-
నిపుణన్ సక్సెస్ మీట్
తమిళసినిమా: దక్షిణాదిలో యాక్షన్ కింగ్‌గా ముద్ర వేసుకుని కథానాయకుడిగా 150 చిత్రాల మైలురాయి చేరుకున్న నటుడు అర్జున్. నటుడిగానే కాకుండా, నిర్మాత, దర్శకుడిగానూ సత్తా చాటుకున్న ఈయన తాజాగా నటించిన నిపుణన్ చిత్రం 150వ చిత్రంగా నమోదు చేసుకుంది. ఇందులో అర్జున్‌తో పాటు ప్రసన్న, నటి వరలక్ష్మీశరత్‌కుమార్, వైభవ్, కృష్ట వంటి యువ నటీనటులు నటించారు. అరుణ్‌వైద్యనాథన్ కథ, కథనం, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించిన ఈ చిత్రం గతవారం తెరపైకి వచ్చి విశేష ప్రేక్షకాదరణ పొందుతున్న నేపథ్యంలో మంగళవారం సాయంత్రం చిత్ర యూనిట్ సక్సెస్‌మీట్‌ను నిర్వహించింది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు అరుణ్‌వైద్యనాథన్ మాట్లాడుతూ నిపుణన్ చిత్ర కథను తయారు చేసుకున్నప్పుడే మంచి చిత్రం అవుతుందనే నమ్మకం కలిగిందన్నారు. నటుడు అర్జున్ 150వ చిత్రానికి తాను దర్శకత్వం వహించడం గర్వంగా ఉందన్నారు. ఈ చిత్రంలో తనతో పనిచేసిన కళాకారులు, సాంకేతిక వర్గం అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నానని అన్నారు. చిత్ర నిర్మాత ఉమేష్ మాట్లాడుతూ చిత్రం చూసిన పత్రికల వారి అభిప్రాయం, ప్రేక్షకుల అభిప్రాయం ఒకటే కావడంతోనే ఈ నిపుణన్ ఇంత విజయం సాధించిందని పేర్కొన్నారు. చిత్ర హీరో అర్జున్ మాట్లాడుతూ నిపుణన్ చిత్ర సక్సెస్ మీట్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. దర్శకుడు అరుణ్‌వైద్యనాథన్ నిపుణన్ చిత్ర స్క్రిప్ట్‌ను చెప్పిన విధంగానే తెరకెక్కించినందుకు ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానని అన్నారు. ఈ చిత్రంలో తనతో పనిచేసిన కథాకారులకు, అదే విధంగా తన 150 చిత్రాలకు పనిచేసిన వారందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానన్నారు. ఇకపై కూడా నటుడిగా కొనసాగాలనుకుంటున్నానని, నిపుణన్ లాంటి వైవిధ్యభరిత కథా చిత్రాల్లో నటించాలని ఆశిస్తున్నానని అర్జున్ పేర్కొన్నారు. అదే విధంగా దర్శకుడిగా ప్రముఖ హీరోలతో పనిచేయాలని కోరుకుంటున్నానని, అలాంటి సందర్భం కోసం ఎదురు చూస్తున్నానని అన్నారు. కాగా ప్రస్తుతం ఈయన తన కూతురు ఐశ్వర్య అర్జున్ హీరోయిన్గా సొల్లివిడవా అనే పేరుతో ఒక యూత్‌ఫుల్ ప్రేమ కథా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అందులో తాను ఒక అతిథి పాత్రలో కనిపించనున్నట్లు అర్జున్ వెల్లడించారు. -
సాల్ట్, పెప్పర్ గెటప్‌లో నటించా
తమిళసినిమా: నిపుణన్ చిత్రంలో సాల్ట్ అండ్ పెప్పర్ గెటప్‌లో నటించానని యాక్షన్ కింగ్ అర్జున్ తెలిపారు. ఇటీవల స్టార్ హీరోలు సాల్ట్ అండ్ పెప్పర్ గెటప్‌లో కనిపించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ మధ్యకాలంలో నటుడు అజిత్ ఎక్కువగా తన చిత్రాల్లో సహజత్వంతో కూడిన పాత్రల్లో సాల్ట్ పెప్పర్ గెటప్‌లో కనిపించి అభిమానుల్ని అలరిస్తున్నారు. సూపర్‌స్టార్ రజనీకాంత్ కూడా కబాలి చిత్రంలో అలాంటి గెటప్‌లోనే ఆకట్టుకున్నారు. తాజాగా నటిస్తున్న కాలా చిత్రంలోనూ రజనీకాంత్‌ను సాల్ట్ అండ్ పెప్పర్ గెటప్‌లోనే నటిస్తున్నారు. ఇక యాక్షన్‌కింగ్ అర్జున్ తన తాజా చిత్రం నిపుణన్లో సాల్ట్ అండ్ పెప్పర్ గెటప్‌లో నటించారు. విశేషం ఏమిటంటే ఇది అర్జున్‌కు 150వ చిత్రం. అరుణ్ వైద్యనాథన్ దర్శకత్వం వహించిన ఇందులో ప్రసన్న, వరలక్ష్మీశరత్‌కుమార్, వైభవ్, కృష్ణ ముఖ్య పాత్రలు పోషించారు.ఈ చిత్రం శుక్రవారం తెరపైకి వచ్చింది. ఈ సందర్భంగా నటుడు అర్జున్ తన అనుభవాలను తెలుపుతూ తన సినీ పయనంలో ఒక్కో తరుణంలో ప్రేమాభిమానాలను అందుకోవడంతో పాటు, పలు ఆటంకాలను ఎదుర్కొన్నానన్నారు. చాలా పోలీస్ పాత్రల్లో నటించానన్నారు. నిపుణన్ చిత్రంలోనూ డీఎస్పీగా సాల్ట్ అండ్ పెప్పర్ గెటప్‌లో వైవిధ్యభరిత పాత్రను పోషించానని చెప్పారు. ఈ చిత్ర కథనాన్ని దర్శకుడు అరుణ్ వైద్యనాథన్ కొత్త కోణంలో నడిపించారని ప్రశంసించారు. ఆయన ముందుగానే చాలా హోమ్‌వర్క్ చేసి షూటింగ్ స్పాట్లో చాలా నేర్పుగా తన పనితనాన్ని నిరూపించుకున్నారని అన్నారు. తనతో పాటు నటించిన ప్రసన్న, వరలక్ష్మీశరత్‌కుమార్, శ్రుతీ హరిహర న్, వైభవ్ ఇలా అందరూ తమ పనిని పర్ఫెక్ట్గా నిర్వహించారని చెప్పారు. విజయానికి కావలసిన అన్ని అంశాలు ఉన్న నిపుణన్ కచ్చితంగా ప్రేక్షకుల ఆదరణను పొందుతుందనే నమ్మకం తనకుందని అర్జున్ అన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
స్కూల్లో బెత్తం దెబ్బలు తిన్నా: సూప్రీం చీఫ్ జస్టిస్
చీర కామెంట్స్... సీఎం రేవంత్‌కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
IPL 2024 PBKS VS CSK: రుతురాజ్‌ను వెంటాడుతున్న దరిద్రం
ఉంగరంతో ఆరోగ్యం పదిలం!
Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియల్ నటి శోభా శెట్టి ఎంగేజ్మెంట్ (ఫోటోలు)
గ్రాండ్‌గా నటుడి కుమార్తె రిపెప్షన్ వేడుక.. సందడి చేసిన ప్రముఖ తారలు!
సీఎం జగన్ రేపటి ఎన్నికల ప్రచార సభల షెడ్యూల్ ఇదే
నాన్న చనిపోయినా వేళ్లలేదు.. బంధువులంతా తిట్టారు: కోవై సరళ ఎమోషనల్
IPL 2024: పంజాబ్‌తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
రెచ్చిపోయిన ఇసుక మాఫియా.. ట్రాక్టర్‌తో తొక్కించి ఏఎస్ఐ హత్య
తప్పక చదవండి
- ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
- ఇదేం ఫ్యామిలీ రా సామీ! ఏకంగా కోబ్రాకే నేరుగా..!
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్‌గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement