-
ఫాతిమాగా మారిన అంజూ.. మతం మార్చుకొని ప్రియుడితో పెళ్లి!
ప్రియుడి కోసం పాకిస్థాన్‌కు వెళ్లిన భారతీయ మహిళా అంజూ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ముందుగా ఫేస్బుక్ స్నేహితుడు నస్రుల్లాను కలిసేందుకు ఆమె తన భర్త, పిల్లలను వదిలి దాయాది దేశానికి వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. తరువాత నస్రుల్లా తనకు కేవలం స్నేహితుడు మాత్రమేనని, అతన్ని పెళ్లి చేసుకునే ఆలోచనలు లేవని పేర్కొంది అంజూ. తాను కేవలం ఓ పెళ్లికి హాజరు కావడానికి మాత్రమే పాక్‌కు చేరినట్లు, త్వరలోనే భారత్‌కు రానున్నట్లు తెలిపింది. తాజాగా ఈ కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. మాతం మార్చుకున్న అంజూ ప్రియుడు నస్రుల్లాను పెళ్లి చేసుకునేందుకు అంజూ ఇస్లాం మతంలోకి మారినట్లు తెలుస్తోంది. తన పేరును సైతం అంజూ నుంచి ఫాతిమాగా మార్చుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఆమె బురఖా ధరించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. పాక్‌లోని దిర్ జిల్లా కోర్టులో వీరిద్దరూ అధికారికంగా నిఖా జరుపుకున్నట్లు ఓ నివేదిక పేర్కొంది. ఈ మేరకు అంజూ, నస్రుల్లా ఒకరికొకరు సన్నిహితంగా మెలుగుతూ.. టూరిస్ట్ ప్రాంతాలను సందర్శించే ఓ వీడియో నెట్టింట్లో తెగ వైరల్‌గా మారింది. సంబంధిత వార్త: అందుకే పాక్ వచ్చా.. అంజూ వ్యవహారంలో ట్విస్ట్! నిఖా హోగయా అంజూ, నస్రుల్లా వివాహాన్ని మలకాండ్ డివిజన్ డీఐజీ నసీర్ మెహమూద్ సత్తి ధృవీకరించారు. ఆ మహిళా ఇస్లాంలోకి మారి ఫాతిమాగా పేరును మార్చుకున్నట్లు పేర్కొన్నారు. నస్రుల్లా కుటుంబ సభ్యులు, పోలీసులు, న్యాయవాదుల సమక్షంలో దంపతులు దిర్ బాలాలోని జిల్లా కోర్టుకు హాజరయ్యారు. భద్రతా కారణాల దృష్ట్యా అంజూను పోలీసు భద్రతతో కోర్టు నుంచి ఆమె కొత్త అత్తవారి ఇంటికి తీసుకెళ్లారు. 24 గంటలు గడవకముందే నస్రుల్లాను పెళ్లి చేసుకునే ఆలోచన లేదని, తన వీసా గడువు ముగియగానే ఆగస్టు 20న భారత్‌కు తిరిగి వస్తుందని పేర్కొన్న మరుసటి రోజే ఈ పరిణామం చోటు చేసుకుంది. అటు నస్రుల్లా సైతం తమ ప్రేమ వ్యవహారంపై వచ్చిన వార్తలను తోసిపుచ్చారు. అయితే 24 గంటలు గడవకముందే మొత్తం సీన్ మారిపోవడంతో ప్రజలు అయోమయానికి గురి చేస్తోంది. ఇప్పటి వరకు అంజూ చెప్పింది అబద్దమేనా..? ఆమె ముందుగానే ప్లాన్ ప్రకారం అతడిని పెళ్లి చేసుకుందా? లేదా వారు బలవంతంగా ఇలా చేశారా? అన్నది ఆసక్తిగా మారింది. పాక్‌లోనే ఉంటుందా? తిరిగొస్తుందా! ప్రస్తుతం అంజూ వీసా గడువు ఆగస్ట్ 20వ తేదీ వరకు మాత్రమే ఉంది. ఆ తర్వాత ఇండియా వచ్చేయాలి. అంజూ ఇప్పుడు ఇస్తాం మతం స్వీకరించటంతోపాటు.. నుజురుల్లాను పెళ్లి చేసుకోవటం, పేరు మార్చుకోవటం చూస్తుంటే పాకిస్థాన్‌లోనే ఉండిపోతుందా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. మరోవైపు ఈ వ్యవహారమంతా లవ్ జీహాదీ అంటూ పలువురు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. చదవండి: ఏంటిది? మొత్తం ముఖానికే మాస్క్! బాబోయ్! మళ్లీ చైనాకు ఏమైంది? Video: Indian girl #Anju with her Pakistani friend Nasrullah Khan in his home district Dir pic.twitter.com/jJJaCmxq1U — Naimat Khan (@NKMalazai) July 25, 2023 -
పెళ్లైన రెండు గంటలకే 'తలాక్' చెప్పాడు!
