-
వీనుల విందుగా..కను విందుగా...
‘‘కథ వినకుండా ఈ సినిమా చేయడానికి అంగీకరించాను. త్రినాథరావుగారి మీద నాకంత నమ్మకం. ‘ఏమైంది ఈ వేళ’ తర్వాత అంతటి హిట్ సినిమా చేయలేదు. ఈ సినిమా ఆ కొరతను తీరుస్తుందనే నమ్మకం ఉంది’’ అని వరుణ్ సందేశ్ చెప్పారు. వరుణ్ సందేశ్, పూర్ణ, సోనియా బిర్జి ముఖ్య తారలుగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘నువ్వలా నేనిలా’. లోలారెడ్డి సమర్పణలో రాజశేఖర్ రెడ్డి నిర్మించారు. సాయి కార్తీక్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను దామోదర ప్రసాద్ విడుదల చేశారు. ఈ వేడుకలో బెక్కెం వేణుగోపాల్, నవదీప్, నిఖిల్, ప్రిన్స్ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. ఈ చిత్రం టైటిల్ వినడానికి హాయిగా ఉందని అందరూ అంటున్నారనీ, వినడానికి మాత్రమే కాదు, చూడ్డానికి కూడా ఈ సినిమా హాయిగా ఉంటుందని దర్శకుడు చెప్పారు. వచ్చే నెల రెండో వారంలో చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాత అన్నారు. -
వైవిధ్యమైన ప్రేమకథ
వరుణ్‌సందేశ్, పూర్ణ జంటగా రూపొందుతోన్న చిత్రం ‘నువ్వలా నేనిలా’. త్రినాథరావు నక్కిన దర్శకుడు. ఇందూరి రాజశేఖర్ నిర్మాత. నిర్మాణం తుదిదశకు చేరుకున్న ఈ చిత్రం గురించి దర్శకుడు చెబుతూ -‘‘వరుణ్ సందేశ్ పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. కథ, కథనాలు చాలా వైవిధ్యంగా ఉంటాయి’’ అని తెలిపారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయని, త్వరలో పాటల్ని విడుదల చేస్తామని నిర్మాత చెప్పారు. సోనియా బిర్జి, వెన్నెల కిషోర్, సన, ధన్‌రాజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ: అమోఘ క్రియేషన్స్, మాటలు: ఉదయ్ భాగవతుల, కెమెరా: జ్ఞానశేఖర్, సంగీతం: సాయికార్తిక్, కూర్పు: శ్రావణ్. -
'నువ్వలా నేనిలా' మూవీ న్యూ స్టిల్స్
-
ఆహ్లాదకరమైన ప్రేమకథ
వరుణ్ సందేశ్, పూర్ణ జంటగా రూపొందుతున్న చిత్రం ‘నువ్వలా.. నేనిలా’. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో అమోఘ్ క్రియేషన్స్ పతాకంపై ఇందూరు రాజశేఖర్‌రెడ్డి ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు తుది దశలో ఉన్నాయి. సాయికార్తీక్ స్వరపరచిన పాటలను ఈ నెలాఖరున విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ - ‘‘ఇది క్లాసికల్ లవ్‌స్టోరీ. ఇప్పటివరకు చేయని పాత్రను వరుణ్ చేశారు. పూర్ణ పాత్ర కూడా వైవిధ్యంగా ఉంటుంది’’ అని చెప్పారు. నిర్మాత మాట్లాడుతూ - ‘‘ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఇటీవల విడుదల చేసిన ఈ చిత్రం ఫస్ట్ లుక్‌కి మంచి స్పందన లభిస్తోంది. ఆహ్లాదకరమైన ప్రేమకథతో దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించారు. జ్ఞానశేఖర్ ఫొటోగ్రఫీ, సాయికార్తీక్ పాటలు, వరుణ్, పూర్ణల నటన ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి’’ అన్నారు. ఈ చిత్రానికి మాటలు: ఉదయ్ భాగవతుల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: పాలకుర్తి శ్రీధర్‌గౌడ్. -
ప్రవాసాంధ్రునితో ప్రేమ
ఓ లక్ష్యంతో హైదరాబాద్‌కి వచ్చిన ప్రవాసాంధ్ర యువకుడు ప్రేమలో ఎలా పడ్డాడు? చివరకు తన ప్రేమను ఎలా దక్కించుకున్నాడు? ఈ క్రమంలో అతనికి ఎదురైన అవరోధాలేంటి? అనే ఆసక్తికరమైన కథాంశంతో రూ పొందుతోన్న చిత్రం ‘నువ్వలా... నేనిలా’. వరుణ్‌సందేశ్, పూర్ణ జంటగా నటిస్తున్నారు. ‘మేం వయసుకు వచ్చాం’ఫేం త్రినాథరావు నక్కిన ఈ చిత్రానికి దర్శకుడు. ఇందూరి రాజశేఖరరెడ్డి నిర్మాత. ఒక పాట మినహా ఈ చిత్రం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. సాయికార్తీక్ స్వరపరిచిన ఈ చిత్రం పాటలను అక్టోబర్ తొలివారంలో విడుదల చేసేందుకు నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ -‘‘ఇదొక ఫీల్‌గుడ్ లవ్‌స్టోరి. వేదం, కృష్ణం వందేజగద్గురుమ్ చిత్రాలకు ఛాయాగ్రహణం అందించిన జ్ఞానశేఖర్ కెమెరా పనితనం ఈ చిత్రానికి ప్రధాన బలం. వరుణ్‌సందేశ్, పూర్ణ ఇందులో కొత్తగా కనిపిస్తారు. ఓ దృశ్యకావ్యంగా త్రినాథరావు ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు’’అని తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: ఉదయ్ భాగవతుల, నిర్మాణ నిర్వహణ: పాలకుర్తి శ్రీధర్‌గౌడ్.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
లక్నోను చిత్తు చేసిన కేకేఆర్.. 98 పరుగుల తేడాతో ఘన విజయం
IPL 2024: చరిత్ర సృష్టించిన జడేజా.. ధోని రికార్డు బద్దలు
జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్‌కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్‌గా
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్‌కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్‌తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement