-
రాష్ట్ర నెట్‌బాల్ జట్ల ప్రకటన
సాక్షి, హైదరాబాద్: జాతీయ జూనియర్ నెట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే తెలంగాణ రాష్ట్ర బాలబాలికల జట్లను గురువారం ప్రకటించారు. వరంగల్ జిల్లా నెల్లికుదురు గ్రామ తెలంగాణ రాష్ట్ర మోడల్ స్కూల్ గ్రౌండ్లో ఈనెల 18 నుంచి 23 వరకు నిర్వహించిన శిక్షణా శిబిరంలో మెరుగైన ప్రదర్శన కనబరిచిన క్రీడాకారులను రాష్ట్ర జట్లకు ఎంపిక చేశారు. ఈ జట్లలో తెలంగాణలోని 10 జిల్లాలకు చెందిన 24 మంది బాలబాలికలు చోటు దక్కించుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర జట్లకు ఎంపికైన క్రీడాకారులకు తెలంగాణ రాష్ట్ర నెట్‌బాల్ సంఘం (ఎన్ఏటీఎస్) కార్యదర్శి మొహమ్మద్ ఖాజా ఖాన్ స్పోర్ట్స్ కిట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో కోచ్ బి. మనోజ్ కుమార్, సంయుక్త కార్యదర్శి సయ్యద్ మొహమ్మద్ అహ్మద్, వరంగల్ నెట్‌బాల్ సంఘం అధ్యక్షులు సాంబరెడ్డి, కార్యదర్శి సూర్యారావు తదితరులు పాల్గొన్నారు. పంజాబ్ వేదికగా జాతీయ నెట్‌బాల్ చాంపియన్‌షిప్ ఈనెల 27 నుంచి 30 వరకు జరుగుతుంది. జట్ల వివరాలు బాలురు: బి. కుమార్, బి. భాను తేజ, ఎం. విజయ్‌కాంత్, కె. సుధాకర్, వి. కిరణ్, జె. నరేందర్, సీహెచ్.రాజీవ్, డి. సాయివర్ధన్, జె. మహేశ్, బి. సిద్ధార్థ్, కె.సోమ్‌నాథ్, బి. రాకేశ్, బి. మనోజ్ కుమార్ (కోచ్), బి. రఘురామ్ (మేనేజర్). బాలికలు: ఎ. అశ్విని, టి. ఝాన్సీలక్ష్మి, కె. స్వాతి, టి. చందన, డి. పూజిత, ఎస్. జ్యోష్న, కె. సౌమ్య, ప్రసన్న, డి. వాహిని, ఎస్. ప్రసన్న, జె. జోసెఫిన్ వయొలెట్, లేఖన, సయ్యద్ అంజద్ అలీ (కోచ్), లిల్లీ ఫ్లోరెన్స్ (మేనేజర్). -
రంగారెడ్డి, హైదరాబాద్ జట్లకు టైటిల్స్
యాకుత్‌పురా: తెలంగాణ సీనియర్ నెట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ పురుషుల, రంగారెడ్డి మహిళల జట్లు విజేతలుగా నిలిచాయి. పాతబస్తీ గౌలిపురా మిత్రా క్లబ్ ఆలే నరేంద్ర స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరిగిన పురుషుల ఫైనల్లో హైదరాబాద్ 23–20తో ఖమ్మంపై విజయం సాధించింది. హోరాహోరీగా సాగిన మహిళల టైటిల్‌పోరులో రంగారెడ్డి 18–17తో ఖమ్మంను ఓడించింది. మూడు రోజుల పాటు జరిగిన ఈ పోటీల ముగింపు కార్యక్రమంలో ఆలిండియా ఈఎస్ఐ అడ్వయిజరీ బోర్డు కమిటీ సలహాదారులు డాక్టర్ రాంచందర్ రావు, బీజేపీ నగర ఉపాధ్యక్షులు రూప్‌రాజ్, మాజీ కార్పొరేటర్ జితేంద్ర, టీఆర్ఎస్ పార్టీ నాయకులు సుందర్ రెడ్డి పాల్గొని విజేతలకు ట్రోఫీలను అందజేశారు. -
నెట్‌బాల్ విజేత హైదరాబాద్
శామీర్‌పేట్ రూరల్, న్యూస్‌లైన్: రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ నెట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ బాలుర జట్టు సత్తా చాటింది. శామీర్‌పేట్‌లోని మినీ స్టేడియంలో జరిగిన ఈ ఈవెంట్లో నగరానికి చెందిన బాలుర జట్టు విజేతగా నిలిచింది. ఖమ్మం జట్టు రన్నరప్‌తో సరిపెట్టుకుంది. వరంగల్, కృష్ణా జిల్లా జట్లు సంయుక్తంగా మూడోస్థానం పొందాయి. బాలికల విభాగంలో ఖమ్మం చాంపియన్‌షిప్ సాధించగా, రంగారెడ్డి జట్టు రన్నరప్‌గా నిలిచింది. మెదక్, కృష్ణా జిల్లా జట్లు ఉమ్మడిగా తృతీయ స్థానం పొందాయి. ఈ టోర్నమెంట్లో 17 జిల్లాలకు చెందిన జట్లు పాల్గొన్నాయి. అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి మేడ్చల్ ఎమ్మెల్యే కె.లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ట్రోఫీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నెట్‌బాల్ సంఘం అధ్యక్షుడు తీగల కృపాకర్ రెడ్డి, రాష్ట్ర ఒలింపిక్ సంఘం కార్యదర్శి కె.జగదీశ్వర్ యాదవ్, స్థానిక సర్పంచ్ కిశోర్ యాదవ్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మనోరంజిత, టోర్నమెంట్ కన్వీనర్ వి.దానయ్య తదితరులు పాల్గొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్‌కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్‌లో ఉన్నా: నటి
- హీట్‌వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్‌తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement