-
అబ్రకదబ్ర.. చేతిలో నుంచి విభూతి, నోటిలో నుంచి శివలింగం
చేతిలో నుంచి విభూతి, నోటిలో నుంచి శివలింగం తీయడం వంటివి చూసి దైవాంశ శక్తులున్న వారే ఇలా చేయగలరని గుడ్డిగా నమ్మడం, చేతబడి, చిల్లంగి వంటివి ఉన్నాయన్న మూఢ నమ్మకాలతో దారుణంగా మోసపోతున్న ప్రజల్లో ఇంద్ర జాలకులు చైతన్య కల్పిస్తున్నారు. మానవతా దృక్పథంతో ఓ అడుగు ముందుకేసి అవన్నీ ఊహాజనితమేనంటూ అవగాహన కల్పిస్తున్నారు. ప్రపంచ ప్రఖ్యాత ఇంద్రజాలకుడు పద్మశ్రీ పీసీ సర్కార్ (సీనియర్) జయంతి ఫిబ్రవరి 23న ఏటా ప్రపంచ ఇంద్రజాల దినోత్సవం నిర్వహిస్తున్నారు. అయితే కోవిడ్ ప్రభావంతో ఎక్కడా సరైన ప్రోగ్రామ్‌లు లేక ఇంద్రజాలంపైనే ఆధారపడి జీవిస్తున్న కళాకారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ సందర్భంగా జిల్లాకు చెందిన ఇంద్రజాలకుల అభిప్రాయాలిలా ఉన్నాయి. – విజయనగరం సమాజంలో మార్పుకోసం కృషి గత 48 ఏళ్లుగా ఇంద్రజాల రంగంలో రాణిస్తూ, జాతీయస్ధాయిలో జిల్లా పేరును నిలబెట్టేందుకు కృషిచేస్తున్నాను. సమాజంలో మార్పుకోసం అహర్నిశలూ శ్రమిస్తున్నాను. సుమారు పదివేలకు పైగా ప్రదర్శనలు దేశమంతా ఇవ్వగలిగాను. కళ ఎప్పుడూ మరుగున పడిపోదు. కళాకారుల కళపైనే ఆధారపడి ఉంటుంది. సద్వినియోగం చేసుకోవాలి. పూర్వం విద్య గోప్యంగా ఉండేది. ప్రస్తుతం యూ ట్యూబ్ వంటి సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన తర్వాత బహిర్గతమైంది. అందులోనూ కేవలం 40 శాతం నిజం ఉంటుంది. పూర్వం థియేటర్ షోలు, స్టాండర్డ్ ఫ్లాట్‌ఫామ్‌లు ఉండేవి. ప్రస్తుతం బర్త్‌డే, మ్యారేజ్‌డే షోలు మాత్రమే ఉంటున్నాయి. చిన్నపాటి స్థలంలో అద్బుతాలు సృష్టించే అవకాశం తక్కువగా ఉంటుంది. – సీహెచ్. శ్యామ్, సీనియర్ మెజీషీయన్ ఆసక్తే ప్రేరణ కల్పించింది చిన్న నాటి నుంచి ఇంద్రజాలమంటే ఎంతో ఆసక్తి. అదే ఆసక్తి నాలో ప్రేరణ కల్పించి, నేర్చుకునేలా చేసింది. గ్రామగ్రామాన అవకాశం వచ్చినప్పుడల్లా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలను చైతన్యవంతుల్ని చేసేందుకు కృషిచేస్తున్నాను. హెల్త్ డిపార్ట్మెంట్లో అవుట్‌సోర్సింగ్‌లో పనిచేస్తున్నప్పటికీ ఎక్కడ అవకాశం వచ్చినా ప్రజల్లో మార్పు తీసుకువచ్చేందుకు పూర్తిస్థాయిలో కృషిచేస్తున్నాను. – పవన్ ఆశిష్, మెజీషీయన్ ఐదు వేలకు పైగా ప్రదర్శనలిచ్చా చేతబడి, చిల్లంగి పూర్తిగా మోసం వంటి వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్లి అవగాహన కల్పించేందుకు మేజిక్ నాకు ఎంతగానో ఉపయోగపడుతోంది. ఐదు వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చాను. ఏ ప్రాంతానికి వెళ్లినా మూఢనమ్మకాలను పారద్రోలడానికి కృషిచేస్తున్నాను. ప్రభుత్వం సరైన ప్రోత్సాహం ఇస్తే మంచి కార్యక్రమాలను చేయడానికి సిద్ధం. – ఎస్కె.సలీమ్, ఇంద్రజాలికుడు మేజిక్ సిస్టర్స్‌గా ప్రతిభ మేజిక్ సిస్టర్స్‌గా మంచి పేరు ప్రఖ్యాతులు అందుకున్నాం. చిన్నప్పటినుంచి నాన్న చారి మా గురువు. 2006 నవంబరు 14న ఢిల్లీలో జాతీయస్థాయి అవార్డును ప్రధాని మన్మోహన్ సింగ్ చేతుల మీదుగా అందుకోవడం తృప్తినిచ్చింది. చిన్నప్పటి నుంచి గ్రామగ్రామాన పర్యటించి, ప్రజల్లో మూఢ నమ్మకాలు పారదోలడంపై అవగాహన కల్పిస్తున్నాం. దేశంలోనే మొట్టమొదటి మేజిక్ సిస్టర్స్‌గా పేరుగాంచాం. – సుస్మిత, మౌనిక -
ఈసారైనా పీసీ సర్కార్ మాయ చేస్తారా?
తాజ్ మహల్ తో సహా ఎన్నింటినో మాయం చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఇంద్ర జాలికుడు పీసీ సర్కార్ జూనియర్ గత ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకోవడంలో ఘోరంగా విఫలమయ్యారు. గతంలో పలుపార్టీల తరపు నుంచి పోటి చేసి ఓటమి పాలైన పీసీ సర్కార్ మళ్లీ 2014లో తన అదృష్ణాన్ని పరీక్షించుకునేందుకు బరిలోకి దిగారు. అయితే బీజేపీ ఎన్నడూ గెలువని బరసాత్ లోకసభ స్థానం నుంచి పోటికి సిద్దమయ్యారు. సామాన్య ప్రజల ఆకాంక్ష మేరకు పనిచేస్తానని సర్కార్ హమీల వర్షం కురిపిస్తున్నారు. బరసాత్ ప్రజల మనోగతాన్ని తెలుసుకోవడానికి వచ్చాను. ఓటరు నాడిని పట్టుకుని విజయం సాధిస్తాననే ధీమాను ఆయన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఎన్నికల తర్వాత బరసాత్ నియోజకవర్గం నుంచి మాయం కాను అని సర్కార్ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. గత 23 ఏళ్లలో ఈ స్థానంలో బీజేపీ విజయం సాధించిన దాఖలాలు లేవు. 1991లో మాత్రం హరాసిత్ ఘోష్ అనే అభ్యర్థి బీజేపీకి 14 శాతం ఓట్లను సంపాదించిపెట్టారు. అయితే 2009లో బీజేపీకి కేవలం 5.4 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. అనేక సంవత్సరాలు వామపక్షాలతో కలిసి ఉన్న సర్కార్.. దేశంలో మోడీ ప్రభంజనం వీస్తుండటంతో ఇటీవల బీజేపీ లో చేరారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
త్వరగా నిద్రలేవమన్నందుకు చెరువులో దూకి ఆత్మహత్య
జిల్లా ఉండన్నా? పోవన్నా..?
రేపు బాన్సువాడకు రాజ్‌నాథ్‌సింగ్ రాక
దేశాన్ని ముక్కలు చేసింది కాంగ్రెస్సే
సకాలంలో పనులు పూర్తి చేయాలి
నేడు సీఎం రేవంత్‌రెడ్డి రోడ్ షో
తప్పనిసరిగా ఓటు వేయాలి
11న ప్రియాంకా గాంధీ సభ
పరిస్థితి విషమించి యువకుడు..
అవినీతి ‘కాలువ’
తప్పక చదవండి
Advertisement