మీరట్: పెళ్లి గురించి అందరిలాగే ఆ యువతి కూడా ఎన్నో కలలుకంది. భర్తతో సంతోషకర జీవితాన్ని ఊహించుకొని మురిసిపోయింది. చివరికి పెళ్లి ముహూర్తం రానే వచ్చింది. అనుకున్నట్లే పెళ్లైంది. కానీ అంతలోనే ఊహించని మలుపు.. పెళ్లయిన రెండు గంటలకే నవవరుడు ఆమెకు తలాక్ చెప్పాడు. దీంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో కన్నీటిపర్యంతమైందా యువతి. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటన వివరాలు. దహా గ్రామానికి చెందిన మొహిసినా అనే యువతికి.. ఆ గ్రామానికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న భగవాన్ పూర్ వాసి మహ్మద్ ఆరిఫ్ తో పెద్దలు పెళ్లి చేయాలని నిశ్చయించారు. ముందుగా అనుకున్న ప్రకారం యువతి కుటుంబ సభ్యులు కట్నకానుకలను సిద్ధం చేసుకున్నారు. అయితే పెళ్లి సమయంలో పెళ్లి కొడుకు తనకు కట్నంగా కారు ఇవ్వలేదని అసంతృప్తి వ్యక్తం చేశాడు. వివాహం అనంతరం ఈ విషయమై గొడవపడి పెళ్లికూతురుకు ఆవేశంగా తలాక్ చెప్పేశాడు. గ్రామ పెద్దలు ఈ విషయమై నచ్చచెప్పడానికి ప్రయత్నించినప్పటికీ కుదరకపోవటంతో పంచాయితీ పెట్టి.. పెళ్లికూతురు కుటుంబానికి వరుడు రూ. 2.5 లక్షలు భరణం చెల్లించేలా తీర్మానం చేశారు. అలాగే ఆరిఫ్ మరో మూడేళ్లపాటు పెళ్లి చేసుకోరాదనే షరతు విధించారు. తలాక్ విధానంపై దేశ వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విధానం వల్ల ముస్లిం మహిళలు తీవ్రంగా నష్టపోతున్నారని, దీనిని రద్దు చేయాలని కోరుతూ 50,000 మంది ముస్లిం మహిళలు, పురుషులు సంతకాలు చేసిన పిటిషన్‌ను 'భారతీయ ముస్లిం మహిళా ఆందోళన్' ఆధ్వర్యంలో జాతీయ మహిళా కమిషన్‌కు సమర్పించారు.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్‌కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్‌పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
కేంద్ర హోం శాఖకు బాంబు బెదిరింపు.. నార్త్ బ్లాక్ హై అలర్ట్
కావ్యా మారన్‌తో ఫొటోలకు ఫోజులు.. ఈ బ్యూటీ గురించి తెలుసా? (ఫొటోలు)
ఈవెంట్లో ప్రియాంక చోప్రా.. వందల కోట్ల విలువైన నెక్లెస్‌తో!
రూ. 2.1 లక్షల కోట్లు.. ప్రభుత్వానికి ఆర్బీఐ రికార్డ్ డివిడెండ్
చరిత్ర సృష్టించిన శ్రేయస్ అయ్యర్.. 17 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలోనే
అధిక స్థాయిలోనే పెట్రోలు, డీజిల్ రేట్లు..
ఎలిమినేటర్ మ్యాచ్
పోలింగ్ శాతాల డేటా వివాదం..జవాబుల్లేని ప్రశ్నలనేకం..!
టాలీవుడ్ స్నిప్పెట్లు: జూనియర్ ఎన్టీఆర్ దేవర తాజా అప్డేట్
RR vs RCB: ఎలిమినేట్ అయ్యేది ఎవరు?
తప్పక చదవండి
- T20: బంగ్లాకు షాకిచ్చిన పసికూన.. మినీ టీమిండియా అంటూ..
- చనుగొండ్లలో చిరుత పిల్లల సంచారం.. భయాందోళనలో గ్రామస్తులు
- ఇజ్రాయెల్ హెచ్చరిక.. రాయబారులు వెనక్కి రండి
- మూడేళ్ల చిన్నారిపై విద్యుత్ చౌర్యం కేసు
- నిర్మాత మోసం.. నిజాలు బయటపెట్టిన హీరోయిన్ నమిత
- వరంగల్‌లో అర్ధరాత్రి బాంబుల మోత, కారణం ఏంటంటే..
- నేమ్‌ప్లేట్ మార్చేసిన సూపర్ మామ్ సానియా మీర్జా ఫోటోలు వైరల్
- స్టార్‌లైనర్ క్యాప్సుల్ ప్రయోగం మళ్లీ వాయిదా..కారణం..
- RR vs RCB: వార్ వన్‌సైడ్.. గెలిచేది ఆ జట్టే: టీమిండియా దిగ్గజం
- Kalki 2898: 12 సెకన్లు.. రూ.3 కోట్లు, రాజమౌళిని ఫాలో అవుతున్న ‘కల్కి’టీమ్!
Advertisement