-
సహారా లైఫ్ విలీనం కాదు.. పాలసీల బదిలీ
న్యూఢిల్లీ: సహారా లైఫ్‌ను తాము విలీనం చేసుకోవడం లేదని ఎస్బీఐ లైఫ్ స్పష్టం చేసింది. బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) ఆదేశాల మేరకు సహారా లైఫ్ ఇన్సూరెన్స్ నిర్వహణలోని పాలసీ దారుల ఆస్తులు, అప్పులను స్వాధీనం చేసుకుంటున్నట్టు తెలిపింది. సహారా లైఫ్ ఇన్సూరెన్స్ ఆర్థిక పరిస్థితులు క్షీణించడంతో సంస్థ జారీ చేసిన పాలసీలు, వాటి ఆస్తులు, అప్పులను స్వాధీనం చేసుకోవాలంటూ గత శుక్రవారం ఐఆర్డీఏఐ ఎస్బీఐ లైఫ్‌ను ఆదేశించడం గమనార్హం. మెరుగైన సేవలు అందిస్తామని సహారా లైఫ్ పాలసీదారులకు ఎస్బీఐ లైఫ్ అభయమిచ్చింది. ‘‘సహారా లైఫ్ పాలసీలను మా వ్యవస్థతో అనుసంధానించేందుకు వేగవంతమైన చర్యలు మొదలు పెట్టాం. పూర్తి స్థాయి ఏకీకరణకు కొంత సమయం పడుతుంది. సహారా లైఫ్ పాలసీదారులు 1800 267 9090 టోల్ ఫ్రీ నంబర్లో లేదా ట్చజ్చిట్చ జీజ్ఛఃటbజీ జీజ్ఛ. ఛిౌ. జీn మెయిల్ ఐడీ ద్వారా సంప్రదించాలని ఎస్బీఐ లైఫ్ సూచించింది. సహారా లైఫ్ కొత్తగా పాలసీలను విడుదల చేయరాదని కూడా ఐఆర్డీఏఐ ఆదేశించడం గమనార్హం. తగినంత సమయం, తగినన్ని అవకాశాలు కల్పించినప్పటికీ తమ ఆదేశాలను పాటించడంలో., పాలసీదారుల ప్రయోజనాల పరిరక్షణకు నిర్ణయాత్మక చర్యలు తీసుకోవడంలో సహారా లైఫ్ ఇన్సూరెన్స్ విఫలమైందని ఆఆర్డీఏఐ తన ఆదేశాల్లో పేర్కొంది. -
'90 శాతం మంది కాంగ్రెస్‌తో విలీనం వద్దంటున్నారు'
కాంగ్రెస్ పార్టీలో విలీనం వద్దని దాదాపు 90 శాతం మంది తమ పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారని టీఆర్ఎస్ నేత జి.వినోద్ మంగళవారం న్యూఢిల్లీలో వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం ఎంత ముఖ్యమో ఆ రాష్ట్ర పునర్నిర్మాణం కూడా తమకు అంతే ముఖ్యమని తెలిపారు. తమ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ పునర్నిర్మాణం జరగాలని తామంతా కోరుకుంటున్నామన్నారు. తెలంగాణ సమస్యల పరిష్కారం, అభివృద్ధికి సంబంధించిన కీలక బాధ్యతలు కేసీఆర్‌కు అప్పగిస్తే తమ పార్టీ విలీనంపై ఆలోచిస్తామన్నారు. అయితే టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తా లేక విలీనమా అనే అంశాలపై చర్చల ప్రక్రియ జరుగుతుందని విలేకర్లు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఆ అంశాలపై చర్చ ఒక్క రోజులో ముగిసేది కాదన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్‌రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement