-
ఆఖరి ఇన్నింగ్స్ ఆడేశాడు
25 పరుగులు చేసిన మెకల్లమ్ రెండో ఇన్నింగ్స్‌లో కివీస్ 121/4 ఆసీస్‌తో రెండో టెస్టు క్రైస్ట్‌చర్చ్: న్యూజిలాండ్ డాషింగ్ బ్యాట్స్‌మన్ బ్రెండన్ మెకల్లమ్ కెరీర్లో ఆఖరి అంతర్జాతీయ ఇన్నింగ్స్ ఆడేశాడు. తొలి ఇన్నింగ్స్ స్థాయిలో కాకపోయినా రెండో ఇన్నింగ్స్‌లో ఓ మోస్తరు ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో.... సోమవారం మూడో రోజు బ్యాటింగ్‌కు వచ్చిన మెకల్లమ్ (27 బంతుల్లో 25; 3 ఫోర్లు, 1 సిక్స్) మరోసారి జోరును చూపెట్టే ప్రయత్నం చేశాడు. హాజెల్‌వుడ్ బౌలింగ్‌లో భారీ సిక్సర్‌ను బాదిన బ్రెండన్ తర్వాతి బంతిని కూడా అదే స్థాయిలో గాల్లోకి లేపాడు. అయితే వార్నర్ చక్కని క్యాచ్ అందుకోవడంతో మెకల్లమ్ ఆఖరి అంతర్జాతీయ ఇన్నింగ్స్‌కు తెరపడింది. టాప్ ఆర్డర్ వైఫల్యంతో న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 44 ఓవర్లలో 4 వికెట్లకు 121 పరుగులు చేసింది. ఆట ముగిసే సమయానికి విలియమ్సన్ (45 బ్యాటింగ్), అండర్సన్ (9 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. లాథమ్ (39) ఫర్వాలేదనిపించాడు. ప్రస్తుతం కివీస్ ఇంకా 14 పరుగులు వెనుకబడి ఉంది. ప్యాటిన్సన్ 3 వికెట్లు తీశాడు. అంతకుముందు 363/4 ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు ఆట కొనసాగించిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 153.1 ఓవర్లలో 505 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఆసీస్‌కు 135 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ వోజెస్ (60), లయోన్ (33) నిలకడగా ఆడారు. మిచెల్ మార్ష్ (18), నీవెల్ (13), హాజెల్‌వుడ్ (13) వరుస విరామాల్లో అవుటయ్యారు. వాగ్నేర్ 6, బౌల్ట్ 2 వికెట్లు పడగొట్టారు. -
కుప్పకూలిన కివీస్
తొలి ఇన్నింగ్స్‌లో 183 ఆలౌట్ మెకల్లమ్ డకౌట్ తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 147/3 కుప్పకూలిన కివీస్ వెల్లింగ్టన్: న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి టెస్టులో బౌలర్లు చెలరేగడంతో ఆస్ట్రేలియా మొదటి రోజే పూర్తి ఆధిక్యం ప్రదర్శించింది. పేసర్లు హాజెల్‌వుడ్ (4/42), సిడిల్ (3/37)తో పాటు స్పిన్నర్ లియోన్ (3/32) కలిసి కివీస్ వెన్ను విరిచారు. దీంతో శుక్రవారం ప్రారంభమైన తొలి టెస్టులో న్యూజిలాండ్ 48 ఓవర్లలో 183 పరుగులకు ఆలౌట్ అయ్యింది. కెరీర్లో వందో టెస్టు ఆడుతున్న బ్రెండన్ మెకల్లమ్ పరుగులేమీ చేయకుండానే నిష్ర్కమించాడు. కోరె అండర్సన్ (87 బంతుల్లో 38; 6 ఫోర్లు), మార్క్ క్రెయిగ్ (57 బంతుల్లో 41 నాటౌట్; 5 ఫోర్లు), బౌల్ట్ (22 బంతుల్లో 24; 3 సిక్సర్లు) రాణించారు. ఓవరాల్‌గా 97 పరుగులకే జట్టు ఏడు వికెట్లు కోల్పోగా చివరి మూడు వికెట్లకు 86 పరుగులు రావడం విశేషం. అనంతరం తమ తొలి ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన ఆసీస్... రోజు ముగిసే సమయానికి 40 ఓవర్లలో మూడు వికెట్లకు 147 పరుగులు చేసింది. ఐదు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయినా కెప్టెన్ స్టీవెన్ స్మిత్ (112 బంతుల్లో 71; 10 ఫోర్లు; 1 సిక్స్), ఉస్మాన్ ఖవాజా (96 బంతుల్లో 57 బ్యాటింగ్; 11 ఫోర్లు) జోడి ఆదుకుంది. వీరిద్దరి మధ్య మూడో వికెట్‌కు 126 పరుగులు వచ్చాయి. క్రీజులో ఖవాజాతో పాటు వోజెస్ (7 బ్యాటింగ్) ఉన్నాడు.
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
IPL 2024: ఇవెక్కడి క్యాచ్‌లు రా బాబు.. చూస్తే ఫ్యూజ్‌లు ఎగిరిపోవాల్సిందే..!
'ఛీ, నీ బతుకు'.. చురకలంటించిన కలర్స్ స్వాతి
12 పరుగులకే ఆలౌట్.. టీ20ల్లో రెండో అత్యల్ప స్కోర్
జగనన్న పాలనతో పెత్తందార్ల కడుపు మండుతోంది: నాగార్జున యాదవ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
ఆది సాయికుమార్ కొత్త మూవీ.. గోవాలో మ్యూజిక్ సిట్టింగ్స్
కాంగ్రెస్‌కు శామ్ పిట్రోడా రాజీనామా
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
తప్పక చదవండి
- భారత్‌లోకి గూగుల్ వాలెట్ వచ్చేసింది.. ఎలా వాడొచ్చంటే?
- ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
- ఒక్క క్లిక్‌తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్‌కి టెండర్ వేసిన 'దేవర'?
- టీ20 వరల్డ్‌కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్‌గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement