-
పగలే కమ్ముకున్న చీకట్లు
మునుపెన్నడూ చేసుకోని పరిణామాలకు ఉత్తర అమెరికా వేదిక అయ్యింది. గ్రహణంతో పగలే కారుచీకట్లు కమ్ముకున్నవేళ.. లక్షల మంది ఆకాశంలో అద్భుతాన్ని వీక్షించారు.ఉత్తర అమెరికా, కెనడా మీదుగా సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడింది. సంపూర్ణ సూర్యగ్రహణానికి సంబంధించి అమెరికాకు చెందిన నాసా పూర్తి సూర్య గ్రహణం ఏర్పడిన చిత్రాన్ని, వీడియోను విడుదల చేసింది. సోమవారం చోటు చేసుకున్న సంపూర్ణ సూర్యగ్రహణం సుమారు 2045 ఏడాదిన మళ్లీ ఏర్పడనుందని పేర్కొంది. Ever seen a total solar #eclipse from space? Here is our astronauts' view from the @Space_Station pic.twitter.com/2VrZ3Y1Fqz — NASA (@NASA) April 8, 2024 అంతరిక్షం నుంచి సంపూర్ణ సూర్యగ్రహణ గమనానికి సంబంధించి ఓ వీడియోను కూడా నాసా షేర్ చేసింది. ఇందులో సూర్యగ్రహణ గమనం కారణంగా నెమ్మదిగా కదులుతూ.. ఉత్తర అమెరికాపై చీకటి ఛాయ వ్యాపించడాన్ని అంతరిక్ష కేంద్ర నుంచి వ్యోమగాములు గమనిస్తున్నారని తెలిపింది. పట్టపగలే కొంత సమయం పాటు ఉత్తర ఆమెరికా ప్రాంతం చీకటిగా మారిందని తెలిపింది. ఇండియానాపోలిస్ మొత్తాన్ని క్రాస్ చేస్తూ.. ఇలా సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడటం సుమారు 800 ఏళ్లలో ఇదే మొదటిసారని వెల్లడించింది నాసా. Follow, follow the Sun / And which way the wind blows / When this day is done 🎶 Today, April 8, 2024, the last total solar #eclipse until 2045 crossed North America. pic.twitter.com/YH618LeK1j — NASA (@NASA) April 8, 2024 మరోవైపు టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ సంపూర్ణ సూర్యగ్రహణానికి సంబంధించిన వీడియోను ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ‘సూర్యుడు భ్రమిస్తూ గ్రహణం ఏర్పడటం ఆర్బిట్ నుంచి కనిపిస్తుంది’ అని కామెంట్ జత చేశారు. View of the eclipse from orbit pic.twitter.com/2jQGNhPf2v — Elon Musk (@elonmusk) April 9, 2024 -
‘తానా ప్రపంచసాహిత్య వేదిక’
డెట్రాయిట్, అమెరికా: ఉత్తరఅమెరికా తెలుగుసంఘం సాహిత్యవిభాగం – ‘తానా ప్రపంచసాహిత్య వేదిక’ ఆద్వర్యంలో ప్రముఖ సినీకవి, పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రిగారి సమగ్రసాహిత్యాన్ని సిరివెన్నెల కుటుంబసభ్యుల సహకారంతో అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన మొత్తం ఆరు సంపుటాలలో ముద్రించి సిరివెన్నెల అభిమానులకు, సాహితీ ప్రియులకు ఇటీవలే కానుకగా అందించిన సంగతి విదితమే. ఇప్పడు అదే స్ఫూర్తితో సుప్రసిద్ధ కవి, రచయిత కొసరాజు రాఘవయ్య చౌదరిగారి సమగ్ర సాహిత్యాన్ని తానా పూర్వాధ్యక్షులు, తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు అయిన డా. ప్రసాద్ తోటకూర గారి నేతృత్వంలో ముద్రించి త్వరలో తెలుగు భాషాభిమానులకు, సాహితీప్రియులకు అందజేయనున్నామని తానా అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు కొసరాజుగారి 37వ వర్దంతి (అక్టోబర్ 27) సందర్భంగా ఒక పత్రికా ప్రకటనలో వెల్లడించారు. ఇది తానా సంస్థ ఒక మహాకవికి ఇచ్చే ఘన నివాళిగా నిలుస్తుందని ఆయన అన్నారు. తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు, డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “దాదాపు నాల్గు దశాబ్దాలుగా సాగిన కవిరత్న, జానపద కవి సార్వభౌమ కొసరాజు రాఘవయ్య చౌదరిగారి సాహితీ ప్రయాణంలో “ఏరువాక సాగాలోరన్న”; “అయయో చేతిలో డబ్బులు పోయెనే, అయయో జేబులు ఖాళీ ఆయెనే”; “భలే ఛాన్సులే భలే ఛాన్సులే, ఇల్లరికంలో ఉన్న మజా”; “సరదా సరదా సిగరెట్టు, ఇది దొరలు కాల్చు సిగరెట్టు”; “రామయతండ్రి, ఓ రామయ తండ్రి, మానోములన్ని పండినాయి రామయ తండ్రీ”; “ఆడుతుపాడుతూ పనిజేస్తుంటే, అలుపూ సొలుపేమున్నది” లాంటి పాటలలో అచ్చతెలుగులోని అందాలు, జానపదుల భాషలోని సొగసులు, పల్లెపట్టు భాషలోని చమత్కారాలు, విరుపులు కొసరాజు గారి కలంనుండి రెండువందల చిత్రాలలో వెయ్యికి పైగా పాటలు జాలువారాయి. కేవలం సినిమా పాటలేగాక కొసరాజు గారు “గండికోట యుద్ధము” అనే ద్విపద కావ్యము; “కడగండ్లు” అనే పద్యసంకలనం, “కొసరాజు విసుర్లు”, “కొండవీటి చూపు”, “నవభారతం”, “భానుగీత” లాంటి గ్రంధాలు, యక్షగానాలు, వీధిభాగవతాలు, హరికథలు, జముకుల కథలు, బుర్రకథలు, భజనగీతాలు, పగటివేషగాళ్ళ పాటలు, రజకుల పాటలు, పాములోళ్ళ పాటలు, గంగిరెద్దుల గీతాలు లాంటవి ఎన్నో రాశారని అన్నారు”. ఈ సందర్భంగా కొసరాజు గారి కుటుంబసభ్యులతో మాట్లాడి ఎన్నో విషయాలను ఇప్పటికే సేకరించడం జరిగిందని, ఈ కార్యక్రమంలో పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్న కొసరాజు గారి కుటుంబసభ్యులకు, కొసరాజు గారి సమగ్ర సాహిత్యాన్ని త్వరలో తెలుగు ప్రజలకు అందించే తానా ప్రపంచసాహిత్యవేదిక తలపెట్టిన సాహితీ మహాయజ్ఞంలో ప్రముఖ పాత్ర పోషించనున్న పేరెన్నికగన్న సాహితీవేత్త, పరిశోధకులు, అనుభవజ్ఞులు అయిన అశోక్ కుమార్ పారా (మనసు ఫౌండేషన్) కు కృతజ్ఞతలు అన్నారు తానా ప్రపంచ సాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర. -
పేద విద్యార్థులకు అండగా నాట్స్ అధ్యక్షుడు
ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ అధ్యక్షులు బాపయ్య చౌదరి జన్మభూమి రుణం కొంత తీర్చుకోవడానికి ముందుడుగు వేశారు. తన స్వగ్రామమైన గుంటూరు జిల్లా పెదనందిపాడులో ప్రతిభగల పేద విద్యార్ధులకు అండగా నిలిచారు. తాను చదువుకున్న కళశాలలో ప్రస్తుతం అత్యుత్తమ మార్కులు సాధించిన వారికి మెరిట్ స్కాలర్షిప్లు అందించారు. పెదనందిపాడు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళశాలలో ఇంటర్, డిగ్రీ చదువుతున్న విద్యార్ధుల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్ధులకు ఒక్కొక్కరికి 10 వేల రూపాయల చొప్పున స్కాలర్షిప్లను అందించారు. కళాశాల పూర్వ విద్యార్థి బాపయ్య చౌదరి నాట్స్ అధ్యక్షునిగా ఎన్నికై తాను చదువుకున్న కళాశాలలోనే పేద విద్యార్థులకు సహాయ,సహకారాలు అందించడం మరెందరో పూర్వ విద్యార్థులకు స్ఫూర్తిదాయకం అని పలువురు అభినందించారు. మెరిట్ స్కాలర్షిప్లు అందుకున్న విద్యార్ధులు సంతోషం వ్యక్తం చేశారు. ప్రతిభ గల విద్యార్ధులను మెరిట్ స్కాలర్‌షిప్‌లతో ప్రోత్సాహిస్తున్న నాట్స్ అధ్యక్షుడు బాపయ్య చౌదరి నూతిని నాట్స్ చైర్ విమెన్ అరుణ గంటి, నాట్స్ బోర్డు సభ్యులు ప్రత్యేకంగా ప్రశంసించారు. (చదవండి: వైట్‌హౌస్‌లో అడుగడుగున మోదీకి ఘన స్వాగతం) -
ఆ రోడ్డుపై ప్రయాణిస్తూ 14 దేశాలు దాటేయొచ్చు.. ఎక్కడుందో తెలుసా!
ఏ దేశంలోని రోడ్లయినా వివిధ ప్రాంతాలను కలుపుతాయనే విషయం మనకు తెలిసిందే. వివిధ రోడ్లపై ప్రయాణించడం ద్వారా మనం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేరుకోవచ్చు. అయితే కొన్ని రోడ్లు చిన్నవిగా, మరికొన్ని రోడ్లు పెద్దవిగా ఉండటాన్ని మనం గమనించేవుంటాం. మనదేశంలోని అతిపెద్ద రోడ్డు విషయానికివస్తే అది నేషనల్ హైవే-44. ఇది 3,745 కిలోమీటర్ల దూరం కలిగివుంది. ఇది కన్యాకుమారితో మొదలై శ్రీనర్ వరకూ ఉంటుంది. అయితే ప్రపంచంలో దీనికి మించిన అతిపెద్ద హైవే ఉందని, దానిపై ప్రయాణిస్తే ఏకంగా 14 దేశాలు చుట్టేయచ్చనే సంగతి మీకు తెలుసా? ఉత్తర అమెరికా- దక్షిణ అమెరికాలను కలిపే పాన్ అమెరికా హైవే ప్రపంచంలోనే అతి పెద్ద రహదారి. అలస్కాలో మొదలై అర్జెంటీనా వరకూ ఈ రహదారి కొనసాగుతుంది. రెండు మహా ద్వీపాలను అనుసంధానించే ఈ సింగిల్ రూట్ నిర్మాణానికి 1923లో తొలి అడుగు పడింది. ఈ హైవేను మొత్తం 14 దేశాలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కాగా ఈ రహదారిలోని 110 కిలోమీటర్ల ఒక భాగం నిర్మాణం ఇప్పటివరకూ పూర్తి కాలేదు. ఈ భాగాన్ని డారియన్ గ్యాప్ అని అంటారు. ఇది పనామా కొలంబియాల మధ్య ఉంది. కాగా ఈ డారియన్ గ్యాప్ ప్రాంతం కిడ్నాప్‌లు, డ్రగ్ ట్రాఫికింగ్, స్మగ్లింగ్ తదితర అక్రమ కార్యకలాపాలకు నిలయంగా మారింది. దీంతో జనం ఈ మార్గాన్ని దాటేందుకు బోటు లేదా ప్లెయిన్ మాధ్యమంలో బైపాస్ చేస్తారు. చదవండి: ఖండాంతరాలు దాటిన ప్రేమ.. భార్య కోసం ఇండియా నుంచి యూరప్‌కు సైకిల్‌పై ఆ 14 దేశాలు ఇవే.. 1. యునైటెడ్ స్టేట్స్ 2.కెనడా 3. మెక్సికో 4. గ్వాటెమాల 5. ఎల్ సల్వడార్ 6.హోండురాస్ 7. నికరాగ్వా 8. కోస్టా రికా 9.పనామా 10.కొలంబియా 11. ఈక్వెడార్ 12. పెరూ 13.చిలీ 14. అర్జెంటీనా ప్రయాణానికి ఎంత సమయం పడుతుందంటే... ఎవరైనా ప్రతీరోజూ సుమారు 500 కిలోమీటర్ల మేరకు ప్రయాణించగలిగితే వారు 60 రోజుల్లో ఈ రహదారి ప్రయాణాన్ని పూర్తి చేయవచ్చు. కార్లెస్ సాంటామారియా అనే సైకిలిస్టు ఈ రహదారిని 177 రోజుల్లో చుట్టివచ్చాడు. ఈ నేపధ్యంలో అతని పేరు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదయ్యింది. ఈ రహదారి మొత్తం పొడవు 48 వేల కిలోమీటర్లు. The Pan-American highway is the longest highway in the world. This road is about 19.000 miles/30.000km long #nowyouknow #FridayThoughts pic.twitter.com/oRdBTMhFRD — 🇺🇦Evan Kirstel #B2B #TechFluencer (@EvanKirstel) November 6, 2020 -
చరిత్ర సృష్టించిన మాలావత్ పూర్ణ.. మౌంట్ డెనాలి ఎక్కి ప్రపంచ రికార్డు
సాక్షి, నిజామాబాద్: మాలావత్ పూర్ణ అరుదైన ఘనత సాధించి మరోసారి చరిత్ర సృష్టించింది. ప్రపంచంలో 7 ఎత్తైన శిఖరాలను అధిరోహించి దేశ ఖ్యాతిని ఇనుమడింపజేసింది. ఈ నెల 5న ఉత్తర అమెరికాలోని డెనాలి పర్వత శిఖరం (6,190 మీటర్లు/20,310 అడుగులు) అధిరోహించడంతో ప్రపంచస్థాయి 7–సమ్మిట్ చాలెంజ్‌ను పూర్తి చేసింది. ఈ ఘనత సాధించిన ‘యంగెస్ట్ ఫిమేల్ ఇన్ ఇండియా’గా రికార్డు సృష్టించింది. పూర్ణ మే 18న ఇండియా నుంచి బయల్దేరి, మే 19న అలస్కాలోని ఎంకరేజ్ నగరానికి చేరుకుంది. ఈ పర్వతారోహణలో పూర్ణతోపాటు మనదేశం నుంచి మరో నలుగురు సభ్యులున్నారు. మే 23న బేస్ క్యాంప్‌కు చేరుకున్నవారు శిఖర అధిరోహణ ప్రారంభించి, ఈనెల 5న లక్ష్యాన్ని చేరుకున్నారు. ఈ విషయాన్ని ఆమె కోచ్ శేఖర్ బాబు ధ్రువీకరించారు. శిఖరం నుంచి కిందికి వస్తూ పూర్ణ శాటిలైట్ ఫోన్ ద్వారా ఈ సమాచారాన్ని పంచుకుంది. ఈ యాత్రకు స్పాన్సర్ చేసిన ఏస్ ఇంజనీరింగ్ అకాడమీ చైర్మన్ ప్రొఫెసర్ వైవీ గోపాలకృష్ణమూర్తి, తన గురువు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఐపీఎస్(వీఆర్ఎస్), సహకరించిన హైదరాబాద్ బీఎస్బీ ఫౌండేషన్ చైర్మన్ భూక్యా శోభన్‌బాబులకు పూర్ణ కృతజ్ఞతలు తెలిపింది. పూర్ణ సాహస యాత్రకు హైదరాబాద్‌కు చెందిన ‘ట్రాన్సెండ్ అడ్వెంచర్స్’ సంస్థ తోడ్పాటునందించింది. ప్రపంచవ్యాప్తంగా ఆమె సాహస యాత్రలను నిర్వహించేందుకు అవసరమైన లైసెన్స్‌లు ఇప్పించి, 7–సమ్మిట్స్ చాలెంజ్‌ను పూర్తి చేయడంలోనూ కీలకపాత్ర పోషించింది. దెనాలి పర్వతారోహణలో పూర్ణతోపాటు అడ్వెంచర్ స్పోర్ట్స్‌లో పద్మశ్రీ అవార్డు గ్రహీత అజీత్ బజాజ్, ఆయన కుమార్తె దియా బజాజ్, విశాఖపట్నానికి చెందిన అన్మిష్ వర్మ కూడా ఉన్నారు. దక్షిణభారత దేశం నుంచి తొలి యువతి.. కాగా, ప్రస్తుతం పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్న పూర్ణ 2014లో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన ‘ప్రపంచంలోని అతి పిన్న వయస్కురాలు’గా చరిత్ర సృష్టించింది. ఆమె ఇప్పటివరకు ఎవరెస్ట్, ఆఫ్రికాలోని కిలిమంజారో, యూరప్‌లోని ఎల్బ్రస్, దక్షిణ అమెరికాలోని అకోన్‌కాగస్, ఓసెనియాలోని కార్టెన్జ్ పిరమిడ్, అంటార్కిటికాలోని విన్సన్, తాజాగా ఉత్తర అమెరికాలోని దెనాలి శిఖరాలను అధిరోహించింది. దక్షిణ భారతదేశం నుంచి ఈ 7–సమ్మిట్ ఘనతను సాధించిన మొదటి యువతి పూర్ణ కావడం విశేషం. పూర్ణ అధిరోహించిన పర్వతాలు: 1. ఎవరెస్టు (ఆసియా) 2. మౌంట్ కిలిమంజారో (ఆఫ్రికా) 3. మౌంట్ ఎల్బ్రస్ (యూరప్) 4. మౌంట్ అకోన్‌కగువా (దక్షిణ అమెరికా) 5. మౌంట్ కార్టెన్జ్ (ఓషియానియా) 6. మౌంట్ విన్సన్ (అంటార్కిటికా) 7. మౌంట్ డెనాలి (ఉత్తర అమెరికా)
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- మళ్లీ దోపిడీకి తెరపైకి..
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్‌స్టాప్‌గా... జెట్ స్పీడ్‌లో
- ఐపీఎల్‌పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
Advertisement