-
విజయ్‌తో పుదుచ్చేరి సీఎం భేటీ
సాక్షి, చెన్నై: సినీ నటుడు విజయ్‌తో పుదుచ్చేరి సీఎం ఎన్ రంగస్వామి భేటీ అయ్యారు. చెన్నై పయనూర్‌లోని విజయ్ ఇంట్లో శుక్రవారం సాయంత్రం గంటపాటు ఇద్దరూ సమావేశమయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న నగర పాలక సంస్థల ఎన్నికల్లో ఆయన అభిమాన సంఘం విజయ్ మక్కల్ ఇయక్కం నుంచి అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఈ క్రమంలో విజయ్ను కలవడం చర్చకు దారితీసింది. భేటీ అనంతరం వెలుపలకు వచ్చిన రంగ స్వామిని మీడియా ప్రశ్నించగా, మర్యాద పూర్వకంగానే కలిసినట్లు వ్యాఖ్యానించారు. విజయ్ తనకు మంచి మిత్రుడని, ఆయనపై అభిమానంతోనే వచ్చినట్లు పేర్కొన్నారు. రాజకీయంగా చర్చనీయాంశం ఈ భేటీ ప్రస్తుతం రాజకీయంగా చర్చకు దారి తీసింది. పుదుచ్చేరిలో ఎన్ఆర్ కాంగ్రెస్– బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలో ఉంది. సీఎం పగ్గాలు చేపట్టినానంతరం ప్రధాని మోదీని రంగన్న ఇంత వరకు కలవలేదు. అయితే విజయ్ను కలిసేందుకు పుదుచ్చేరి నుంచి రావడం, తనకు మంచి మిత్రుడు అని వ్యాఖ్యానించడాన్ని రాజకీయ వర్గాలు నిశితంగానే పరిశీలిస్తున్నాయి. విజయ్ మక్కల్ ఇయక్కంను పర్యవేక్షిస్తున్న పుదుచ్చేరికి చెందిన పి. ఆనంద్ ఈ భేటీకి ఏర్పాట్లు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. -
రంగన్నకు ఆ ఎమ్మెల్యేలు షాక్
చెన్నై: పుదుచ్చేరి ప్రధాన ప్రతిపక్షంలో రాజకీయ అలజడి బయలుదేరింది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు సొంతగూటికి చేరడానికి సిద్ధం అవుతోన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఇందుకు అద్దం పట్టే విధంగా ఎమ్మెల్యే టీపీఆర్ సెల్వం కాంగ్రెస్‌కు మద్దతుగా గళం విప్పడం గమనార్హం. పుదుచ్చేరి కాంగ్రెస్‌లో ఒకప్పుడు తిరుగులేని నేత ఎన్ రంగస్వామి. ప్రజాబలం కలిగిన ఆయన్ను కాంగ్రెస్ కుటిల రాజకీయాలు వెంటాడాయి. సీఎం పదవి దూరం కావడంతో 2011లో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి ఎన్ఆర్ కాంగ్రెస్ ఏర్పాటుతో అధికార పగ్గాలు సైతం చేపట్టారు. ఐదేళ్ల పాటుగా ఆయన నేతృత్వంలో పుదుచ్చేరి అభివృద్ధి అంతంత మాత్రమే. మంత్రుల అవినీతి భాగోతాలు 2016 ఎన్నికల్లో ముచ్చెమటలు పట్టించాయి. ఆ ఎన్నికల్లో అధికారం దూరం అయ్యింది. 30 మందితో కూడిన పుదుచ్చేరి అసెంబ్లీకి ఎన్ఆర్ కాంగ్రెస్ నుంచి ఏడుగురు మాత్రమే ఎంపిక అయ్యారు. ప్రస్తుతం ప్రధాన ప్రతి పక్ష నేతగా ఉన్న రంగస్వామికి ఆ ఎమ్మెల్యేలు పలువురు షాక్‌లు ఇచ్చేందుకు సిద్ధం అయ్యారు. సొంతగూటి వైపు చూపు : ప్రస్తుతం పుదుచ్చేరిలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో, ఎన్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పలువురు మాతృగూటి వైపుగా చూస్తున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఎన్ఆర్కాంగ్రెస్లో ఉండటం కన్నా, నియోజకవర్గం అభివృద్ధి నినాదంతో కాంగ్రెస్‌కు మద్దతుగా వ్యవహరిండం మంచిదన్న నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఇందుకు అద్దం పట్టే విధంగా మంగళవారం మంత్రి కందస్వామి నేతృత్వంలో లింగారెడ్డి పాళయంలో జరిగిన సభలో ఆ నియోజకవర్గం ఎన్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే టీపీఆర్ సెల్వం కాంగ్రెస్‌కు మద్దతుగా ప్రసంగాన్ని అందుకున్నారు. ఇది వరకు తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఒరిగింది శూన్యమేనని, ఇప్పుడు తమ పనులు చక..చకా సాగుతున్నాయని వ్యాఖ్యానించారు. నియోజకవర్గం అభివృద్ధి కోసం తనతో పాటుగా పలువురు కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధంగానే ఉన్నట్టు ఆయన స్పష్టం చేయడం ఎన్ఆర్ కాంగ్రెస్‌లో చర్చకు దారి తీసింది. ఎమ్మెల్యేలు ఫిరాయింపులతో కాంగ్రెస్ గూటికి చేరుతారేమోనన్న ఆందోళన రంగస్వామిలో బయలు దేరింది. దీంతో ఎమ్మెల్యేలను రక్షించుకునేందుకు ప్రయత్నాల్ని వేగవంతం చేసే పనిలో నిమగ్నం అయ్యారు. గోడ దూకేందుకు సిద్ధంగా ఉన్నట్టు భావిస్తున్న తన ఎమ్మెల్యేలను పిలిచి బుజ్జగించేందుకు నిర్ణయించినట్టు ఎన్ఆర్ కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
IPL 2024: చరిత్ర సృష్టించిన జడేజా.. ధోని రికార్డు బద్దలు
జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్‌కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్‌గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్‌కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్‌తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement