-
ఒక్క చెప్పుతో వస్తానంటున్న పార్తీపన్
సినిమా: నటుడు, దర్శకుడు పార్తీపన్ చిత్రాలు వైవిధ్యంగా ఉంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే జయాపజయాలను పక్కన పెడితే ఆయన చిత్రాల్లో కథ, కథనాల్లో కచ్చితంగా కొత్తదనం ఉంటుంది. అంతే కాదు పార్తీపన్ చిత్రాల పేర్లు కొత్తగా ఉంటాయి. ఇంతకుముందు కోడిట్ట ఇడంగళ్ నిరంబుగా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పార్తీపన్ చిన్న గ్యాప్ తరువాత ఇప్పుడు ఒత్త సెరుప్పు (ఒంటి చెప్పు) అంటూ వస్తానంటున్నారు. ఈ తాజా చిత్రం గురించి ఆయన తెలుపుతూ సాధారణ, విభిన్నం అంటూ తన చిత్రాల గురించి తారుమారుగా తానూ ఊహించని విధంగా అంచనాలు ఏర్పడుతున్నాయన్నారు. అలాంటి అంచనాలను పూర్తి చేయడానికి తానూ శ్రమిస్తున్నానన్నారు. కాపీ కొట్టకుండా సొంత ఆలోచనలతో ప్రేక్షకులను అలరించే విధంగా విభిన్నంగా తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఒత్త సెరుప్పు సైజ్–7 అని చెప్పారు. ఈ ఒక్క చెప్పు అందరి ప్రశంసలు అందుకునేలా ఉంటుందని అన్నారు. ఇకపోతే ఈ చెప్పుకు జోడీ చెప్పు ఏదీ? అది ఎవరు? సైజ్–7 ఏమిటీ? లాంటి వివరాలను తెలిపే తరుణం త్వరలోనే వస్తుందని అన్నారు. ఇది చాలా తక్కువ సమయంలో రూపొందిస్తున్న చిత్రం అని చెప్పారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాగైనా ఓట్లు పొందాలన్న కాంక్షతో స్వగౌరవాన్ని పక్కన పెట్టి, మర్యాద వంటి వాటికి నీళ్లొదిలి కూటమి ఏర్పరచుకుంటున్న వారి మాదిరిగా కాకుండా ఈ చిత్రానికి తాను ఏర్పాటు చేసుకున్న కూటమి విజయం సాధించడం ఖాయం అన్నారు. దీనికి సంగీతాన్ని సంతోష్నారాయణన్, ఛాయాగ్రహణను రాంజీ అందిస్తున్నారని చెప్పారు. 39 సెకన్ల నిడివితో కూడిన ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్, టీజర్లను ఇటీవలే నటుడు విజయ్‌సేతుపతి చేతుల మీదగా ఆవిష్కరించగా మంచి స్పందన వస్తోందని అన్నారు. చిత్ర షూటింగ్‌ను పూర్తి చేసుకుని త్వరలోనే మీ ముందుకు వస్తానని పార్తీపన్ తెలిపారు. -
నటి సీత కూతురు వివాహ వేడుక
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
ముస్లిం రిజర్వేషన్లే రద్దు
మోదీకి బహుమతిగా ఇవ్వాలి
అబద్ధాల పునాదులపై..
బీజేపీకి మరో రూపమే బీఆర్ఎస్
పదేళ్ల అభివృద్ధి ఏది?
● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్ షా పర్యటన ● కాగజ్‌నగర్ వికాస్ సంకల్ప్ సభ విజయవంతం ● ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన జనం ● మార్మోగిన జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలు
బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి
నేడు జేపీ నడ్డా రాక
చిన్నబోయిన చిన్నబొంకూరు
తప్పక చదవండి
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్‌లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- పోస్టల్ బ్యాలెట్‌కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- ఇజ్రాయెల్‌లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement