-
అనర్హులకు లబ్ధి
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల రిటైర్మెంట్ వయసు పెంపు ప్రతిపాదనలపై కేంద్రం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘దాన్ని పెంచితే సరైన అర్హత లేని, సరైన పనితీరు కనబరచని న్యాయమూర్తుల సర్వీసూ పెరుగుతుంది. పైగా ప్రభుత్వోద్యోగుల నుంచీ రిటైర్మెంట్ వయసు పెంపు డిమాండ్‌కు ఇది దారి తీయొచ్చు’’ అని పేర్కొంది. ఈ మేరకు సిబ్బంది, న్యాయ వ్యవహారాల పార్లమెంటు సంఘానికి ప్రజెంటేషన్ సమర్పించింది. ‘‘కాబట్టి ఈ అంశాన్ని సమగ్రంగా పరిశీలించాల్సిన అవసరముంది. ఉన్నత న్యాయ వ్యవస్థలో జవాబుదారీతనం, పారదర్శకత కోసం చేపట్టే చర్యల్లో భాగంగా రిటైర్మెంట్ వయసు పెంపు అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటాం’’ అని తెలిపింది. ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు 65 ఏళ్లు, హైకోర్టు న్యాయమూర్తులు 62 ఏళ్లకు రిటైరవుతున్నారు. దీన్ని పెంచేందుకు 2010లో 114వ రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టారు. కానీ 15వ లోక్‌సభ రద్దుతో దానికి కాలదోషం పట్టింది. -
పనికిరారని ముద్ర వేసి.. టెకీలను పంపేస్తున్నారు
ఎవరిదైనా ఉద్యోగం తీసేయాలంటే వాళ్లను పనికి రారని ముద్ర వేయాలి. దేశంలో చాలావరకు ఐటీ కంపెనీలు ఇప్పుడు ఇదే సూత్రాన్ని ఉపయోగిస్తున్నాయి. చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లను 'నాన్ పెర్ఫార్మర్స్'గా ముద్ర వేసి వాళ్లను ఇంటికి పంపేస్తున్నాయి. ఆటోమేషన్ పెరగడం, లాభాలు గణనీయంగా తగ్గడం, ట్రంప్ ప్రభావంతో అంతర్జాతీయంగా కొత్త కాంట్రాక్టుటు రాకపోవడానికి తోడు ఉన్న కాంట్రాక్టులు కూడా రెన్యువల్ కాకపోవడం లాంటి కారణాలతో ఉద్యోగుల సంఖ్యను చాలావరకు తగ్గిస్తున్నాయి. ప్రధానంగా మిడ్, సీనియర్ లెవెల్స్‌లో ఈ ఉద్యోగాల కోత ఎక్కువగా కనపడుతోంది. ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, విప్రో, టెక్ మహీంద్రా.. ఇలా అనేక కంపెనీలు ఇటీవలి కాలంలో కొంతమందిని నాన్ పెర్ఫార్మర్లు అనే ముద్ర వేసి ఉద్యోగాలు ఊడగొట్టి పంపించాయి. ఉద్యోగుల జీతాల మీదే తాము దాదాపు 60-70 శాతం ఖర్చుపెట్టాల్సి వస్తోందని, దాన్ని తగ్గించుకోవడం తప్ప తమకు వేరే మార్గం ఉండబోదని కంపెనీ వర్గాలు అనధికారికంగా చెబుతున్నాయి. పేరుకు నాన్ పెర్ఫార్మర్లు అని చూపించి పంపేస్తున్నారని, ఇలా పంపేసేవారిలో చాలామందికి ఇంతకుముందు సంవత్సరం లేదా ఈ సంవత్సరం రేటింగులు బ్రహ్మాండంగా వచ్చిన దాఖలాలు ఉన్నాయని, కేవలం అతి తక్కువ కాలంలో ఒక 'ఎ'గ్రేడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నట్టుండి నాన్ పెర్ఫార్మర్గా ఎలా మారిపోతాడని ఇటీవలే ఉద్వాసనకు గురైన ఒక ఉద్యోగి వాపోయారు. క్వాలిటీ ఎష్యూరెన్స్ విభాగంలో సాధారణంగా నాన్ పెర్ఫార్మెన్స్ అనేదే ఉండదని, కానీ అదే కారణం చూపించి పైగా తనకేదో మేలు చేస్తున్నట్లుగా నాలుగు నెలల జీతం ఇస్తున్నామని చెప్పి, తనచేత బలవంతంగా రిజైన్ చేయించారని, తనను ఏదో మీటింగ్ ఉందని పిలిపించి అటు నుంచి అటే పంపేశారని మరో ఉద్యోగి చెప్పారు. సాధారణంగా లే ఆఫ్‌లు ప్రతియేటా ఉంటాయి గానీ ఈ ఏడాది ఇంకా ఎక్కువగా ఉన్నాయని ఒక హైరింగ్ సంస్థ నిర్వాహకుడు చెప్పారు. సీనియర్ పొజిషన్ల నుంచి బయటకు వచ్చినవారికి కూడా కొత్త సంస్థల్లో ఓపెనింగ్స్ పెద్దగా కనిపించడం లేదని, ఒకటీ అరా ఇంటర్వ్యూలు వస్తున్నా.. మళ్లీ యాజమాన్యం ఆలోచనలు మారడంతో చివరకు వాళ్లకు ఆఫర్ లెటర్లు రిలీజ్ కావడం లేదని వివరించారు. కొత్తగా తీసుకుంటాం: టీసీఎస్ ఒకవైపు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో అంతా ఉద్యోగులను బయటకు పంపేస్తున్న ట్రెండ్ కనిపిస్తుంటే మరోవైపు టీసీఎస్ మాత్రం తమ దగ్గర అలాంటిదేమీ లేదని, పైపెచ్చు ఈసారి కొత్తగా మరింతమందిని తీసుకుంటామని ప్రకటించి అందరినీ ఒక్కసారిగా ఆశ్చర్యపరిచింది. బిహార్‌లో తమ రెండో క్యాంపస్‌ను ప్రారంభించిన టీసీఎస్.. తన ప్రకటనతో నిరుద్యోగులలో ఆశలు రేకెత్తించింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేనేమి పాపం చేశానమ్మా..!
ఆదిలాబాద్ నుంచే షురూ
ఈవీఎం కమిషనింగ్ సమర్థవంతంగా చేపట్టాలి
పని వేళలు మార్చాలని సీఎండీకి వినతి
కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్
నిరుద్యోగ సమస్య తీరుస్తా
గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం
వాహనాలు సిద్ధం
భూగర్భ జలాలు.. మరింత దిగువకు
● ఆర్థికంగా ఉన్న కుటుంబానికే అవకాశాలు ● కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య సహకారం ● కార్మిక నేతగా ఇక్కడి సాధకబాధలు తెలుసు ● పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలంతా ఆలోచించాలి ● ‘సాక్షి’తో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్‌లో ఉన్నా: నటి
- హీట్‌వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్‌తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement