-
పాత జీన్స్‌ను ఇలా కూడా వాడవచ్చని మీకు తెలుసా?
అతి కొద్దిమంది మాత్రమే వ్యర్థాలను కూడా ఉపయుక్తంగా మలచి, తమ జీవితాన్ని కూడా అర్థవంతంగా మార్చుకుంటారు. ఆ కొద్దిమంది జాబితాలో నిలుస్తుంది సౌమ్య కల్లూరి. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ వాసి అయిన సౌమ్యముంబైలో సోషల్ ఎంటర్ప్రైజ్ ‘ద్విజ్’ అనే సంస్థను ఏర్పాటు చేసిదాని ద్వారా వాడి పడేసే డెనిమ్ దుస్తులను తిరిగి ఉపయోగించుకునేలా బ్యాగులు, టోపీలు, జ్యువెలరీ, క్లచ్‌లు, ఇతర యాక్సెసరీస్.. తయారు చేస్తోంది. ఈ పని ద్వారా 40 మంది మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. హైదరాబాద్ గచ్చిబౌలిలోని నిథిమ్‌లో జరుగుతున్న దస్తకారి హాత్ సమితి క్రాఫ్ట్ ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసిన డెనిమ్ స్టాల్లో తన ఉత్పత్తుల ద్వారా వ్యర్థాలతో కొత్త అర్థాలను మనకు పరిచయం చేస్తోంది.రెండోసారి మరింత కొత్తగా! ‘‘ద్విజ్ అంటే రెండవది అని అర్థం వచ్చేలా ఈ రీయూజ్ కాన్సెప్ట్‌ను ఎంచుకున్నాను. డెనిమ్ లేదా జీన్స్ అని పిలిచే క్లాత్ చాలా గట్టిగా ఉంటుందని మనకు తెలుసు. కొంత కాలం వాడాక పాతబడి పోవడమో, బోర్ అనిపించడమో, రంగు వెలిసిందనో పిల్లలవైతే పొట్టిగా అయ్యాయనో .. ఇలా రకరకాల కారణాలతో డెనిమ్ దుస్తులను ఎవరికైనా ఇచ్చేస్తుంటారు. అవి తీసుకున్నవాళ్లు వాటిని వాడతారు అనే నమ్మకం లేదు. ఎందుకంటే, అవి వారి సైజుకు సరిపోకపోవచ్చు. వారు వాటిని చెత్తలో పడేయచ్చు. ప్రపంచమంతటా విరివిగా ఉపయోగిస్తూ, వాడి పడేసే జీన్స్‌ను తిరిగి ఉపయుక్తంగా మార్చేలా చేసిన ప్రయోగాలు మంచి ఫలితాలను ఇచ్చాయి. దీంతో 2018లో ఈప్రాజెక్ట్‌ను 6 లక్షల రూపాయలతో ఆరంభించాను. పర్యావరణ హితంగా.. మెకానికల్ ఇంజినీరింగ్ చేసి, ఎమ్మెస్ కోసం జర్మన్ వెళ్లాను. అక్కడ కార్బన్ ఉద్గారాలు, వ్యర్థాలపై పరిశోధన చేస్తున్నప్పుడు చాలా విషయాలు పరిశీలనకు వచ్చాయి. పర్యావరణహితంగా ఏదైనా వర్క్ చేయాలనుకున్నాను. ఏడాదిన్నర పాటు ఉద్యోగం చేసినా నా ఆలోచనలు మాత్రం రీ సైక్లింగ్ చుట్టూ తానే తిరుగుతూ ఉండేవి. వాడేసిన డెనిమ్పైన దృష్టి మళ్లి వాటిని సేకరించడం మొదలుపెట్టాను. వాడేసిన వాటర్ బాటిల్స్‌ను సేకరించి, రీ సైకిల్ చేసి, బ్యాగ్ లోపలివైపు వచ్చేలా డిజైన్ చేశాను. దీనివల్ల ఏదైనా పదార్థాన్ని బ్యాగ్‌లో తీసుకెళుతున్నప్పుడు డబ్బా మూతలు లీక్ అయినా సమస్య ఉండదు. ఈ బ్యాగ్లుఎక్కడా పాతవిగా అనిపించవు. మొదటిసారి వాడు తున్నట్టుగానే ఉంటాయి. ఈ తరం కోరుకునే బ్యాక్ ప్యాక్స్, క్లచ్‌లు, ల్యాప్‌టాప్ బ్యాగ్‌లు.. కూడా మా దగ్గర అందుబాటులో ఉన్నాయి. చిన్న పీస్‌ను కూడా వదలం వాడేసిన జీన్స్‌ను సెకండ్ హ్యాండ్ మార్కెట్లో బల్క్‌లో కొనుగోలు చేస్తాం. కొందరు నేరుగా వచ్చి డొనేట్ చేస్తారు. ముందు వాటిని శుభ్రం చేయిస్తాం. ఆ తర్వాత వాటి సైజ్, షేడ్, సన్నం, మందం.. క్లాత్‌ని బట్టి దేనిని ఎలా మలచాలి అనే ఆలోచనకు వస్తాం. పదిమంది ఫుల్ టైమ్ ఉద్యోగులు పని చేస్తున్నారు. 30మంది మహిళలు వాళ్ల ఇంటి నుంచే పని చేస్తారు. బాగా మందంగా ఉండి, పెద్ద పెద్ద జీన్స్ వస్తే వాటిని బ్యాగ్‌లుగా తయారు చేస్తాం. కొంచెం మీడియం సైజు వాటితో చిన్న బ్యాగ్స్,. పలుచటి, చిరిగిన జీన్స్‌తో హ్యాండ్‌మేడ్ జ్యువెలరీ తయారు చేస్తాం. ఇంకా, బొమ్మలు, ఎంబ్రాయిడరీ చేసి హోమ్ డెకార్ ఐటమ్స్ కూడా ఇందులో ఉంటాయి. మా దగ్గరకు వచ్చిన జీన్స్‌లో చిన్న ముక్కను కూడా వృథాగా పోనివ్వం. ఈ రోజుల్లో పర్యావరణం ఎలా ఉంటుందో చూస్తున్నాం. కాలానుగుణంగా వర్షాలు పడవు, భూ తాపం పెరిగిపోతుంటుంది. కాలుష్యం కంపెనీల నుంచో, వాహనాల నుంచో వస్తుందనే అనుకుంటాం. కానీ, మనం రోజూ వాడే బట్టలు కూడా కాలుష్యానికి పెద్ద కారకం. ఈ సమస్య నివారణకు చేసిన చిన్న ప్రయత్నమే ద్విజ్. స్వచ్ఛంద సంస్థలతో కలిసి మిషన్ గ్రీన్ ముంబయ్ స్వచ్ఛంద సంస్థతో కలిసి ప్రభుత్వ స్కూల్ పిల్లలకు హ్యాండ్ బ్యాగ్‌లను కానుకగా ఇచ్చాం. దీని ద్వారా అటు చదువుకునే పిల్లలనూ, ఇటు ఈ పనిలో భాగం పంచుకుంటున్న మహిళలనూ ్ ప్రోత్సహిస్తున్నాం. అనిమేథ్ చారిటబుల్ ట్రస్ట్ వారితో కలిసి మహిళలకు డెనిమ్ రీ యూజ్ ప్రాజెక్ట్‌లో భాగంగా వర్క్‌షాప్స్ ఏర్పాటు చేసి, శిక్షణ ఇస్తున్నాం. 2022లో సర్వోదయ ట్రస్ట్ ద్వారా తెలంగాణలోని వికారాబాద్ ప్రభుత్వ పాఠశాల పిల్లలకు హ్యాండ్ బ్యాగ్‌లను కానుకగా ఇచ్చాం. ఇండియా మొత్తంలో క్రాఫ్ట్స్ ఎగ్జిబిషన్స్ ఎక్కడ జరిగినా అక్కడ మా స్టాల్ ఏర్పాటుకు కృషి చేస్తుంటాం. దీనికి విడిగా షాప్ అంటూ ఏమీ లేదు. ఆన్లైన్ మార్కెటింగ్ చేస్తుంటాం’’ అని వివరిస్తారు సౌమ్య. -
పడేసేవి కాదు.. పనికొచ్చేవే!
- పాత జీన్స్‌తో బంప్ బ్యాగులు రెడీ... - బంకమట్టే డిజైనర్ ఆభరణంగా మెరుస్తుంది - గాజు సీసాలు బెడ్ ల్యాంపులుగా ధగధగలాడతాయి - రీసైక్లింగ్‌తో సరికొత్త వస్తువులను సృష్టిస్తున్న నగరవాసులు సాక్షి, బెంగళూరు: సాధారణంగా జీన్స్ ప్యాంట్స్ బిగుతైపోతే మనం వాటిని పడేయడమో లేదంటే ఏ స్టీల్ సామాన్ల వాడికి ఇవ్వడమో చేస్తూ ఉంటాం. కానీ వాటిని కూడా అందమైన బ్యాగులుగా మార్చవచ్చనే విషయం మీకు తెలుసా! ఎందుకూ పనికిరావనుకునే గాజు సీసాలను ఎంచక్కా బెడ్ ల్యాంప్‌లుగా మార్చవచ్చని మీరెప్పుడైనా విన్నారా, అంతేకాదు బంకమట్టితో డిజైనర్ ఆభరణాలు, పేపర్‌తో బ్యాగులు ఇలా ఏ వస్తువునైనా రీసైక్లింగ్‌తో మరింత కొత్తగా మార్చవచ్చనే విషయాన్ని రుజువుచేస్తున్నారు నగరానికి చెందిన అనేక మంది ఔత్సాహికులు. అంతేకాదు ఇలా తయారుచేసిన వస్తువుల ద్వారా లభించిన మొత్తాన్ని స్వచ్ఛంద కార్యక్రమాల కోసం వినియోగిస్తూ మన్ననలందుకుంటున్నారు. బీరు సీసాల మూతలు, బంకమట్టే డిజైనర్ జువెలరీ... నగరానికి చెందిన గృహిణి ముక్త ఆలోచనల నుంచి పుట్టుకొచ్చినదే ‘ఆర్ట్సీ క్రాఫ్టీ క్రియేషన్స్’ సంస్థ. ఇంట్లోనే ఉంటూ ఎన్నో వస్తువులను రీసైక్లింగ్ చేస్తూ మళ్లీ వాటికి కొత్త రూపును ఇస్తున్నారు ముక్త. బీరు సీసాల మూతల నుండి అందమైన ఇయర్ రింగ్స్‌తో పాటు బంకమట్టితో నెక్లెస్‌లు, డిజైనర్ జువెలరీని తయారుచేస్తున్నారు. ఇవి కాక దుస్తులు కుట్టేటపుడు మిగిలిపోయిన చిన్న చిన్న క్లాత్ పీసెస్తోటి చిన్నారుల కోసం అందమైన హెయిర్ క్లిప్స్‌ను తయారుచేయడం, ప్యాకింగ్ కోసం వాడే అట్టముక్కలను గృహాలంకరణకు వీలైన వెల్కమ్ బోర్డ్స్‌గా మార్చడం ముక్త ప్రత్యేకత. నగరంలో ఎక్కడ హ్యాండీక్రాఫ్ట్ మేళా జరిగినా తను తయారుచేసిన సరికొత్త వస్తువులతో ప్రత్యక్షమౌతారు ముక్త. వీటన్నింటితో పాటు బంకమట్టితో తయారుచేసిన ప్లేట్స్‌పై చిన్నారుల చేతి, పాద ముద్రలను కూడా అచ్చు పోయించి మధురస్మృతులను తయారుచేయిస్తుంటారు. ఈ తరహా వస్తువుల అమ్మకం ద్వారా లభించిన మొత్తంలో కొంత భాగాన్ని అనాధ శరణాలయాల్లో ఆశ్రయం పొందుతున్న చిన్నారులకు అందజేస్తుంటానని ముక్త తెలిపారు. పాత సీసాలు బెడ్ ల్యాంప్‌లుగా మారతాయి నగరంలో రీసైక్లింగ్ ఉత్పత్తుల తయారీలో తనకంటూ ఓ ప్రత్యేకతను సాధించిన సంస్థ మదర్ ఎర్త్. ఈ స్టోర్‌లో కనిపించే వస్తువులన్నీ రీసైక్లింగ్ విధానంలో తయారైనవే. అంతేకాకుండా ఎకోఫ్రెండ్లీ కూడా. పేపర్‌తో తయారుచేసిన బ్యాగులు మొదలుకొని పేపర్‌తో తయారైన గృహాలంకరణ వస్తువులు, మహిళలు వాడే పర్సులు, గడియారాలు కూడా పేపర్‌తోనే తయారవుతాయి. చాపలతో షూస్టాండ్లు, నారతో తయారుచేసిన ఫర్నీచర్ ఇవన్నీ ఈ స్టోర్ ప్రత్యేకత. ముఖ్యంగా పనికిరాని గాజు సీసాలు ఈ స్టోర్‌లో బెడ్ ల్యాంప్‌లుగా దర్శనమిస్తాయి. అంతేకాదు గాజు సీసాపై ప్రత్యేక కలర్ కోటింగ్‌లను వేసి, వాటిని ఫ్లవర్ వాజ్‌లుగా కూడా మార్చేస్తుంటారు. ఈ తరహా వస్తువుల తయారీనే ఎందుకు ఎంచుకున్నారని సంస్థ వ్యవస్థాపకులు ‘నీలం చిబ్బర్’ను ప్రశ్నిస్తే...‘ప్రస్తుతం ఏ వస్తువును తయారుచేయాలన్నా ఎన్నో రకాల రసాయనాలు వాడుతున్నారు. ఈ కారణంగా పర్యావరణ కాలుష్యం రోజురోజుకూ పెరుగుతోంది. అందుకే వస్తువుల తయారీలో ఎకోఫ్రెండ్లీ విధానాన్ని ఎంచుకున్నాం. ఇక రీసైక్లింగ్ ద్వారా సరికొత్త వస్తువులను తయారుచేయడం వల్ల వాటి ధర తక్కువై, మధ్య తరగతి వారికి ఆ వస్తువులు అందుబాటులో ఉంటాయనేది నా అభిప్రాయం’ అని చెప్పారు. జీన్స్‌లతో బంప్ బ్యాగ్‌లు... సాధారణంగా మార్కెట్లో ఇప్పటి వరకు లెదర్, ఫోమ్, కాటన్ ఇలా తదితర వాటితో తయారైన బ్యాగులు దర్శనమిస్తున్నాయి. వాటన్నింటికి భిన్నంగా వచ్చిన బ్యాగ్‌లే బంప్ బ్యాగ్‌లు. ఈ తరహా బ్యాగ్‌ల తయారీకి శ్రీకారం చుట్టింది నగరానికి చెందిన ‘ఎ హండ్రెడ్ హ్యాండ్స్’ సంస్థ. వాడి పడేసిన జీన్స్ ప్యాంట్లను శుభ్రపరిచి, వాటితో బ్యాగ్‌లను తయారచేయడమే ఈ సంస్థ ప్రత్యేకత. ఇలా తయారుచేసిన బ్యాగ్‌ల అమ్మకం ద్వారా వచ్చిన మొత్తాన్ని కూడా స్వచ్ఛంద సేవా కార్యక్రమాలకే వినియోగిస్తోంది. ఇందుకోసం ఈ సంస్థలో ఎంతో మంది విదేశీయులు కూడా వాలంటీర్లుగా పనిచేస్తున్నారు. ఈ బంప్ బ్యాగ్స్ ధర రూ.250 నుండి ప్రారంభమౌతుందని సంస్థ ప్రతినిధి వెరీనా వెల్లడించారు.
ఈనాడు సంస్థల ఛైర్మన్ రామోజీరావు కన్నుమూత
రాజీనామా చేసి వెళ్లిపోండి.. టీడీపీ కార్యకర్తల అల్టిమేటం
పట్టలేని సంతోషం.. మర్చిపోలేని విషాదం.. రెండూ ఈ నెలలోనే!
పిఠాపురం వర్మపై జనసేన దాడి
ఇదేం వ్యాధి..నిద్రలో షాషింగ్ చేయడమా..?
టీడీపీ యథేచ్ఛదాడులతో ఏపీలో ఆటవిక పరిస్థితులు: వైఎస్ జగన్
పాస్వర్డ్ మర్చిపోయాడు.. 11 ఏళ్ల తరువాత చూస్తే రూ. కోట్ల డబ్బు
T20 WC 2024: పాక్‌ను మట్టికరిపించిన అమెరికా జట్టులో సగం మంది మన వారే..!
ఎన్నికల వరకే రాజకీయాలు.. ఎన్నికల తర్వాత అభివృద్దే తారక మంత్రం
సిమ్రాన్, అవినాష్ హీరోగా కొత్త సినిమా ప్రారంభం
మూత పెట్టకుండా వండుతున్నారా? ఐసీఎంఆర్ స్ట్రాంగ్ వార్నింగ్
T20 World Cup 2024 IND VS PAK: క్రికెట్ అభిమానులకు బ్యాడ్ న్యూస్
టెస్లా విజయం వెనుక ఇండియన్.. థాంక్స్ చెప్పిన మస్క్
ఆర్ఆర్ఆర్ చాలా నచ్చింది.. ఆ హీరోతో పని చేయాలనుంది: హాలీవుడ్ డైరెక్టర్
కేంద్ర కేబినెట్లోకి నడ్డా
చరిత్ర సృష్టించిన సిలికానాంధ్ర స్నాతకోత్సవం..ఏకంగా 16 మంది..
కాంచన-4లో టాలీవుడ్ హీరోయిన్.. రాఘవ లారెన్స్ క్లారిటీ!
బాబర్.. విరాట్ కాలిగోటికి కూడా సమానం కాడు: పాక్ మాజీ ప్లేయర్
Advertisement