-
రవి తేజ ని చాలా లవ్ చేశాను కానీ
-
రన్ టైమ్ తగ్గించినా కలిసిరాలేదు.. టైగర్ నాగేశ్వరరావు కలెక్షన్స్ ఎన్ని కోట్లంటే?
మాస్ మహారాజా రవితేజ నటించిన తాజా చిత్రం టైగర్ నాగేశ్వరరావు. ఈ చిత్రంలో కృతి సనన్ సోదరి నూపూర్ సనన్ హీరోయిన్గా నటించింది. విజయదశమి సందర్భంగా ఈనెల 20న థియేటర్లలో రిలీజైంది. అభిమానుల భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే బాక్సాఫీస్ వద్ద వసూళ్లు రాబట్టడంతో టైగర్ నాగేశ్వరరావు విఫలమైంది. (ఇది చదవండి: 20 ఏళ్లుగా అంటున్న మాట నిజమైంది: బన్నీ ఆసక్తికర కామెంట్స్) ఈ మూవీ రన్‌టైమ్ తగ్గించినప్పటికీ ప్రేక్షకుల నుంచి ఆదరణ పెద్దగా కనిపించలేదు. తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు రూ. 5.50 కోట్ల షేర్.. దేశవ్యాప్తంగా అన్నీ భాషల్లో కలిపి రూ.8 కోట్ల నెట్ వసూలు చేసింది. రెండో రోజు రెండు రాష్ట్రాల్లో రూ. 3.20 కోట్లు వరకు షేర్‌ను వసూలు చేయగా... రెండో రోజు రూ.4.75 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. రెండు రోజుల్లో మొత్తంగా ఈ చిత్రం రూ.9 కోట్లకు పైగా షేర్‌ను అందుకుని పది కోట్ల మార్క్‌ను చేరుకునేందుకు దగ్గరలో ఉంది. ఓవరాల్‌గా చూస్తే రెండురోజుల్లో రూ.12.75 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టినట్లు తెలుస్తోంది. కాగా.. టైగర్ నాగేశ్వరరావు చిత్రాన్ని 1970 కాలంలోని స్టువర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కించారు. తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ చిత్రాన్ని నిర్మించారు. నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ కథానాయికలుగా నటించారు. జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ అందించారు. రేణు దేశాయ్, అనుపమ్ ఖేర్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. (ఇది చదవండి: 'టైగర్ నాగేశ్వరరావు'.. ఇప్పుడు జాగ్రత్త పడి ఏం లాభం?) -
‘టైగర్ నాగేశ్వరరావు’ మూవీ ట్విటర్ రివ్యూ
మాస్ మహారాజా రవితేజ నటించిన తాజా పాన్ ఇండియా చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’.స్టూవర్టుపురంలో పేరుమోసిన గజదొంగ అయిన ‘టైగర్ నాగేశ్వరరావు’ బయోపిక్ ఇది. వంశీకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. నూపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్స్. రవితేజ కెరీర్లో అత్యంత భారీగా, పాన్ ఇండియా స్థాయిలో రూపొందించిన ‘టైగర్ నాగేశ్వరరావు’పై మొదటి నుంచి భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఇటీవల విడుదలైన ట్రైలర్ ఆ అంచనాలను మరింత పెంచేశాయి. దీనికి తోడు సౌత్‌తో పాటు నార్త్‌లో కూడా ప్రమోషన్స్ గ్రాండ్‌గా నిర్వహించడంతో ‘టైగర్..’పై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(అక్టోబర్ 20)ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల ఫస్ట్ డే ఫస్ట్‌షో పడిపోయింది. దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. టైగర్ నాగేశ్వరరావు కథేంటి? ఈ సినిమాకు ప్లస్, మైనస్ పాయింట్స్ ఏంటి? తదితర విషయాలు ట్విటర్(ఎక్స్)వేదికగా చర్చిస్తున్నారు.అవేంటో చూడండి. ఇది కేవలం ప్రేక్షకుల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు. ‘టైగర్ నాగేశ్వరరావు’కు ట్విటర్లో మంచి స్పందన లభిస్తోంది. డార్క్ క్యారెక్టర్లో రవితేజ యాక్షన్ హైలెట్ అని అంటున్నారు. సినిమాలో యాక్షన్ సీన్స్ అదిరిపోయాయట. చాలా మంది ట్రైన్ సీక్వెన్స్ గురించి చర్చిస్తున్నారు. అదే సమయంలో రన్ టైమ్ ఇబ్బందికరంగా మారిందని కొంతమంది అంటున్నారు. లవ్‌ట్రాక్ కూడా అంతగా వర్కౌట్ కాలేదట. కానీ సినిమా మాత్రం బోరింగ్‌గా సాగదని చెబుతున్నారు. #TigerNageswaraRao An Action Drama that has a good start and engaging moments but feels dragged after awhile due to the tedious runtime. The setup of the characters and story is well done but after a point especially in the 2nd half it drags until the climax along with some… — Venky Reviews (@venkyreviews) October 20, 2023 ‘టైగర్ నాగేశ్వరరావు’ యాక్షన్ డ్రామా బాగుంది. అయితే రన్ టైమ్ ఎక్కువగా ఉండడం కారణంగా కొంత సాగదీసినట్లుగా అనిపిస్తుంది. ముఖ్యంగా సెకండాఫ్‌లో వచ్చే లవ్ ట్రాక్ సాగదీసినట్లుగా అనిపించింది. కానీ సినిమాలోని క్యారెక్టర్లను తీర్చిదిద్దిన విధానం, యాక్షన్స్ సీన్స్ అదిరిపోయాయి. ఈ మధ్య కాలంలో రవితేజ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇది’అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. Completed My Show 💥 Peak @RaviTeja_offl Ni Chustaru🔥 RT career Lo Best Intro🤯💥 2nd Half >>>1st Half💥💥 Interval and Climax 🙌💥 BGM @gvprakash🔥🔥 Action Sequences🔥🔥 Block Buster Movie 💥💥💥 My Rating - 4/5 #TigerNageswaraRao #RaviTeja #BlockBusterTigerNageswaraRao pic.twitter.com/D48NOVBqfA — Srinivas (@srinivasrtfan2) October 20, 2023 రవితేజ కెరీర్లో బెస్ట్ మూవీ ఇది. ఫస్టాఫ్‌తో పోలిస్తే సెండాఫ్ చాలా బాగుంటుంది. ఇంటర్వెల్, క్లైమాక్స్ సన్నివేశాలు అదిరిపోయాయి. బీజీఎం బాగుంది. ఓవరాల్‌గా టైగర్ నాగేశ్వరరావు బ్లాక్ బస్టర్ మూవీ అంటూ ఓ నెటిజన్ 4 రేటింగ్ ఇచ్చాడు. I watched #TigerNageswaraRao @BiggBossTamil7_ Review ⭐⭐⭐ so far it’s an interesting and well narrated period action drama. Ravi Teja plays a Good character which is unique to watch. VFX Low Quality #RaviTeja Good Acting . Perfect entertainerpic.twitter.com/MOjI6vvqdB — BiggBossTamil 7 (@BiggBossTamil7_) October 20, 2023 1st Half Review: #TigerNageswaraRao#RaviTeja best in recent🔥@DirVamsee few portions well handled@gvprakash Music OK but didn't create any impact Started off well then derailed with love story & lags, picked up again for interval Good so far!#TNR #TigerNageswaraRaoReview pic.twitter.com/T58yaZci0h — World Cinema (Updates & Reviews) (@UrsWorldCinema) October 20, 2023 #TigerNageswaraRao Review : 👉Rating : 2.75/5 Positives: 👉#RaviTeja Performance 👉Good First Half 👉Fight Sequences 👉Production Values Negatives: 👉Bad Songs 👉Dragged Second Half 👉Lengthy Runtime#TNR #TNRReview #TigerNageswarRaoReview — PaniPuri (@THEPANIPURI) October 19, 2023 #TigerNageswaraRao good film to watch for festival ..#RaviTeja carried the dark character very well💥💥 …Rating 3/5 — CPR News Telugu (@cprnewstelugu) October 20, 2023 #TigerNageswaraRao - 3.25/5 SuperHit ❤️ Positives: 👉#RaviTeja Performance 👉Good First Half 👉Fight Sequences 👉Production Values 👉 @gvprakash BGM Back Bone Of The Movie 🔥 Negatives: 👉Lengthy Runtime@RaviTeja_offl@AbhishekOfficl #RenuDesai pic.twitter.com/EJO9ZdBdk5 — Gayle 333 (@RajeshGayle117) October 20, 2023 #TigerNageswaraRao Outstanding ⭐⭐⭐⭐ #RaviTeja is Mind Blowing & Madras Central Jail Scene Is Bomb Basic. Bgm & Dialogues are Fire Interval block 🔥 Screen play little to long but overall worthy movies for fans#TigerNageswaraRaoReview #TigerNageshwarRao pic.twitter.com/9bLXctmoBF — Taran Adarsh (@Mrjaat0007) October 20, 2023 #TigerNageswaraRaoReview: Positives: - Ravi Teja Performance 👌👌💥 - Madras Central Jail Scene 💥💥💥💥💥💥 - Action Episodes ❤️🔥❤️🔥 - BGM in Action Sequences ☺️☺️ - Interval 💯💯 - Murder Scene in 2nd Half 🤯🤯🤯👌👌👌 Negatives: - Too Lengthy 👎👎👎 - No Proper Flow In… pic.twitter.com/P6enbesWP9 — Movies4u Official (@Movies4u_Officl) October 20, 2023 -
అప్పుడు నా కళ్లలో నీళ్లు తిరిగాయి
రవితేజ టైటిల్ రోల్ చేసిన చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. ఇందులో నూపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ హీరో యిన్లుగా నటించారు. వంశీకృష్ణ దర్శకత్వంలో తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ చిత్రం రేపు (శుక్రవారం) విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో నిర్మాత అభిషేక్ అగర్వాల్ చెప్పిన విశేషాలు. ► మంచి కంటెంట్, కొత్త కథలను చెప్పడమే మా అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థ ప్రధాన లక్ష్యం. ఈ క్రమంలోనే పవర్ఫుల్ కంటెంట్ ఉన్న ‘టైగర్ నాగేశ్వరరావు’ చేశాం. ఈ సినిమా చేయడానికి ముందే నాగేశ్వరరావు కుటుంబ సభ్యులను సంప్రదించి, ఆయన పూర్తి వివరాలు తెలుసుకున్నాం. టైగర్ నాగేశ్వరరావు దొంగగా మార డానికి దారి తీసిన కారణాలు, పరిస్థితులు ఏమై ఉంటాయి? ఆయన దొంగగా మారిన తర్వాత ఏం చేశారు? అనే అంశాలు ఈ సినిమాలో ఆసక్తికరంగా ఉంటాయి. ► రవితేజగారు హార్డ్‌వర్క్ చేశారు. యాక్షన్ సీక్వెన్స్‌లన్నీ ఆయనే చేశారు. ఓ రోజు ఆయన చేతికి గాయమైంది. లొకేషన్లో ఐదారు వందలమంది ఉన్నారు. ్ర΄÷డక్షన్ కాస్ట్ వృథా కాకూడదని, ఆయనకు ఇబ్బందిగా ఉన్నా షూటింగ్లో ΄ాల్గొన్నారు. ఇక అనుపమ్ ఖేర్‌గారు నా లక్కీ చార్మ్ అనే చె΄్పాలి. ఫలానా ΄ాత్ర చేయాలని అనుపమ్గారిని కోరితే వెంటనే ఓకే అంటారు. నాపై ఆయనకు ఉన్న నమ్మకం అలాంటిది. హేమలతా లవణంగా రేణూ దేశాయ్ బాగా నటించారు. రేణూదేశాయ్ 2.ఓ చూస్తారు. ప్రత్యేక శ్రద్ధతో జీవీ ప్రకాష్‌కుమార్ సంగీతం అందించాడు. అవినాష్ కొల్లా అద్భుతంగా ఆర్ట్ డైరెక్షన్ చేశాడు. దర్శకుడిగానే కాదు.. నిర్మాతగా కూడా బాధ్యతలు తీసుకుని పని చేశారు వంశీ. కథకు ఏది అవసరమైతే అది నేను వందశాతం ఇస్తాను. నిర్మాణంలో రాజీపడను. నా కెరీర్లో ఓ మంచి గుర్తుగా నిలిచి΄ోతుంది ‘టైగర్ నాగేశ్వరరావు’. ► పండగ అంటే రెండు, మూడు సినిమాలు రావడం సహజం. మా సినిమా కంటెంట్‌పై నమ్మకం ఉంది. ప్రేక్షకులు ఆదరిస్తారన్న నమ్మకం కూడా ఉంది. నార్త్‌లోనూ మంచి ΄ాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ► తెలుగు ఇండస్ట్రీలో నిర్మాతగా నేను అవుట్‌సైడర్‌ని. ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. వచ్చిన మూడేళ్ళలో నిర్మాతగా జాతీయ అవార్డు (‘కశ్మీరీ ఫైల్స్’ చిత్రం) అందుకోవడం మా సంస్థకు గౌరవాన్ని తెచ్చింది. అవార్డు అందుకుంటున్నప్పుడు నా కళ్లలో నీళ్లు తిరిగాయి. మా బ్యానర్లో త్వరలో ఓ క్రేజీ బయోపిక్ ప్రకటిస్తా. -
బద్రి సినిమా ఇప్పుడే రిలీజైనట్లు ఉంది: రేణు దేశాయ్ కామెంట్స్ వైరల్!
మాస్ మహారాజా రవితేజ టైగర్ నాగేశ్వరరావుగా ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీని వంశీకృష్ణనాయుడు దర్శకత్వంలో.. అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. 1970లో జరిగిన యథార్థ ఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. గుంటూరు జిల్లాలోని స్టువర్టుపురానికి చెందిన ఒకనాటి గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవితాన్నే ఈ చిత్రంలో చూపించనున్నారు. ఇప్పటికే ట్రైలర్, టీజర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. తాజాగా చిత్రబృందం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈవెంట్‌కు హాజరైన నటి రేణు దేశాయ్ పలు ఆసక్తికర కామెంట్స్ చేసింది. హీరో రవితేజపై ప్రశంసల వర్షం కురిపించింది. (ఇది చదవండి: రిలీజ్‌కు ముందు హైకోర్టుకు లియో మేకర్స్.. ఎందుకంటే?) రేణు దేశాయ్ మాట్లాడుతూ.. '23 ఏళ్లయినా నాకు సపోర్ట్ చేస్తున్నందుకు ధన్యవాదాలు. మిమ్మల్ని చూస్తుంటే బద్రి సినిమా ఇప్పుడే రిలీజ్ అయినట్లు అనిపిస్తోంది. మీ ప్రేమకు నా దగ్గర పదాలు లేవు. ఇన్నేళ్లు నేను సినిమాలు చేయకపోయినా సోషల్ మీడియాలో నాకు సపోర్ట్ చేస్తున్నారు. నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు చిత్రబృందానికి థ్యాంక్స్. రవితేజకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ సినిమా 2019లోనే మొదలైంది. రవితేజ హీరో అని చెప్పారు. నేను వంశీని ఒక్కటే అడిగా. నేను ఈ సినిమాలో ఉన్నానా? అని. ఎందుకంటే రవితేజ పెద్ద హీరో కదా. ఈ చిత్రంలో అవకాశం రావడం నా జీవితంలో ఎంత ముఖ్యమో మీకు తెలియదు. ఈ క్షణం కోసం చాలా రోజులుగా వెయిట్ చేశా. దయచేసి మీరంతా ఈ సినిమాకు థియేటర్‌కు వెళ్లి చూడండి అంటూ అభిమానులకు రెక్వెస్ట్' చేసింది. అనంతరం ఇకపైనా కేవలం సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న పాత్రలే చేస్తారని వార్తలొస్తున్నాయి నిజమేనా? కాదా? అని యాంకర్ ప్రశ్నించగా.. అలాంటిదేమి లేదని.. అవన్నీ రూమర్స్ మాత్రమేనని రేణు దేశాయ్ కొట్టిపారేసింది. ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 20న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. (ఇది చదవండి: సినిమా వాళ్లపై ప్రజల్లో అలాంటి అభిప్రాయం: రాధేశ్యామ్ నటి కామెంట్స్!)
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్‌పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్‌లు ఔట్! వీడియో
ఐపీఎల్‌పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్‌పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్‌లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్‌పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్‌బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement