-
అతనితో డేటింగ్లో భారత మహిళా క్రికెటర్.. ఫోటోలు వైరల్
స్మృతి మంధాన భారత క్రికెట్ జట్టులో ప్రముఖ క్రీడాకారిణి. మహారాష్ట్రకు చెందిన 27 ఏళ్ల ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ గ్రౌండ్లోకి దిగితే ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలే . క్రీజ్‌లో ఉన్నప్పుడు దూకుడుగా బ్యాటింగ్ చేయడమే కాదు, మైదానం బయట కూడా అంతే చురుగ్గా కనిపించే ఈతరం అమ్మాయి. భారత ఓపెనర్‌గా ఎన్నో చూడచక్కటి ఇన్నింగ్స్‌లు ఆడిన స్మృతి సోషల్‌మీడియాలో కూడా బాగా వైరల్ అవుతూ ఉంటుంది. ఈ మధ్య తను బాలీవుడ్ మ్యూజిక్ కంపోజర్ అయిన పలాష్ ముచ్చల్‌తో డేటింగ్లో ఉన్నట్లు తరుచూ వార్తలు వస్తూనే ఉన్నాయి. రీసెంట్గా తన పుట్టినరోజును జులై 18న ఢాకాలో జరుపుకుంది. భారత జట్టు బంగ్లాదేశ్ పర్యటనలో ఉండటంతో ఆమె అక్కడే ఈ వేడుకలను జరుపుకుంది. ఆ సమయంలో తన బాయ్ ఫ్రెండ్ పలాష్ ముచ్చల్ కూడా ఢాకా వెళ్లి స్మృతి మంధానకు బర్త్‌డే శుభాకాంక్షలు చెప్పాడు. అది బాగా వైరల్ అయింది. (ఇదీ చదవండి: ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో వరుణ్ తేజ్ పాన్ ఇండియా మూవీ!) ఈ వార్త మరిచిపోక ముందే తాజాగా పలాష్ ముచ్చల్‌తో సినిమా షూటింగ్ స్పాట్లో స్మృతి మంధాన కనిపించింది. బాలీవుడ్ కమెడియన్, నటుడు రాజ్‌పాల్ యాదవ్ కొత్త సినిమాకు సంబంధించిన పోస్టర్ ప్రకటన కార్యక్రమంలో ఆమె మరోసారి తన బాయ్‌ఫ్రెండ్‌తో కనిపించింది. ఈ చిత్రానికి పలాష్ ముచ్చల్ మ్యూజిక్ కంపోజర్‌గానే కాకుండా డైరెక్షన్ కూడా చేస్తున్నాడు. అంతే కాకుండా ఈ సినిమాతో తొలిసారి నిర్మాతగా కూడా మారనున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైన ఫోటోలను కమెడియన్ రాజ్‌పాల్ యాదవ్ తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో ఇవి ఒక్కసారిగా వైరల్ అయ్యాయి. రెండు నెలల క్రితం, పలాష్ పుట్టినరోజు జరుపుకునేటప్పుడు, అతను తన చేతిపై 'SM 18' అని పచ్చబొట్టును గుర్తుగా రాపించాడు. స్మృతి మందన క్రికెట్ జెర్సీ నంబర్ '18' అనేది అందరికీ తెలిసిందే. అందుకే వీరిద్దరి డేటింగ్ చర్చ బాగా పాపులర్ అయింది. కానీ ఈ విషయంపై వీరద్దరూ బహిరంగంగా ఇప్పటికి వరకు ఒప్పుకోలేదు. అన్నీ సజావుగా జరిగితే వీరిద్దరూ త్వరలో శుభం కార్డుతో ఈ పుకార్లకు ఫుల్‌స్టాఫ్ పెడతారని సమాచారం. View this post on Instagram A post shared by Rajpal Naurang Yadav (@rajpalofficial) -
ప్రముఖ సింగర్‌కు ప్రధాని మోదీ విషెష్.. సోషల్ మీడియాలో వైరల్
బాలీవుడ్ సింగర్ పాలక్ ముచ్చల్ మ్యూజిక్ డైరెక్టర్ మిథూన్ శర్మ వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. కొన్నేళ్లుగా ప్రేమలో మునిగితేలిన వీరద్దరూ మూడుముళ్ల బంధంతో రెండు రోజుల క్రితమే ఒక్కటయ్యారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది ముచ్చల్. ఈ జంట వివాహానికి సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరలయ్యాయి. పలువురు సినీతారలు ఈ జంటకు శుభాకాంక్షలు తెలిపారు. (చదవండి: మ్యూజిక్ డైరెక్టర్‌ను పెళ్లాడిన ప్రముఖ సింగర్.. ఫోటోలు వైరల్) తాజాగా ఈ ప్రేమజంటకు ప్రధాని మోదీ సైతం శుభాకాంక్షలు తెలిపారు. పాలక్ ముచ్చల్‌ను కంగ్రాట్స్ చెబుతూ ఓ లేఖను విడుదల చేశారు. ఈ విషయాన్ని తెలుపుతూ పాలక్ ముచ్చల్ ట్వీట్ చేశారు. మోదీ లేఖపై ఆమె స్పందిస్తూ..' మీ ఆశీర్వాద లేఖ మా హృదయాలను తాకింది. మా పట్ల మీ ప్రేమ, గౌరవానికి కృతజ్ఞతలు. ఈ శుభ సందర్భంలో మీ ఆశీస్సులు పొందడం మాకు చాలా విశేషం.' అంటూ రాసుకొచ్చింది. కాగా పాలక్ ఏక్ థా టైగర్’ ‘అషికీ–2’ ‘యం.ఎస్ ధోనీ: ది అన్‌టోల్డ్ స్టోరీ’ వంటి సినిమాల్లో పాటలు పాడిన సంగతి తెలిసిందే. आदरणीय मोदी जी, आपके आशीर्वाद रूपी पत्र ने हमारे ह्रदय को छुआ है । हम इस सम्मान और प्रेम के लिये आपके प्रति अपनी कृतज्ञता व्यक्त करते हैं । हमारे विवाह के शुभ अवसर पर आपका आशीर्वाद मिलना हमारे लिये सौभाग्य की बात है। 🙏🏻@narendramodi @PMOIndia pic.twitter.com/nBa9rzRSGf — Palak Muchhal (@palakmuchhal3) November 8, 2022 -
మ్యూజిక్ డైరెక్టర్‌ను పెళ్లాడిన ప్రముఖ సింగర్.. ఫోటోలు వైరల్
బాలీవుడ్ సింగర్ పాలక్ ముచ్చల్ మ్యూజిక్ డైరెక్టర్ మిథూన్ శర్మ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. గత కొన్నాళ్లుగా ప్రేమలో మునిగితేలిన ఈ జంట పెళ్లితో ఒక్కటయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. రెడ్ కలర్ లెహంగాలో పాలక్ మెరిసిపోతుండగా, మిథూన్ శర్మ గోధుమ రంగు షేర్వానీలో కనిపించారు. ఎల్లప్పుడూ కలిసి ఉండాలని మేమిద్దరం ఇలా ఒక్కటయ్యం అంటూ పెళ్లి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. దీంతో కొత్త జంటకు పలువురు ప్రముఖులు సహా నెటిజన్ల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సోనూ నిగమ్, కైలాష్ ఖేర్, కృషికా లుల్లా, రుబీనా దిలైక్, అభినవ్ శుక్లా వంటి పలువురు సెలబ్రిటీలు వీరి రిసెప్షన్‌కు హాజరై నూతన జంటను ఆశీర్వదించారు. కాగా పాలక్ ఏక్ థా టైగర్’ ‘అషికీ–2’ ‘యం.ఎస్ ధోనీ: ది అన్‌టోల్డ్ స్టోరీ’ వంటి సినిమాల్లో పాటలు పాడిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Palak Muchhal (@palakmuchhal3) -
Palak Muchhal: హార్ట్ ఫౌండేషన్ ద్వారా ఎందరో పేద పిల్లలను ఆదుకుంటూ!
పాలక్ ముచ్చల్...అనే పేరు వినబడగానే తేనెలొలికే స్వరగానం తీయగా ధ్వనిస్తుంది. ‘ఏక్ థా టైగర్’ ‘అషికీ–2’ ‘యం.ఎస్ ధోనీ: ది అన్‌టోల్డ్ స్టోరీ’... మొదలైన సినిమాల్లో అద్భుతమైన పాటలు పాడింది. హిందీలోనే కాదు ఎన్నో ప్రాంతీయ భాషల పాటలు పాడి అలరించింది పాలక్. సినిమా పాటలు మాత్రమే కాదు... గజల్స్, భజన్స్ ఆలాపనలో ‘ఆహా’ అనిపించింది. పాలక్ సింగర్ మాత్రమే కాదు...గీతరచయిత కూడా. ఎన్నో ప్లేలలో అద్భుతంగా నటించింది..... ఇదంతా ఒక ఎత్తయితే తన కళను సామాజికసేవకు ఉపయోగించడం మరో ఎత్తు. గుండెకు సంబంధించిన రుగ్మతలతో బాధ పడే చిన్నారుల కోసం ‘దిల్ సే దిల్ తక్’ పేరుతో దేశ, విదేశాల్లో ఎన్నో ఛారిటీ షోలు చేసింది పాలక్. గతంలోకి వెళితే... గుజరాత్ భూకంప (2001) బాధితుల కోసం నిధుల సేకరణలో చురుకైన పాత్ర పోషించింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జన్మించిన పాలక్‌కు చిన్నప్పటి నుంచి సంగీతం అంటే ఎంత ఇష్టమో, సామాజిక సేవ అంటే కూడా అంతే ఇష్టం. ‘పాలక్ ముచ్చల్ హార్ట్ ఫౌండేషన్’ ద్వారా ఎందరో పేద పిల్లలను ఆదుకుంది పాలక్. సామాజికసేవలో చేస్తున్న కృషికి ఆమె పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లో చోటు చేసుకుంది. చదవండి: Mehndi Health Benefits: గోరింటాకు పెట్టుకుంటే ఇన్ని ప్రయోజనాలా! లాసోన్ అనే రసాయనం వల్ల! View this post on Instagram A post shared by Palak Muchhal (@palakmuchhal3) -
అదృష్టవంతురాలిని
సల్మాన్‌ఖాన్‌తో కలిసి ఓ పాట పాడే అవకాశం లభించడం తన అదృష్టమంటూ గాయని పాలక్ ముచ్చల్ పొంగిపోయింది. ‘కిక్’ సినిమాలో ‘జుమ్మే కీ రాత్’ అనే పాటను సల్మాన్‌తో కలిసి పాడడం తనకు మంచి కిక్కు ఇచ్చిందంది. తన కెరీర్లో హిమేశ్ రేషమ్మియా, సల్మాన్‌లు కీలకపాత్ర పోషించారంది. ‘సల్మాన్‌ఖాన్‌తో కలసి ఓ పాట పాడాలనేది నా కల. ఓ రోజు సరదాగా ఈ విషయాన్ని సల్మాన్ సార్‌కు చెప్పా. ఆయనయన కూడా ఓ మంచి గాయకుడే కావడంతో నా మనసులో మాట చెప్పా. హిమేశ్ అందరితోనూ ఎల్లప్పుడూ స్వేచ్ఛగా ఉంటాడు. ఎటువంటి పరిమితులు ఉండవు. హిమేశ్ కోసం నేను ఓ పాట కూడా పాడాను. అది నాకు ఎంతో ఉత్సాహం కలిగించింది. ఈ పాట పాడే సమయంలో నా దృష్టిని, హృదయాన్ని పూర్తిస్థాయిలో కేంద్రీకరించాను’ అని అంది. ఈ పాటలో సల్మాన్ భాగస్వామ్యంపై మీ స్పందన ఏమిటని ప్రశ్నించగా ఎంతో సంతోషం కలిగిందంది. 14 ఏళ్ల వయసులోనే తాను సల్మాన్‌ను తొలిసారిగా కలిశానని చెప్పింది. ‘వీర్’ సినిమాలో ‘మెహర్బానియా’ అనే పాట తానే పాడానని తెలిపింది. ‘దస్ కా దం’ షోలో పాల్గొనాల్సిందిగా తనను కోరాడంది. అతడికి తాను ఎంతో రుణపడి ఉన్నానంది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న నిరుపేద చిన్నారులకు తరచూ తాను కూడా ఆర్థిక సహాయం అందిస్తుంటానంది. ఇందుకు సల్మాన్ కూడా తనవంతు సహకారం అందజేస్తున్నాడంది. ‘లా పతా’ సినిమాతో బాలీవుడ్ రంగంలోకి అడుగిడినట్టు చెప్పింది. ఆ తర్వాత ‘ఆషికి 2’లో పాడానని, ఇప్పటికి మొత్తం 142 పాటలు పాడానని తెలిపింది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
ఆర్టీసీ బస్సు– బైక్ ఢీ ●
వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ
అంబేడ్కర్ కళాశాలలో దొడ్డమణి గోల్మాల్
తప్పక చదవండి
- సుప్రీం కోర్టుకు కేజ్రీవాల్ పిటిషన్
- వయనాడ్, రాయ్‌బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- ఐపీఎల్లో నేటి (మే 7) మ్యాచ్
- పండ్ల తోటలకు.. 'సన్ బర్న్' ముప్పు!
- షర్మిల.. ఎందుకిలా..!
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
- విడాకులపై సలహా అడిగిన యువతి.. శ్రీజ పోస్ట్ వైరల్
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
Advertisement