-
‘స్టార్’ అనిపించుకోవడంలో మజా ఏం ఉంటుంది?
నా మటుకు నాకు స్టార్ హీరోయిన్ అనిపించుకోవడంకన్నా ‘మంచి ఆర్టిస్ట్’ అనిపించుకోవడమే ఇష్టం. స్టార్ అనిపించుకోవడంలో మజా ఏముంటుంది? భారీ బడ్జెట్ చిత్రాల్లో నటిస్తే, ఆ హోదా దక్కుతుంది. ‘స్టార్’ అనిపించుకోవడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. కానీ, గొప్ప నటి అనిపించుకోవడానికి మాత్రం చాలా కష్టపడాలి. బలమైన పాత్రలు చేయాలి. అలాంటి పాత్రలవైపే మొగ్గు చూపుతున్నా. కథాబలం ఉన్న చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నా. నిర్మాతగా నా తొలి చిత్రం ‘ఎన్‌హెచ్ 10’ కూడా కథాబలం ఉన్నదే. ఇందులో నా పాత్ర కూడా చాలా శక్తిమంతంగా ఉంటుంది. అందుకే అందరి ప్రశంసలూ అందుకుంటోంది. ఏదో వచ్చామా? రెండు పాటలకు డాన్స్ చేశామా? హీరోతో రొమాంటిక్ సీన్స్ చేశామా? అనే తరహా పాత్రలు చేస్తే, పెద్దగా ప్రశంసలు లభించవు. భవిష్యత్తులో నేను వెనక్కి తిరిగి చూసుకుంటే, ‘ఫర్వాలేదు.. మనం గొప్ప పాత్రలే చేశాం’ అనే సంతృప్తి మిగలాలి. అందుకే, పాత్రల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్త వహిస్తున్నా. కథ నచ్చితే చాలు హీరో, బేనర్.. ఏదీ ఆలోచించను. కళ్లు మూసుకుని సినిమా ఒప్పేసుకుంటా. - అనుష్క శర్మ, కథానాయిక -
నా ప్రియురాలి సినిమా బావుంది: విరాట్
ముంబై: భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ తన గార్ల్ ప్రెండ్ అనుష్క శర్మను బాహాటంగా పొగడ్తల్లో ముంచెత్తాడు. ఆమె నటించిన హిందీ చిత్రం ఎన్ హెచ్ 10తాను చూశానని, ఆ చిత్రంలో అనుష్క నటన అదిరిపోయిందని, గతంలో ఎన్నడూ చేయని విధంగా చేసిందని మురిసిపోతూ కొనియాడాడు. 'ఆహా ఏమాచిత్రం. మైండ్ బ్లోయింగ్. చాలా బ్రిలియంట్ ఫిల్మ్. ప్రత్యేకంగా అందులో నాలవ్ అనుష్క శర్మ నటన అత్యద్భుతం'అంటూ ప్రస్తుతం ప్రపంచ కప్ క్రికెట్‌తో తీరిక లేకుండా ఉన్న కోహ్లీ చెప్పాడు. గతంలో వీరి అనుబంధాన్నిగురించి ప్రశ్నించినప్పుడు చిరుబుర్రులాడే కోహ్లీ.. తాజాగా బహిరంగంగా తన ప్రేయసి.. ప్రేయసి అంటూ అభిప్రాయాలు వెలిబుచ్ఛడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. -
అలా అనుకుంటే.. అమాయకత్వమే!
నమ్మకం, భయం, ఉద్వేగం.. ప్రస్తుతం ఇలా రకరకాల ఫీలింగ్స్‌తో ఉన్నారు అనుష్క శర్మ. దానికి కారణం తొలి ప్రయత్నంగా ఆమె నిర్మించిన ‘ఎన్‌హెచ్ 10’ చిత్రం. కథానాయికగా ఇప్పటివరకూ అనుష్క కెరీర్ బాగానే సాగింది. ఇక, నిర్మాతగా ఎలాంటి అనుభూతి మిగులుతుందో ‘ఎన్‌హెచ్ 10’ విడుదల రోజున తెలిసిపోతుంది. వచ్చే నెల 13న విడుదల కానున్న ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ ‘ఎ’ సర్టిఫికెట్ ఇచ్చింది. ఇది ముందే ఊహించాననీ, అన్ని చిత్రాలూ ఆరు నుంచి అరవయ్యేళ్లవారు చూసే విధంగా ఉండవనీ ఈ సందర్భంగా అనుష్క పేర్కొన్నారు. ఆమె ఇంకా మాట్లాడుతూ - ‘‘ ‘నీకేంటి నువ్వు స్టార్ హీరోయిన్‌వి.. నువ్వు నిర్మించిన సినిమా బంపర్ హిట్’ అని నా స్నేహితులు కొంతమంది అంటున్నారు. నేనా మాటలతో ఏకీభవించను. ‘స్టార్’ హోదా అనేది ప్రేక్షకులను థియేటర్‌కి రప్పించడం వరకే ఉపయోగపడుతుంది. ఆ హోదా వల్లే సినిమా ఆడేస్తుందనుకుంటే అంతకన్నా అమాయకత్వం మరోటి ఉండదు. సినిమాలో దమ్ముంటేనే హిట్ అవుతుంది. లేకపోతే ఎంత పెద్ద స్టార్ అయినా ఫట్టే. నేను నిర్మించిన ‘ఎన్‌హెచ్ 10’ మంచి దమ్మున్న కథ. వాస్తవానికి దగ్గరగా ఉంటుంది. అందుకే, ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని నమ్ముతున్నాను. మరి.. ఏం జరుగుతుందో చూద్దాం’’ అన్నారు. -
'ఎన్ హెచ్ 10'పై ఇసుక తుఫాన్, చిక్కుకున్న అనుష్క!
బాలీవుడ్ తార అనుష్క శర్మ రూపొందిస్తున్న 'ఎన్ హెచ్ 10' చిత్ర యూనిట్ ఇసుక తుఫాన్ లో చిక్కుకుంది. ఇసుక తుఫాన్ కారణంగా రాజస్థాన్ లో జరుగుతున్న 'ఎన్ హెచ్ 10' చిత్ర షూటింగ్ కు అంతరాయం కలిగింది. నాతోపాటు 'ఎన్ హెచ్ 10' చిత్ర షూటింగ్ యూనిట్ అంతా ఇసుక తుఫాన్ లో నిన్న ఇరుక్కున్నాం. అయితే అందరం క్షేమంగా బయటపడ్డాం అని అనుష్క శర్మ ట్విటర్ లో పోస్ట్ చేశారు. దుమ్ము, ధూళితోపాటు ఇసుక తమని చాలా ఇబ్బందికి గురి చేసిందని.. ప్రతిఒక్కరు సురక్షితంగా ఉన్నారని అనుష్క ట్విటర్ లో పేర్కొన్నారు. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న 'ఎన్ హెచ్ 10' చిత్రానికి నవదీప్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. -
నిర్మాతగా మారనున్న నటి అనుష్క శర్మ
ముంబై: ఇన్నాళ్లు హీరోయిన్గా అందాలు అరబోస్తు అందరిని అలరించిన బాలీవుడ్ నటి అనుష్క శర్మ నిర్మాతగా కొత్త అవతారమెత్తేందుకు సిద్ధమైంది. ఫంటోమ్ ప్రొడక్షన్లో వస్తున్న ‘ఎన్‌హెచ్ 10’లో హీరోయిన్గా పాటు సహచర నిర్మాతగా సత్తా చాటేందుకు రెడీ అవుతోంది. నవదీప్ సింగ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా కథ నచ్చడంతో సహచర నిర్మాతగా వ్యవహరించాలని నిర్ణయించుకుంది. సినీ కెరీర్లోనే ఈ అవకాశం ఇంత త్వరగా వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపింది. ఎన్‌హెచ్ 10కన్నా మంచి ప్రాజెక్టు ఇప్పటివరకు తాను ఎక్కడా వినలేదని చెప్పింది. ఈ సినిమాతో తన కెరీర్ కొత్త పుంతలు తొక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది. ఫంటోమ్ ప్రొడక్షన్లో బాంబే వెల్వెట్ తర్వాత ఇది రెండో సినిమా అని వివరించింది. ఫంటోమ్ ప్రొడక్షన్లో పనిచేయడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పింది. మళ్లీ ఆ అవకాశం దొరకడం అదృష్టంగా భావిస్తున్నానని, అందుకోసం ఎంతో అతృతగా ఎదురుచూస్తున్నానని తెలిపింది. ఇదికాక ఆమీర్‌ఖాన్‌తో నటించిన పీకే, రణ్‌బీర్ కపూర్‌తో చేసిన బాంబే వెల్వేట్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయని వివరించింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్‌లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
శుబ్‌మన్ గిల్‌కు ఏమైంది.. ఇలా అయితే కష్టమే! వీడియో వైరల్
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్‌గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్‌కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
తప్పక చదవండి
- ఐపీఎల్‌పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్‌బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement