్కా, జూదాలు నిర్వహిస్తున్న వారిపై సమాచారం అందివ్వాలని పిలుపునిచ్చారు. సమాచారం ఇచ్చిన వారిని గోప్యంగా ఉంచి, నిందితులపై చర్యలు తీసుకుంటామన్నారు. -
టీచర్.. అయ్యాడు 'మట్కా' చీటర్
- అనంతపురం జిల్లాలో మట్కా నిర్వహిస్తూ పట్టుపడ్డ ఉపాధ్యాయుడు అనంతపురం: పవిత్రమైన వృత్తిగా భావించే ఉపాధ్యాయుడు ఆయన. పిల్లలకు విద్యాబుధ్దులు నేర్పాల్సిన ఆయనే.. ప్రజలను పెడదోవ పట్టించే అక్రమ మట్కా దందా నిర్వహిస్తున్నాడు. చివరికి అదే మట్కా నిర్వహిస్తూ శనివారం పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. అనంతపురం జిల్లా కళ్యానదుర్గంలో ఒక టీచర్ నిర్వకం ఇది. పేద, మధ్య తరగతి ప్రజలను లక్ష్యంగా చేసుకుని జిల్లాలో విస్తరించిన మట్కా జూదంపై ఇటీవలే దాడులు ప్రారంభించిన పోలీసులు.. కళ్యానదుర్గంలో అరస్టయిన ఉపాధ్యాయుడి నుంచి దాదాపు 16 లక్షల విలువైన మట్కా జాబితాను స్వాధీనం చేసుకున్నారు. కాగా, ప్రస్తుతం కటకటాల్లో ఉన్న మట్కా టీచర్ ను విడిపించేందుకు తెలుగుదేశం నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. జిల్లాలో విచ్చలవిడిగా సాగుతోన్న మట్కా దందా వెనుక రాజకీయ నాయకుల హస్తం ఉన్నదని పెద్ద ఎత్తున ఆరోపణలున్న సంగతి తెలిసిందే.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement