-
హైదరాబాద్ పరాజయం
సాక్షి, హైదరాబాద్: బీసీసీఐ అండర్–23 పురుషుల వన్డే క్రికెట్ టోర్నమెంట్లో హైదరాబాద్ జట్టుకు తొలి ఓటమి ఎదురైంది. ఈసీఐఎల్ గ్రౌండ్లో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 5 వికెట్ల తేడాతో హరియాణా చేతిలో పరాజయం పాలైంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన హైదరాబాద్ 48.3 ఓవర్లలో 177 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ ఠాకూర్ తిలక్ వర్మ (71 బంతుల్లో 37; 2 ఫోర్లు) టాప్ స్కోరర్. పీఎస్ చైతన్యరెడ్డి (23), సి. హితేశ్ యాదవ్ (27) పరవాలేదనిపించారు. ప్రత్యర్థి బౌలర్లలో ఎంఎం బూరా 3 వికెట్లు దక్కించుకోగా... ఎంఎస్ రాథీ 2 వికెట్లు పడగొట్టాడు. అనంతరం హరియాణ జట్టు 46.3 ఓవర్లలో 5 వికెట్లకు 181 పరుగులు చేసి గెలుపొందింది. వీఏ భరద్వాజ్ (65), ప్రశాంత్ వశిష్ట్ (64 నాటౌట్) అర్ధ సెంచరీలు చేశారు. అజయ్‌దేవ్ గౌడ్, మికిల్ జైస్వాల్ చెరో 2 వికెట్లు తీశారు. విజేతగా నిలిచిన హరియాణా జట్టుకు 4 పాయింట్లు లభించాయి. ఆదివారం జింఖానా మైదానంలో జరిగే తదుపరి మ్యాచ్‌లో సౌరాష్ట్రతో హైదరాబాద్ తలపడుతుంది. ఇతర మ్యాచ్‌ల ఫలితాలు జార్ఖండ్: 330/9 (వివేక్ కుమార్ 106, కుమార్ సూరజ్ 101; నీలంబుజ్ 4/62), త్రిపుర: 120 (సుశాంత్ మిశ్రా 3/34, సోను కుమార్ 3/30). సౌరాష్ట్ర: 271/7 (కెవిన్ 83, తరన్గోహెచ్ 59), బరోడా: 276/4 (జేకే సింగ్ 125; పార్థ్ 3/36). -
టెస్టులకు కులశేఖర గుడ్‌బై
కొలంబో: శ్రీలంక వెటరన్ బౌలర్ నువాన్ కులశేఖర టెస్టు కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ మేరకు శ్రీలంక క్రికెట్ బోర్డుకు బుధవారం లేఖ రాశాడు. ‘వన్డేల్లో, టీ20ల్లో మరింత మెరుగ్గా రాణించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాను’ అని కులశేఖర తెలిపాడు. ఇప్పటివరకు 21 టెస్టులాడి 48 వికెట్లు తీసిన ఈ 33 ఏళ్ల పేస్ బౌలర్... 2005లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టె స్టు క్రికెట్లో అరంగేట్రం చేశాడు. రెండేళ్ల క్రితం లార్డ్స్‌లో ఇంగ్లండ్‌పై చివరి టెస్టు ఆడాడు. 2009లో పాకిస్థాన్‌పై అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు (8/58) నమోదు చేశాడు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్‌పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
పోలీస్ ఫెయిల్యూర్.. బాబు, పురందేశ్వరి మేనేజ్..
'ఇడియట్ సిండ్రోమ్' అంటే ఏంటీ..? ప్రమాదకరమా..?
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన టీడీపీ, జనసేన వీడియో
తెలంగాణలో బీజేపీకి బ్రహ్మాండమైన ఫలితాలు: కిషన్ రెడ్డి
రోహిత్ శర్మతో పాటు షకీబ్!.. ఎవరికీ సాధ్యం కాని రికార్డు!
టీడీపీతో కుమ్మక్కు.. ఏపీ పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రాపై వైఎస్సార్సీపీ ఫిర్యాదు
ఈసీ బదిలీ చేసిన చోటే ఈ దారుణాలు
రాజశ్యామల సహస్ర చండీయాగం వేద ఆశీర్వచనం ఇచ్చిన వేద పండితులు
కొంతమంది పోలీసులు టీడీపీ వాళ్ళతో కుమ్మక్కై: అంబటి
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (15-05-2024)
తప్పక చదవండి
- పంచాయత్ సీజన్ 3 ట్రైలర్ విడుదల
- సచిన్ టెండూల్కర్ సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య!
- అమ్ముడుపోని లక్షలాది ఇళ్లు.. చైనా కీలక ప్రతిపాదన!
- నాన్‌స్టిక్ పాత్రలు వినియోగిస్తున్నారా? ఐసీఎంఆర్ స్ట్రాంగ్ వార్నింగ్!
- ఆంధ్రాలో చిన్న ఆలయానికి జూ.ఎన్టీఆర్ భారీ విరాళం
- ‘ఆ దేవాలయాలు నిర్మించాలంటే 400కుపైగా సీట్లు కావాల్సిందే’
- అతడి కంటే చెత్త కెప్టెన్ ఎవరూ లేరు.. పైగా హార్దిక్‌ను అంటారా?
- పల్నాడు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
- BCCI: టీమిండియా హెడ్‌కోచ్‌గా వాళ్లిద్దరిలో ఒకరు?
- NewsClick Row: ప్రబీర్ తక్షణ రిలీజ్‌కు సుప్రీం కోర్టు ఆదేశం
Advertisement